రేడియో తరంగాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రేడియో తరంగాలు అనేవి విద్యుదయస్కాంత వర్ణపటంలో పరారుణకాంతి కన్నా ఎక్కువ తరంగదైర్ఘ్యం కలిగిన రకం విద్యుదయస్కాంత వికిరణాలు. అన్ని ఇతర విద్యుదయస్కాంత తరంగాల వలె, ఇవి కాంతి వేగంతో ప్రయాణిస్తాయి. సహజంగా-సంభవించే రేడియో తరంగాలు మెరుపు, లేదా ఖగోళ పదార్థాలద్వారా తయారవుతాయి. కృత్రిమంగా-ఉత్పత్తిచేసిన రేడియో తరంగాలను స్థిరమైన మరియు చలన రేడియో సమాచారం, ప్రసారం, రాడార్ మరియు ఇతర మార్గనిర్దేశక వ్యవస్థలు, ఉపగ్రహ సమాచారం, కంప్యూటర్ నెట్‍వర్కులు మరియు ఎన్నో ఇతర ప్రయోగాల్లో ఉపయోగిస్తారు. భూమియొక్క వాతావరణంలో వివిధ పౌనఃపున్యాలు కలిగిన రేడియో తరంగాలకు వివిధ విస్తరణ లక్షణాలు ఉంటాయి; దీర్ఘ తరంగాలు భూమియొక్క కొంత భాగాన్ని స్థిరంగా నింపుతూ ఉండవచ్చు, హ్రస్వ తరంగాలు అయనోస్ఫియర్ నుండి వెనుకకు పరావర్తనం చెంది ప్రపంచం చుట్టూ ప్రయాణం చేయవచ్చు, మరియు అతి తక్కువ తరంగదైర్ఘ్యాలు ఎంతో తక్కువగా వంగడం లేదా పరావర్తనం చెంది, దృష్టి రేఖలో ప్రయాణించవచ్చు.


ఆవిష్కారం మరియు ఉపయోగం[మార్చు]

రేడియో తరంగాలతో సహా, వివిధ తరంగదైర్ఘ్యాలు కలిగిన విద్యుదయస్కాంత వికిరణాలకు భూమియొక్క వాతావరణ ప్రసారం (లేదా నిరోధకతత్వం)

రేడియో తరంగాలను మొట్టమొదట 1865లో జేమ్స్ క్లర్క్ మాక్స్‌వెల్ వ్రాసిన గణితశాస్త్ర గ్రంథంలో ఊహించడం జరిగింది. విద్యుత్ మరియు అయస్కాంత పరిశీలనలలో పోలికలు మరియు కాంతి ధర్మాలను మాక్స్‌వెల్ గమనించాడు. అప్పుడు అతడు కాంతి తరంగాలు మరియు రేడియో తరంగాలను, అంతరిక్షంలో ప్రయాణించే విద్యుదయస్కాంత తరంగాలుగా వివరించే సమీకరణాలు ప్రతిపాదించాడు. 1887లో, మాక్స్‌వెల్ యొక్క విద్యుదయస్కాంత తరంగాల వాస్తవికతను, హీన్రిచ్ హెర్ట్జ్ ప్రయోగపూర్వకంగా తన ప్రయోగశాలలో రేడియో తరంగాలు ఉత్పత్తి చేసి ప్రదర్శించాడు.[1] తరువాత ఎన్నో ఆవిష్కారాలు సంభవించాయి, ఇందువలన అంతరిక్షంలో రేడియో తరంగాలు ఉపయోగించి సమాచార రవాణా సాధ్యమైంది.

