రోమన్ అబ్రమోవిచ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మూస:Infobox governor

రోమన్ అర్కడైవిచ్ అబ్రమోవిచ్ (Roman Abramovich) (Russian: Рома́н Арка́дьевич Абрамо́вич, pronounced [rəˈman ərˈkadʲjɪvʲɪtɕ əbrɐˈmovʲɪtɕ]; జననం 1966 అక్టోబరు 24) రష్యాకు చెందిన ఒక యూదు వ్యాపారవేత్త మరియు ప్రైవేటు పెట్టుబడి కంపెనీ అయిన మిల్‌హౌస్ LLCకి ప్రధాన యజమాని.

2003లో రష్యన్ వ్యాపార మ్యాగజైన్ అయిన ఎక్స్‌పర్ట్ ద్వారా అబ్రమోవిచ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యారు. మైఖైల్ ఖోడోర్కవిస్కీతో కలిసి ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు. రష్యాకు వెలుపలి ప్రపంచానికి మాత్రం ఆయన ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్ జట్టు అయిన చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్ యజమానిగాను, మరియు యూరోపియన్ ఫుట్‌బాల్‌లో విస్తృతమైన భాగస్వామ్యం కలిగిన వ్యక్తిగానూ సుపరిచితుడు.

2010 ఫోర్బ్స్ జాబితా ప్రకారం, $11.2 బిలియన్ల సంపదతో ఆయన రష్యాలో అత్యంత ధనవంతుడైన నాల్గవ వ్యక్తిగాను మరియు ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతుడైన 50వ వ్యక్తిగానూ ఉన్నారు.[1]

విషయ సూచిక

వ్యాపార జీవితం[మార్చు]

సైనిక సర్వీసులో ఉన్న సమయంలో రోమన్ అబ్రమోవిచ్ తన మల్టీ-బిలియన్-డాలర్ వ్యాపారాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా దొంగలించబడిన గ్యాసోలిన్‌ను తన విభాగంలోని కొంతమంది ఉన్నతాధికారులకు ఆయన అమ్మేవారు.[2] సోవియట్ సైన్యంలో కొంతకాలం పనిచేసిన తర్వాత, ఆయన తన మొదటి భార్య ఓల్గాను వివాహం చేసుకున్నారు. మొదట్లో వీధి-వర్తకునిగా పనిచేసిన ఆయన ఆ తర్వాత ఒక స్థానిక కర్మాగారంలో మెకానిక్‌గా పనిచేశారు.[3] ఓల్గా తల్లితండ్రుల నుంచి పెళ్ళి కానుకగా అందిన 2,000-రూబల్ (దాదాపు £1,000) సొమ్మును నల్ల-బజారు సరుకులైన సుగంధద్రవ్యాలు, డియోడిరెంట్లు, బిగుతైన దుస్తులు, మరియు టూత్‌పేస్టులు కొనుగోలు కోసం పెట్టుబడిగా పెట్టిన అబ్రమోవిచ్ 1987 డిసెంబరులో లేదా ఆ సమీప రోజుల్లో మాస్కోలో ఆ వస్తువులను విక్రయించాడు.[4] వ్యాపారంలో లభించిన ప్రతి విజయంతో అత్మవిశ్వాసం పెరగడంతో అబ్రమోవిచ్ త్వరలోనే తన పెట్టుబడిని రెండింతలు, మూడింతలుగా పెంచారు[ఉల్లేఖన అవసరం]. దీనితర్వాత ప్లాస్టిక్ బొమ్మల (ప్లాస్టిక్ బాతులు మరియు సైనికులుతో సహా[5]) తయారీ స్థాయికి ఎదగడంతో పాటు ఒక ఆటోమొబైల్ విడిభాగాల కోపరేటివ్‌ను కూడా ప్రారంభించారు. అటుపై మాస్కోలోని గుబ్కిన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్‌పై దృష్టి పెట్టిన ఆయన (ఈ సమయంలో ఆయన రీట్రేడెడ్ కారు టైర్ల అమ్మకాలను కూడా చేపట్టారు[6]), తర్వాత స్విస్ వ్యాపార సంస్థ అయిన రునికామ్ కోసం సరుకుల వాణజ్యం చేశారు.[7]

1988లో, పెరెస్ట్రోయికా రూపంలో సోవియట్ యూనియన్‌లోని ఔత్సాహికవేత్తలకు అవకాశాలు అందివచ్చాయి, దీంతో ఆయన మరియు ఓల్గా బొమ్మల తయారీ కంపెనీని స్థాపించారు. "దాదాపు వెనువెంటనే అది విజయాన్ని తెచ్చిపెట్టింది" అని ఓల్గా అన్నారు.[4] ఆయనలోని వ్యాపార బుద్ధికుశలత కారణంగా, కొన్నేళ్లలోనే అబ్రమోవిచ్ వ్యాపార సామ్రాజ్యం చమురు సేకరణ కేంద్రాలు మొదలుకుని పందుల పెంపకం వరకు విస్తరించింది. దీంతోపాటు ఇతర వ్యాపారాల్లోనూ ఆయన పెట్టుబడులు పెట్టడాన్ని ప్రారంభించారు.[8] ఈ విధంగా 1990ల ప్రారంభంలో అబ్రమోవిచ్ కనీసం 20 కంపెనీలను స్థాపించడం మరియు పెట్టుబడులు పెట్టడం జరిగింది, దీంతో టైర్ రీట్రేడింగ్ మరియు బాడీగార్డు నియామకాల వరకు ఆయన అడుగుపెట్టని రంగమంటూ లేకుండా పోయింది.[9][10]

1992 నుంచి మొదలుకుని 1995 వరకు కాలంలో, అబ్రమోవిచ్ ఐదు కంపెనీలను స్థాపించారు. పునఃవిక్రయం, వినియోగ వస్తువుల ఉత్పత్తి, మరియు మధ్యవర్తుల రూపంలో వ్యవహరించడం లాంటి కార్యకలాపాలను ఆ కంపెనీలు నిర్వహించేవి. ఈ విధమైన ప్రయత్నాలతో పాటు చివరకు చమురు మరియు చమురు సంబంధిత పదార్థాల వ్యాపారంలో ప్రత్యేకత కలిగిన సంస్థగా ఆయన కంపెనీ అవతరించింది. అయినప్పటికీ, 1992లో, ప్రభుత్వ ఆస్తుల దొంగతనం కేసులో ఆయన అరెస్టు కావడంతో పాటు జైలుకు[11] వెళ్లారు: ఉఖ్‌టిన్‌స్క్ ఆయిల్ ప్రొడక్షన్ ప్యాక్టరీ నుంచి 3.8 మిలియన్ రూబుల్స్ విలువైన 55 పీపాల డీజిల్‌ ఇంధనాన్ని కలిగిన రైలును AVEKS-కోమి పంపడం జరిగింది; మాస్కోలో ఈ రైలును చేరిన అబ్రమోవిచ్, ఒక నకిలీ ఒప్పందం కింద దానిని కలినిన్‌గ్రాడ్ సైనిక బేస్‌కు రవాణా చేశాడు, అయితే, ఆ ఇంధనం రిగాకు వచ్చి చేరింది. ఈ విషయమై జరిగిన దర్యాప్తులో అబ్రమోవిచ్ సహకరించాడు, దీంతోపాటు ఆ డీజిల్ కొనుగోలుదారు అయిన లాట్వియన్-US కంపెనీ, చికోరా ఇంటర్నేషనల్ ద్వారా చమురు ఉత్పత్తి ఫ్యాక్టరీకి పరిహారం అందడంతో ఆ కేసును మూసివేశారు.[12]

1995లో, అబ్రమోవిచ్ మరియు అధ్యక్షుడు బోరిస్ యెల్ట్‌సిన్ సహచరుడైన బోరిస్ బెరెజోవ్‌స్కీలు కలిసి అతిపెద్ద చమురు కంపెనీ అయిన సిబ్‌నెఫ్ట్‌లో నియంత్రణ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అయితే, వాటాల కోసం రుణాలు అనే కార్యక్రమంలో భాగంగా జరిగిన ఈ ఒప్పందం వివాదాస్పదమైంది. వారు కొనుగోలు చేసిన వాటాల స్టాక్ మార్కెట్ విలువ ఆసమయంలో తక్కువగా US$150 మిలియన్‌గా ఉన్నప్పుడు కంపెనీలో సగభాగం కోసం ఒక్కో భాగస్వామి US$100 మిలియన్లు చెల్లించారు, దీని తర్వాత ఆ వాటాల విలువ వేగంగా పెరిగి బిలియన్లకు చేరింది. కంపెనీ విలువ వేగంగా వృద్ధి సాధించడం అనేకమంది పరిశీలకులు తమదైన కోణంలో భాష్యం చెప్పడానికి దారితీసింది. దీనిప్రకారం కంపెనీ యొక్క అసలైన ధర బిలియన్ డాలర్లుగా ఉంటుందని వారు సూచించారు.[13] మరోవైపు ఈ ఆస్తులను మరియు ఇతర ఆస్తులను (అల్యుమినియం వ్యాపారుల మధ్య జరిగిన పోరులో అల్యుమినియం ఆస్తులను కాపాడుకోవడం కోసం కూడా) గ్యాంగ్‌స్టర్ల నుంచి రక్షించుకోవడం కోసం ప్రభుత్వ అధికారులకు భారీగా లంచాలు (బిలియన్ల కొద్దీ) ఇచ్చినట్టు అబ్రమోవిచ్ కోర్టులో అంగీకరించారు.[14]

