రేడియో మిర్చి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రేడియో మిర్చి (దేవనాగరి:హిందీ మరియు మరాటి:रेडियो मिर्ची, మలయాళం:റേഡിയോ മിർച്ചി) భారత్‌లో ప్రైవేట్ FM రేడియో స్టేషన్లకు చెందిన ఒక దేశవ్యాప్త నెట్‌వర్క్. ఇది ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్ ఇండియా లిమిటెడ్ (ENIL) వారి యాజమాన్యంలో ఉంది, ఇది ది టైమ్స్ గ్రూప్ అనుబంధ సంస్థలలో ఒకటి.

"మిర్చి" అంటే హిందీలో చిలి అని అర్థం. రేడియో మిర్చి ట్యాగ్‌లైన్ "ఇట్ ఈజ్ హాట్!"

దస్త్రం:Radiomirchi.jpg
రేడియో మిర్చి లోగో

చరిత్ర[మార్చు]

రేడియో మిర్చి అసలు అవతారం టైమ్స్ FM. రేడియో మిర్చి తన కార్యకలాపాలను 1993లో ఇండోర్ నుంచి ప్రారంభించింది. 1993 వరకు, ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆలిండియా రేడియో లేదా AIR, భారత్‌లో ఏకైక రేడియో బ్రాడ్‌కాస్టర్‌గా ఉండేది. తర్వాత ప్రభుత్వం రేడియో ప్రసార రంగాన్ని ప్రయివేటీకరించటానికి చొరవ చూపింది. ఇది ఇండోర్, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, కొల్‌కతా, వైజాగ్ మరియు గోవాలలోని తన FM ఛానెళ్లమీది ఎయిర్‌టైమ్ బ్లాక్‌లను తమ స్వత ప్రోగ్రాం విషయాన్ని రూపొందించుకున్న ప్రయివేట్ ఆపరేటర్లకు అమ్మివేసింది. టైమ్స్ గ్రూప్ తన బ్రాండ్ అయిన టైమ్స్ FMని 1998 జూన్‌లో ప్రారంభించింది. అటు తర్వాత, ప్రైవేటు ఆపరేటర్లకు ఇచ్చిన కాంట్రాక్టులను పునరుద్ధరించకూడదని ప్రభుత్వం నిర్ణయించింది.

తొలి విడత లైసెన్సులు[మార్చు]

2000లో, భారతదేశ వ్యాప్తంగా 108 FM ఫ్రీక్వెన్సీలను వేలం వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ENIL పెద్ద సంఖ్యలో ఫ్రీక్వెన్సీలను గెల్చుకుంది, అందుచేత రేడియో మిర్చి బ్రాండు పేరుతో తన కార్యకలాపాలను ప్రారంభించింది.

రెండో విడత లైసెన్సులు[మార్చు]

2006 జనవరిలో, భారత ప్రభుత్వం జారీ చేసిన రెండో విడత లైసెన్సులలో 25 ఫ్రీక్వెన్సీలను రేడియో మిర్చి కైవసం చేసుకుంది. దీంతో రేడియో మిర్చి 32 కేంద్రాలలో తన ఉనికిని చాటుకుంది. తొలి విడత ప్రారంభాలలో, భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రేడియో చానెల్‌ని కలిగిన తొలి నగరంగా ఇండోర్ చరిత్రకెక్కింది.వెయ్యి రూపాయల తక్కువ ఖర్చుతో ప్రకటనదారులను ఆకర్షించే అవకాశం రావడంతో మాస్ ఆడియన్స్‌ని పలకరించడానికి రేడియో ఛానెల్‌ని ప్రారంభించాలని టైమ్స్ నిర్ణయించింది.

కార్యక్రమాలు నిర్వహించే ప్రాంతాలు[మార్చు]

ప్రస్తుతం, రేడియో మిర్చి 33 కంటే ఎక్కువ నగరాల్లో ఉనికిలో ఉంది, పోటీలో రెట్టింపు ఛార్జీలను వసూలు చేస్తున్నందున భారతదేశంలోని 6 మెట్రో నగరాలతో సహా రేడియో మిర్చి భారత్‌లోనే అత్యంత విలువైన స్టేషను‌గా ఉంది.క్లయింట్ల నుంచి ఎక్కువగా వసూలు చేయడం ద్వారా ప్రీమియమ్ ర్యాంకును సాధించవచ్చని రేడియో మిర్చి నమ్ముతోంది. :

