రేకి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

'బొద్దు పాఠ్యం'

Reiki-2.svg

రెకీ మికావు ఉసుఇ 1926లో రూపొందించిన ఒక ఆధ్యాత్మిక ఆచరణా విధానము .[1]]] మూడు వారాలు జపాన్లో ఉన్న కురామ పర్వతము పై ఉపవాసము మరియు ధ్యానం చేసిన తరువాత ఉసుఇ తనకు "శక్తి తగ్గకుండా నయం" చేసే సామర్థ్యం కలిగినట్లు పేర్కొన్నారు.[2] ఈ విధానంలో ఒక భాగమైన తెనోహిర(tenohira) లేదా అరచేయితో నయం చేయటం అనే పధ్దతిని అనుబంధ మరియు ప్రత్యామ్నాయ వైద్యం(CAM)యొక్క రూపంగా వాడుతున్నారు.[3][4] తెనోహిర(Tenohira) అనే ఈ పద్ధతిలో అరచేతుల నుండి స్వస్థత చేకూర్చే శక్తిని (కి(ki )యొక్క రూపం) పంపిస్తున్నట్లు ఈ విధానాన్ని ఆచరించేవారు నమ్ముతున్నారు.[5][6]

కి(ki) ని కాని దాన్ని వాడుకోవడం గురించి కాని వైజ్ఞానిక నిదర్శనము లేదు. 2008లో నిర్వహించబడిన అనిర్దిష్ట క్లినికల్(clinical) పరిశోధనల యొక్క సమీక్ష కూడా రేకి యొక్క ప్రయోజనాలని కాని ఏ ఒక్క పరిస్థితినినైనా నయం చేయటంలో రేకిని వాడటాన్ని కాని సమర్థిచలేదు.[7][8]

చరిత్ర[మార్చు]

పేరు యొక్క మూలం[మార్చు]

జపనీయుల భాషలో " రేకి 霊気 "మర్మమైన వాతావరణం; ఆధ్యాత్మిక శక్తి" చైనా భాష లో లింగూయ్(lingui) 靈氣 అనే పదం నుండి వ్యుత్పత్తి యైన పదం. లింగూయ్ అనే పదాన్ని కొన్ని చైనీస్-ఆంగ్ల నిఘంటువులు ఇలా అనువదిస్తాయి: (అందమైన పర్వతాలు) ఆధ్యాత్మిక ప్రభావం లేదా వాతావరణం";[9]" 1.తెలివి; అర్ధం చేసుకునే సామర్ధ్యం 2.గాంధర్వ కథలలో వచ్చే అతీంద్రియమైన లేదా అద్భుతమైన శక్తి;[10] మహాధ్బుతమైన శక్తి లేదా బలం"; 1.ఆధ్యాత్మిక ప్రభావం (పర్వతాలకు సంబందించినవి) 2.మేదస్సు; తెలివి" [11]loanwordloanwordలోన్ వోర్డ్ ఈ జపనీస్ సంయుక్త పదం "దయ్యం, జీవాత్మ, ఆత్మ; అమానుష్యమైన, మహాద్బుతమైన, దివ్యమైన; అంతరిక్ష సంబందమైన వస్తువు" అని అర్ధం కలిగిన రే అనే పదం మరియు "వాయువు, గాలి; ఊఁపిరి; శక్తి; బలము; వాయుమండలం; మనోభావము; ఉద్దేశం; భావము; గమనము;" అనే అర్థం కలిగిన కి అనే పదాల (ఇక్కడ ''కి అనగా "ఆధ్యాత్మిక శక్తి; కీలకమైన శక్తి; మూలాధార శక్తి;[[ప్రాణాధారము | జీవనాధార శక్తి]];") కలయిక.[12] కొన్ని జపనీస్-ఆంగ్ల నిఘంటువులు రేకి అనే పదాన్ని ఈ విధముగా అనువదిస్తున్నాయి: "మర్మమైన అనుభూతి[13]", "మర్మమైన వాతావరణము[14]",అంతరిక్ష వాతావరణము (దేవాలయ ప్రాంగణములో నెలకొంటున్నట్లుగా); ఆధ్యాత్మిక (దివ్యమైన) సముఖముని (గ్రహించడం, అనుభూతి కలగడం)."[15]

ఆంగ్లములో రేకి అనే పదం జపనీస్ భాష నుండి అరువుగా తీసుకోనబడిన ఒక పదముకు ప్రతిలేఖనము చేయబడినది. రేకి అనే పదము నామవాచకముగా ("సంభావనీయమైన శక్తి "లేదా "దాన్ని అనుసరించిన చికిత్స పద్ధతి") లేదా క్రియవాచకముగా లేదా విశేషణుముగా వాడబడుతుంది. కొన్ని పాశ్చాత్య రచయితలు సందిగ్దముగలో రేకి అనే పదాన్ని "సార్వాత్రిక జీవన శక్తి "[16]గా అనువదిస్తారు. ఈ వాడకము పాక్షికంగా తప్పుగా అనువదించబడినది: కి అనగా "జీవ శక్తి" - కాని రే అనగా "సార్వత్రిక" కాదు.

మూలము[మార్చు]

మికావు ఉసుఇ(臼井甕男), 1922లో 21 రోజులు ధ్యానము, ఉపవాసము మరియు ప్రార్థనలతో కురమ పర్వతముపై ఏకాంతంగా గడిపిన తరువాత రేకిని రూపొందించారు.[2] ఉసుఇ తనకు ఆధ్యాత్మిక జ్ఞానోదయం కలిగి తద్వారా రేకి గురించిన పరిజ్ఞానం మరియు ఆధ్యాత్మిక శక్తి కలిగిందని పేర్కొన్నారు.

ఏప్రిల్ 1922లో ఉసుఇ టోక్యో నగరానికి చేరుకొని ఉసుఇ రేకి ర్యోహో గక్కై (ఉసుఇ రేకి చికిత్స సంఘము)ని స్థాపించారు.[17]

ఉసుఇ మేఇజి చక్రవర్తి రాసిన గ్రంథాలను ఏంతో హర్షించేవారు. దానివల్ల తను రేకి పద్ధతిని రూపొందించినప్పుడు చక్రవర్తియొక్క కొన్ని గ్రంథాలని సంక్లిప్తం చేసి వాటిని నీతి సూత్రాలుగా ప్రకటించారు. ఇవే తరువాత రేకి సూత్రాలుగా పిలవబడ్డాయి.(" రేకి సూత్రాలు:(జపనీస్ భాషలో "గోకాయి") అనేక మంది రేకి అధ్యాపకులు మరియు రేకిని ఆచరించేవారు ఈ 5 సూత్రాలకి[18] కట్టుబడి ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ సూత్రాల అనువాదము ఈ విదముగా ఉండును.

గొప్ప సంపదని ఆహ్వానించటానికి ఒక రహస్య మార్గం.
అన్ని రోగాలకి ఒక అధ్బుత మైన మందు
కేవలం ఈ రోజు కొరకు:
కొంపం తెచ్చుకోవద్దు
చింతించవద్దు
కృతజ్ఞత కలిగి ఉండు
చిత్తశుద్ధితో పనిచేయి
ఇతరులు మీద దయ చూపించు
ప్రతి రోజు ఉదయం మరియు రాత్రి గస్శో (Gassho) భంగిమలో(రెండు చేతులని అరచేయి మీద అరచేయి కలిపినట్టు పెట్టుకొని) కూర్చొని ఈ పదాలని మీ మనస్స్సులో అరవండి.
శరీరం మరియు ఆత్మల పరిణామాల కొరకు ఉసుఇ రేకి ర్యోహో" - మికావు ఉసుఇ, స్థాపకుడు.[19]

ఉసుఇ 2000కి పైగా విద్యార్థులకి రేకిని బోధించారు. వాళ్ళలో 16 మంది తమ అభ్యాసాన్ని కొనసాగించి శిన్పిదేన్ (Shinpiden) స్థితికి చేరుకున్నారు. ఇది పాశ్చాత్య దేశాలలో మూడవ డిగ్రీ లేదా మాస్టర్ స్థితితో సమానము.[20]

ఉసుఇ 1926లో మరణించారు.

ప్రారంభదశలో పెరుగుదల[మార్చు]

ఉసుఇ మరణానంతరం చుజిరో హయాషి అనే పూర్వ విద్యార్థి ఉసుఇ రేకి ర్యోహో గక్కాయిని విడిచి వెళ్లి తను సొంత కూటమిని ఏర్పరిచారు. హయాషి రేకి బోధనలని సరళీకృతం చేసి శారీరక చికిత్సకి ప్రాదాన్యమిచ్చి ఎక్కువ నియమాలతో కూడిన సులభమైన రేకి పద్ధతులని ప్రేవేశ పెట్టారు.[21]

హయాషి, హవాయో తకాటా[22] అనే వ్యక్తికి శిక్షణ ఇచ్చారు. తకాట అమెరికాలో విస్తృతంగా ప్రయాణించి రేకిని ఆచరిస్తూ మొదటి రెండు స్థాయిలను పలువురికి బోధించారు.[23]

తకాటా రేకి చికిత్సకి మరియు శిక్షణ ఇవ్వడానికి రుసుము వసూలు చెయ్యడానికి ప్రాధాన్యమిచ్చారు. 1976లో తకాటా శిన్పిదేన్ స్థాయికి శిక్షణ ఇవ్వడం ప్రారంబించి ఈ స్థాయికి రేకి మాస్టర్ అనే కొత్త పేరు పెట్టారు.[24] ఆమె ఈ మాస్టర్ స్థాయి శిక్షణకి రుసుము $10,000 అని నిర్ణయించారు.[ఆధారం చూపాలి]

తకాటా 22 రేకి మాస్తేర్లకి శిక్షణ ఇచ్చి 1980లో[25] మరణించారు.[26] జపాన్ మినహా ఇతర ప్రాంతాలలో ఇవ్వబడిన రేకి శిక్షణలలో దాదాపు అన్నికూడా తకాటా నేర్పించనవే.[27]

రేకి పద్దతులు[మార్చు]

మూస:Article issues

ప్రస్తుతం అనేక రేకి పద్ధతులు ఆచరణంలో ఉన్నప్పటికీ, ప్రదానంగా ఉన్న రెండు పద్ధతులు ఏమనగా సంప్రదాయక జపనీస్ రేకి మరియు పాశ్చాత్య రేకి .