ఆవిధంగా, అబ్రమోవిచ్ ఫైనాన్సియల్ కెరీర్‌లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి: జనవరి 1989 మొదలు మే 1991 వరకు, కంఫర్ట్ co-op (ప్లాస్టిక్ బొమ్మల తయారీ సంస్థ)కు ఛైర్మన్; మే 1991 మొదలు మే 1993 వరకు, మాస్కోలోని ABK అనే చిన్న ఎంటర్‌ప్రైజ్‌కు డైరెక్టర్‌గా వ్యవహరించారు. వివిధ రకాల ఆధారాల ప్రకారం, 1992 మొదలు 1995 వరకు రోమన్ అబ్రమోవిచ్, వినియోగ వస్తువుల తయారీ మరియు అమ్మకం-మరియు-కొనడం లాంటి కార్యకలాపాలతో సంబంధం కలిగిన ఐదు కంపెనీలను స్థాపించారు. మే 1995లో, బోరిక్ బెరెజోవ్‌స్కీతో కలిసి, P.K. ట్రస్ట్ క్లోజ్ జాయింట్-స్టాక్ కంపెనీని ఆయన స్థాపించారు. 1995 మరియు 1996లో, ఆయన మరో 10 సంస్థలను ఏర్పాటు చేశారు: మెకాంగ్ క్లోజ్ జాయింట్-స్టాక్ కంపెనీ, సెంచూరియన్-M క్లోజ్ జాయింట్-స్టాక్ కంపెనీ, ఆగ్రోఫెర్ట్ పరిమిత భాగస్వామ్య కంపెనీ, మల్టీట్రాన్స్ క్లోజ్ జాయిటం-కంపెనీ, ఆయిలిమ్‌పెక్స్ క్లోజ్ జాయింట్-స్టాక్ కంపెనీ, సిబ్రియల్ క్లోజ్ జాయింట్-స్టాక్ కంపెనీ, ఫార్‌నెఫ్ట్ క్లోజ్ జాయింట్-స్టాక్ కంపెనీ, సెర్వెట్ క్లోజ్ జాయింట్-స్టాక్ కంపెనీ, బ్రాన్కో క్లోజ్ జాయింట్-స్టాక్ కంపెనీ, వెక్టర్-A పరిమిత భాగస్వామ్య కంపెనీ లాంటి వాటిని ఏర్పాటు చేసిన ఆయన మరోసారి బెరె‌జోవ్‌స్కీతో కలిసి సిబ్‌నెఫ్ట్ పబ్లిక్ కంపెనీ వాటాలను కొనుగోలు చేశారు.[15]

అబ్రమోవిచ్ కెరీర్‌ను ది గార్డియన్ కింది విధంగా పేర్కొంది:[16]

By 1996, at the age of 30, Abramovich had become so rich and politically well-connected that he had become close to President Boris Yeltsin, and had moved into an apartment in the Kremlin at the invitation of the Yeltsin family. In 1999, and now a tycoon, Abramovich was elected governor of Russia's remote, far eastern province of Chukotka, and has since lavished £112 million (€ 132 million) on charity to rebuild the impoverished region. The identikit image being pieced together for us was of a self-made man who was not only powerful and wealthy, but acutely aware of those who had done less well in the tumultuous 1990s, when the Soviet Union fell.

బోరిస్ బెరెజోవ్‌స్కీతో స్నేహం[మార్చు]

1993లో, అబ్రమోవిచ్ మెకాంగ్‌ స్థాపించారు. నోయబ్రస్క్ నుంచి ఆయన చమురు అమ్మకం ప్రారంభించారు. ఈ సమయంలోనే రష్యాకు చెందిన సహచర వ్యాపారవేత్త మరియు వ్యవస్థాపకుడు అయిన బోరిస్ బెరెజోవ్‌స్కీనిని ఆయన కలుసుకున్నారు.

రెండు విభిన్నమైన ఆధారాల ప్రకారం, బెరెజోవ్‌స్కీని మొదటగా ఆయన కారిబ్బెయిన్‌లో 1993లో జరిగిన ఒక సమావేశం సందర్భంగా కలిసి ఉండాలి[17] లేదా తన స్నేహితుడైన పైయోట్ర్ ఎవెన్‌కు చెందిన నావపై కలిసి ఉండాలి.[18]

మొత్తంమీద తనకు స్నేహితుడిగా మారిన అబ్రమోవిచ్‌ను అప్పటి అధ్యక్షుడు బోరిస్ యెల్ట్‌సిన్ "కుటుంబం", సన్నిహితులైన ఆయన కుమార్తె టట్‌యానా డైయచెన్కో మరియు ప్రధాన భద్రతా సలహాదారైన అలెగ్జాండర్ కొర్జకోవ్‌లకు బెరెజోవ్‌స్కీ పరిచయం చేశారు.[17]

బెరెజోవ్‌స్కీతో కలిసి తీరస్థ కంపెనీ అయిన గిబ్‌రాల్టర్-రిజిస్టర్డ్ రునికామ్ లిమిటెడ్‌ను అబ్రమోవిచ్ స్థాపించారు. అలాగే ఐదు పశ్చిమ యూరోపియన్ అనుబంధ సంస్థలనూ స్థాపించారు. 1995లో స్విస్ సంస్థకు చెందిన మాస్కో అనుబంధ సంస్థ అయిన రునికామ్ S.A.కు అబ్రమోవిచ్ అధ్యక్షత వహించారు, ఇక బోరిస్ యెల్ట్‌సిన్ అధ్యక్ష డిక్రీ ద్వారా సిబ్‌నెఫ్ట్ అనేది రూపొందింది. ఈ సంస్థకు అధ్యక్షుడిగా వ్యవహరించిన అబ్రమోవిచ్, బెరెజోవ్‌స్కీతో కలిసి ఉన్నత వర్గాల సమూహాల్లో వ్యాపార ప్రచారం నిర్వహించారనే పుకార్లు వినిపించాయి.[19][20]

సిబ్‌నెఫ్ట్-స్వాధీనం, అల్యూమినియం యుద్ధాలు, మరియు వాటాల-కోసం-రుణాలు[మార్చు]

1995లో, అబ్రమోవిచ్ మరియు బెరెజోవ్‌స్కీలు కలిసి అతిపెద్ద సోవియట్ చమురు కంపెనీ సిబ్‌నెఫ్ట్‌లో నియంత్రణ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అబ్రమోవిచ్ చేర్పులు, బోరిస్ బెరెజోవ్‌స్కీ చేర్పులతో రష్యన్ చమురు కంపెనీ అయిన సిబ్‌నెఫ్ట్‌ను $100.3 మిలియన్‌లకు (అప్పట్లో ఆ కంపెనీ విలువ $2.7 బిలియన్‌గా ఉండేది) కొనుగోలు చేశారు. సిబ్‌నెఫ్ట్ కంపెనీ ఏడాదికి దాదాపు $3 బిలియన్ విలువైన చమురును ఉత్పత్తి చేస్తుంది.[21][22] మరోవైపు సిబ్‌నెఫ్ట్‌కు చెందిన నిల్వలను స్వాధీనం చేసుకోవడం కోసం స్నేహితుడు బోరిస్ బెరెజోవ్‌స్కీతో కలిసి ఆయన అనేక ఫ్లే-బై-నైట్ సంస్థలను ఏర్పాటు చేశారు. దీనిఫలితంగా, మార్కెట్ ధరతో పోలిస్తే 25 రెట్లు తక్కువ ధరను మాత్రమే చెల్లించి ఆయన చమురును సొంతం చేసుకోగలిగారు.[21]

ఈ వ్యవహారంలో బద్రి పటర్‌కట్‌సిష్‌విలి ద్వారా ఆయన సాయం అందుకున్నారని ది టైమ్స్ పేర్కొంది.[23] అప్పటి అధ్యక్షుడు బోరిస్ యెల్ట్‌సిన్‌ ద్వారా ప్రారంభించబడిన వివాదాస్పద కార్యక్రమమైన వాటాల కోసం రుణాల ద్వారా ఈ స్వాధీనం జరిగింది.[24][25][26] సిబ్‌నెఫ్ట్ తర్వాత, అబ్రమోవిచ్ లక్ష్యం అల్యూమినయం పరిశ్రమ వైపు మళ్లింది. ప్రైవేటీకరణ తర్వాత పరిశ్రమపై పట్టు కోసం చోటుచేసుకున్న 'అల్యూమినియం యుద్ధాలు' లోహం కరిగించే ప్లాంట్ మేనేజర్లు, లోహ వ్యాపారాలు మరియు జర్నలిస్టుల హత్యలకు దారితీశాయి. ఈ అల్యూమినియం యుద్ధాల్లో అబ్రమోవిచ్ అందరి దృష్టినీ ఆకర్షించేలా విజయం సాధించిన వ్యక్తిగా నిలిచారు.[23]