 • 98.3 FM - అహ్మదాబాద్ ట్యాగ్‌లైన్ "రేడియో మిర్చి - ఇట్ ఈజ్ హాట్"..
 • 98.3 FM - ఔరంగాబాద్, మహారాష్ట్ర ట్యాగ్‌లైన్ "మిర్చి సున్నె వాలే ఆల్వేస్ కుష్".
 • 98.3 FM - బెంగళూరు ఇది ఈ ట్యాగ్‌లైన్ ఉపయోగిస్తోంది "ಸಕ್ಕತ್‌ ಹಾಟ್‌ ಮಗಾ !.
 • 98.3 FM - భోపాల్ ట్యాగ్‌లైన్ "రేడియో మిర్చి - ఇట్స్ హాట్"
 • 98.3 FM - చెన్నై ఇది ఈ ట్యాగ్‌లైన్ ఉపయోగిస్తోంది "ఇదు సెమ్మా హాట్ మచ్చీ !".
 • 98.3 FM - కోయంబత్తూర్ ఈ ట్యాగ్ లైన్ ఉపయోగిస్తుంది "ఇదు సెమ్మా హాట్ మచ్చీ !"
 • 98.3 FM - ఢిల్లీ "ఇట్స్ హాట్"
 • 98.3 FM - జైపూర్ "ఇట్స్ హాట్"
 • 98.3 FM - ముంబై "ఇట్స్ హాట్"
 • 98.3 FM - గ్వాలియర్ ఇది ఈ ట్యాగ్‌లైన్ ఉపయోగిస్తోంది "గ్వాలియర్ జూమె"
 • 98.3 FM - హైదరాబాద్ ఇది ఈ ట్యాగ్‌లైన్ ఉపయోగిస్తోంది "ఇది చాలా హాట్ గురూ !".
 • 98.3 FM - ఇండోర్, ట్యాగ్‌లైన్ "రేడియో మిర్చి - "బహుత్ గరమ్ హై రె బాబా".
 • 98.3 FM - జైపూర్, ఇది ఈ ట్యాగ్‌లైన్ ఉపయోగిస్తోంది "రేడియో మిర్చి - ఇట్స్ హాట్"
 • 98.3 FM - కాన్పూర్ - ట్యాగ్‌లైన్ - "మిర్చి సున్నె వాలే ఆల్వేస్ కుష్" మరియు "రేడియో మిర్చి - ఇట్స్ హాట్"
 • 98.3 FM - కొల్హాపూర్ ట్యాగ్‌లైన్ -" రేడియో మిర్చి - ఇట్స్ హాట్"
 • 98.3 FM - కొల్‌కతా ఇది ఈ ట్యాగ్‌లైన్ ఉపయోగిస్తోంది "మిర్చి షోన్ జె ఆల్వేస్ కుషి థకె సె."
 • 98.3 FM - నాసిక్ - ఇది ఈ ట్యాగ్‌లైన్ ఉపయోగిస్తోంది "మిర్చి సున్నె వాలే ఆల్వేస్ కుష్" &"గరమ్ ఆహె !"
 • 98.3 FM - పుణె ట్యాగ్‌లైన్ - "రేడియో మిర్చి - ఇట్స్ హాట్" / రేడియో మిర్చి - టిఖాట్ ఆహె
 • 98.3 FM - పాట్నా ట్యాగ్‌లైన్ - "రేడియో మిర్చి - ఇట్స్ హాట్" /ఇది రెండవ విడతలో మొదటి స్టేషను.
 • 98.3 FM - జలంధర్ ట్యాగ్‌లైన్ - "మిర్చి సున్నె వాలే ఆల్వేస్ కుష్" & "ఇట్స్ హాట్".
 • 98.3 FM - గోవా ట్యాగ్‌లైన్ - "రేడియో మిర్చి - ఇట్స్ హాట్"
 • 98.3 FM - ఉజ్జయిని ట్యాగ్‌లైన్ "ఇట్స్ హాట్"
 • 98.3 FM - వడోదర ట్యాగ్‌లైన్ - "మిర్చి సున్నె వాలే ఆల్వేస్ కుష్" & "ఇట్స్ హాట్".
 • 98.3 FM - రాజ్‌కోట్ ట్యాగ్‌లైన్ "రేడియో మిర్చి - ఇట్స్ హాట్"
 • 98.3 FM - రాయ్‌పూర్
 • 98.3 FM - వారణాసి - సర్వీస్ 2007 జూలై 14న ప్రారంభించబడింది
 • 98.3 FM - లక్నో - సర్వీస్ 2007 ఆగస్టు 14న ప్రారంభించబడింది
 • 98.3 FM - సూరత్ - సర్వీస్ 2007 ఆగస్టు 14న ప్రారంభించబడింది
 • 98.3 FM - నాగపూర్ - సర్వీస్ 2007 అక్టోబరు 14న ప్రారంభించబడింది. ట్యాగ్‌లైన్ - పై విధంగానే
 • 98.3 FM - మదురై - సర్వీస్ సెప్టెంబరు 2007న ప్రారంభించబడింది.దీని ట్యాగ్‌లైన్ 'ఇదు సెమ్మా హాట్ మచ్చి'

