రెయిన్ ట్రీ హోటల్, అన్నాసాలై

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
The Raintree Hotel
Anna Salai
హోటల్ చైన్Ceebros Hotels
సాధారణ సమాచారం
ప్రదేశంచెన్నై, India
చిరునామా636, Anna Salai, Teynampet
చెన్నై, తమిళనాడు 600 035
భౌగోళికాంశాలు13°2'2"N 80°14'38"E
ప్రారంభం27 జూలై 2010
వ్యయం 2,000 million
యజమానిCeebros Hotels
ఎత్తు170 feet (52 m)
సాంకేతిక విషయములు
అంతస్థుల సంఖ్య16
రూపకల్పన, నిర్మాణం
వాస్తు శిల్పిUphasani Design Cells
అభివృద్ధికారకుడుసి. సుబ్బారెడ్డి
ఇతర విషయములు
గదుల సంఖ్య230
సూట్ల సంఖ్య13
రెస్టారెంట్ల సంఖ్య5
పార్కింగ్200 కార్లు
జాలగూడు
raintreehotels.com

రెయిన్ ట్రీ హోటల్ అన్నాసాలై (The Raintree Hotel, Anna Salai) అనేది ఒక 5 - స్టార్ హోటల్. ఇది భారతదేశంలోని తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నగరంలో అన్నాసాలై అనే ప్రాంతంలో ఉంది. రెయిన్ ట్రీ హోటళ్ల సంస్థ స్థాపించి రెండో హోటల్ ఇది. ఈ హోటల్ ను రూ. 2,000 మిలియన్ల వ్యయంతో స్థాపించి జూలై 2010లో ప్రారంభించారు.[1]

చరిత్ర[మార్చు]

దక్షిణ భారత రాష్ట్రమైన తమిళనాడులోని చెన్నై (పూర్వపు మద్రాసు) నగరంలో రేయిన్ ట్రీ హోటల్ ఉంది. భారతదేశంలో నాలుగో అతిపెద్ద నగరంగా పేరుగాంచిన చెన్నై నగరంలో భారత సంస్కృతికి అద్దం పట్టే అనేక హిందూ దేవాలయాలు, థియేటర్లు, సముద్ర బీచ్, చారిత్రక ప్రదేశాలు, మ్యూజియాలు అనేకం ఉన్నాయి. చెన్నై నగరానికి గుండెకాయలాంటి అన్నాసాలై ప్రాంతంలో ఈ హోటల్ ను జూలై 2010లో ప్రారంభించారు. ఆగస్టు 2013లో నిర్వహించిన హోటల్స్ అండ్ రిసార్ట్స్ సమ్మేళనంలో పాల్గొన్న ఈ హోటల్ కు ప్రోత్సహించదగిన బ్రాండ్ హోటల్ గా గుర్తింపు రావడమే కాకుండా, ఆసియా పసిఫిక్ పోర్ట్ పోలియోలో స్థానం సంపాదించింది.[2] ఈ హోటల్ ను ఉపహాసినీ డిజైన్ సెల్ ఆర్టిటెక్ట్స్ చేశారు. ఇంటీరియర్ డిజైన్ ను మలేసియాకు చెందిన జేలియర్ &లిమ్ పూర్తి చేసారు.

హోటల్ గురించి[మార్చు]