బోరిస్ బెరెజోవ్‌స్కీ మరియు బద్రి పటర్‌కట్‌సిష్‌విలితో బాంధవ్యం[మార్చు]

ఈ విషయమై ది టైమ్స్ కింది విధంగా కూడా పేర్కొంది:[23]

2001లో స్విట్జర్‌ల్యాండ్‌లోని St మోర్టిజ్ విమానాశ్రయంలో ఉన్న సమయంలో బెరెజోవ్‌స్కీకి US$1.3 బిలియన్ (€925 మిలియన్) చెల్లించాల్సిందిగా అబ్రమోవిచ్‌ను Mr [బద్రి] పటర్‌కట్‌సిష్‌విలి అడిగిన సమయంలో ఆయన తన మనసులో మాట బయటపెట్టారు. “సొమ్ము కోసం Mr బెరెజోవ్‌స్కీ అభ్యర్థిస్తే ఆ సొమ్మును చెల్లించేందుకు సిద్ధమని చెప్పడంతో పాటు తాను మరియు Mr పటర్‌కట్‌సిష్‌విలి కలిసి బెరెజోవ్‌స్కీతో మరియు అతని వ్యాపారాల్లో బహిరంగంగా భాగస్వామ్యం" ఇవ్వాల్సిందిగా అబ్రమోవిచ్ కోరారు. ఆ విధంగా ఆ సొమ్ము ఇవ్వడం జరిగింది.

దీంతోపాటు Mr పటర్‌కట్‌సిష్‌విలికి సొమ్ము ఇచ్చేందుకు కూడా Mr అబ్రమోవిచ్ సిద్ధమయ్యారు. “చివరి చెల్లింపు ద్వారా” US$585 మిలియన్ (€416 మిలియన్) ఇచ్చేందుకు అంగీకరిస్తున్నట్టు ఆయన తెలిపారు.

మరోవైపు Mr బెరెజోవ్‌స్కీకి సిబ్‌నెఫ్ట్ మరియు అల్యుమినియం వ్యాపారంలో ఉండే మక్కువను తనకు అనుకూలంగా ఉపయోగించుకోవడం లేదా స్నేహితున్ని దేశం విడిచిపోయేలా బెదిరించడం లాంటి తనపై వచ్చిన ఆరోపణలను అబ్రమోవిచ్ ఖండించారు. “Mr అబ్రమోవిచ్ చేసినట్టుగా లేదా ఆయన పార్టీ చేసినట్టుగా చెబుతున్న నిర్బంధ బెదిరింపులు లేదా భయపెట్టడం లాంటి వాటిని ఖండించడమైనది” అని ఆయన అన్నారు.

అబ్రమోవిచ్ ద్వారా సమర్పించబడిన కోర్టు-పత్రాలు మరియు ది టైమ్స్‌చే చూడబడిన (UK) వివరాల ప్రకారం,[23] అబ్రమోవిచ్ ఈ విషయాలను కోర్టు-పత్రాల్లో సూచించారు:

Prior to the August 1995 decree [of Sibneft's creation], the defendant [Abramovich] informed Mr Berezovsky that he wished to acquire a controlling interest in Sibneft on its creation. In return for the defendant [Abramovich] agreeing to provide Mr Berezovsky with funds he required in connection with the cash flow of [his TV company] ORT, Mr Berezovsky agreed he would use his personal and political influence to support the project and assist in the passage of the necessary legislative steps leading to the creation of Sibneft.

Mr Patarkatsishvili did ... provide assistance to the defendant in the defendant's acquisition of assets in the Russian aluminium industry.

రాజకీయ జీవితం[మార్చు]

డూమా సభ్యుడు[మార్చు]

1999లో, తూర్పు రష్యాలో బాగా అభివృద్ధి చెందిన చుకోట్కా ఆటోనోమస్ ఓక్రగ్‌కు ప్రతినిధిగా అబ్రమోవిచ్ స్టేట్ డూమాకు ఎన్నికయ్యారు. చుకోట్కాలోని ప్రజలకు, ప్రత్యేకించి పిల్లలకు సాయం చేయడం కోసం ఆయన పోల్ ఆఫ్ హోప్ పేరుతో ఒక ఛారిటీని ప్రారంభించారు. దీంతోపాటు డిసెంబరు 2000లో అలెగ్జాండర్ నజారోవ్ స్థానంలో చుకోట్కాకు ఆయన గవర్నర్‌గా ఎన్నికయ్యారు.

గవర్నర్[మార్చు]

2000 నుంచి 2008 వరకు చుకోట్కాకు అబ్రమోవిచ్ గవర్నర్‌గా పనిచేశారు. ప్రస్తుతం రష్యాలోనే అత్యధిక జనన రేటు కలిగిన ప్రాంతాల్లో ఒకటిగా ఉన్న ఈ ప్రాంతానికి[27] గవర్నర్‌గా ఉన్న రోజుల్లో ఆయన US$1.3 బిలియన్ (€925 మిలియన్) పైగా సొంత డబ్బు ఖర్చు చేశారు.[28] అబ్రమోవిచ్ పాలన కింద ఈ ప్రాంతానికి సంబంధించిన జీవన ప్రమాణాలు అభివృద్ధి చెందాయి, పాఠశాలలు మరియు గృహాలు లాంటివి పునఃనిర్మితం కావడంతో పాటు పెట్టుబడిదారులు ఈ ప్రాంతానికి తరలివచ్చారు.[29]

"అత్యంత ఖర్చు"తో కూడిన వ్యవహారం కావడం, అరుదుగా మాత్రమే ఆయన ఆ ప్రాంతాన్ని సందర్శించడం లాంటి కారణాల వల్ల 2005లో తన పదవీకాలం ముగిసిన తర్వాత మరోసారి గవర్నర్‌గా ఎన్నిక కావడం కోసం తాను ప్రయత్నించనని అబ్రమోవిచ్ చెప్పారు. అయినప్పటికీ, ప్రాంతీయ గవర్నర్‌ల కోసం నిర్వహించే ఎన్నికలను రద్దు చేయడం కోసం రష్యా అధ్యక్షుడు వాద్లిమర్ పుతిన్ చట్టాన్ని మార్చడంతో, 21 అక్టోబర్ 2005లో అబ్రమోవిచ్ మరోసారి గవర్నర్‌గా ఎంపికయ్యారు.

"స్వయంప్రతిపత్తి కలిగిన జిల్లా [చుకోట్కా] ఆర్థిక అభివృద్ధి కోసం అతిపెద్ద సాయం చేసిన" కారణంగా, అధ్యక్షుడు పుతిన్ సంతకం చేసిన ఒక డిక్రీ ద్వారా అబ్రమోవిచ్‌ను ఆర్డర్ ఆఫ్ హానర్ పురస్కారంతో సత్కరించారు.[30]

రాజీనామా[మార్చు]

అబ్రమోవిచ్ ద్వారా సాయం పొందుతున్న ఛారిటబుల్ ట్రస్టులు నడుస్తున్నప్పటికీ, చుకోట్కా గవర్నర్‌గా రాజీనామా చేస్తూ ఆయన చేసిన అభ్యర్థనను ఆమోదిస్తున్నట్టు 2008 జూలై ప్రారంభంలో అధ్యక్షుడు దిమిత్రి మెద్వదేవ్ ప్రకటించారు. 2000–2006 మధ్య కాలంలో చుకోట్కాలో వేతనాల సరాసరి 2000లో ఉన్న నెలకు US$165 (€117/£100) నుంచి 2006 నాటికి నెలకు US$826 (€588/£500)కు చేరింది.[12][31]

ప్రాంతీయ ప్రభుత్వం వివరాల ప్రకారం, అబ్రమోవిచ్ తన పదవీకాలంలో చుకోట్కాలోని నాసిరకం గృహాలు, పాఠశాలలు, ఆస్పత్రులు మరియు మౌలిక సదుపాయాలను పునఃనిర్మించడంతో కోసం $2.5 బిలియన్ ఖర్చు చేశారు. ఇందులో ఎక్కువ భాగం నిధులు ఆయన సొంత జేబు[dubious ] నుంచి మరియు అనుబంధ కంపెనీల నుంచి మరియు ఆయనకు చెందిన రెండు ఫౌండేషన్లు-పోల్ ఆఫ్ హోప్ మరియు టెర్రెటోరియా నుంచి వచ్చాయి.[ఉల్లేఖన అవసరం]

నేరారోపణలు మరియు అపరాధాలు[మార్చు]

