రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్
Raiders of the Lost Ark | |
---|---|
![]() Theatrical release poster by Richard Amsel | |
దర్శకత్వం | Steven Spielberg |
నిర్మాత | Frank Marshall |
స్క్రీన్ ప్లే | Lawrence Kasdan |
కథ | |
నటులు | |
సంగీతం | John Williams |
ఛాయాగ్రహణం | Douglas Slocombe |
కూర్పు | Michael Kahn |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదారు | Paramount Pictures |
విడుదల | జూన్ 12, 1981 |
నిడివి | 115 minutes |
దేశం | United States |
భాష | ఆంగ్ల భాష |
ఖర్చు | $18 million[1] |
బాక్సాఫీసు | $389.9 million[1] |
రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ ఆంగ్లం: Raiders of the lost ark 1981 అనే "సాహస యాత్రతొ కూడిన హాలివుడ్ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇండియానా జొన్ స్ రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్ పేరు మీదుగా ప్రపంచవ్యాప్తంగా ఎంతొ ప్రసిద్దికెక్కింది. ఈ చిత్రాన్ని స్పీల్బర్గ్ మిత్రుడు జార్జ్ లూకాస్ పారమౌంట్ నిర్మాణ సంస్థ ఆద్వర్యంలొ నిర్మించాడు. ఈ చిత్రంలొ కథానాయకుడిగా హారిసన్ ఫార్డ్ నటించారు. ఈ చిత్రానికి కొనసాగింపుగా తరువాత 3 చిత్రాలు వచ్చాయి. ఇండియానా జోన్స్ "ద టెంపుల్స్ ఆఫ్ డూమ్" "ద లాస్ట్ క్రూసేడ్"" ద కింగ్డం ఆఫ్ క్రిస్టల్ స్కల్" చిత్రాలు కూడా ఘనవిజయం సాధించాయి. ఈ చిత్రాలలోనూ హారిసన్ ఫార్డ్ నటించారు. ఈ చిత్రం ఆ సంవత్సరం విడుదలైన అన్నిటి కంటే ఎక్కువ వసూళ్ళు సాధించింది. ఈ చిత్రం ఆ సంవత్సర ఆస్కార్ అవార్డులలో 9 విభాగాలలో ఎంపికైంది. (Best Art Direction, Best Film Editing, Best Sound,
Best Visual Effects) ఈ చిత్రం సాధించిన అసాదారణ విజయమే కొనసాగింపుగా వచ్చిన ఇతర చిత్రాలకు కారణమైంది. 1999 వ సంవత్సరంలో అమెరికాలోని U.S.
Library of Congress' National Film Registry లో "సాంస్కృతికంగా, చారిత్రకంగా లేదా అభిరుచి పరంగా విశిష్టమైనదని గుర్తించారు.
ఈ చిత్రం ప్రపంచ అత్యుత్తమ సాహస యాత్ర చిత్రంగా గుర్తింపు పొందింది.
కథ[మార్చు]
ఈ కథ 1936 సంవత్సరంలొ ప్రారంభమవుతుంది. పురాతత్వ శాస్త్రవేత్త ఇండియానా జోన్స్ పెరూ దేశంలొని అడవిలొ సామాన్య మానవులు ప్రవేశించలేనటువంటి గుడిలొ ఉన్న బంగారు బొమ్మను ఎన్నొ అవాంతరాల అనంతరం చేజిక్కించుకుంటాడు. అయితే జోన్స్ దారి చూపించడానికి అతనితొ ఉన్న గైడు 'సపిటో' అనే వ్యక్తి అది దొంగిలించి పారిపొతుండగా మద్యలొ ఉన్న అవాంతరాల ద్వారా మరణిస్తాడు. జోన్స్ బొమ్మతొ బయటకు వచ్చినప్పుడు తన ప్రత్యర్థియైన పురాతత్వశాస్త్రవేత్త "రెనె బెలూక్" ఆ ప్రాంత స్థానికులతొ కలిసి జోన్స్ ను చంపాలని ప్రయత్నిస్తాడు. జోన్స్ వారికి లొంగిపొయి ఆ బొమ్మను వారికిచ్చేస్తాడు. తిరిగి అక్కడనుండి తప్పించుకొని సముద్ర విమానం ద్వారా అమెరికాకు బయలు దేరుతాడు. మార్షల్ కాలేజిలో విద్యార్థులకు పురాతత్వ శాస్త్రం బొదిస్తుండగా అమెరికన్ ఇంటలిజెన్ స్ అధికారులు జోన్స్ ను కలిసి నాజిలు Ark of the covenant (ఒడంబడికా పత్రం కూడినటువంటి పెట్టె) ను గూర్చి వెతుకుతున్నారని జోన్స్కు వివరిస్తారు. ఈజిప్షియన్ టానిస్ నగర చరిత్ర గూర్చి అపార నైపుణ్యం కల్గిన తన గురువు "ఆబ్నెర్ రెవెన్ వుడ్" గూర్చి వెదుకుతున్నారని వివరిస్తారు. ఎందుకంటే అతని వద్ద ఆ పెట్టెను తెరిచే "కీ" ఉంది. జోన్స్ నేపాల్కు ప్రయాణించి ఆబ్నెర్ రెవెన్ వుడ్ ను కలిసి ఆకీని వారికంటే ముందే చేజిక్కించుకొవాలనుకుంటాడు.