!" (అంటే దీనర్థం 'ఇట్ ఈజ్ హాట్')

 • 98.3 FM - మంగళూరు - ఈ ట్యాగ్‌లైన్‌తో ప్రారంభించబడింది "ಸಕ್ಕತ್‌ ಹಾಟ್‌ ಮಗಾ

! (సక్కాత్ హాట్ మాగా!)"

 • 98.3 FM - విజయవాడ - ఈ ట్యాగ్‌లైన్‌తో ప్రారంభించబడింది "ఇది చాలా హాట్ గురూ !"
 • 98.3 FM - వైజాగ్ - సర్వీస్ అక్టోబరు 2007న ఈ ట్యాగ్‌లైన్‌తో ప్రారంభించబడింది "ఇది చాలా హాట్ గురూ

!"

 • 98.3 FM - తిరువనంతపురం- సర్వీస్ జనవరి 2008న ఈ [1] ట్యాగ్‌లైన్‌తో ప్రారంభించబడింది: "సంగతి HOT ఆను

!"

ఇది ఢిల్లీలో దాదాపు 52% FM రేడియో శ్రోతలను చేరింది. ముంబైలో 44% ఇండోర్‌లో 40%, జైపూర్‌లో 35%, భోపాల్‌లో 30%, చెన్నయ్‌లో 20%, కోల్‌కతలో 17 శాతం, నాగ్‌పూర్‌లో 15%, బెంగళూరులో 10%, రాయ్‌పూర్‌లో 02% రేడియో శ్రోతలను చేరింది. రేడియో మిర్చి 2006 జూలై 25న ఢిల్లీలోను, 2006 సెప్టెంబరులో ముంబైలో ఉన్న తన సబ్‌స్క్రయిబర్లకు, విజువల్ రేడియోను అందించింది. ఇటీవలే ఇది కోల్‌కత నుంచి కూడా తన విజువల్ రేడియో సేవలను ప్రారంభించింది.

రేడియో ఆడియెన్స్ మెజర్మెంట్ రిపోర్ట్స్ (RAM) ప్రకారం, రేడియో మిర్చి ఢిల్లీలో ఆధిపత్యస్థానంలో ఉంది & ముంబై, కోల్‌కతల్లో నాయకత్వ స్థానంలోనూ ఉంటోంది. అయితే కోల్‌కతాలో, SEC ABC విభాగాల్లో వీళ్లు స్పష్టమైన నేతలుగా లేరు. SEC ABC విభాగాలపై అంతకుముందు Big FM & ఇప్పుడు ఫ్రండ్స్ FM ఆధిపత్యం వహిస్తున్నాయి. అయితే SEC D & E విభాగాల్లో రేడియో మిర్చి పూర్తి ఆధిపత్యం కలిగి ఉంది.

కార్యక్రమాలు[మార్చు]

 • దేవరాగం
 • మమ్మీ - బేబీ

మిర్చి మ్యూజిక్ అవార్డులు[మార్చు]

మిర్చి మ్యూజిక్ అవార్డులు ఏటా ఇవ్వబడుతున్న అవార్డులు, వీటిని బాలీవుడ్ ఫిల్మ్ మ్యూజిక్‌లో ప్రావీణ్యత కోసం రేడియో మిర్చి ఏర్పర్చింది. దీన్ని మొట్టమొదట 2008లో ఇచ్చారు.

బాహ్య లింకులు[మార్చు]

సూచనలు[మార్చు]

 1. "Radio Mirchi launches in Thiruvananthapuram". IndianTelevision.com. 2008-01-28. Retrieved 2008-01-28. Cite web requires |website= (help)