బోరిస్ బెరెజోవ్‌స్కీ ఆరోపణలు[మార్చు]

బ్లాక్‌మెయిల్ ఆరోపణ[మార్చు]

బోరిస్ బెరెజోవ్‌స్కీ (ఒకప్పటి ఆయన వ్యాపార భాగస్వామి) 2008లో చేసిన ఆరోపణల ప్రకారం, తనకు చెందిన విలువైన వాటాలను వాటి అసలు ధర కంటే అతి తక్కువ ధరకు అమ్మేలా మోసం చేయడం కోసం అబ్రమోవిచ్ ఆయనను "బెదిరించడం మరియు భయపెట్టడం" చేశారు. దీంతో అగ్రహం చెందిన అబ్రమోవిచ్ US$3.3 బిలియన్ (€2.35 బిలియన్/£2 బిలియన్)కు దావా వేశారు.[8]

సిబ్‌నెఫ్ట్‌లోని తన వాటాను ఈ రోజు ధరల వద్ద $650 మిలియన్ (€462 మిలియన్/£326 మిలియన్)కు విక్రయించినట్టు బెరెజోవ్‌స్కీ తెలిపారు. రుసల్ వాటాల కోసం ఆయన $450 మిలియన్ (€320 మిలియన్/£272 మిలియన్) అందుకున్నారు. ఆ ధర సిబ్‌నెఫ్ట్ వాటాల కంటే US$2 బిలియన్ (€1.42 బిలియన్/£1.2 బిలియన్) మరియు రుసల్ వాటాల కంటే US$1.5 బిలియన్ (€1.06 బిలియన్/£900 మిలియన్) ఎక్కువని ఆయన తెలిపారు. మాజీ అటవీశాఖ ఇంజనీర్ మరియు ఒకప్పటి సేల్స్‌మెన్ అయిన ఆయిన వివరాల ప్రకారం, అబ్రమోవిచ్‌ యొక్క US$17.9 బిలియన్ (€12.73 బిలియన్/£10.8 బిలియన్) సంపదలో US$ 3.36 బిలియన్ (€2.39 బిలియన్/£2.03 బిలియన్) మొత్తం ఒక గుర్తించదగిన భాగం.[32] ఆ మొత్తం విలువ దాదాపు £500 మిలియన్ అని బెరెజోవ్‌స్కీ నమ్మకం.[33]

లంచాలు[మార్చు]

2008లో అబ్రమోవిచ్ అంగీకరించిన ప్రకారం, అమెరికాలో జన్మించిన గ్రీక్ చమురు బిలియనీర్ కాన్‌స్టాంటైన్ N. అలెగ్జాండర్-గౌల్యాండ్రిస్‌తో కలిసి రాజకీయ ప్రయోజనాల కోసం మరియు రష్యా యొక్క చమురు మరియు అల్యూమినియం సంపదల్లో పెద్ద వాటాను సొంతం చేసుకోవడం కోసం రక్షణ ఫీజుల రూపంలోనూ బిలియన్ డాలర్లు ఇవ్వడం జరిగిందని ది టైమ్స్ నివేదించింది. ది టైమ్స్ సంపాదించిన కోర్టు పత్రాల్లో ఈ వివరాలు చోటు చేసుకున్నాయి.[23]

చట్ట వ్యతిరేకంగా వాటాల-విలువ తగ్గింపు ఆరోపణలు[మార్చు]

రోమన్ అబ్రమోవిచ్‌ మరియు ఆయన పెట్టుబడితో నడిచే మిల్‌హౌస్ క్యాపిటల్ కంపెనీకి వ్యతిరేకంగా లండన్‌లో దాఖలు చేసిన దావాలో భాగంగా సిబిర్ ఎనర్జీకి అనుబంధ సంస్థ అయిన యుగ్రానెఫ్ట్ బిలియన్ డాలర్ల నష్టపరిహారం కోరింది. రష్యన్ ఆస్తుల విషయంలో తాను మోసానికి గురికావడానికి అబ్రమోవిచ్ కారణమన్నది ఆ సంస్థ ఆరోపణ.[34] రోమన్ అబ్రమోవిచ్‌ కంపెనీల్లో ఒకటైన సిబ్‌నెఫ్ట్‌పై కూడా ఆ సంస్థ ఆరోపణలు చేసింది. రష్యాలో చమురు క్షేత్రాలను కలిగిన వారి సంయుక్త కంపెనీ విషయంలో సిబ్‌నెఫ్ట్ చట్టవ్యతిరేకంగా యుగ్రానెఫ్ట్ యొక్క వాటాను 50% నుంచి 1%కు తగ్గించిందన్నది దాని ఆరోపణ. జరిగిన కార్యకలాపాల్లో "పలుచన చేసిన ప్రయోజనాల నిధులను రాబట్టేందుకు అవసరమైన బలమైన ఆధారాలు" ఉన్నాయని బిలియనీర్ అయిన శల్వ చిగిరిన్‌స్కీ సంయక్త భాగస్వామ్యంతో నడుస్తున్న సిబిర్ ఎనర్జీ తెలిపింది.[34]

దొంగతనం నేరంపై అరెస్ట్[మార్చు]

1992లో ప్రభుత్వ సొత్తు దొంగిలించిన కేసులో ఆయన అరెస్టు అయ్యారు: Р3.8 మిలియన్ (రూబుల్స్) విలువ కలిగిన 55 సిస్టెర్న్‌స్ (ట్యాంకర్లు) డీజిల్ ఇంధన కలిగిన ఒక రైలును ఉఖ్తిన్స్‌క్ చమురు ఉత్పత్తి కర్మాగారం నుంచి అవెక్స్-కోమి పంపారు (కేసు No. 79067, స్టేట్ సొత్తును అత్యధిక-మొత్తంలో దొంగిలించినందుకు);[12][35][36] మాస్కో దగ్గర ఈ రైలును కలుసుకున్న అబ్రమోవిచ్, ఒక నకిలీ ఒప్పందం ద్వారా దాన్ని కలినిన్‌గ్రాడ్‌కు రవాణా చేశారు, అయితే ఆ ఇంధనం రిగాకు చేరింది. దర్యాప్తు విషయంలో అబ్రమోవిచ్ సహకరిచడంతో పాటు, డీజిల్ కొనుగోలుదారైన లాట్‌వేన్-USకు సంబంధించిన చికోరా ఇంటర్నేషనల్ ద్వారా చమురు ఉత్పత్తి కర్మాగారానికి పరిహారం అందడంతో అది కేసును ఉపసంహరించుకుంది.[12]

రుణ-మోసం ఆరోపణలు[మార్చు]

ఒక మాజీ కంపెనీ, మరియు అనేకమంది ఇతర రష్యా రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు మరియు బ్యాంకర్ల ద్వారా అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి వచ్చిన US$4.8 బిలియన్ (€3.4 బిలియన్) రుణాన్ని అబ్రమోవిచ్ తన సొంత నిధిలా ఉపయోగించుకున్నారని ఒక స్విస్ పరిశోధన నుంచి ఆరోపణ వెలువడింది; అయితే, IMF సొంతంగా జరిపిన ఆడిట్‌లో IMF నిధులన్నీ సక్రమంగానే ఉపయోగించినట్టు గుర్తించబడింది.[37]

అబ్రమోవిచ్‌కు వ్యతిరేకంగా £9 మిలియన్ (US$14.9 మిలియన్/€10.6 మిలియన్)కు దావా వేయనున్నట్టు జనవరి 2005లో, యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (EBRD) తెలిపింది.[38] అబ్రమోవిచ్ మరియు యుజెన్ శివిడ్లర్‌ ద్వారా నియంత్రించబడుతున్న స్విట్జర్లాండ్‌లోని రునికామ్ సంస్థ తమకు US$17.5 మిలియన్ (€12.45 మిలియన్/£10.6 మిలియన్) బాకీ ఉన్నట్టు EBRD తెలిపింది. అయితే, ఈ రుణాన్ని అంతకుముందే తిరిగి చెల్లించడం జరిగిందని అబ్రమోవిచ్ అధికార ప్రతినిధి తెలిపారు.[39]

అల్యూమినియం యుద్ధాలు[మార్చు]

ది టైమ్స్ [23][40] చెప్పిన ప్రకారం, “అల్యూమినియం యుద్ధాల్లో” చివరకు అబ్రమోవిచ్ విజేతగా నిలిచారు, లాభదాయకమైన లోహ పరిశ్రమపై పట్టుకోసం జరిగిన గ్యాంగ్‌ల్యాండ్ పోరులో దాదాపు 100మందికి పైగా హత్య చేయబడినట్టు ఒక అంచనా. క్రెమ్లిన్‌పై కోపం తెచ్చుకున్న ఆయన విరోధి సభ్యుల విధిని దూరంగా పెట్టారు. దీంతో చివరకు ఆయన పదేళ్లపాటు సైబీరియా జైల్లో ఉండేందుకు తరలించబడ్డారు", దీంతో "తామంతా జీవితాలను కోల్పోయినట్టు అనేకమంది అధికారులు మరియు ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు".