అక్కడికి వెళ్ళగా అతను మరణించాడని తెలుసుకుంటాడు. అతని కూతురు తన మాజీ ప్రేమికురాలు అయిన "మారియాన్"ను కలుసుకుంటాడు. తను అక్కడ బార్ను నడుపుకుంటూ ఉంటుంది. జోన్స్ తనని కలిసి ఆకీ గురించి వివరాలు అడుగుతుండగా నాజిల గూడాచారి థొట్ అను వ్యక్తి తన మనుషులతొ జోన్స్ పైకి దాడిచేస్తాడు. జోన్స్ కి థొట్ మనుషులకి జరిగిన ఘర్షణలోకీ మంటలలో పడిపొతుంది. థొట్ కీని మంటలలో నుండి బయటకి తీసినప్పుడు అతని చేతిపైనకీ ముద్ర పదుతుంది. జోన్స్ మారియాన్ తొ కలిసి అక్కడ తప్పించుకుకుంటాడు. జోన్స్ మారియాన్ను తనతొ పాటు ఈ అన్వేషణకి తొడ్పడమంటాడు. వారిద్దరూ కలిసి ఈజిప్టు లోని కైరొ నగరానికి బయలు దేరుతారు. జోన్స్ తన మిత్రుడైన సాలహ్ ను కలుసుకుంటాడు. అతను పురాతత్వ తవ్వకాల్లో మంచి నైపుణ్యం కల్గివుంటాడు. మరొవైపు బెలూక్, నాజీలు కల్నల్ డీట్రిచ్ సారథ్యంలో థొట్ చేతి మీద ఏర్పడినకీ నకలు ద్వారా "ఆత్మల బావి" గురించి తవ్వకాలు ప్రారంబిస్తారు. కైరొ మార్కెట్లొ నాజీ మనుషులు మారియాన్ను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తారు. జోన్స్కి వారికి మద్య ఘర్షణ జరుగుతుంది. అప్పుడు అక్కడ జరిగిన ప్రేలుడులో మారియాన్ మరిణిచిందని జోన్స్ భావిస్తాడు. సాలాహ్తొ కలిసికీని ఛేదించినప్పుడు నాజిలు "ఆత్మల బావి" గురించి జరిపే తవ్వకాలు సరైన ప్రదేశంలో కాదని తెలుసుకుంటారు. వారికి తెలియకుండా రాత్రిపూట సరైన ప్రదేశంలో త్రవ్వగా ఎన్నొపాములతొ నిండి వున్న చొట పెట్టె వుంటుంది. జోన్స్ లోపలికి వెళ్ళి పెట్టెను బయటికి తెచ్చెందుకు లోపలికి వెళ్తాడు. అప్పటికే ఈ విషయాన్ని తెలుసుకున్న బెలూక్, డీట్రిచ్ అక్కడికి వెళ్ళి జోన్స్ చేత పెట్టెను బయటికి తియించి బ్రతికేవున్న మారియాన్ను అతనితొపాటె లోపలికి నెట్టేసి దానిని కప్పివేస్తారు. జోన్స్ మారియాన్ ఎలాగొలా బయటకు తప్పించుకొని వస్తారు. నాజీలు పెట్టెను సముద్రమార్గం ద్వారా బెర్లిన్కు తరలించే లోపే జోన్స్ దానిని తిరిగి దక్కించుకుంటాడు.
జోన్స్, మారియాన్ పెట్టెను కైరొ నుండి ఇంగ్లండ్కు వెళ్ళే స్టీమరులో తీసుకుని వెళ్తారు. మరునాడు ఉదయం ఆ స్టీమర్ను బెలూక్, డీట్రిచ్ తమ ఆదీనంలొకి తెచ్చుకుంటారు. మారియాన్ను మళ్ళి బందిస్తారు. జోన్స్ అది గ్రహించి వారి కంట పడకుండా వారిని వెంబడిస్తాడు. బెలూక్ దానిని హిట్లర్కు అప్పగించే ముందు దాని శక్తిని ఒకసారి పరీక్షించాలనుకుంటాడు. ఏజియన్ సముద్రం దగ్గర్లొని ఒక నిర్జన ప్రదేశం లోకి పెట్టెను తీసుకువెళ్తున్నప్పుడు జోన్స్ వారికి ఎదురుపడి ఆ పెట్టెను తనవద్దనున్న రాకెట్ లాంచర్ ద్వారా నాశనం చేస్తానని చేప్తాడు. అయితే బెలూక్ కి తెలుసు జోన్స్ అంత విలువైన వస్తువును నాశనం చేయడని.అప్పుడు జోన్స్ వారికి లొంగిపొతాడు. మారియాన్ను జోన్స్ను బంధించి పురాతన పద్ధతుల ద్వారా అ పెట్టెను తెరవగా అందులో ఇసుక తప్ప ఏమీ వుండదు. ఒక్కసారిగా ఆ పెట్టెలోనుండి ఆత్మలు బయటకు వస్తాయి. మానవాతీత శక్తుల ద్వారా ఏదొ ప్రమాదం సంభవిస్తుందని జోన్స్ ముందే గ్రహిస్తాడు. ఆ అత్మలను చూడడం ద్వారా ప్రమాదం ఉందని మారియాన్ను గట్టిగా కళ్ళు మూసుకొమంటాడు. ఈ విషయం తెలియని నాజిలు, థొట్, బెలూక్ ఆ పేతాత్మల దాటికి మరణిస్తారు.
వాషింగ్టన్ డి.సి లోని ఆర్మి అధికారులు ఈ పెట్టెను ప్రభుత్వ గిడ్డంగిలో ఉంచి దానిని గొప్ప పురాతత్వ శాస్త్రవేత్తల పర్యవేక్షణలో ఉంచుతారు. ఆ ప్రదేశంలో ఇటువంటి పెట్టెలు లెక్కలేనన్ని ఉంటాయి.
నటీనటులు[మార్చు]
- ↑ 1.0 1.1 "Raiders of the Lost Ark (1981)". Box Office Mojo. Retrieved July 9, 2007.