ఈ హోటల్లో[3] మొత్తం 230 గదులున్నాయి. వీటిలో 154 డీలక్స్ గదులు, 8 ప్రీమియం గదులు, 51 క్లబ్ గదులు, 4 స్టూడియో గదులు, 12 ఎక్జిక్యూటివ్ సూట్లు, 1 ప్రెసిడెన్షియల్ సూట్లు ఉన్నాయి.హోటల్లో ఉన్న రెస్టారెంట్లో కిచెన్ తా పాటు మల్టీ క్యూసైన్ రెస్టారెంట్, మద్రాసు, దక్షిణ భారతదేశంలోని వంటలు అందించే రెస్టారెంట్, మడేరా, ఒక లాంజ్ బార్, అప్ నార్త్, రూఫ్ టాం పంజాబీ రెస్టారెంట్, హై బార్ ఉన్నాయి. ఇందులో మూడు బ్యాంకెట్ హాళ్లు, 3 సమావేశ స్థావరాలు ఉన్నాయి. వీటిలో బ్యాంకెటింగ్ కోసం 12,000 చదరపు అడుగులు (1,100 చ.మీ.) విస్తీర్ణంలో స్థలం ఉంటుంది. ఈ హోటల్లో రూఫ్ టాప్ పూల్ తో పాటు హెల్త్ క్లబ్, స్పా వంటి సౌకర్యాలున్నాయి. హోటల్లోని విలాసవంతమైన సదుపాయాలు, మై మరిపించే ఆహ్లాదకర వాతావరణ, ఎకో ఫ్రెండ్లీ స్నానానికి ఉపయోగించే వస్తువులు, లక్సరీ బెడ్డింగ్, నగర అందాలను వీక్షించే వ్యూ వంటివి ప్రత్యేక ఆకర్షణలు. ఈ హోటల్ నగరానికి మధ్యలోఉండటం వల్ల కార్పోరేట్ ప్రయాణికులకు ఇది ఎక్కడికెళ్లాలన్నా అనువుగా ఉంటుంది. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి రెయిన్ ట్రీ హోటల్ కేవలం 13 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. అంతేగాకుండా నగరంలోని ఏ పర్యాటక కేంద్రానికి వెళ్లాలన్నా సులభంగా వెళ్లే సౌకర్యాలు ఉంటాయి. హోటల్ కు దగ్గరలో మద్రాసు సంగీత అకాడమీ, ఎలియట్స్ బీచ్ వంటి ప్రదేశాలున్నాయి.

సేవలు[మార్చు]

రెయిన్ ట్రీ హోటల్ అన్నాసాలైలో పూర్తి స్థాయి సేవలు అందించబడుతాయి. దక్షిణ భారతదేశానికి చెందిన అతిథి మర్యాదలకు లోటు లేకుంటా ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, హెల్త్ స్పా, జిమ్, హై స్పీడ్ వైర్ లెస్ ఇంటర్నెట్ వంటి సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ హోటల్లోని ఫైవ్ స్టార్ సదుపాయాల్లో ముఖ్యమైనవి సమావేశాలకు, ఇతర కార్యక్రమాల నిర్వహణకు, విందులు, వేడుకలకు సరిపడా విశాలమైన ప్రాంగణం ఉంటుంది. స్టైలిస్ మీటింగ్ రూములు, బాంకెంట్ హాల్ లో దాదాపు 1000 మంది అతిథులు కూర్చునే విధంగా ఉంటాయి. ఇక్కడ హైటెక్ ఆడియో, వీడియో పరికరాలు, వైరెలెస్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటాయి.

అవార్డులు[మార్చు]

  • సముద్ర ఆహారం అందించే క్యూషన్ల విభాగంలో ఉత్తమ టైమ్స్ ఫుడ్ అవార్డును 2012లో టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ హోటల్ ను ఎంపిక చేసింది.
  • ఉత్తమ పర్యావరణ హోటల్ గా ఎన్.డి.టి.వి. హిందు లైఫ్ స్టైల్ అవార్డుతో సత్కరించింది. ఈ ఆవార్డును 2011లో ఎన్.డి.టి.వి. హిందూ అందజేసింది.
  • 2011లో డి &బి- యాక్సిస్ బ్యాంకు చేతుల మీదుగా బిజినెస్ గౌరవ్ ఎస్.ఎం.ఇ. అవార్డు-హాస్పిటాలిటీ అందుకుంది.[4]

మూలాలు[మార్చు]

  1. "Ceebros launches second hotel in Chennai". The Hindu. Chennai: The Hindu. 27 July 2010. Retrieved 25 May 2012.
  2. "The Raintree Hotel, Chennai joins Summit Hotels & Resorts". TravelBizMonitor.com. Chennai: TravelBizMonitor.com. 6 August 2013. Archived from the original on 3 డిసెంబరు 2013. Retrieved 15 Aug 2013.
  3. "The Raintree, Anna Salai". cleartrip.com.
  4. "Interesting plot". The Hindu. Chennai: The Hindu. 25 November 2011. Retrieved 25 May 2012.

బయటి లింకులు[మార్చు]