రష్యాలో నమ్మక వ్యతిరేక చట్ట ఉల్లంఘన[మార్చు]

ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నివేదించిన ప్రకారం, "వంటకు ఉపయోగించే బొగ్గు కోసం వినియోగదారుల నుంచి ఎక్కువ ఛార్జీలు వసూలు చేయడం ద్వారా ఎవ్‌రజ్ హోల్డింగ్‌లో కొంత భాగానికి యజమాని- క్రెమ్‌లిన్‌తో స్నేహపూరిత సంబంధాలు కలిగిన వ్యాపారవేత్త అయిన రోమన్ అబ్రమోవిచ్ ఏకాధికార వ్యతిరేక నియమాలను ఉల్లంగించారు."[41]

అబ్రమోవిచ్ మరియు యూరోపియన్ ఫుట్‌బాల్[మార్చు]

చెల్సియా F.C.[మార్చు]

రోమన్ అబ్రమోవిచ్

యునైటెడ్ కింగ్‌డమ్‌లో చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్‌ను నియంత్రించే కంపెనీలకు ఆయన జూన్ 2003లో యజమానిగా మారారు. ఈ క్లబ్బుకి మాజీ యజమాని అయిన కెన్ బేట్స్, అప్పట్లో లీడ్స్ యునైటెడ్ కొనుగోలు కోసం డబ్బు అవసరమై చెల్సియా ఫుట్‌బాల్ క్లబ్‌ను నియంత్రించే కంపెనీల అమ్మకానికి సిద్ధమయ్యారు. మరోవైపు ప్రపంచవ్యాప్త బ్రాండ్‌గా అవతరించాలనే లక్ష్యంతో వాణిజ్య అభివృద్ధి కార్యక్రమంపై దృష్టిసారించిన ఈ క్లబ్, కోభమ్, సర్రీలో ఒక అత్యాధునిక శిక్షణ కేంద్రాన్ని నిర్మించనున్నట్టు ప్రకటించింది.[42] ప్రీమియర్‌షిప్‌లో అంతకుముందు నాలుగో స్థానంలో నిలిచిన చెల్సియా క్లబ్, అబ్రమోవిచ్ చేపట్టిన తర్వాత తన మొదటి సీజన్‌ను రెండో స్థానంతో ముగించింది. దీంతోపాటు చాంఫియన్స్ లీగ్‌లో సెమీ-ఫైనల్‌కు చేరింది. అటుపై కొత్త మేనేజర్‌గా జోష్ మౌరిన్‌హో నియమించబడడంతో పాటు ఆ తర్వాతి సీజన్‌లో చెల్సియా లీగ్ ఛాంపియన్లుగా నిలిచింది. అబ్రమోవిచ్ చేతికి వచ్చినప్పటినుంచి ప్రారంభించి చెల్సియా క్లబ్ ఎనిమిది ప్రధానమైన ట్రోఫీలు - ప్రీమియర్ లీగ్‌ను 3 సార్లు, FA కప్‌ను 3 సార్లు మరియు లీగ్ కప్‌ను రెండుసార్లు దక్కించుకుంది. దీంతో మాంచెస్టర్ యునైటెడ్ తర్వాత గడచిన ఏడు సంవత్సరాల్లో అత్యంత విజయవంతమైన రెండో ఇంగ్లీష్ జట్టుగా అది గుర్తింపు సాధించింది.

ఆగస్టు 2008లో పోర్ట్స్‌మౌత్ F.C. పై 4-0 విజయం సాధించిన సమయంలో స్టాంఫోర్డ్ బ్రిడ్జ్ వద్ద రోమన్ అబ్రమోవిచ్

చెల్సియా విషయంలో అబ్రమోవిచ్ అంకితభావం వల్ల ఫుట్‌బాల్ మార్కెట్ అనేది యూరోప్[43] మొత్తం విస్తరించింది. మరోవైపు ఆయనకు ఉన్న సంపద కారణంగా అనేక సందర్భాల్లో మెరుగైన ఆటగాళ్లను క్లబ్ సొంతం చేసుకునేందుకు అవకాశం లభించింది. అయితే, ఇటీవలి సంవత్సరాల్లో ఆ విధమైన తీరు మారింది. అయినప్పటికీ, ఆండ్రీ షెవ్‌చెంకోను బదిలీ చేసేందుకు ఆయన ఆమోదించారు. అప్పట్లో బ్రిటీష్ రికార్డుగా నిలిచిన £30 మిలియన్ (€35.3 మిలియన్) బదిలీ ఫీజు కోసం ఆయన ఇందుకు ఆమోదించారు.

గ్లెన్ జాన్సన్ మరియు జో కోల్ కోసం వెస్ట్ హామ్ యునైటెడ్‌కు సంయుక్త ఫీజుగా £12.5 మిలియన్ (€14.7 మిలియన్) చెల్లించడంతో ఈ సొమ్ము కొంతమేర విస్తరించడంతో పాటు, గేమ్ వ్యాప్తంగా సంపద పునఃపంపిణీ అయ్యింది. మరోవైపు అదే సంవత్సరం జూన్ 2005 నాటికి చెల్సియా రికార్డు స్థాయిలో £140 మిలియన్ (€165 మిలియన్) నష్టాలను ప్రకటించింది. అయితే, జూన్ 2006 నాటికి ఈ నష్టాల మొత్తం £80.2 మిలియన్ (€94.3 మిలియన్)గా తగ్గినప్పటికీ, 2010కి ముందుగా ఈ క్లబ్ లాభాలను ఆర్జించగలదని మాత్రం ఊహించలేదు.[44]

ఈ రకమైన పరిస్థితి నుంచి దూరమయ్యే మార్గాల కోసం చూస్తున్నప్పటికీ[45], డిసెంబరు 2006లో ఇంటర్వ్యూ ఇచ్చిన అబ్రమోవిచ్, రాబోయే సంవత్సరాల్లో చెల్సియా ట్రాన్స్‌ఫర్ ఖర్చులు తగ్గుతాయని తాను అంచనావేస్తున్నట్టు తెలిపారు.[46] చెల్సియా ఆడే దాదాపు ప్రతి గేమ్‌ను చూసేందుకు హాజరుకావడంతో పాటు, మ్యాచ్ జరిగినంతసేపు ఉద్వేగాన్ని బయటికి కనబడేలా ప్రదర్శించడాన్ని అబ్రమోవిచ్ అలవాటుగా చేసుకున్నారు. దీంతో ఆయనకు ఆటపై ఉన్న ప్రేమ ఏపాటిదో మద్దతుదారులకు తెలియవచ్చింది. అలాగే ప్రతి మ్యాచ్‌కు ముందు ఆయన ఆటగాళ్లను వారి డ్రస్సింగ్ రూంలో కలిసేవారు, అయితే, ఈ రకమైన మద్దతు అనేది 2007 ప్రారంభంలో పూర్తిగా తగ్గిపోయింది. అబ్రమోవిచ్‌కు మరియు చెల్సియా మేనేజర్ జోష్ మౌరిన్‌హోలకు మధ్య తగాదా ఉన్న కారణంగానే ఇలా జరిగిందనే గుసగుసలు అప్పట్లో వినిపించాయి. దీనికి తగ్గట్టు ఆటగాళ్ల విషయంలో మరీ ముఖ్యంగా ఆండ్రీ షెవ్‌చెన్కో లాంటి వారు ఆటలో కనిపించాలా వద్దా అనే విషయమై వారిద్దరి మధ్య చోటు చేసుకున్న వాదోపవాదాలు ఎప్పుడూ పత్రికల్లో ప్రచురితం కావడమే ఇందుకు కారణం.[47] ఈ నేపథ్యంలో బోర్డు సమావేశంలో భాగంగా క్లబ్‌తో కుదిరిన పరస్పర అంగీకారం మేరకు తాను చెల్సియా మేనేజర్ పదవినుంచి తప్పుకుంటున్నట్టు 2007 సెప్టెంబరు 20లో జోష్ మౌరెన్‌హో ప్రకటించారు.[48] దీనితర్వాత మాజీ ఇజ్రాయిల్ కోచ్ మరియు చెల్సియా డైరెక్టర్ ఆఫ్ ఫుట్‌బాల్ అయిన అవ్రమ్ గ్రాంట్, జోష్ స్థానాన్ని అందుకున్నారు.[49] చెల్సియాలో గ్రాంట్ చేరిన ప్రారంభంలో (2007 వేసవిలో) ఆయనకు, మౌరెన్‌హోకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో జట్టు విషయాల్లో కలగజేసుకోరాదని గ్రాంట్‌కు మౌరెన్‌హో సూచించారు. అయితే, అబ్రమోవిచ్ అండతో క్లబ్‌లో గ్రాంట్ ప్రాభవం పెరగడంతో పాటు ఆ తర్వాత ఆయన క్లబ్ బోర్డులో సభ్యునిగా నియమితులయ్యారు. అయితే, ఈ పరిణామం మౌరెన్‌హోకు నచ్చలేదు. ఈ కారణంగానే ఆయన ఆశ్చర్యకరమైన రీతిలో చెల్సియా క్లబ్ నుంచి వైదొలిగి ఉండవచ్చు.[50] ఇక అవ్రమ్ గ్రాంట్ నేతృత్వంలో ఇంగ్లీష్ ప్రీమియర్ మరియు యూరోపియన్ ఛాంపియన్స్ రెండింటిలోనూ చెల్సియా రన్నరప్‌గా నిలించింది. రెండింటిలోనూ చెల్సియా క్లబ్, మాంచెస్టర్ యునైటెడ్‌కు తర్వాతి స్థానంలో నిలిచింది. అయితే, మే 24న గ్రాంట్‌ను మేనేజర్ పదవినుంచి అబ్రమోవిచ్ తొలగించారు.[51] దీనితర్వాతా 2008 జూలై 1 నుంచి చెల్సియాకు మేనేజర్‌గా లూయిజ్ ఫెలిప్ స్కొలరీ వ్యవహరించనున్నారని 2008 జూలై 1న ప్రకటన వెలువడింది. అయితే, కొద్దిరోజులకే అంటే, 2009 ఫిబ్రవరి 9న చెల్సియా మేనేజర్‌గా స్కొలరీ ఉద్వాసనకు గురయ్యారు. ఫిబ్రవరి 2009లో, గుస్ హిడ్డింక్‌ క్లబ్ మేనేజర్‌గా నియమితుడయ్యాడు. అయితే, ఇంగ్లీష్ సీజన్ ముగిసిన తర్వాత కార్లో ఏన్సెలొట్టిని తొలగించడంతో, హిడ్డింక్ తన శాశ్వత స్థానమైన రష్యా జాతీయ జట్టు మేనేజర్‌ పదవిని చేపట్టారు. మే 2008 నాటి వివరాల ప్రకారం, అబ్రమోవిచ్ 2003లో చెల్సియా క్లబ్‌ను చేపట్టిన తర్వాత దాదాపు £600 మిలియన్ల (€705 మిలియన్)ను క్లబ్ కోసం ఖర్చు చేశారు.

