రేవతి నక్షత్రం
రేవతీ నక్షత్ర అధిపతి బుధుడు, అధిదేవత పూషణుడు, గణము దేవగణం, రాశ్యాధిపతి గురువు. ఈ నక్షత్రంలో పుట్టిన వారు కనిపించని మేధావులు. ఆడంబరం తక్కువ. గణితంలో ప్రజ్ఞ కలిగి ఉంటారు. దౌర్జన్యం తగాదాలకు దూరంగా ఉంటారు. అనేక రకాల విజ్ఞాన గ్రంథాలను పఠిస్తారు. వేదవేదాంగాలను తెలుసుకోవాలన్న తపన కలిగి ఉంటారు. ఇతరుల ధనానికి ఆశపడరు. కష్టపడే మనస్తత్వము ఉంటుంది. ప్రశాంతంగా నిదానంగా సమాధానాలను చెప్తారు. సమస్యలను పక్కన పెట్ట్టిచక్కగా నిద్రిస్తారు. స్నానం పట్ల మక్కువ ఎక్కువ. త్వరిత గతిన ఆర్థిక ప్రగతిని సాధిస్తారు. త్వరితంగా కోపం రాదు. వ్యాపరంలో మోసం చేసే భాగస్వాముల నుండి తప్పించు కుంటారు. ముఖ్యమైన సమయాలలో సహాయం చెసే ఆత్మీయుల అండ దండ ఉండదు. ఒక వేళ ఉన్నా ప్రయోజనం ఉందదు. దూరప్రాంతాలలో చదువుకుని స్థిరపడడా నికి బంధువుల సహకారం ఉంటుంది. కీలకమైన అధికార పదవులలో వినూతన వ్యాపారాలలో రాణిస్తారు. ప్రజలలో మంచి పేరు ఉంటుంది. నమ్ముకున్న వారిని కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు సహాయం చేస్తారు. వివాహ జీవితంలో ఒడిదుడుకులు ఉన్నా సర్దుకు పోతారు. వీరికి జ్ఞాపక శక్తి, సాహిత్య రంగంలో అధికం. పాడి పంటలకు సంబంధించిన వ్యాపారాలు కలసి వస్తాయి. సంతానాన్ని ప్రేమగా గౌరవంగా చూస్తారు. మంచితనంతో జీవితంలో ముఖ్యమైన విషయాలను అనుకూలం చేసుకుంటారు. విద్యాభ్యాసంలో కలిగే అవరోధాలను అధిగమించి ముందుకు సాగితే రాణిస్తారు. బాల్యం నుండే తెలివితేటలను ప్రదర్శిస్తారు.
నక్షత్రములలో ఇది 27వ నక్షత్రము.
నక్షత్రం | అధిపతి | గణము | జాతి | జంతువు | వృక్షము | నాడి | పక్షి | అధిదేవత | రాశి |
---|---|---|---|---|---|---|---|---|---|
రేవతి | బుధుడు | దేవ | పురుష | ఏనుగు | విప్ప | అంత్య | నెమలి | పూషణుడు | మీనం |
రేవతి నక్షత్ర జాతకుల తారా ఫలాలు
[మార్చు]తార నామం | తారలు | ఫలం |
---|---|---|
జన్మ తార | ఆశ్లేష, జ్యేష్ట, రేవతి | శరీరశ్రమ |
సంపత్తార | అశ్విని, మఖ, మూల | ధన లాభం |
విపత్తార | భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ | కార్యహాని |
సంపత్తార | కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ | క్షేమం |
ప్రత్యక్ తార | రోహిణి, హస్త, శ్రవణం | ప్రయత్న భంగం |
సాధన తార | మృగశిర, చిత్త, ధనిష్ఠ | కార్య సిద్ధి, శుభం |
నైత్య తార | ఆరుద్ర, స్వాతి, శతభిష | బంధనం |
మిత్ర తార | పునర్వసు, విశాఖ, పూర్వాభద్ర | సుఖం |
అతిమిత్ర తార | పుష్యమి, అనూరాధ, ఉత్తరా భద్ర | సుఖం, లాభం |
రేవతీనక్షత్రము నవాంశ
[మార్చు]- 1వ పాదము - ధనసురాశి.
- 2వ పాదము - మకరరాశి.
- 3వ పాదము - కుంభరాశి.
- 4వ పాదము - మీనరాశి.
చిత్ర మాలిక
[మార్చు]-
రేవతి నక్షత్రమువృక్షము విప్ప
-
రేవతి నక్షత్రమ జంతువు
-
రేవతి నక్షత్ర జాతి (పురుష)
-
రేవతి నక్షత్ర పక్షి నెమలి.
-
రేవతి నక్షత్ర అధిపతి బుధుడు.
-
రేవతి నక్షత్ర అధిదేవత
-
రేవతి నక్షత్రగణము దేవగణము దేవగణాధిపతి ఇంద్రుడు.
ఇతర వనరులు
[మార్చు]రేవతి నక్షత్రము ప్రాశస్త్యము
[మార్చు]- దేవతాప్రతిష్ట, యాత్రలు, ఉద్యోగము, వివాహము, ఉపనయనము, సీమంతము, నూతన వస్త్రధారణ, అక్షరాభ్యాసము, వాహనారోహణ, అన్నప్రాశన, గృహారంభము, గృహప్రవేశము, క్షురకర్మ/కేశఖండన లకు ప్రశస్తము.