సంప్రదాయక జపనీస్ రేకి[మార్చు]

రేకి చికిత్స జరుపు విధము

సంప్రదాయక జపనీస్ రేకి అనే మాట ఉసుఇ బోధనలని అనుసరించి ఏర్పడిన నిర్ణితమైన రేకి పద్ధతిని సూచిస్తుంది. ఈ పద్ధతి కేవలం జపాన్లో మాత్రమే ఆచరణలో ఉంది.కొందరు పాశ్చాత్య గురువులు 1990ల సమయములో ఈ సాంప్రదాయ రేకి పద్ధతి గురించి తెలుసుకోవడానికి జపాన్ దేశానికి వెళ్ళారు. కాని వాళ్ళుకి ఏ విషయమూ దొరకలేదు. అందువల్ల వాళ్ళు రేకిని జపాన్ దేశస్తులుకి నేర్పించటానికి రేకి పాఠశాలలు నెలకొల్పటం ప్రారంభించారు . ఆ తరువాత వెంటనే ఆప్పటివరకు రేకి పద్ధతిని గోప్యంగా ఆచరిస్తున్న జపాన్ దేశస్తులు తమ గురించి బైటప్రపంచానికి తెలియచేసి తమ రేకి పాండిత్యాన్ని విస్తరింప చేయడం ప్రారంభించారు. అప్పడినుంది అనేక సంప్రదాయక జపనీస్ రేకి పద్ధతులు వాడకములోకి వచ్చినా, వాటిలో ముఖ్యమైన పద్ధతులు ఇవే.

ఉసుఇ రేకి ర్యోహో గక్కాయి అనేది స్వంతంగా తమ ఉసుఇ స్థాపించుకున్న ఒక గురువులు సంఘము.ఉసుఇ మరణాంతరం ఉషిడ ఆధ్వర్యంలో ఉసుఇ రేకి పద్ధతి ఈనాటి వరకు వ్యాప్తిలోనే వున్నది ఎన్నో సంవత్సరాలుగా రహస్యముగా కార్యకలాపాలు కావిస్తున్న ఈ ఉసుఇ రేకి ర్యోహో గక్కై సమాజము గురువైన మస్కి కొన్దొహ్ యొక్క ఆధ్వర్యంలో నడుస్తున్నది. వాళ్ళ చాలా విద్యాపద్ధతులు ఇంకా రహస్యంగానే వున్నప్పటికీ, కొంచం కొంచంగా గుర హిరోషి దొఇ వంటి ఈ సంఘ సభ్యులు వాళ్ళ పరిజ్ఞానాన్ని బాహ్య ప్రపంచాలతో పాలుపంచుకుంటున్నారు. అయినప్పటికీ ఈ విద్య కష్టసాధ్యమై ఋషుల కోవలోనివారికి మాత్రమే చేరువలో వుంటూ వస్తుంది

ఫుమినోరి అఒకి ఆధ్వర్యాన నడుస్తున్న రేఇదో రేకి గక్కై అనబడీ ఈ పద్ధతి గక్కై గురువుల ద్వారా ప్రవేశపపెట్టబడింది. ఫుమినోరి గురువు గక్కై విద్య లూ కొన్ని మార్పులు జత చేసినాకూడా చెప్పుకోదగ్గ రీతిలో బోధనా పద్ధతులు మారలేదు. రేకి గక్కై పద్ధతిలో ఫుమినోరి అఒకిని ఉత్తేజితుడిని చేసిన కొరికి అనబడు గుర్తు వాడబడింది.

హ్యకుతెన్ ఇనమొతొచే (稲本 百天)సెన్సెఇ స్థాపించబడిన కొమ్యో రేకి కై విద్య సంస్థ సంప్రదాయ జపాన్ రేకి పద్ధతికి చెందినది.కొమ్యో రేకి పద్ధతి జపాన్ లోని చియోకో యమగుచి (山口 千代子)యొక్క హయషి వారసత్వాన వృద్ది చెందినది. ఇతర రేకి పద్ధతులు గక్కై ద్వారా వ్యాప్తిలోకి వచ్చాయి. ఈ కొమ్యో రేకి కై విధానములో మెళకువలు, విద్య పరిజ్ఞానము మిగిలిన పద్ధతులకంటే ఏక్కువ. వీటితోపాటు ఉసుఇ మొట్ట మొదట్లో ప్రవేశపెట్టిన జుఇ-ఉం, ఫుకుయు, హోంజ-జే-శోనేన్ మరియు ది-కో-మయో లాంటి చిహ్నాలు కూడా ఈ విధానములో ఉన్నాయి. ప్రస్తుతం హ్యకుతెన్ ఇనమోతో సెన్సెఇ ఆధ్యాత్మిక పరిణామములో పై స్థాయిలో ఉండటంవల్ల అతన్ని మికావు ఉసుఇయొక్క వారసుడిగా బావిస్తున్నారు.

శ్రీమతి యమగుచి యొక్క పుత్రుడు తాడో యమగుచి జికిదేన్ రేకి అనబడే ఒక పద్ధతిని ఆవిష్కరించారు. ఈ పద్ధతికి కొమ్యో రేకి కై పద్ధతికి పోలిక ఉంది.

ప్రాశ్చాత్య రేకి[మార్చు]

ప్రాశ్చాత్య రేకి పద్ధతిని శ్రీమతి హవయో టకట ప్రవేశపెట్టారు. ఈ పద్ధతి మొదట హవాయి నుండి కలిఫోర్నియాకి వ్యాపించి తరువాత ఇతర పాశ్చాత్య ప్రదేశాలకి వ్యాపించింది. రెండో ప్రపంచ యుద్ధం తరువాత శ్రీమతి టకట ఈ పద్ధతిని ఇంకా బాగా అర్ధం అయ్యే విధంగా మరియు పాశ్చాత్య మనోబావాలకి అనుగుణంగా ఉండేవిధంగా సవరించారు. సంప్రదాయక జపనీస్ రేకి మాదిరిగానే శ్రీమతి టకట ప్రేవేశపెట్టిన రేకి పద్ధతినుండి కూడా అనేక వేర్వేరు పద్ధతులు ఆచరణలోకి వచ్చాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి ఇవి.

రేకి ఊసుఇ శికి ర్యోహో అనే పేరుతో పాశ్చాత్య రేకి పద్ధతి పిలవబడుతుంది. ఈ పెరుయొక్క అర్ధం ఏమనగా "ఊసుఇ యొక్క ప్రకృతిసిద్దమైన చికిత్సా పద్ధతి". ఈ పద్ధతి హవాయో టకాటయొక్క మూల విధానాలను పాటించటానికి ప్రయత్నిస్తుంది.ఇదే శ్రీమతి టకట స్థాపించిన అసలు పద్ధతి. ఇది ఈ రోజు కూడా ఇంకా బోధింపపడుతుంది. శ్రీమతి టకటయొక్క మనవరాలైన ఫయలిస్ ళెఇ ఫురుమోటో ఆధ్బర్యంలో నడపబడే రేకి అలయన్స్ అనే సంస్థ ఈ పద్ధతిని బోదిస్తుంది. ఇతర పాశ్చాత్య రేకి పద్ధతుల్లో ఉన్నట్లే ఈ రేకి పద్ధతిలో కూడా శ్రేణులు ఉన్నాయి. ఈ రేకి పద్ధతిలో ఉన్న మూడు శ్రేణులు ఏమనగా మొదటి డిగ్రే, రెండో డిగ్రే మరియు మాస్టర్. ఈ పద్ధతిలో చొ-కు రేయ్, సి-హి-కి, హాన్-శ-జే-శో-నేన మరియు ది-కూ-మయో ఊసుఇ అనే నాలుగు మూల చిహ్నాలను (టకాట విధం) ఉపయోగిస్తారు.