CSKA మాస్కో[మార్చు]

రష్యా జట్టు CSKA మాస్కో తరపున స్పాన్సర్‌షిప్ కోసం మూడేళ్ల కాలపరిమికి €41.3 మిలియన్ల (US$58 మిలియన్లు) విలువైన ఒప్పందానికి మార్చి 2004లో సిబ్‌నెఫ్ట్ అంగీకరించింది. ఈ నిర్ణయం మేనేజ్‌మెంట్ స్థాయిలో తీసుకున్నదని ఆ కంపెనీ వివరించే ప్రయత్నం చేసినప్పటికీ, చెల్సియా కొనుగోలు సమయంలో ఎదుర్కొన్న మాతృదేశంపై అభిమానంలేని వ్యక్తి అనే ఆరోపణలను తిప్పికొట్టడానికే అబ్రమోవిచ్ ఈ ఒప్పందానికి సిద్ధమయ్యారని కొందరు భావించారు. మరోవైపు ఏవ్యక్తి కూడా UEFA పోటీల్లో పాల్గొనే జట్లలో ఒక దానికి మించి సొంతం చేసుకునే వీలు లేకుండా యూనియన్ ఆఫ్ యూరోపియన్ ఫుట్‌బాల్ అసోసియేషన్ (UEFA) నిబంధన విధించడంతో అబ్రమోవిచ్‌కు CSKAలో ఈక్విటీ ప్రయోజనం లేకుండా పోయింది. అలాగే ఒకానొక దర్యాప్తులో భాగంగా CSKAలో భాగస్వామి అయిన న్యాయవాది అలెగ్జాండర్ గారేస్‌కు భాగస్వామ్యం ద్వారా ప్రయోజనం ఉందనే విషయాన్ని UEFA నిర్థారించింది.[52] ఏదిఏమైనప్పటికీ, రష్యన్ ఫుట్‌బాల్‌లో అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తిగా రష్యన్ మ్యాగజైన్ ప్రో స్పోర్ట్ 2004 జూన్ చివరిలో ఆయనకు గుర్తింపునిచ్చింది. మే 2005లో, UEFA కప్ గెల్చుకోవడం ద్వారా, ఒక భారీ యూరోపియన్ ఫుట్‌బాల్ పోటీలో గెల్చిన మొట్టమొదటి రష్యన్ క్లబ్‌గా CSKA గుర్తింపు సాధించింది. అయినప్పటికీ, అక్టోబరు 2005లో, సిబ్‌నెఫ్ట్‌లోని తన వాటాను అబ్రమోవిచ్ అమ్మివేశారు. దీని తర్వాత ఈ సంస్థకు కొత్త యజమాని అయిన గాజ్‌ప్రోమ్, FC జెనిట్ సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు స్పాన్సర్ కావడం వల్ల పాత ఒప్పందాన్ని రద్దు చేశారు.

రష్యా జాతీయ జట్టు[మార్చు]

జర్మనీలో వరల్డ్ కప్ సందర్భంగా అబ్రమోవిచ్

రష్యా జాతీయ ఫుట్‌బాల్ జట్టుకు గుస్ హిడ్డింక్‌ కోచ్‌గా సేవలందించే విషయంలోనూ అబ్రమోవిచ్ ఎనలేని పాత్ర పోషించారు.[53] హిడ్డింక్‌కు చెందిన PSV ఐన్డ్‌హోవన్‌కు మాజీ హెడ్ స్కౌట్ అయిన పియట్ డి విస్సర్, హిడ్డింక్‌ను చెల్సియా యజమాని అయిన అబ్రమోవిచ్‌కు పరిచయం చేశారు.ప్రస్తుతం చెల్సియాకు సంబంధించి అబ్రమోవిచ్‌కు ఆయన వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నారు.[54] దీంతోపాటు 2008-09 సీజన్ చివరి నెలల్లో హిడ్డింక్‌ను తాత్కాలిక చెల్సియా మేనేజర్‌గా నియమించడంలో కూడా డి విస్సర్ ముఖ్య భూమిక పోషించారు.[55]

ఫుట్‌బాల్ జాతీయ అకాడమీ[మార్చు]

ప్రొఫెసనల్ ఫుట్‌బాల్‌లో చొరవకు తోడు ఫుట్‌బాల్ జాతీయ అకాడమీ పేరుతో రష్యాలో ఒక ఫౌండేషన్‌ను సైతం అబ్రమోవిచ్ స్పాన్సర్ చేశారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా యూత్ స్పోర్ట్స్ కార్యక్రమాలను స్పాన్సర్ చేయడంతో పాటు వివిధ నగరాలు మరియు పట్టణాల్లో యాభైకి పైగా ఫుట్‌బాల్ మైదానాలను నిర్మించింది. కోచ్‌లకు శిక్షణ కార్యక్రమాలు, సూచనల సరంజామా ముద్రణ, స్పోర్ట్స్ సౌకర్యాలను కల్పించడం మరియు ఇంగ్లాండ్, హోలాండ్ మరియు స్పెయిన్‌‌లోని ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్‌ల సందర్శన కోసం అగ్రశ్రేణి కోచ్‌లను మరియు విద్యార్థులను తీసుకువెళ్లడం లాంటి వాటికోసం కూడా ఇది నిధులను అందిస్తుంది. దీంతోపాటు 2006లో సమర ఒబ్లాస్ట్‌లో టోగ్లియటీ దగ్గర్లోని ప్రిమోర్‌స్కీ వద్ద ఉన్న ఒక ఫుట్‌బాల్ అకాడమీ నిర్వహణని కూడా ఈ ఫుట్‌బాల్ అకాడమీ చేపట్టింది. దాని నిర్వహకుడైన 38 ఏళ్ళ యురి కోనోప్లేవ్ మృతి చెందడంతో అందులోని ౧౦౦౦ మంది యువకుల బాగోగులను చూసే బాధ్యతను ఫుట్‌బాల్ అకాడమీ తీసుకుంది.[56]

క్రెమ్లిన్‌తో బాంధవ్యం[మార్చు]

బోరిస్ యెల్ట్‌సిన్[మార్చు]

బోరిస్ యెల్ట్‌సిన్ మరియు ఆయన కుటుంబంతో అబ్రమోవిచ్‌కు చక్కని బాంధవ్యం ఉండేది.[57] మొదట్లో ఆయన శక్తివంతమైన వ్యాపారవేత్త అయిన బోరిస్ బెరెజోవ్‌స్కీకి సహాయకుడిగా గుర్తింపు సాధించారు: "బెరెజోవ్‌స్కీకి ఉన్నతికి సంబంధించిన ప్రతి దశలోనూ వెన్నంటి నిలిచిన అబ్రమోవిచ్ ఆ విషయాన్ని గమనిస్తూ మరియు దాని గురించి నేర్చుకుంటూ గడిపారు."[58]

