రేఖా గుప్తా
రేఖా గుప్తా | |||
![]()
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2025 ఫిబ్రవరి 20 | |||
గవర్నరు | వినయ్ కుమార్ సక్సేనా | ||
---|---|---|---|
ముందు | అతిషి | ||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2025 ఫిబ్రవరి 8 | |||
ముందు | బందన కుమారి | ||
నియోజకవర్గం | షాలిమార్ బాగ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | జూలానా, హర్యానా, భారతదేశం | 1974 జూలై 19||
జాతీయత | ![]() | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | మనీష్ గుప్తా |
రేఖా గుప్తా ఢిల్లీ రాష్ట్రానికి చెందిన రాజకీయ . ఆమె ఢిల్లీ శాసనసభకు 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో షాలిమార్ బాగ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై[1], ఫిబ్రవరి 20న ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.[2]
జననం & విద్యాభాస్యం
[మార్చు]రేఖా గుప్తా 1974 జులై 19న హర్యానాలోని జుల్నాలో జై భగవాన్ జిందాల్, ఊర్మిళ జిందాల్ దంపతులకు జన్మించింది. ఆ తర్వాత రెండేళ్లకే ఆమె తండ్రి ఉద్యోగరీత్యా ఢిల్లీకి వచ్చి స్థిరపడడంతో ఆమె విద్యాభ్యాసమంతా ఢిల్లీలో పూర్తి చేసి 1992లో ఢిల్లీ విశ్వవిద్యాలయం పరిధిలోని దౌలత్ రామ్ కళాశాల నుండి పట్టభద్రురాలై, 2022లో మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం పరిధిలోని ఘజియాబాద్‌లోని IMIRC కాలేజ్ ఆఫ్ లా భైనా నుండి ఎల్ఎల్బీ పూర్తి చేసింది.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]రేఖా గుప్తా 1998లో పారిశ్రామికవేత్త మనీష్ గుప్తాను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.[4]
రాజకీయ జీవితం
[మార్చు]రేఖా గుప్తా దౌలత్ రామ్ కాలేజీలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌తో (ఏబీవీపీ) నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 1996లో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలిగా పని చేసి ఆ తరువాత భారతీయ జనతా పార్టీ ద్వారా క్రియాశీల రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2007 నుండి 2014 వరకు ఢిల్లీలోని ఉత్తరి పితంపుర వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికై 2007 నుండి 2009 వరకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి కమిటీ ఛైర్‌పర్సన్‌గా, 2012లో జరిగిన ఎన్నికల్లో ఉత్తరి పితంపుర నుంచి వరుసగా రెండోసారి కౌన్సిలర్‌గా ఎన్నికై దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పని చేసి,[5] 2015 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో షాలిమార్ బాగ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి బందన కుమారి చేతిలో 10,978 ఓట్ల తేడాతో ఓడిపోయింది.
రేఖా గుప్తా 2020 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో షాలిమార్ బాగ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి ఆప్ బందన కుమారి చేతిలో 3,440 ఓట్ల తేడాతో ఓడిపోయింది. ఆమె 2022లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో షాలీమార్ బాగ్-బి నుండి తొలిసారి బీజేపీ కార్పొరేటర్‌గా ఎన్నికైంది.[6]
రేఖా గుప్తా 2025 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో షాలిమార్ బాగ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఆప్ అభ్యర్థి బందన కుమారిపై 29,595 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[7] ఆమెను ఫిబ్రవరి 19న బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్న అనంతరం ఢిల్లీ ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించగా[8][9] ఫిబ్రవరి 20న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది.[10]
పార్టీ పదవులు
[మార్చు]- ఢిల్లీ విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు
- 2003 నుండి 2004 వరకు బీజేపీ యువ మోర్చా ఢిల్లీ యూనిట్ ప్రధాన కార్యదర్శి
- 2004 నుంచి 2006 వరకు బీజేపీ యువ మోర్చా జాతీయ కార్యదర్శి
- 2009 ఢిల్లీ బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి
- ఢిల్లీ బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు
- 2010 బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు
మూలాలు
[మార్చు]- ↑ "కార్పొరేటర్ టు సీఎం.. ఆమె వైపు అధిష్టానం మొగ్గుకు కారణం అదేనా". Andhrajyothy. 19 February 2025. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
- ↑ "దిల్లీ సీఎంగా రేఖాగుప్తా ప్రమాణస్వీకారం.. అట్టహాసంగా కార్యక్రమం". Eenadu. 20 February 2025. Archived from the original on 20 February 2025. Retrieved 20 February 2025.
- ↑ "5 facts about Rekha Gupta, Delhi's new chief minister". Hindustan Times. 19 February 2025. Archived from the original on 20 February 2025. Retrieved 20 February 2025.
- ↑ "Delhi CM Rekha Gupta: Age, education, husband, political background". Hindustan Times. 20 February 2025. Archived from the original on 20 February 2025. Retrieved 20 February 2025.
- ↑ "విద్యార్థి నేత నుంచి సీఎం పీఠానికి రేఖా గుప్తా". Andhrajyothy. 19 February 2025. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
- ↑ "BJP names Rekha Gupta as its Delhi mayor candidate. Who is she?" (in ఇంగ్లీష్). India Today. 27 December 2022. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
- ↑ "Delhi Assembly Elections Results 2025 - Shalimar Bagh" (in ఇంగ్లీష్). Election Commission of India. 8 February 2025. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
- ↑ "ఉత్కంఠకు తెర.. దిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తా". Eenadu. 19 February 2025. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
- ↑ "Delhi CM pick Rekha Gupta is a grassroots leader with RSS–ABVP background" (in Indian English). The Hindu. 19 February 2025. Archived from the original on 19 February 2025. Retrieved 19 February 2025.
- ↑ "దిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా". Eenadu. 20 February 2025. Archived from the original on 20 February 2025. Retrieved 20 February 2025.