రేష్మా రాథోడ్
రేష్మా రాథోడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన సినీ నటి, రాజకీయ నాయకురాలు. ఆమె 2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యింది.[2]
జననం, విద్యాభాస్యం
[మార్చు]రేష్మా రాథోడ్ తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, ఇల్లెందు మండలంలోని ఉసిరికాయలపల్లి గ్రామంలో 1989, నవంబరు 3న హరిదాస్ రాథోడ్, రాధాబాయ్ దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి గోదావరిఖనిలోని సింగరేణి సంస్థలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు, తల్లి హైకోర్టు న్యాయవాది. రేష్మా వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో న్యాయవిద్య పూర్తి చేసింది
సినీ జీవితం
[మార్చు]రేష్మారాథోడ్ మొగలిరేకులు సీరియల్[3] ద్వారా బుల్లితెరకు పరిచయమై, 2012లో విడుదలైన బాడీగార్డ్ సినిమాతో సినీరంగంలోకి అడుగు పెట్టి, 2013లో ఈ రోజుల్లో చిత్రంలో హీరోయిన్‌గా మారింది. ఆమె తెలుగు, తమిళ, మలయాళ సినిమాలలో నటించింది.
రాజకీయ జీవితం
[మార్చు]రేష్మా రాథోడ్ 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా వైరా శాసనసభ నియోజకవర్గం నుండి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి, ఓడిపోయింది.[4] ఆమె ప్రస్తుతం బీజేపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తుంది.[5]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (6 July 2018). "బీజేపీ నుంచి పోటీచేస్తా". Sakshi. Archived from the original on 13 మే 2021. Retrieved 13 May 2021.
- ↑ BBC News తెలుగు (26 November 2018). "సుహాసిని, సురేఖ, రేష్మ... తెలంగాణ ఎన్నికల్లో ఈ మహిళలు ఎందుకంత ప్రత్యేకం?". BBC News తెలుగు. Archived from the original on 13 మే 2021. Retrieved 13 May 2021.
- ↑ Zee News Telugu (25 November 2018). "తెలంగాణ ఎన్నికలు: ఖమ్మం జిల్లా వైరా నుండి పోటీ చేస్తున్న టాలీవుడ్ నటి". Zee News Telugu. Archived from the original on 13 మే 2021. Retrieved 13 May 2021.
- ↑ Times Now News (29 November 2018). "Telangana poll: Reshma Rathore - Actress turns MLA candidate for BJP". Archived from the original on 13 మే 2021. Retrieved 13 May 2021.
- ↑ Sakshi (14 July 2018). "బీజేపీలో నటి రేష్మాకు కీలక పదవి!". Sakshi. Archived from the original on 13 మే 2021. Retrieved 13 May 2021.