సిబ్‌నెఫ్ట్‌ను యుకోస్‌తో కలిపివేయాలనే ప్రతిపాదన వచ్చిన సమయంలో, రష్యా నుంచి దూరంగా వెళ్లిపోవడానికి అబ్రమోవిచ్ చేస్తున్న ప్రయత్నంగా కొందరు భావించారు, అదేసమయంలో ది క్రెమ్లిన్ కనిపించడంతో కనీసం కొంతమంది సభ్యుల గత వ్యాపార పద్ధతులనైనా తీసుకోవాలని ఆయన నిర్ణయించుకునేందుకు కారణమైంది. రష్యాలోని ఆస్తులను చౌక ధరకే తనకు అమ్మేయాల్సిందిగా అబ్రమోవిచ్ తనపై ఒత్తిడి తెచ్చిన కారణంగా ఆయనపై బ్రిటీష్ కోర్టుల్లో దావా వేయనున్నట్టు దేశం వదలివెళ్లిన బెరెజోవ్‌స్కీ జూలై 2005లో ప్రకటించినప్పటికీ, సిబ్‌నెఫ్ట్‌లో వాటాను అమ్మివేసిన తర్వాత కూడా వివాదాస్పద బోరిస్ బెరెజోవ్‌స్కీతో అబ్రమోవిచ్ సన్నిహితంగానే ఉండేవారు.[59]

చుకోట్కా స్థానిక పార్లమెంటుకు గవర్నర్‌గా మరో పదవీకాలం కొనసాగేందుకు ఆమోదం కోరుతూ అబ్రమోవిచ్ పేరు క్రెమ్లిన్‌కు వచ్చిందని, ఆయన నియామకాన్ని 2005 అక్టోబరు 21న ధ్రువీకరించడం జరిగిందని క్రెమ్లిన్ ప్రెస్ సర్వీస్ నివేదించింది.

వాద్లిమర్ పుతిన్[మార్చు]

రష్యా ప్రధాన మంత్రి అయిన వాద్లిమర్ పుతిన్‌ జీవిత గాథ రాసిన క్రిస్ హట్చిన్స్ ప్రకారం, మాజీ రష్యా అధ్యక్షుడికి మరియు అబ్రమోవిచ్‌కి మధ్య బాంధవ్యం ఒక తండ్రి, ముద్దుల కొడుకు అన్నట్టుగా ఉండేదని రాశారు; అయితే, అబ్రమోవిచ్ మాత్రం పుతిన్ గురించి మాట్లాడే సమయంలో రష్యా భాష పద్ధతి ప్రకారం "Вы" (ఫ్రెంచే "vous" లాంటి) అని పలకాల్సిన చోట "ты" (ఫ్రెంచ్‌లో "tu")ని ఉపయోగించడం ద్వారా పుతిన్‌తో తన బాంధవ్యం వృత్తి సంబంధమైనదని అన్నారు.[60]

వ్యక్తిగత జీవితం[మార్చు]

కుటుంబం[మార్చు]

రెండు సార్లు వివాహం చేసుకున్న అబ్రమోవిచ్, మొదట ఓల్గా యురేవ్నా లైసోవాను డిసెంబరు 1987లో [4][19] (విడాకులు 1990) పెళ్ళి చేసుకున్నారు, అటుపై ఇరినా వైయాచెస్లావోవ్నా మలందినాను అక్టోబరు 1991లో పెళ్ళి చేసుకున్నారు (విడాకులు 2007).[4][12][19] ఆయన మరియు ఇరినాకు ఐదుగురు సంతానం.

టెన్నిస్ ఆటగాడు మారత్ సఫిన్ మాజీ ప్రియురాలు మరియు రష్యన్ ఓలిగార్చ్ అలెగ్జాండర్ రాడ్‌కిన్ జుకోవ్ కుమార్తె అయిన 25 ఏళ్ల దారియా జుకోవాతో అబ్రమోవిచ్ సన్నిహితంగా ఉంటున్నారన్న వార్తల నేపథ్యంలో ఇరినా విడాకుల కోసం UKలో అగ్రశ్రేణి విడాకుల న్యాయవాదుల్లో ఇద్దరిని నియమించారని 2006 అక్టోబరు 15లో, న్యూస్ ఆఫ్ ది వరల్డ్ తెలిపింది. మొత్తంమీద ఆ వార్త నిజమై అబ్రమోవిచ్, ఇరినాలు భవిష్యత్‌లో తీసుకునే విడాకుల ఒప్పందం (కొందరి ఊహ ప్రకారం £5.5 బిలియన్ (€6.5 బిలియన్)) అంతకుముందు కనీవిని ఎరుగని ఒక పెద్ద మొత్తంతో ముగుస్తుందనే ఊహలకు తావిచ్చింది. ఈ విడాకుల సమయంలో అబ్రమోవిచ్ న్యాయసలహాదారులను సంప్రదించారు.[61][62] అయినప్పటికీ, మార్చి 2007లో US$300 మిలియన్ (€213 మిలియన్) ఒప్పందం మేరకు వారు రష్యాలో విడాకులు తీసుకున్నారు.[63] 2009 డిసెంబరు 4న, లాస్ ఎంజెల్స్‌లో డారియా తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆరోన్ ఆలెగ్జాండర్ అనే పేరు కలిగిన ఈ సంతానంతో రోమన్‌కు జన్మించిన పిల్లల సంఖ్య ఆరుకు చేరింది.

"వ్యక్తిగత సైన్యం"[మార్చు]

అబ్రమోవిచ్ ఇటీవల తన భద్రతా సిబ్బందిని 40-మందితో కూడిన "వ్యక్తిగత సైన్యం" స్థాయికి చేర్చడం ద్వారా, ప్రపంచంలో అత్యుత్తమ రక్షణ కలిగిన వ్యాపారవేత్తల్లో ఒకరిగా గుర్తింపు సాధించారు.[22]

సంపద[మార్చు]

ఫోర్బ్స్ వివరాల ప్రకారం, మార్చి 2010 నాటికి, అబ్రమోవిచ్ సంపద విలువ US$11.2 బిలియన్‌కు చేరడంతో ప్రపంచంలోని అత్యంత ధనవంతుల్లో 50వ వ్యక్తిగా నిలబెట్టింది.[64] ఆర్థిక సంక్షోభానికి ముందు, యునైటెడ్ కింగ్‌డమ్ పరిథిలో నివసిస్తున్న రెండవ అత్యంత ధనవంతుడిగా పరిగణింపబడ్డారు.[65] 2009 ప్రారంభంలో, ది టైమ్స్ కథనం ప్రకారం, ఆర్థిక సంక్షోభం కారణంగా ఆయన తన £11.7 బిలియన్ సంపదలో £3 బిలియన్ సంపదను కోల్పోయారు[66]

ఇతర అభిరుచులు మరియు కార్యకలాపాలు[మార్చు]

కళ[మార్చు]

సోవియట్‌కు చెందిన ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ మ్యాక్ పెన్సన్ (1893–1959) తీసిన ఉజ్బెకిస్థాన్ ఫోటోలతో లండన్‌లోని సోమర్‌సెట్ హౌస్‌లో గిల్బెర్ట్ కలెక్షన్ పేరుతో 2006 నవంబరు 29న ప్రారంభమైన ప్రదర్శనను రోమన్ అబ్రమోవిచ్ స్పాన్సర్ చేశారు. అంతకుముందు "క్వైట్ రెసిస్టెన్స్: రష్యన్ పిక్టోరియల్ ఫోటోగ్రఫీ 1900s-1930s" పేరుతో 2005లో అదే గ్యాలరీలో ఏర్పాటు చేసిన ప్రదర్శనకు కూడా ఆయనే నిధులు సమకూర్చారు.[67] ఈ రెండు ప్రదర్శనలనూ మాస్కో హౌస్ ఆఫ్ ఫోటోగ్రఫీ నిర్వహించింది.

