రోజ్‌వుడ్ ఆయిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Rosewood (Aniba rosaeodora) essential oil in a clear glass vial
Structure of linalool, a substance extracted from A. rosaeodora

రోజ్‌వుడ్ ఆయిల్ లేదా రోజ్‌వుడ్ తైలం లేదా రోజ్‌వుడ్ నూనె ఒక ఆవశ్యక నూనె. రోజ్‌వుడ్ అనేది ఇంగ్లీసు పేరు. తెలుగులో నూకమాను నూనెఅంటారు. రోజ్‌వుడ్ ఆయిల్ను వైద్యంలో ఉపయోగిస్తారు. రోజ్‌వుడ్ నూనె వలన ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి.ఇది మానసిక అస్వస్థతను/మానసికకృంగు బాటును తగ్గిస్తుంది.అలాగే నంపుంస గుణాన్ని తగ్గిస్తుంది.అలాగే చర్మాన్ని మృదువు పరుస్తుంది.

రోజ్‌వుడ్ చెట్టు[మార్చు]

రోజ్‌వుడ్ చెట్టు లారేసియే కుటుంబానికి చెందినది.రోజ్‌వుడ్ లో పలురకాలు ఉన్నాయి. రోజ్‌వుడ్ వృక్షశాస్త్ర పేరు అనిబా రోసయేడోరా అంతేకాదు అనిబా రోసయేడోరావర్ అమజోనికా అనికూడా పిలుస్తారు. సాధారణంగా బ్రెజిలియన్ రోజ్‌వుడ్ అనికూడా పిలుస్తారు. దీని మూల స్థానం బ్రెజిల్. రోజ్‌వుడ్ చెట్టు సతతహరిత చెట్టు. 40 మీటర్ల (125 అడుగులు) ఎత్తువరకు పెరుగును. చెట్టు ఎర్రనిబెరడును కలిగి వుండును.పూలు పసుపు రంగులో వుండును.దక్షిణ అమెరికాలో ఈ చెట్లలను విపరీతంగా నరికిన ఫలితంగా చెట్ల భూవైశాల్యం బాగా తగ్గిపోయింది. అందువలన రోజ్‌వుడ్‌ను పారిశ్రా మికంగా వాడేవారు ఒకచెట్టు నరకాలంటే ఒక చెట్టు నాటాలనే చట్టం చేసారు. రోజువుడ్‌ను భవన నిర్మాణంలో, అలమరాలు చేయటానికి, పెట్టెలు చేయటానికి ఉపయోగిస్తారు.జపానులో చోప్ స్టిక్స్ చేయటానికి ఉపయోగిస్తారు., ఆవశ్యక సుంగంధ తైలాన్ని ఉత్పత్తి చేయుటకు ఉపయోగిస్తారు.[1]

నూనె సంగ్రహణం[మార్చు]

రోజ్‌వుడ్ చెక్క ముక్కలనుండి నీటి ఆవిరి స్వేదన క్రియ /స్టీము డిస్టీలేసను ద్వారా సంగ్రహిస్తారు.

రోజ్‌వుడ్ ఆయిల్[మార్చు]

నూనె స్పైసీ తియ్యని సువాసననుకల్ల్గి వుండును.రోజువుడ్ నూనె ఎలాంటి‌ విష గుణాలు లేని నూనె. రోజ్‌వుడ్ నూనెలో లినలూల్ ఎక్కువ పరిమాణంలో (86%) వరకు వుండును.[2] రోజ్‌వుడ్ నుండి నూనె ఉత్పత్తి 2.19% వరకు వుండును.నూనెలో 13 కి మించి రసాయన పదార్థాలు ఉన్నాయి.

నూనెలోని రసాయన సమ్మేళనాలు[మార్చు]

రోజ్‌వుడ్నే నూనెలో పలు ఆల్కహాలులు, టెర్పేనోలు, కీటోనులు, ఆరోమాటిక్ సమ్మేళాలు, పినైల్‌లు. అల్డిహైడులు ఉన్నాయి. రోజ్‌వుడ్ తైలంలోని కొన్ని ముఖ్యమైన రసాయన పదార్థాలు: ఆల్ఫా –పినేన్, కాంపెన్, జెరానియోల్, నేరాల్, జెరానియెల్, మైర్సేన్, లిమోనెన్,1,8-సినేయోల్, లినలూల్, బెంజాల్డిహైడ్, లినలూల్ ఆక్సైడులు, ఆల్ఫా-టెర్పినీయోల్‌లు.[1]

భౌతిక గుణాల పట్టిక[మార్చు]

భౌతిక గుణాల పట్టిక[3]

వరుస సంఖ్య గుణం విలువ మితి
1 రంగు లేత పసుపు లేదా వర్ణ రహితం
2 వాసన ప్రత్యేకమైన దారు సువాసన
3 విశిష్ట గురుత్వం@25C 0.868గ్రా/సెం.మీ3
4 వక్రీభవన సూచిక@20C 1.464
5 ఫ్లాష్ పాయింట్ 73˚C

రోజ్‌వుడ్ తైలం ఉపయోగాలు[మార్చు]

  • రోజ్‌వుడ్ నూనె కున్న సుగంధ పరిమళం కారణంగా ఈనూనెను సుగంధ ద్రవ్యాలు/perfumes, సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు.[2]
  • మొటిమలనివారణకు.పొడిబారిన చర్మ కణాలను పుననిర్మానికి పనిచేస్తుంది.డిప్రెసను తగ్గిస్తుంది.అలాగే గాయాలను మాన్పు గుణం కల్గివున్నది.పురుగులకాటుకు, తెగిన గాయాలకు ప్రథమ చికిత్సకు ఈ నూనె పనిచేయును.[2]
  • వీర్యవృద్ధికరమైనమందు
  • జలుబు, దగ్గు, సైనటిస్ లకు ఉపయోగిస్తారు.
  • గాయాలు మాంపును.
  • నొప్పులు తగ్గించును.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]