టిబెతన రేకి అనేది విల్లియం ఎల్.రాండ్ అనే అమెరికా దేశస్థుడు రూపొందించిన రేకి పద్ధతి. ఈ పద్ధతికూడా తకాటా యొక్క బోధనల ఆధారముగా రూపొందిచబడినా, ఈ పద్ధతి ఇంకా ఎక్కువ చిహ్నాలు కలిగి ఉంది. రాండ్ ఈ పద్ధతిలో మొట్టమొదటి సారిగా అతీంద్రియ శస్త్రచికిత్సని ప్రవేశపెట్టారు. ఈ పద్ధతిలో వాడబడుతున్న రెండు టిబెట్ చిహ్నాలవల్ల మరియు కొన్ని బౌద్ధ బోధనలవల్ల ఈ పద్ధతికి అ పేరు వచ్చింది. ఈ పద్ధతిలో రేకి ఊసుఇ శికి ర్యోహో పద్ధతిలాగ కాకుండా నాలుగు స్థాయిలు ఉన్నాయి. అవి ఏమనుగా మొదటి డిగ్రీ, రెండో డిగ్రీ, మూడో డిగ్రీ మరియు మాస్టర్. ఈ పద్ధతిలో మొత్తం ఏడు చిహ్నాలు ఉన్నాయి (తరువాత విధానాల్లో తొమ్మిది చిహ్నాలు ఉన్నాయి). ఇతరవన్ని పాశ్చాత్య రేకి పద్ధతిలాగే ఉన్నప్పటికీ ఈ పద్ధతిలో అదనంగా ఉన్న చిహ్నాలు; టిబెటన్ డై-కో-మ్యో, రాకు, ది సేర్పెంట్ అఫ్ ఫైర్, ది ద్రగూన్ అఫ్ ఫైర్ మరియు తుమో.

చిన్న చిన్న సంస్థలు, స్వతంత్ర బోధనాకారులు కొంతమంది టకట పద్ధతిలో రేకిని బోధిస్తూ ఆ విద్య విధానం కొనసాగేందుకు సహాయపడుతున్నారు. రేకి యొక్క పెద్ద సంస్థల మాదిరిగా వీరికి కష్ష్టమైన నియమావళి వుండదు. గత కొన్ని సంవత్సరాలుగా రేకి విధానం తమకు చెందినదని తమకు మాత్రమే ఆ వారసత్వము వుందని వివిధ రేకి సంస్థల మధ్య వాద వివాదాలు జరుగుచున్నవి. అయినప్పటికీ ప్రపంచము మొత్తము మీద ప్రాచుర్యము పొందిన ఈ రేకి ఏ ఒక్కరికి చెందిన వారసత్వం కాదు.

జెండై రేకి హో ప్రాచీన జపాన్ రేకి మరియు ప్రాశ్చాత్య రేకి పద్ధతుల మేళవింపు.జెంది రేకి హో పద్ధతిని హిరోషి దొఇ ఆవిష్కరించారు. ఈయన ఆనేక రేఇకి ప్రక్రియలలో దిట్ట. ఈయన జపాన్ రేఇకి గురువైన శ్రీ మిఎకో మిత్సుఇ ప్రథమ శిష్యుడు.శ్రీ మిఎకో మిత్సుఇ "తేజస్సు ప్రక్రియ"కి రచన కర్త.1993లో హిరోషి దొకి ఉసుఇ రేకి ర్యోహో గక్కై యొక్క సభ్యత్వము లభించింది.జెంది రేకి హో పద్ధతిలో సంప్రదాయ జపానీ మరియు ప్రాశ్చాత్య పద్ధతుల మేళవింపు. అయినా కొన్ని కచ్చితమైన సంప్రదాయ జపానీ లక్షణములు లేని కారణాన ఈ విద్య ప్రాశ్చాత్య పద్ధతిగానే పరిగణించబడుతున్నది.

జపనీస్ రేకి మరియు పాశ్చాత్య రేకికి మధ్య ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. రేకి చేసేటప్పుడు చేతుల భంగిమలకు సంబంధించి రెండు పద్ధతుల్లో తేడా ఉంది. పాశ్చాత్య రేకిలో హయాషి సెన్సెఇ మరియు శ్రీమతి తకాటలనుండి వచ్చిన చేతుల భంగిమలు ముఖ్యమైనవిగా భావించగా సంప్రదాయ జపానీ రేకి చికిత్సలో ఆ చేతి భంగిమలు వాడుకలో లేవు.సాంప్రదాయ జపానీ రేకి చికిత్సలో చేతులు ఎక్కడ వుంచాలి ఆనేది ఆ గురువు మానసిక స్పందన మీద ఆధారపడి వుంటుంది . సాంప్రదాయ జపానీ రేకిలో చేతుల ద్వారా కచ్చితమైన జబ్బులను నయం చేయవచ్చు. తేలికపాటి మర్దన, శరీరముపై తట్టటం,తేలికగా గుద్ధటం వంటివి కూడా ఈ పద్ధతిలో వాడతారు.

సాంప్రదాయ జపానీ రేకి విద్య ద్వారా శక్తిని క్రమబద్ధం చేయటం వ్యక్తిత్వ వికాసం మరియు ఆధ్యాత్మికత వైపు మార్పు కలుగుతాయి. ఈ రేకి విద్యకు శ్వాస ప్రక్రియలు గస్శో ధ్యానము మరియు వెలుగు ప్రక్రియలు జత చేస్తే చికిత్స విధానం మరింత మెరుగవుతుంది.రేకి యొక్క ప్రాశ్చాత్య విధానాలు శారీరిక రుగ్మతలను నయం చేయటంలో ధ్యాస పెడతాయి.ప్రాశ్చాత్య రేకి విద్యావిధానములో విద్యార్థి క్రమంగా పాఠాలను పూర్తి చేసుకొని అంచెలంచలుగా దిగువ స్థాయి నుండి ఎగువ స్థాయికి ఎదుగాతాడు. అయితే సాంప్రదాయ జపానీ రేకి విద్య విధానంలో విద్యార్థి పై స్థాయికి చేరుకునే సమయాన్ని గురువు మాత్రమే నిర్ణయించగలరు.

ఇతర పద్దతులు[మార్చు]

ప్రస్తుతం కొంతమంది పాశ్చాత్య రేకి గురువులు సమాచారం మరియు చిహ్నాల నుండి వాళ్ళ సొంత పద్ధతులను రూపొందించారు. వీళ్ళు రేకిలో ఉన్న చేతి భంగిమలని లేదా చిహ్నాలని వాడారు.

గత కొన్నేళ్లలో స్థాపించబడిన కొన్ని పాశ్చాత్య పద్ధతులు మీకో ఉసుఇ పద్ధతుల వంశావళికి చెందినవి కావు. ఈ పద్ధతులు కరుణా రేకి, సేఇచిం లేదా ఎస్కేహెచ్ఎం, రేకి సతోరి, రైన్బో రేకి, సెల్టిక్ రేకి, కుండలిని రికి, కరుణా కి, తొమ్మిదోకి యొక్క రికి, బయోరికి, శంబల రేకి, తేరా మై రికి మరియు టిబెటన్-తంత్రిక్ రేకి అని పిలవబడతాయి.

ఇక్కడ ఆశ్చర్యం ఏమంటే వీటిలో చాలా పద్ధతులు రేకి ఉసుఇకంటే కూడా ఉన్నతమైన శక్తిని మరియు శక్తివంతమైన చిహ్నాలను వాడుతున్నట్లుగా పేర్కొంటున్నాయి. ఇక్కడ దృష్టిలో పెట్టుకోవలసిన ఒక విషయం ఏమనగా రేకి పద్ధతులు రూపొందించిన అందరు గురువులలో కేవలం మికావు ఉసుఇ సెన్సెఇ మాత్రమే సతోరి(కాంతి) స్థాయికి చేరుకున్నారు. ఆయన రూపొందించిన కొత్త పద్ధతి ప్రేమ, గౌరవం వంటి భావాలపై ఆధారపడినటువంటిది. ఇందులో ఆధ్యాత్మిక వికాసము, చికిత్సలకు సంబంధించి చికిత్సకారుడి యొక్క వ్యక్తిగత ఆలోచన విధానానికి ఆనేక ఇతర ప్రక్రియలు అనుసందానమైవున్నాయి.

ఉసుఇ రేకి ర్యోహో గక్కై (సాంప్రదాయ జపాన్ ఉసుఇ),టిబెట్ దేశపు రేకి, కరుణ రేకి, రేకి సేఇచిం-సేఖేం, కొమ్యో రేకి అనబడు ఈ ఇదు రేకి విద్యా విధానాలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి.

కరుణ రేకి

కరుణ అనే పదము సంస్కృతము నుండి వచ్చింది. ఈ పదము హిందు మతములోను, టిబెట్ దేశపు బౌధ్ధమతములోను, జెన్ బౌధ్ధమతములోను వాడుకలో ఉంది.కరుణ అనగా జాలి, దయతో కూడిన పని అని అర్ధము. "తేరా మై" అని పిలవబడే ఈ రేకి విధానమును కతేరిన్ మిల్నేర్ అను ఆయన అమెరికాలో మొదటగా ప్రవేశ పెట్టారు. స్పైన్లో ఈ విధానాన్ని 1995లొ అంటోనియో మొరగ అను ఆయన మొదలుపెట్టారు. ఆయన భారతదేశంలో పరిశోధన చేసిన తరువాత కొన్ని ఇతర ప్రక్రియలు జోడించి కరుణ-ప్రకృతి అనే విధానాన్ని తయారు చేసారు. (కరుణ అనగా ఆర్ధ్రత అని అర్ధము. ప్రకృతి విశ్వములో ఆవిర్భవించే ఒక శక్తి అనగా ఒక రూపము లేని భగవత్ స్వరూపమని అర్ధం). ఈ పద్ధతిలో వేర్వేరు సమయాల్లో వివిధ రేకి గురువుల ద్వారా వెలుబడిన ప్రకృతి-కరుణ రేకి చిహ్నాలు ఉన్నాయి.అంటోనియో మొరగ రూపొందించిన ఈ పద్ధతిలో 21 క్రొత్త ప్రత్యేక విలువకలిగిన శక్తి చిహ్నాలు ఉన్నాయి. వీటిని ఉసుఇ పద్ధతి మరియు జపనీస్-టిబెటన్ తన్త్రిక్ పద్ధతిలో ఉన్న చిహ్నాలతో కలిపి వాడుకోవచ్చు.