మే 2008లో అంతర్జాతీయ ఆర్ట్ వేలం మార్కెట్‌లో అబ్రమోవిచ్ ఒక ప్రధాన కొనుగోలుదారుగా ఆవిర్భవించారు. ఫ్రాన్సిస్ బేకన్ గీసిన ట్రిప్టిక్ 1976ను €61.4 మిలియన్ (US$86.3 మిలియన్) (యుద్ధం తర్వాతి కార్యకలాపాలకు సంబంధించి గీసిన ఆర్ట్‌కు లభించిన రికార్డు ధర) మరియు లూసియన్ ఫ్రాయిడ్ గీసిన బెనిఫిట్స్ సూపర్‌వైజర్ స్లీపింగ్ను €23.9 మిలియన్ (US$33.6 మిలియన్) (జీవించి ఉన్న చిత్రకారుడి చిత్రానికి లభించిన రికార్డు ధర) ఆయన కొనుగోలు చేశారు.[68]

ఆయన భాగస్వామి అయిన దశ జుకోవా మాస్కోలో నిర్వహిస్తున్న గ్యాలరీలో ఆధునిక కళాఖండాలతో పాటు కొన్‌స్టాన్టిన్ మెల్నికోవ్ నిర్మించిన ఒక చారిత్రాత్మక బఖ్‌మెటెవ్‌స్కీ బస్ గ్యారేజ్ కూడా ఉంది. దశాబ్దాలుగా ఆ భవనం నిర్లక్ష్యానికి గురికావడంతో పాటు, అందులో కొంత భాగాన్ని అంతకుముందు నుంచి ఉన్న అద్దెదారులు తీసుకున్నారు.అటువంటి భవనాన్ని 2007–2008 మధ్య కాలంలో పునఃనిర్మించడంతో పాటు సెప్టెంబరు 2008న ప్రజల సందర్శనకు అనుమతించారు. ఈ పునఃనిర్మాణ కార్యక్రమం వేగంగా జరగడానికి అబ్రమోవిచ్ స్పాన్సర్‌షిప్ ఉపయోగపడింది.[69]

గృహాలు[మార్చు]

లండన్‌లోని లౌన్‌డెస్ స్క్వయర్‌లో ఉన్న నైట్స్‌బ్రిడ్జ్ రోడ్డులో €13.8 బిలియన్ (£11.7 బిలియన్/US$19.3 బిలియన్) విలువైన స్థలం కలిగి ఉండడం ద్వారా సండే టైమ్స్ రిచ్ లిస్ట్ 2008కు అబ్రమోవిచ్ అర్హత సాధించారు.

యునైటెడ్ స్టేట్స్ సర్జికల్ కార్పొరేషన్ స్థాపకుడైన అమెరికన్ వ్యాపారవేత్త లియోన్ హిర్స్‌కు చెందిన ఆస్పైన్, కొలరాడో ఎస్టేట్‌కు దగ్గర్లోని 200-acre (0.81 kమీ2) పాతకాలం నాటి వైల్డ్‌క్యాట్ రిడ్జ్‌ని €21.2 మిలియన్ (£18 మిలియన్/US$29.7 మిలియన్) మొత్తానికి అబ్రమోవిచ్ కొనుగోలు చేశారు.[70]

నౌకలు మరియు విమానాలు[మార్చు]

విలాసవంత నౌకలపై ఖర్చు పెట్టడడంలో అబ్రమోవిచ్‌కు ప్రపంచంలోనే మరెవరూ సాటిరారు, ఆయనకు ఉన్న ఐదు నౌకలను మీడియా "అబ్రమోవిచ్ న్యావీ" అని పిలుస్తుంటుంది:[71][72]

 • ' ఎక్లిప్స్' - ఆయనకు చెందిన ఈ అత్యాధునిక నౌకను హెర్మిడాస్ అటాబైకి రూపొందించారు, ' పెలోరస్‌ను పోలి ఉండే ఈ నౌక దానికంటే మరింత దూకుడు కలిగిన లైన్లను మరియు మూడు రంగుల పథకాన్ని కలిగి ఉంటుంది. దీంతోపాటు ' పెలోరస్‌ను పోలిన పథకంతో[73] ఉండే ఈ నౌకలోని లోపలి అలంకరణలను డెర్రెన్స్ డిస్‌డేల్ రూపొందించారు. బ్లోమ్ + వోస్ ద్వారా జర్మనీలో ఎక్లిప్స్ తయారైంది, సెప్టెంబరు 2009లో అది నీటిపైకి చేరింది.[74] అయితే, నౌకకు సంబంధించిన నిర్థేశాలు మారడంతో అబ్రమోవిచ్ 2009 డిసెంబరు 22న[75] నౌకను డెలివరీ తీసుకోలేదు. మరోవైపు డెలివరీకి సంబంధించిన సమస్యలతో 2010లో కొంతకాలం వరకు ఈ ప్రక్రియ ఆలస్యమైంది. 170 metres (560 ft) పొడవులో,[74] ఉండే ఈ నౌక కోసం అబ్రమోవిచ్ US$1.2 బిలియన్ ఖర్చు చేశారు, అదేసమయంలో 2009 నాటికి ఈ నౌక ప్రపంచంలోనే ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న అతిపెద్ద నౌకగా నమోదైంది. ఇందులో ఉన్న నిర్థేశాల ప్రకారం, కనీసం రెండు స్విమింగ్‌ పూల్‌లు, రెండు హెలిక్యాప్టర్ ల్యాండిగ్-ప్యాడ్స్, అనేక ఆన్-బోర్డ్ టెండర్స్ మరియు సబ్‌మెరైన్‌ కలిగి ఉంటాయి. దీంతోపాటు "యాంటీ-పేపరజ్జి" ఫోటో-షీల్డ్ వ్యవస్థ కలిగిన నౌకగా కూడా గుర్తింపు సాధించింది.[74]
 • ఎక్‌స్టసీ (85 మీటర్లు / 282 అడుగుల పొడవు) - ఇప్పటివరకు నిర్మించబడిన అతిపెద్ద ఫీడ్‌షిప్‌గా గుర్తింపు సాధించింది. ఈ నౌక గ్యాస్ టర్బైన్‌తో పాటు సంప్రదాయక డీజిల్ ఇంజన్ కలిగి ఉండడం వల్ల అత్యంత వేగంగా ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. అబ్రమోవిచ్ ఈ నౌకను 2009లో పేరు చెప్పని కొనుగోలుదారు రూపంలో కొనుగోలు చేశారు.[76]
బ్లోమ్ & వోస్ ద్వారా అబ్రమోవిచ్ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయబడిన తర్వాత 2004లో పెలోరస్ రూపం.
 • పెలోరస్ (115 మీటర్లు/377 అడుగుల పొడవు) - లుర్సెన్ ద్వారా నిర్మితమైన ఈ నౌక మరోకరి కోసం తయారైనప్పటికీ, దాని నిర్మాణం పూర్తయ్యే నాటికి దానికోసం ఆరుమంది పోటీపడ్డారు. అయితే, నౌక పూర్తి కావడానికి ముందుగానే అబ్రమోవిచ్ వేసిన బిడ్‌ను తయారీదారులు ఆమోదించారు. టెరెన్స్ డిస్డేల్ రూపొందించిన ఈ నౌకలోని ఇంటీరియర్ అత్యంత సమకాలీన రూపంలో ఉంటుంది, అలాగే వారి వెబ్‌సైట్‌లో ఈ చిత్రాలు లభించగలవు. 2005లో పెలోరెస్‌ను బ్లోమ్ + వోస్ ద్వారా మార్పులు చేయడం ద్వారా కొత్తగా పొడిగించబడిన హెలిప్యాడ్ (దీనివల్ల యజమాని హెలిక్యాప్టర్ గమనంలో లేనప్పటికీ అతిధులు నౌకపై దిగగలుగుతారు) మరియు జీరో స్పీడ్ స్టెబిలైజర్లు ఏర్పాటు చేశారు. 2007–2008లో ఈ నౌక మరోసారి బ్లోమ్ + వోస్ ద్వారా పాక్షికంగా మార్పులు చేయబడింది. 2008 వేసవిలో ఈ నౌక వెస్ట్రన్ మెడ్ (ఫ్రాన్సుకు దక్షిణం మరియు సర్దీనియా)లోను మరియు డిసెంబరులో కెనరీ ద్వీపాల్లో మజిలీతో అట్లాంటిక్‌ను దాటుతుంది. అబ్రమోవిచ్ తరచూ కొత్త సంవత్సర పండుగను St బార్ట్స్‌లో జరుపుకుంటుంటారు.
 • లీ గ్రాండ్ బ్లూ (112 మీటర్/370 అడుగుల పొడవైన సాహసయాత్ర నౌక)  – అధికారికంగా జాన్ మెకౌకు సొంతమైన ఈ నౌకను అబ్రమోవిచ్ 2002లో కొనుగోలు చేశారు. అటుపై దీనిలో 16 ft (4.9 m) స్విమ్ వేదిక మరియు స్పోర్ట్స్ డాక్ లాంటివి ఏర్పాటు చేయడంతో పాటు పూర్తిగా మార్పులు చేర్పులు చేశారు. జూన్ 2006లో ఈ నౌకను ఆయన తన సహచరుడు మరియు స్నేహితుడు అయిన యుజేన్ స్విద్లెర్‌కు బహుమతిగా ఇచ్చారు.[ఉల్లేఖన అవసరం]
 • సుస్సుర్రో (50 మీటర్లు/163 అడుగుల పొడవు) - ఫెడ్‌షిప్ ద్వారా 1998లో తయారైన ఈ నౌకలోని ఇంటీరియర్‌ను టెర్రెన్స్ డిస్‌డేల్ రూపొందించారు. పెలోరస్‌ను తనకు అమ్మిన వ్యక్తి నుంచే ఈ నౌకను కూడా అబ్రమోవిచ్ కొనుగోలు చేశారు. ఈ నౌక శాశ్వతంగా IYCA యాంటిబీస్‌లో ