Jump to content

రేణు సైకియా

వికీపీడియా నుండి
రేణు సైకియా
జననం
రేణు బోర్బోరా

(1934-12-10)1934 డిసెంబరు 10
శ్రీపురియా, అస్సాం, భారతదేశం
మరణం2011 నవంబరు 17(2011-11-17) (వయసు 76)
టిన్సుకియా, అస్సాం
జీవిత భాగస్వామిసమరెన్ సైకియా
పిల్లలుఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు
తల్లిదండ్రులుకోమోల్ బోర్బోరా - పునియాప్రోవా బోర్బోరా

రేణు సైకియా (1934, డిసెంబరు 10 - 2011, నవంబరు 17) అస్సామీ నాటకరంగ, సినిమా నటి.[1] క్యారెక్టర్ నటిగా పలు సినిమాలలో నటించింది. హర్బేశ్వర్ చక్రవర్తి రూపొందించిన మణిరామ్ దేవాన్ (1963), బ్రోజెన్ బారువా రూపొందించిన డా . బెజ్‌బరువా (1968), రతన్‌లాల్ (1970లు) వంటి విజయవంతమైన సినిమాలలో నటించింది.[2] కళ్యాణి, జోయ్మోతి, నిమిలా ఆంగ్కో, టాక్సీ డ్రైవర్, రాజ్‌పత్ వంటి ప్రసిద్ధ నాటకాలలో నటించింది.

జననం

[మార్చు]

రేణు సైకియా 1934, డిసెంబరు 10న కోమోల్ బోర్బోరా - పునియాప్రోవా బోర్బోరా దంపతులకు అస్సాం రాష్ట్రం, టిన్సుకియాలోని శ్రీపురియాలో ఒక ప్రసిద్ధ కుటుంబంలో జన్మించింది.[3] రేణు తండ్రి ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్, డిగ్‌బోయ్ నుండి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేసి, అధికారిక సమస్యల కారణంగా (కంపెనీలో సుదీర్ఘ సమ్మె) తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. రేణు సైకియాకి పదిమంది తోబుట్టువులు ఉన్నారు. రేణు సైకియా అన్న దివంగత గోలప్ బోర్బోరా పార్లమెంటు సభ్యుడిగా, అస్సాం ముఖ్యమంత్రి (1978)గా పనిచేశాడు.

కళారంగం

[మార్చు]

18 సంవత్సరాల వయస్సులో 1952లో జోయ్మోతి నాటకంతో నటనా జీవితాన్ని ప్రారంభించిన రేణు సైకియా, ఆ తరువాత అనేక నాటకాలలో ప్రధాన పాత్రలలో నటించింది. 1961లో వచ్చిన రాజ్‌పథ్ అనే అస్సామీ నాటకం, తన సినీరంగ ప్రవేశానికి దారి వేసింది. హుమేశ్వర్ బారువా దర్శకత్వం వహించిన హిందీ నాటకం, నిచెర్ మోహోల్ అనే బెంగాలీ నాటకంలో నటించింది. డాక్టర్ బెజ్‌బరువాలో సినిమాలో నటించిన తరువాత, రేణు సైకియా అస్సామీ సినిమా "లలితా పవార్"గా గుర్తింపు పొందింది.

వ్యక్తిగత జీవితం

[మార్చు]
రేణు సైకియా, సమరెన్ సైకియా

1956లో నటుడు, రచయిత, దర్శకుడు సమరెన్ సైకియాతో రేణు సైకియా వివాహం జరిగింది. ఈతి బ్రహ్మన్ ఎఖోన్ రోంగా ప్రితిబిత్, మేఘముక్తి, హుకులా హతిర్ జోపున్, అమర్ వియత్నాం వంటి వాటని అనువదించాడు. వీరిద్దరూ కలిసి అనేక రంగస్థల నాటకాల్లో నటించారు. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

ఇతర వివరాలు

[మార్చు]

వివాహమైన తరువాత, రేణు సైకియా తన భర్త రూపొందించిన ప్రసిద్ధ అస్సామీ నాటకం రాజ్‌పథ్ కోసం పనిచేసింది. అస్సాం ప్రభుత్వం గువాహటిలో నిర్వహించిన అస్సాం నాటకోత్సవంలో ఈ నాటకం ప్రదర్శన జరిగింది. 1962లో, తన చిన్న బిడ్డ పుట్టినరోజున, తన మొదటి సినిమా మణిరామ్ దేవాన్ కోసం ఒప్పంద పత్రాలపై సంతకం చేసింది. డాక్టర్ భూపేన్ హజారికియా పాడిన "బుకు హమ్ హమ్ కరే" పాటలో నటించింది.

మరణం

[మార్చు]

అనారోగ్యంతో 2011, సెప్టెంబరు17న అస్సాంలోని టిన్సుకియాలో మరణించింది.

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర
1963 మణిరామ్ దేవాన్ రాజ్ మావో
1968 డాక్టర్ బెజ్‌బరువా ధనిక టీ తోట యజమాని భార్య, ప్రధాన నటుడు నిపోన్ గోస్వామి సవతి తల్లి
1970లు రతన్‌లాల్ తేయాకు తోట కూలీ భార్య

మూలాలు

[మార్చు]
  1. "Bollywood Movie Actress Renu Saikia Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2022-02-21.
  2. "How old is Renu Saikia". HowOld.co (in ఇంగ్లీష్). Retrieved 2022-02-21.[permanent dead link]
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-11. Retrieved 2022-02-21.