శక్తి ప్రకృతిలో భాగమైన చిహ్నాలు స్వామి ప్రెమ్ ఆనంద్ ద్వారా వెలుబడి తరువాత అయన ద్వారా కిరం గురువుకి చేరుకుంది. తరువాత ఆయన ద్వారా ఇవి అంటోనియో మొరగకి చేర్చబడ్డాయి.

కరుణ-ప్రకృతి చిహ్నాలు బలమైన శక్తి ద్వారా అతి అపారమైన చికిత్సని అందిస్తూ ప్రేమ, అన్యోన్యము వంటి గొప్ప గుణాలని కలిగించటంతో పాటు ఆత్మాబిమానము పెంచి, భావాల సమీకరణని అందించి, కర్మని తొలగించి, స్వచ్ఛతనం మరియు జ్ఞానాన్ని పెంచి, [[చక్రము |చక్రాల]] సామరస్యాని కలిగించి మన జీవం గురించిన అవగాహన కలిగించి మనశ్శాంతిని ఇస్తాయి.

టిబెటన్ -తన్త్రిక్ రేకి

టిబెటనుల రేకి అని కూడా పిలవబడే ఈ టిబెటన్-తన్త్రిక్ రేకిలో 11 శక్తి చిహ్నాలు ఉన్నాయి. ఈ చిహ్నాలు వాడటంవల్ల కర్మ ప్రభావితిమైన రోగాలని నయం చేయవచ్చని బోధనలు చెపుతున్నాయి. కొందరైతే కాన్సర్, AIDS లాంటి రోగాలని కూడా రేకి నయం చేస్తుందని పేర్కొంటారు. విభిన్న షారేరకలి మరియు పరిజ్ఞానానికి మధ్య అనుసందానం చేస్తుందని కూడా పేర్కొంటారు వీటిలో 4 చిహ్నాలని "తిబెటన్ చిహ్నాలు" అని మిగిలిన 7 చిహ్నాలని "తన్త్రిక్ చిహ్నాలు" అనియు పిలుస్తారు. బోధనల ప్రకారం, ఈ తాంత్రిక్ చిహ్నాలు శాక్యముని బుద్ధుడు యొక్క మరుసటి రహస్య అవతారమైన పద్మసాంభవ(గురు రింపోచే) బోధనలనుండి వచ్చాయి. ఈయినే టిబెత్కు బౌధ్ధమతాన్ని పరిచయమ చేశారు. గ్రహీతలో ప్రాణాధార బలాన్ని నింపి కుండలిని శక్తిని పెంచడమే చిహ్నాలు మరియు టిబెతన్ తాంత్రికేల ఉద్దేశం. ఈ చిహ్నాలు చక్రాల మీద కూడా పని చేస్తాయి.

రికి సేఖేం-సేచిం

రేకి సేఖిం-సేచిం (సేకిం అని పలకాలి "SKHM" అని సంక్లిప్తంగా చెప్పబడుతుంది) అనేది ఈజిప్టుల సేఖేం అనే పదాన్నుండి ఇది వచ్చింది. దేన్ని అనువదిస్తే "శక్తుల యొక్క శక్తి" అని అర్ధం వస్తుంది.ఈ పద్ధతిని పాట్రిక్ సేగ్లేర్ స్థాపించారు.ప్రస్తుతం SKHM పాట్రిక్ తనయొక్క శక్తి సంబందిచిన పనిని చూపిస్తుంది.

1979లో పాట్రిక్ జేగ్లేర్ చేఒప్స్ పిరమిడ్లో ఉన్న SKHM యొక్క స్వచ్ఛమైన శక్తిలో ప్రవేశం పొందాడు. తరువాత షేక్ మొహమద్ ఒస్మాన్ బ్రహనితో పాటు శిక్షణ కొనసాగించారు. 1984లో జేగ్లేర్ సమాచారాన్ని వేలుబరుచే 2500 సంవంతరాల పురాతనమైన మారట్ ప్రేతాత్మని వేలుబరుచే చ్రిస్తినే గేర్బెర్ని కలిసారు. 1984లో జేగ్లేర్ టాం సీమన్కి సిచిం రేకిని బోధించారు. ఈ రేకి పద్ధతి విస్థిరించటానికి టాం ఒక ముఖ్య కారణము. 1985లో ఫినిక్ష్ సుమ్మేర్ఫిల్డ్ ఏడు అదనపు చిహ్నాలని సృష్టించి సేచింని బోదిన్చదాన్ని ప్రారంబించారు. 1985-1987 మధ్య కాలములో సమ్మర్ఫీల్ద్ ఆస్ట్రేలియాలో సేచిం బోధించడం ప్రారంబించారు. తరువాత ఈ పద్ధతి ప్రపంచమంతా వ్యాప్తి చెందుతూ ఉంది. 1995లో శయూమకేర్ రేకి మాస్టర్ అయి సిచింలో తొలి అడుగు పెట్టారు. 1996లో శయూమకేర్ సిచిం మాస్టర్ అయి సిచిం రేకిని బోధించడం ప్రారంబించారు. శయూమకేర్ 1997లో స్వచ్ఛందంగా ఒక కొత్త దిశ నిర్ధేశించటం ద్వారా సేఖేం-సేచిం రేకికి రూపకల్పన చేశారు.శయూమకేర్, మర్శ బరాక్ ఇరువురు ఆ రేకి విధానములో నిష్ణాతులు.

బోధనలు[మార్చు]

రేకి బోధనల ప్రకారం ఈ సృష్టిలో ఉన్న అనంతమైన "జీవశక్తి" మరియు ఆధ్యాత్మిక శక్తులను[28][29] శారీరిక రుగ్మతలనుండి ఉపశమనం పొందేందుకు వాడుకోవచ్చు.[30] ఈ శక్తిని రేకి గురువులచే చేయబడే ఒక విశేష అట్యూన్మెంట్ ప్రక్రియ [31] ద్వారా ఎవరైనా పొందవచ్చని దీన్ని నమ్మేవాళ్ళు చెపుతున్నారు.[32] అయితే ఈ విధముగా శక్తిని పొందగాలమనటానికి సిద్దాంతరీత్య కాని జీవ-భౌతికశాస్త్రరీత్యా కాని ఎటువంటి ఆధారాలు లేవు.[5][33][34]

రేకి శారీరికంగా, మానసికంగా, ఒక సంపూర్ణమైన చికిత్స పద్దతని భావపూరితంగా మరియు ఆద్యాత్మికంగా స్వస్ధత కలిగిస్తుందని ఈ పద్ధతిని పాటించేవాళ్ళు వివరిస్తున్నారు.[35] రేకి విధానాన్ని పాటించేవాళ్ళు తమ చేతులని చికిత్స గ్రహీతల మీద కాని దగ్గిర కాని పెట్టినప్పుడు శక్తి వాళ్ళ చేతులద్వారా ప్రవహిస్తుందని నమ్మకం. ఇది జరగేటప్పుడు గ్రహీత దుస్తులు దరించి ఉండవచ్చు.[36] కొన్ని బోధనలు రేకి ఆచరిస్తున్నవాళ్ళ ఉద్దేశం లేదా సమక్షం చాల ముఖ్యమని చెపుతున్నాయి. అయితే గ్రహీత యొక్క గాయాన్నుండి తీయబడిన శక్తి సహజమైన చికిత్సా ప్రక్రియాన్ని ప్రారంబించటమో లేదా దాన్ని ఇంకా వేగవంతం చేయటమో [37] చేస్తుందని ఇతర బోధనలు చెపుతున్నాయి. శక్తి వివేకవంతమైనది,[38] అందువల్ల రోగనిర్దారణ అవసరమే లేదని ఇంకొక నమ్మకం.