విస్తరణ[మార్చు]

రేడియో తరంగాలు ఖాళీ ప్రదేశంలో మరియు భూమి ఉపరితలంపై ఎలా కదులుతాయో పరిశీలించడానికి, విద్యుదయస్కాంత స్వభావాలైన పరావర్తనం, వక్రీభవనం, ధ్రువీకరణము, వివర్తనము మరియు గ్రహణము అనేవి పరిశోధించడం ఎంతో ముఖ్యం. భూమియొక్క వాతావరణంలో వివిధ పౌనఃపున్యాలు, ఈ లక్షణాలలో వివిధ మిశ్రమాల్ని పొందుతాయి, ఇందువలన ప్రత్యేకమైన ప్రయోజనాలకు మరే ఇతర తరంగాలకన్నా రేడియో బ్యాండ్లు మరింత ఉపయోగకరంగా ఉంటాయి.

రేడియో సమాచారం[మార్చు]

రేడియో సంకేతాలను అందుకోవడానికి, ఉదాహరణకు AM/FM రేడియో స్టేషన్ల నుండి, ఒక రేడియో ఆంటెనా ఉపయోగించాల్సి ఉంటుంది. కానీ, ఈ ఆంటెనా ఒకేసారి కొన్ని వేల రేడియో సంకేతాలను అందుకోవడం వలన, ఒక ప్రత్యేకమైన పౌనఃపున్యాన్ని (లేదా పౌనఃపున్య స్థాయి) ట్యూన్ ఇన్ చేయడానికి రేడియో ట్యూనర్ అవసరమవుతుంది.[2] ఇది సామాన్యంగా ఒక రెసొనేటర్ (అతి సరళ రూపంలో, ఒక కెపాసిటర్ మరియు ఒక ఇండక్టర్ కలిగిన సర్క్యూట్). ఈ రెసొనేటర్ ఒక ప్రత్యేక పౌనఃపున్యం (లేదా పౌనఃపున్య బ్యాండ్) వద్ద కంపించేలా రూపకల్పన చేయబడి ఉంటుంది, కాబట్టి ఇతర త్రిజ్య తరంగాలను విడిచి, ఆ రేడియో పౌనఃపున్యం వద్ద త్రిజ్య తరంగాలను విస్తరిస్తుంది. సామాన్యంగా, రెసొనేటర్ యొక్క ఇండక్టర్ లేదా కెపాసిటర్ సరిచేయవచ్చు, దీనిద్వారా వినియోగదారులు అది కంపించే పౌనఃపున్యానికి రెసొనేటర్ మార్చే వీలవుతుంది.[3]

వైద్యశాస్త్రంలో[మార్చు]

రేడియో పౌనఃపున్య (RF) శక్తిని వైద్య చికిత్సల్లో 75 ఏళ్ళకు పైగా [4] సాధారణంగా తక్కువ గాటు శస్త్రచికిత్సలకు మరియు కొయాగ్యులేషన్, ఇంకా నిద్రలో శ్వాసవిరమణ చికిత్సలో ఉపయోగిస్తున్నారు.[5] మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (MRI), మానవ శరీరం యొక్క చిత్రాలను ఉత్పన్నం చేయడానికి రేడియో పౌనఃపున్య తరంగాలు ఉపయోగిస్తుంది.

వీటిని కూడా చూడండి.[మార్చు]

  • రేడియో ఖగోళశాస్త్రం

సూచికలు[మార్చు]

  1. హీన్రిచ్ హెర్ట్జ్: ది డిస్కవరీ అఫ్ రేడియో వేవ్స్
  2. Brain, Marshall (2000-12-07). "How Radio Works". HowStuffWorks.com. Retrieved 2009-09-11. Cite web requires |website= (help)
  3. Brain, Marshall (2000-12-08). "How Oscillators Work". HowStuffWorks.com. Retrieved 2009-09-11. Cite web requires |website= (help)
  4. Ruey J. Sung and Michael R. Lauer (2000). Fundamental approaches to the management of cardiac arrhythmias. Springer. p. 153. ISBN 9780792365594.
  5. Melvin A. Shiffman, Sid J. Mirrafati, Samuel M. Lam and Chelso G. Cueteaux (2007). Simplified Facial Rejuvenation. Springer. p. 157. ISBN 9783540710967.CS1 maint: multiple names: authors list (link)

మూస:Radio spectrum మూస:EMSpectrum మూస:Radiation