Jump to content

రైల్ నిలయం

అక్షాంశ రేఖాంశాలు: 17°26′19″N 78°30′39″E / 17.4386004°N 78.5108461°E / 17.4386004; 78.5108461
వికీపీడియా నుండి
రైల్ నిలయం
67వ స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూడు రంగులతో ముస్తాబైన రైల్ నిలయం
ఇతర పేర్లురైల్ నిలయం, సికింద్రాబాదు
సాధారణ సమాచారం
స్థితివాడుకలో ఉంది
చిరునామాదక్షిణ మధ్య రైల్వే, రైల్ నిలయం కాలనీ, సికింద్రాబాదు, తెలంగాణ 500071
పట్టణం లేదా నగరంహైదరాబాదు, తెలంగాణ
దేశంభారతదేశం
భౌగోళికాంశాలు17°26′19″N 78°30′39″E / 17.4386004°N 78.5108461°E / 17.4386004; 78.5108461
యజమానిభారత ప్రభుత్వం

రైల్ నిలయం తెలంగాణ రాష్ట్రం, సికింద్రాబాదులోని మారేడుపల్లి సమీపంలో ఉన్న భవనం.[1] ఇది భారతీయ రైల్వేకు చెందిన దక్షిణ మధ్య రైల్వే జోన్ ప్రధాన కేంద్రంగా ఉన్న ఈ రైల్ నిలయాన్ని 1972 సం.లో నిర్మించారు.

ఈ భవనం ప్రాంగణంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ కార్యాలయం, జోన్ వివిధ విభాగాల ఉన్నతాధికారులు, విభాగాధిపతుల కార్యాలయాలు ఉన్నాయి.[2] దక్షిణ మధ్య రైల్వే విభాగంలో వివిధ రకాల కార్యకలాపాలకు సంబంధించిన అన్ని నిర్ణయాలు తీసుకునే విధాన సంస్థ ఈ రైల్ నిలయం. ఈ రైల్ నిలయానికి సూమారు 2.5 కి.మీ.ల దూరంలో రైల్వే సిగ్నలింగ్, టెలికమ్యూనికేషన్స్ లో శిక్షణ ఇచ్చే ఇండియన్ రైల్వే ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ (ఇరిసెట్) ఉంది.[3]

చరిత్ర

[మార్చు]

1968లో రైల్ నిలయం గ్రౌండ్ ఫ్లోర్ నుండి మూడవ అంతస్తు వరకు ప్రారంభించబడి, 1972లో ఈ భవనం నిర్మాణం పూర్తయింది. 1988, జూలైలో దక్షిణ మధ్య రైల్వేలో రైల్ నిలయంలో మొట్టమొదటి డిజిటల్ ఎలక్ట్రానిక్ ఎక్స్ఛేంజ్ ప్రారంభించబడింది.[4] 2017లో ఈ భవనం భారత రైల్వే యొక్క మొట్టమొదటి ఎల్ఈడి-లైట్ జోనల్ ప్రధాన కార్యాలయ భవనంగా మారింది. 3,048 లైట్ల స్థానంలో అధిక సామర్థ్యం గల ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటుచేశారు. దాంతో 112.25 కిలోవాట్ల నుండి 65.8 కిలోవాట్లకు తగ్గించబడింది. కొత్త ఎల్ఇడి లైట్స్ ఏర్పాటుతో విద్యుత్ వాడకం 46.45 కిలోవాట్ల వరకు తగ్గింది. ఇంధన పరిరక్షణకు భారతీయ రైల్వే చేసిన ప్రయత్నాలలో ఇది ముఖ్యపాత్రని పోషిస్తుంది.[5]

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "About Us - South Central Railway". SCR.
  2. "Thermal scanners at Secunderabad railway station". The Hindu (in Indian English). 20 March 2020.
  3. India, The Hans (12 March 2020). "Secunderabad: IRISET gets new Director General". www.thehansindia.com (in ఇంగ్లీష్).
  4. "About Us - South Central Railway". SCR.
  5. "Rail Nilayam in Hyderabad is first LED-lit HQ building of Indian Railways". Telangana Today (in Indian English). 22 December 2017.

ఇతర లంకెలు

[మార్చు]