రేకి చికిత్స దూరం నుండే నిర్వర్తించటానికి చికిత్సాకారునికి పై స్థాయిలో శిక్షణ గావించబడుతుంది.[39] ఈ విధానంలో కొన్ని ప్రత్యేక గుర్తుల ద్వారా రేకి కర్తకు గ్రహీతకు మధ్య ఒక తాత్కాలిక శక్తి బంధం ఏర్పడుతుంది.[40] కొన్ని ప్రక్రియల ద్వారా గతములోగాని భవిష్యత్తులోగాని రేకి చికిత్సను తీసుకువెళ్ళే అవకాశం వుంటుంది.[54]

ఆచరణ[మార్చు]

పూర్తి శారేరక చికిత్స[మార్చు]

పూర్తి శారీరక రేకి చికిత్సలో[41] రేకి కర్త గ్రహీతని ఒక మర్దనా బల్లలో పడుకోపెట్టి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోమని చెపుతారు. ఈ చికిత్సా సమయములో వదులుగా సుఖవంతముగా ఉండే దుస్తులని ధరిస్తారు. రేకి కర్త ఒక ప్రశాంతమైన మననమైన మనస్థితికి రావడానికి మరియు చికిత్స ఇవ్వడానికి తనను తయారు చేసుకోవడానికి కొన్ని క్షణాలు తీసకోవచ్చు.[42] ఈ చికిత్స సాధారణంగా ఎటువంటి అనవసరమైన సంభాషణలు లేకుండా సాగుతుంది.[43]

కర్త తన చేతులని గ్రహీత మీద రకరకాల స్థానాల్లో పెట్టుతూ ఈ చికిత్స సాగిస్తారు. కొన్నిసార్లు కర్త గ్రహీతని ముట్టుకోకుండానే, కొన్ని లేదా అన్ని స్థానాలకి తన చేతులని గ్రహీత శరీరానికి కొన్ని సెంటిమీటర్ల దూరంలో ఉంచి ఈ చికిత్సని అందించవచ్చు. కర్త ఒక్కొక్క స్థానాల్లో చేతులని 3-5 నిమిషాలపాటు ఉంచుతారు. మొత్తంమీద చేతి స్థానాలు తల, శరీరమొక్క ముందు మరియు వెనక్క బాగాలు, మోకాలు మరియు పాదాలకి వర్తిస్తుంది.12 - 20 చేతి స్థానాలని సాధారణంగా వాడుతారు. మొత్తం చికిత్సకి సుమారు 45-90 నిమిషాలు సమయం పడుతుంది.[44]

కొంత మంది రేకి కర్తలు ఒక నిర్ణీతమైన చేతి స్థితులనే వాడుతారు. ఇతరలు వారి ఆత్మప్రభోదిత ఆలోచనలపై ఆధారపడి చికిత్స చేస్తారు.[45] కొన్నిసార్లు శరీర భాగాలను స్కాన్ చేసి చికిత్స మొదలుపెడతారు.ఇటువంటి ప్రేరణ ఆధారిత రేకిలో ఒక్కొక్కసారి చేతి ముద్రలు ఎక్కువగాని తక్కువగాని సమయము తీసుకునే అవకాశము ఉంది.

గ్రహీతని తాకకుండా చికిత్స చేసినాకూడా గ్రహీతకి చికిత్సాస్థలములో వెచ్చదనం కాని జలధరించటం కాని ఏర్పడుతుందని చెప్పబడుతుంది.చికిత్స ముగిసిన వెంటనే గ్రహీతకి పూర్తిగా మనస్సు తేలికైపోయి సుఖంగా ఉండుంది. కొన్ని సార్లు ఫలితాలు భావభరితనని వ్యక్త పరచేలా కూడా ఉండవచ్చు.[46] రేకి చికిత్సా పద్ధతి సహజమైన చికిత్స ప్రక్రియని ఉత్తేజపరుస్తుందని చెప్పబడుతుంది కాబట్టి శారీరక ఆరోగ్య సమస్యలకి తక్షణ ఫలితాలు ఏమి సాధారణంగా కనబడవు . దీర్ఘకాల సమస్యలకి 1-7 రోజుల వ్యవధిలో మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు చికిత్స చేయాలని చెపుతారు.[47] సాధారణంగా ఆరోగ్యంగా ఉండటానికి దీర్ఘకాలిక ప్రాతిపదికన ఈ చికిత్సను కొనసాగించవచ్చు. దీనికి 1-4 వారాల వ్యవధిలో చికిత్స తీసుకుంటారు అయితే స్వయంగా చికిత్స చేసుకునేవారు ప్రతిరోజు చేసుకుంటారు.[48]

స్థానిక చికిత్స[మార్చు]

స్థానిక రేకి చికిత్సలో కర్త తన చేతులని గ్రహీత నిర్ణీతమైన శారీర భాగం మీద కాని దానికి దగ్గిరలో కాని పెటుతారు. ఇటీవల జరిగిన గాయాలకి ఈ విధముగా[49] గాయం ఏర్పడిన చోటుని లక్ష్యంగా పెట్టుకుని చికిత్స చేస్తారు. ఇటువంటి చికిత్సలో చికిత్సా కాలవ్యవధిలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. అయితే సాధారణంగా 20 నిమిషాలు పాటు చికిత్స ఉంటుంది.

కొంత మంది రేకి కర్తలు స్థానిక చికిత్సా పద్ధతిని కొన్ని రోగాలని నయం చేయటానికి వాడుతారు. కొన్ని ప్రచురణలు తగు చేతి స్థానాల పట్టికని ప్రసురించాయి.[64]అయితే ఇతర రేకి కర్తలు పూర్తి శారీరక చికిత్స పద్ధతినే ఇష్టపడుతారు ఎందుకంటే అది సంపూర్ణమైన ఫలితాన్ని ఇస్తుందని.[65] ఇంకొక పద్ధతి ఏమంటే ముందుగ పూర్తి శారీరక చికిత్సని ఇచ్చి తరువాత స్థానిక చికిత్సని ఇవ్వడం.[66]

శిక్షణ[మార్చు]

జపాన్ బైట రేకి శిక్షణ విధానం మూడు శ్రేణులుగా విభజించపడుతాయి.[67]

మొదటి శ్రేణి[మార్చు]

మొదటి శ్రేణి రేకి పాఠావళిలో[68]ప్రాథమిక సిద్ధాంతాలు, విధానాలను నేర్పుతారు.[50] గురువు విద్యార్థికి నాలుగు "అట్యునేమెంట్ "లు ఇస్తారు.[50] విద్యార్తులు పూర్తి శారీరక చికిత్సలో గ్రహీత శరీరములో పెట్టాల్సిన సరైన చేతి స్థితులను నేర్చుకుంటారు.[51] మొదటి శ్రేణి పూర్తి చేసినవాళ్ళు తమకి మరియు ఇతరలకి రేకి చికిత్స ఇవ్వవచ్చు. ఈ పాఠావళి సంప్రదాయంగా 4 సార్లు వరుసగా 2,3 లేదా 4 రోజుల్లో ఇవ్వబడుతంది.[52]

రెండవ శ్రేణి[మార్చు]

రెండవ శ్రేణి పాఠావళిలో[72] శక్తిని మరియు ఫలితాలయొక్క దూర పరిమితిని పెంచే మూడు చిహ్నాలు,వాటి వాడకాల గురించి విద్యార్థి నేర్చుకుంటారు.[73] విద్యార్థికి రేకి ప్రవహించే సామర్ధ్యాని పెంచి మరియు చిహ్నాల వాడే సామర్ధ్యాన్ని పెంచే మరొక "అట్యూన్మెంట్ " ఇవ్వబడుతుంది.[53] రెండవ శ్రేణి పూర్తి చేసిన తరువాత విద్యార్థి తను స్వయంగా హాజరవకుండానే గ్రహీతకి చికిత్స ఇచ్చే సామర్ధ్యాని పొందుతారు .[75]

మూడవ శ్రేణి లేదా మాస్టర్ శిక్షణ[మార్చు]

మూడవ శ్రేణి లేదా మాస్టర్ శిక్షణ తరువాత విద్యార్థి రేకి మాస్టర్ అవుతాడు.[54](రేకి పదావళిలో "మాస్టర్""అనే పదానికి ఆధ్యాత్మిక జ్ఞానోదయం అని అర్థం కాదు)ఒకటి లేదా ఇంకా ఎక్కువ అట్యూన్మెంట్లు ఇవ్వబడి విద్యార్థి మరొక మాస్టర్ శ్రేణి చిహ్నమైన డై కో మ్యో ని నేర్చుకుంటాడు.[55] మాస్టర్ శిక్షణ పూర్తి చేసిన తరువాత రేకి మాస్టర్గా ఇతరలకి రేకి నేర్పించవచ్చు,మూడు శ్రేణీలను బోదించవచ్చు. శిక్షణ ఇచ్చే గురువుల మరియు రేకి సిద్ధాంతాల బట్టి మాస్టర్ శిక్షణకి కాల వ్యవధి 1 రోజు నుండి 1 ఏడాది వరకు పట్టవచ్చు.

బేధాలు[మార్చు]

శిక్షణా విధానాల్లో, వేగములో మరియు ఖరీదులో చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. రేకికి గుర్తింపు ఇచ్చే సమస్త కానీ ఆచరణా విధానాన్ని కట్టుబాటు చేసే ప్రక్రియ కానీ లేదు.రేకి పాఠాలని ఇంటర్నెట్ ద్వారా కూడా నేర్చుకోవచ్చు. కానీ రేకి మాస్టర్ లేదా గురువు విద్యార్దియొక్క శక్తి ప్రదేశాన్ని స్పర్శించాలి, అందుకు మాస్టర్ స్వయంగా ఉంటేనే విద్యార్థికి రేకి ప్రవేశం చేయించడానికి వీలుపడుతుందని సాంప్రదాయవాదులు అంటున్నారు. అయితే రేకిని "త్వరతగతిలో" నేర్పించే ఏ విధానమూ అంత గొప్ప ఫలితాలని ఈయదని మరియు అనుభవం,ఓర్పుతో ఈ కళని నేర్చుకుంటే లభించే పాండిత్యానికి ఏ ప్రత్యామ్నాయము లేదని కొంత మంది సాంప్రదాయవాదులు వాదన.[56]

శాస్త్రీయ పరిశోధన[మార్చు]

రేకిని శాస్త్రీయంగా పరిశోధన చేయటములో ఉన్న సమస్య ఏమంటే ప్లాసిబోతో పోల్చి పరిశోధన చేయాలంటే ప్లాసిబో అన్ని విధాలా రేకి చికిత్సలాగే కనబడేటట్లు చూడాలి.[79]

2008లో చేపట్టిన ఒక పటిష్ఠమైన పరిశోధనలో ఎటువంటి పరిస్థితికి రేకి ఒక సరైన చికిత్స అని నిరూపించ బడలేదు. ఈ క్రమమైన పునర్విచారణలో అన్ని ఆధారాలని పరిశీలించిన తరువాత ప్రమాణాలకి అనుగుణంగా ఉండే తొమ్మిది అధ్యయనాన్ని ఎంపిక చేసారు.[7] రేకి కర్తలయొక్క కళ్ళని కప్పడంలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా ఒక సవరించిన జడాద్ స్కోరుని పరిశోధనలయొక్క నాణ్యతని కొలవడానికి వాడారు. అనిర్దిష్టత లేని పరిశోధనలని పరిగణంలోకి తీసుకోలేదు ఎందుకంటే ఎటువంటి పరిశోధనల్లోనయినా ఆలోచనపూర్వకంగా కానీ అనాలోచనపూర్వకంగా కానీ పక్షపాతము ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ పరిశోధనల ఫలితాలు వ్యాఖ్యానించడానికి అర్హం కావు.మొత్తంమీద ఆధారాల పరిశోధనా పద్ధతుల యొక్క నాణ్యత లోపించి ఉంది. అతి పెద్ద పరిశోధనలు కూడా ప్లాసిబో ప్రాబల్యాన్ని పూర్తిగా నివరించలేదు. చాలా పరిశోధనల్లో పద్ధతి పరంగా కనిపించే లోపాలు ఏమనగా తక్కువ నమూనా సంఖ్యా, పరిశోధన రూపకల్పనలో లోపము మరియు నివేదన లోపాలు.[81] ఇటువంటి లోపాలు ఉన్న పరిశోధనలు చికిత్సా ఫలితాలని బాగా పెంచి చూపిస్తాయి కనుక,రేకి ఎటువంటి ఆరోగ్య సమస్యకి ఏకైక లేదా అదనపు చికిత్సా పద్ధతి అని చెప్పడానికి కానీ ప్లసిబో కంటే ఎక్కువ ఫలితము ఇస్తుందని చెప్పడానికి కానీ సరిపోను ఆధారాలు లేవు.[82][83]

భద్రత మరియు ప్రభావం[మార్చు]

ఇతర నిరూపణకాని ప్రత్యామ్నాయ చికిత్సలగురించి ఉన్నట్టే రేకి భద్రత గురించి కూడా చింతలు ఉన్నాయి.ప్రమాదకరమైన జబ్బులతో బాధపడుతున్న రోగులు శాస్త్రీయపరంగా నిరూపించబడిన చికిత్సని కాకుండా రేకి లాంటి నిరూపణంకాని చికిత్సలవైపు మక్కువ చూపించే అవకాశముందని వైద్యశాస్త్రం చదివిన వైద్యులు మరియు సహాయ ఆరోగ్యశాఖలో పనిచేస్తున్నవారు నమ్ముతున్నారు.[57] ప్రమాదకరమైన పరిస్థితులగురించి వైద్యులని సంప్రదించమని రేకి కర్తలు తమ వద్ద వచ్చే సేవాగ్రహీతలని ప్రోత్సాహించాలి మరియు వాళ్ళకి రేకి పద్ధతిని సాంకేతిక వైద్యానికి అదనంగా వాడుకోవచ్చని చెప్పాలి.[87] రేకి వల్ల ఎటువంటి హానికరమైన ప్రభావాలు లేవని ఆరోగ్య పరిశోధనల్లో వెలుబడింది.[7]

రేకి వల్ల లభించే ఫలము సూచన (ప్లసిబో ఫలము)[58] వల్ల అయి వుంటుందని ది నేషనల్ కౌన్సిల్ అగైన్స్త్ హెల్త్ ఫ్రాడ్ అబిప్రాయపడుతుంది. రేకి గ్రహీతలే వాళ్ళకి గణనీయమైన చికిత్సా ఫలాలు లభిస్తాయని ఆశించటము లేదు కాబట్టి రేకిని సుఖంగా ఉన్నట్లుగా భావించడానికి ఉపయోగపడే ఒక చికిత్స విధానముగా పేర్కొంటున్నారు.[59]

అంతర్గత విభేదాలు[మార్చు]

రేకి విద్య విధానం లోని ఆనేక తేడాల వలన రేకికి సంబంధించిన గురువులు,చికిత్సకారులు,ఇతర సంస్థలలో ఆంతర్గత విభేదాలు ప్రారంభమయ్యాయి. రేకి శక్తి యొక్క స్వరూపము,శిక్షణా విధానాలు,రహస్య గుర్తులు, అనుసందానించే పద్ధతి,చికిత్సకయ్యే ఖర్చు వగైరాలలో తేడాలు వుండటంతో రేకి సంస్థలలో ఆంతర్గత విభేదాలు ప్రారంభమయ్యాయి.[60][61]

హవయో టకట మరణాంతరం 1990 దశాబ్ధములో గ్రాండ్ మాస్టర్ పదవికి ఆనేక మంది ప్రత్యర్థులు వుండేవారు.అయితే తకటానే ఈ పదముని సృష్టించారని తెలిసిన తరువాత ఈ వివాదము సద్దు మణిగింది.[95]

కాథలిక్ చర్చి వారి చింతలు[మార్చు]

మార్చి 2009లో అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని కాథలిక్ బిశోప్ల సమావేశం రేకి చికిత్సా విధానం గురించి ఒక శాసనం జారి చేసింది (రేకిని ఒక ప్రత్యామ్నాయ చికిత్సలా పరిగణించడానికి సూచనలు, 2009 మార్చి 25). దరుమిల కొన్ని కాథలిక్ సమస్థలు కాథలిక్కులు రేకిని ఆచరించటాన్ని మరియు కథొలిక్కు వైద్యశాలలలో రేకి చికిత్సల వాడకాన్ని నిషేధించటం జరిగింది."రేకి చికిత్సా విధానానికి క్రైస్తవ బోధనలకిగాను శాస్త్రీయ ఆధారలకిగాను పొందిక లేదు కాబట్టి కాథలిక్ సంస్థలు అనగా కాథలిక్ వైద్యశాలలు,కాథలిక్ ఆశ్రమాలు మరియు కాథలిక్ గురువులాంటి చర్చయొక్క ప్రతినిధులు రేకి పద్దతిని ప్రోత్సాహించటముగాని దానికి సహాయపడటముగాని సమచితం కాదు" అని ఈ శాశనం చివరిగ చెపుతుంది.

ఇవి కూడా చూడండి[మార్చు]

గమనికలు[మార్చు]

