Jump to content

రోనాల్డ్ సాపా త్లా

వికీపీడియా నుండి
రోనాల్డ్ సాపా త్లా
రాజ్యసభ సభ్యుడు
In office
2014 జూలై 19 – 2020 జులై 18
అంతకు ముందు వారులాహింగ్ లాయిన
తరువాత వారుకె.వనలవీణ
నియోజకవర్గంమిజోరాం
వ్యక్తిగత వివరాలు
జననం(1954-02-04)1954 ఫిబ్రవరి 4
హువాల్టు, అస్సాం , భారతదేశం
మరణం2025 ఏప్రిల్ 30(2025-04-30) (వయసు: 71)
న్యూఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
సంతానంఇద్దరు కొడుకులు ఒక కూతురు
As of జూన్ 15, 2014

రోనాల్డ్ సాపా త్లా (1954 ఫిబ్రవరి 4-2025 ఏప్రిల్ 30) మిజోరం రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకుడు. రోనాల్డ్ సాపాత్లా భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన మిజోరాం రాష్ట్రం నుండి రాజ్యసభ కు ప్రాతినిధ్యం వహించారు.[1]

ప్రారంభ జీవితం విద్య

[మార్చు]

రోనాల్డ్ సాపాత్లా 1954 ఫిబ్రవరి 4న మిజోరాం రాష్ట్రం సెర్చిప్ జిల్లాలోని హువాల్టు అనే గ్రామంలో జన్మించాడు.[2]అతను స్పిసర్ అడ్వెంటిస్ట్ విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. హోవార్డ్ విశ్వవిద్యాలయం నుండి కమ్యూనికేషన్ డెవలప్మెంట్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు.[3]

రాజకీయ జీవితం

[మార్చు]

రోనాల్డ్ సాపాత్లా మిజోరాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా పనిచేశాడు. .[4] రోనాల్డ్ సాపాత్లా మిజోరం ప్రజా వ్యవహారాల కమిటీ చైర్మన్గా పనిచేశాడు. 2008 మిజోరాం శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయాడు. .[5]

రాజ్యసభ ఎంపీ

[మార్చు]

2014 రాజ్యసభ ఎన్నికలలో మిజోరం శాసనసభ కు ఎన్నికైన 40 మంది ఎమ్మెల్యేలలో 34 మంది ఎమ్మెల్యేలు రోనాల్డ్ సాపాత్లా మద్దతు ఇవ్వడంతో ఆయన రాజ్యసభ ఎన్నికలలో విజయం సాధించాడు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[6]

  • పార్లమెంటరీ ఆహార కుటుంబ వ్యవహారాల కమిటీ సభ్యుడు.[7]
  • పార్లమెంటరీ సైన్స్ సాంకేతిక వ్యవహారాల కమిటీ సభ్యుడు.[8]
  • పార్లమెంటరీ సమాచార హక్కుల కమిటీ సభ్యుడు.[9]

రాజ్యసభ ఎంపీగా ఉన్న సమయంలో రోనాల్డ్ సాపాత్లా మిజోరం రాష్ట్రానికి అనేక మెడికల్ కాలేజీలు రావడానికి కృషి చేశాడు. తెంజాల్ గోల్ఫ్ కోర్స్ స్థాపనలో ఆయన కీలకపాత్ర పోషించాడు.[10][11]

వ్యక్తిగత జీవితం మరణం

[మార్చు]

రోనాల్డ్ సాపాత్లా రామ్తన్పరి త్లావ్ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు సంతానం.[12] ఆయన క్రైస్తవుడు.

మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ 2025 ఏప్రిల్ 30న 71 సంవత్సరాల వయసులో రోనాల్డ్ సాపాత్లా మరణించాడు.[13]

పుస్తకాలు

[మార్చు]

రోనాల్డ్ సాపా త్లా ఈ క్రింది పుస్తకాలను రచించాడుః [14]

  • రాల్తియాంగ్ రామ్
  • సఖావ్ జలెన్నా
  • జోరామ్తార్
  • హిందూ కుల్ముట్

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Congress nominee, Ronald Sapa Tlau, wins lone Rajya Sabha seat in Mizoram". PTI. Archived from the original on 17 January 2016. Retrieved 22 June 2014.
  2. ↑ "Mizoram: Former Rajya Sabha MP Ronald Sapa Tlau dies at 71". indiatodayne.in. Retrieved 12 May 2025.
  3. ↑ "L Ramkinlova leh Ronald Sapa ten Rajya Sabha chuh turin hming an pe". Vanglaini. Retrieved 22 June 2014.
  4. ↑ Hmar, Sangzuala. "Former Mizoram Rajya Sabha MP Ronald Sapa Tlau passes away in Delhi". Hindustantimes.com. Retrieved 12 May 2025.
  5. ↑ PTI (8 June 2014). "Ronald Sapa Tlau is Cong nominee for lone RS seat in Mizoram". Business Standard. Retrieved 9 December 2018.
  6. ↑ "Congress nominee, Ronald Sapa Tlau, wins lone Rajya Sabha seat in Mizoram". Economic Times. 19 June 2014. Retrieved 5 January 2019.
  7. ↑ "COMMITTEE ON HEALTH AND FAMILY WELFARE" (PDF). Rajya sabha. Retrieved 5 January 2019.
  8. ↑ "Congress-in Ronald Sapa an chhuang". Vanglaini. Retrieved 17 May 2023.
  9. ↑ "Standing Committee on Information Technology" (PDF). loksabhadocs. Retrieved 17 May 2023.
  10. ↑ "ZMC-a associate professor lak dan Rajya Sabha MP hoin chinfel a ni". vanglaini. Retrieved 1 October 2020.
  11. ↑ "Ka ṭanpui theih loh zawng zawng hnenah An ngaihnathiamna ka dil e". vanglaini. Retrieved 1 October 2020.
  12. ↑ "Ronald Tlau Bio". India gov. Retrieved 20 June 2020.
  13. ↑ "Former Mizoram MP Ronald Sapa Tlau dies". theprint.in. Retrieved 12 May 2025.
  14. ↑ "Ronald sapa". Entrance india. 15 March 2018. Retrieved 10 March 2020.[permanent dead link]