 1. లుబెక్,పెట్టర్,రాండ్ 2001 ch14,pp108;ఎల్లియర్డ్ 2004 p79; మేకెన్జీ 1998 pp19,42,52 పుటలు; లుబెక్ 1996 p22; బోరాంగ్ 1997 p57; వెల్తీం,వెల్తీం 1995 p72
 2. 2.0 2.1 ఉసుఇస్ 21 డే రిట్రీట్: (లుబెక్,పెట్టేర్,రాండ్ 2001 p14); వాట్ ఈస్ ది హిస్టరీ అఫ్ రికి?
 3. పరస్పర మరియు ప్రత్యామ్నాయ వైధ్యమునకు కేంద్రీయ సంస్థ "రేకి : ఎన్ ఇంత్రోడుచ్షన్", nccam.nih.gov/health/reiki/ నవంబరు 13 2008 నందు తీయబడినది
 4. ఇన్స్టిట్యూట్ ఫర్ కాంప్లిమెంటరీ అండ్ నాచురల్ మెడిసిన్. "BRCP డివిషన్స్ అండ్ ప్రేక్తీసేస్ " Archived 2007-08-12 at the Wayback Machine. , i-c-m.org.uk . నవంబరు 12, 2008న తీయబడినది
 5. 5.0 5.1 నేషనల్ సెంటర్ ఫర్ కాంప్లిమెంటరి అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ యాన్ ఇంట్రడక్షన్ టూ రేకి
 6. రేకి ఫ్లోస్ త్రు హాండ్స్ :(మెకంజీ 1998 p18 );(ఎల్లియార్డ్ 2004 p27 ); బోరాంగ్ 1997 p 9); వెల్తీం, వెల్తీం 1995 p33 )
 7. 7.0 7.1 7.2 Lee, MS (2008). "Effects of reiki in clinical practice: a systematic review of randomized clinical trials". International Journal of Clinical Practice. 62: 947. doi:10.1111/j.1742-1241.2008.01729.x. Retrieved 2008-05-02. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (help)
 8. హెండర్సన్,మార్క్ "ప్రిన్స్ ఆఫ్ వేల్స్ గైడ్ టూ ఆల్టర్నేటివ్ మెడిసిన్ 'ఇన్యక్కురేట్'", థ టైమ్స్ April 17, 2008. ఏప్రిల్ 17 ,2008నవంబరు 13, 2008 న వాడబడినది
 9. లిన్ యుటాoగ్,1972, "లిన్ యుటాంగ్ చైనీస్ -ఇంగ్లీష్ డిక్షనరీ ఆఫ్ మోడరన యు సేజ్ ", చైనీస్ యునివర్సిటి ఆఫ్ హంగ్కొంగ్ ప్రెస్
 10. లింగ యువన్, 2002, ది కాతెమ్పోరరీ చైనీస్ డిక్షనరీ, చైనీస్-ఇంగ్లీష్ ఎడిసన్ , ఫారిన్ లాంగ్వేజ్ తెఅచింగ్ అండ్ రీసెర్చ్ ప్రెస్.
 11. దేఫ్రంసిస్, జాన్, 2003, ABC చైనీస్-ఇంగ్లీష్ కాంప్రెహెన్సెడ్ నిఘంటువు , యునివేర్సితి అఫ్ హవాయి ప్రెస్.
 12. డెరివశన్ అఫ్ నేమ్: (లుబెక్, పెట్టేర్, రాండ్ 2001 చ 6)
 13. ఎం స్పాన్ అండ్ డబ్ల్యు .హడామిట్జి, ౧౯౮౯, జాపనీస్ ఖరేక్టర్ దిక్షోనరి విత్ కాంపౌండ్ లుకుప్ వయ అని కంజి , నిచిగై.
 14. J. H. హైగ్, ఎడ్. జే. హెచ్.హైగ్ ,ఎడ్.1997, ది న్యూ నెల్సన్ జపనీస్-ఇంగ్లీష్ క్యారెక్టర్ డిక్షనరీ , టుటలె.
 15. T. వతానబే, E., R. స్క్ర్జ్య్ప్చ్జాక్, P. స్నౌడేన్, 2003, కేంక్యుశాస్ న్యూ జపనీస్-ఇంగ్లీష్ డిక్షనరీ.
 16. లుబెక్, పెట్టేర్, రాండ్ 2001 p302; మ్కెన్జీ 1998 p18; శుఫ్ఫ్రేయ్ 1998 p1
 17. ఫౌందింగ్ అఫ్ ఊసుఇ రికి ర్యోహో గక్కై: (లుబెక్,పెట్టేర్,రాండ్ 2001 p14)
 18. ప్రాక్టీస్ అఫ్ 5 ప్రిన్సిపల్స్: పార్ట్ అఫ్ రికి అల్లయన్స్ మెంబెర్షిప్ అగ్రీమెంట్[permanent dead link]
 19. ది 5 రేకి ప్రిన్సిపల్స్: రేకి ప్రిన్సిపల్స్; (పెట్టేర్ 1998 p29); (లుబెక్,పెట్టేర్,రాండ్ 2001 p95)
 20. నెంబర్ అఫ్ పీపుల్ టాట్ బై ఊసుఇ: (లుబెక్,పెట్టేర్,రాండ్ 2001 p16)
 21. హయషీస్ టీచింగ్స్: (లుబెక్,పెట్టేర్,రాండ్ 2001 p17,ch19)
 22. హయషి టకటకి శిక్షణ ఇచ్చారు: (ఎల్యర్డ్ 2004 p13)
 23. ^ టకట రేకి ప్రాక్టిస్ అండ్ టీచింగ్ ఇన్ ద యు.ఎస్: (ఎల్లియర్డ్ 2004 పే 15 )
 24. [31] ^ టకట రేకి మస్తేర్లకి శిక్షణ ఇవ్వడం ప్రారంభం: (ఎల్యర్డ్ 2004 p15)
 25. (పెట్టేర్ 1997 p21), (వేల్తీం, వేల్తీం 1995 p26)
 26. టకాటా 22 రికి మాస్టర్లకి శిక్షణ ఇచ్చారు: (ఎల్యర్డ్ 2004 p14), (వేల్తీం, వేల్తీం 1995 p26), (పెట్టేర్ 1997 p20)
 27. రేకిని జపాన్నుండి బయటకి తీసుకురావడంలో టకాటయొక్క ప్రాముఖ్యత: (ఎల్యర్డ్ 2004 pp14,16), (వేల్తీం, వేల్తీం 1995 p26)
 28. రేకి తరగనిదిమెకంజీ 1998 p18; బోరాంగ్ 1997 p9
 29. రేకి ఒక సార్వజనిక జీవ శక్తి: లుబెక్,పెట్టేర్,రాండ్ 2001 p62; మ్కెన్జీ 1998 p18; ఎల్యర్డ్ 2004 p75; (లుబెక్ 1994 p13); (బోరాంగ్ 1997 p8)
 30. మ్కెన్జీ 1998 p18; లుబెక్,పెట్టేర్,రాండ్ 2001 pp14,68; వేల్తీం,వేల్తీం 1995 p30; ఎల్ల్యర్డ్ 2004 p27
 31. గమనిక: అట్యూన్మెంట్ మరియు "ఇనిషియెశున్" అనే రెండు పదాలకి రేకిలో ఒకే అర్ధం.అయితే అప్పుడప్పుడు ఈ రెండు పదాలకి స్వల్ప వ్యత్యాసము ఉంటుంది. అట్యూన్మెంట్ రేకి శక్తిలో ప్రవేశం పొందేటప్పుడు వాడుతారు. "ఇనిషియెశన్" అనే పదాన్ని స్వయ లేదా ఆద్మాద్మిక పెరుగుదల గురించి చెప్పేటప్పుడు వాడుతారు. ఈ రెండు పధాలు ఒకే భౌతిక పద్ధతినే సూచిస్తాయి.
 32. ప్రవేశము అట్యూన్మెంట్ ద్వారానే:(ఎల్యర్డ్ 2004 pp27,31); (లుబెక్,పెట్టేర్,రాండ్ 2001 p22); (మ్కెన్జీ 1998 pp18,19); (గొల్లఘేర్ 1998 p26); (బోరాంగ్ 1997 p12)
 33. The 'National Center for Complementary and Alternative Medicine (October 13 2006). "Energy Medicine: An Overview". మూలం నుండి 2009-01-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-11-04. Cite web requires |website= (help); Check date values in: |date= (help) "
 34. Stenger, Victor J. (1999). "The Physics of 'Alternative Medicine' Bioenergetic Fields". Scientific Review of Alternative Medicine. 3 (1): 1501. doi:10.1126/science.134.3489.1501. PMID 14471768. మూలం నుండి 2006-12-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-03-30.
 35. రేకి సమూలమైన భౌతిక, మానసిక,భావ సంబంధిత, ఆధ్యాత్మిక చికిత్స :(బాగిన్స్కి, శరమోన్ 1988 p35);(గొల్లఘర్ 1998 p44 );
 36. రేకీ చేయించుకునే వ్యక్తి దుస్తులు ధరించకొని ఉండవచ్చు:(లుబెక్ 1994 p48 ); (మెకెంజీ 1998 p81 ); (బోరాంగ్ 1997 p10,36 )
 37. రేకి సహజసిద్ధమైన ఉపశమనానికి తోడ్పడుతుంది( మేకేంజే 1998 p18 );(వేల్తీం , వేల్తీం 1995 p78,93 );(గొల్లఘేర్ 1998 p24 )
 38. ^ రేకీ ఈస్ "ఇన్టల్లిజేంట్ ":(ఎల్లియర్డ్ 2004 p28,29 );(బోరాంగ్ 1997 p10 )
 39. రెండవ స్థాయిలో దూరం నుండే నయం చేయవచ్చు(ఎల్యర్డ్ 2004 p107 ); (మకేంజి 1998 p56 ); (లుబెక్ 1994 p155 ); (వేల్తీం , వేల్తీం 1995 p119 )
 40. గుర్తుల సహాయంతో దూర చికిత్స: (మకేంజే 1998 p39); (ఎల్యర్డ్ 2004 p110)
 41. పూర్తి శారీరక చికిత్స: (లుబెక్ 1994 ch4,ch5); (మ్కెన్జీ 1998 p84); (ఎల్యర్డ్ 2004 p45); (లుబెక్,పెట్టేర్,రాండ్ 2001 ch20); (వేల్తీం,వేల్తీం 1995 p79); (పెట్టేర్ 1997 pp50,55); (బోరాంగ్ 1997 p36)
 42. చికిత్స ప్రారంబదశలో రేకి కర్త చేసుకుంటున్న మానసిక సన్నాహం: (ఎల్ల్యర్డ్ 2004 p46)
 43. నియంత్రిoచిన చికిత్స సమయములో అతి తక్కువగా మాట్లాడటం: (ఎల్యర్డ్ 2004 p45)
 44. పూర్తి శారీరక చికిత్స కాల వ్యవధి: (ఎలియర్డ్ 2004 పే 41)
 45. అంతర్బుద్ది ఉపయోగం: (ఊసుఇ,పెట్టేర్ 2003 p17)
 46. చికిత్సయొక్క తక్షణ ఫలితం: (ఎల్యర్డ్ 2004 p44)
 47. ఇతరలకి ఇచ్చే చికిత్సయొక్క పునర్ప్రధర్శన: (ఎల్యర్డ్ 2004 p41)
 48. స్వీయ చికిత్స యొక్క పునర్ప్రధర్శన : (ఎల్యర్డ్ 2004 p41)
 49. గాయాలకి చికిత్స: (మ్కెన్జీ 1998 p110); (ఎల్యర్డ్ 2004 p70); (వేల్తీం,వేల్తీం 1995 p77)
 50. 50.0 50.1 మొదటి స్థాయిలో 4 అట్యూన్మెంట్ల ఫలాలు: (ఎల్యర్డ్ 2004 p37)
 51. మొదటి శ్రేణి పాఠావళిలో నేర్పబడే చేతి స్థాయిలు: (బగిన్స్కి, శరమోన్ 1988 p48), (పెట్టేర్ 1997 p39)
 52. మొదటి శ్రేణి పాఠాలకి కాల వ్యవధి: (బగిన్స్కి, శరమోన్ 1988 p46), (పెట్టేర్ 1997 p38)
 53. రెండవ స్థాయి అట్యూన్మెంట్ యొక్క ఫలితాలు: (ఎల్యర్డ్ 2004 p81)
 54. మాస్టర్ శిక్షణ: (మ్కెన్జీ 1998 p58); (వేల్తీం,వేల్తీం 1995 pp120-124); (పెట్టేర్ 1997 pp47-49)
 55. మాస్టర్ శిక్షణలో పాథ్యామసాలు: (ఎల్యర్డ్ 2004 ch16,ch17)
 56. "రేకిలో ఉన్న శ్రేణులు". మూలం నుండి 2009-12-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-11-04. Cite web requires |website= (help)
 57. Lilienfeld, Scott O. (2002). "Our Raison d'Être". The Scientific Review of Mental Health Practice. 1 (1). Retrieved 2008-01-28.
 58. రేకి గురించిన ఒక అనుమానాస్పత అంచనా: నేషనల్ కౌన్సిల్ అగైన్స్త్ హెల్త్ ఫ్రాడ్ కథనం Archived 2009-08-23 at the Wayback Machine..
 59. "CAM" నమ్మకాల గురించి కొన్ని ఆలోచనలు
 60. "Charging for Reiki Healing". Indobase. Retrieved 2009-02-05. Cite web requires |website= (help)
 61. Ray, Barbara (1995). "The Radiance Technique, Authentic Reiki: Historical Perspectives". The Radiance Technique International Association Inc. Retrieved 2008-04-02. Cite web requires |website= (help)

అన్వయములు[మార్చు]

 • బి.జే.బగిన్స్కి, ఎస్.శరమోన్.రికి:యునివేర్సల్ లైఫ్ ఎనేర్జి (ఆంగ్ల ప్రసురణ : లైఫ్ రిథం, 1988), ISBN 0-940795-02-7.
 • డానియల్ జే. బెనోర్, MD స్పిరిచ్యువల్ హీలింగ్:సైంటిఫిక్ వలిదషన్ అఫ్ ఎ హీలింగ్ రేవోలుషన్ (విషన్ పబ్లికేషన్స్ - డిసెంబరు 2000) ISBN 1-886785-11-2.
 • కజ్స కృష్ని బోరాంగ్ రేకి (ప్రిన్సిపల్స్ అఫ్) (తోర్సొంస్, 1997) ISBN 0-7225-3406-X.
 • ఎల్.ఎల్యర్డ్ రేకి హీలేర్: ఎ కంప్లేతే గైడ్ టు ది పాత్ అండ్ ప్రాక్టీసు అఫ్ రేకి (లోటస్ ప్రెస్, 2004) ISBN 0-940985-64-0.
 • త్రేవోర్ గొల్లఘేర్. రేకి: ఎ గిఫ్ట్ ఫ్రొం ది యునివేర్సే (ప్రచ. తెలియదు 1998).
 • మార్క్ హోస్ మరియు వాల్టర్ లయూబెక్. 0}బిగ్ బుక్ అఫ్ రికి సింబల్స్ (లోటస్ ప్రెస్, 2006) ISBN 0-914955-64-0.
 • W. లుబెక్ కంప్లేతే రికి హన్ద్బూక్ (లోటస్ ప్రెస్, 1994) ISBN 0-941524-87-6.
 • W. లుబెక్. రేకి: వే అఫ్ ది హార్ట్ (లోటస్ ప్రెస్, 1996) ISBN 0-941524-91-4.
 • W. లుబెక్, ఎఫ్. ఎ . పెట్టేర్ & W. L. రాండ్. స్పిరిట్ అఫ్ రేకి (లోటస్ ప్రెస్, 2001, 5వ ప్రచురణ: 2004) ISBN 0-914955-67-5.
 • ఆలివేర్ క్లాట్ etc. రికి సిస్టమ్స్ అఫ్ ది వరల్డ్ (లోటస్ ప్రెస్, 2007) ISBN 0-914955-79-9.
 • ఎలేనోర్ మ్కెన్జీ. హీలింగ్ రికి ( హంలిన్, 1998) ISBN 0-600-59528-5.
 • పమేలా మైల్స్. రికి: ఎ కంప్రేహేన్సివే గైడ్ (తర్చేర్/పెంగుయిన్, 2006) ISBN 1-58542-474-9.
 • నిన L. పాల్ PhD రేకి ఫర్ దుమ్మీస్ (విలీ పబ్లిషింగ్ ఇంక్, 2005) ISBN 0-7645-9907-0
 • F. A. పెట్టేర్ . రికి ఫైర్ (లోటస్ ప్రెస్, 1997) ISBN 0-914955-50-0
 • F. A. పెట్టేర్ . రికి: ది లెగసి అఫ్ డా.ఊసుఇ (లోటస్ ప్రెస్, 1998) ISBN 0-914955-56-X
 • F. A. పెట్టేర్, T. యమగుచి మరియు C. హయషి. హయషి రికి మాన్యువల్: త్రదిషనల్ జపనీస్ హీలింగ్ టెక్నిక్స్ ఫ్రం ది ఫౌందర్ అఫ్ ది వెస్ట్రన్ రికి సిస్టం (లోటస్ ప్రెస్, 2004) ISBN 0-914955-75-6
 • డా. బార్బరా రే. ది 'రేకి' ఫాక్టర్ ఇన్ ది రెడియన్స్ టెక్నిక్ (R) (రాదియన్క్ అసోసియేట్స్, 1983 - ప్రస్తుత విస్తార ప్రచురణ (c) 1992) ISBN 0-933267-06-1
 • సండి లేర్ శుఫ్ఫ్రేయ్. రేకి: ఎ బెగిన్నెర్స్ గైడ్ /0} హేద్వే [హోద్దర్ & స్తోవ్టన్ ], 1998) ISBN 0-340-72081-6
 • బ్రోన్వేన్ మరియు ఫ్రాన్స్ సతినే. ది రికి సౌర్సుబుక్ (ఓ బుక్స్, 2003) ISBN 1-903816-55-6
 • బ్రోన్వేన్ మరియు ఫ్రాన్స్ స్తినే. ది జపనీస్ ఆర్ట్ అఫ్ రికి (ఓ బుక్స్, 2005) ISBN 1-905047-02-9
 • బ్రోన్వేన్ మరియు ఫ్రాన్స్ స్తినే. A -Z అఫ్ రికి (ఓ బుక్స్, 2006) ISBN 1-905047-89-4
 • M. ఊసుఇ మరియు F. A. పెట్టేర్. ఒరిజినల్ రికి హన్ద్బుక్ అఫ్ డా. మికావు ఊసుఇ (లోటస్ ప్రెస్, 2003) ISBN 0-914955-57-8
 • డా. జాన్ & ఎస్తేర్ వేల్తెం. రికి: ది సైన్స్, మెటాఫిజిక్స్ మరియు ఫిలాసఫీ (పరమ, 1995) ISBN 0-9645944-0-4
 • ఆన్ ఇంత్రోడుచ్షన్ టు రికి నేషనల్ సెంటర్ ఫర్ కామ్ప్లేమెంతరీ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ (3 జూలై 2007 తీయబడింది)
 • ABC అఫ్ కామ్ప్లెమెన్టరీ మెడిసిన్ కాతేరినే జోల్ల్మన్ అండ్ ఆండ్రూ వికెర్స్, BMJ 1999;319:693-696, 11 సెప్టెంబర్ 1999, (3 జూలై2007 తీయబడింది)
 • BRCP దివిశాన్స్ అండ్ ప్రక్టిసేస్ ఇన్స్టిట్యూట్ ఫర్ కామ్ప్లేమేన్టరీ మెడిసిన్ (3 జూలై2007 తీయబడింది)
 • మైల్స్, P., ట్రూ, G. రికి: రివ్యూ అఫ్ ఎ బిఒఫీల్ద్ థెరపీ (ఆల్టర్నటివె తెరపీస్ ఇన్ హెల్త్ అండ్ మెడిసిన్, మార్చి/ఏప్రిల్ 2003, 9(2) pp62–72).
 • హ్యూమన్ హీమోగ్లోబిన్ లెవెల్స్ అండ్ రికి (జర్నల్ అఫ్ హోలిస్టిక్ నర్సింగ్, 1989, 7(1) pp47–54)
 • వర్డల్, D.W., ఎంగేబ్రేత్సన్, J. బయలగికాల్ కర్రెలతెస్ అఫ్ రికి టచ్ హీలింగ్ , (జ. అడ్వాన్స్డ్ నర్సింగ్, 2001, 33(4): 439-445)

వెలుపటి వలయము[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=రేకి&oldid=2827260" నుండి వెలికితీశారు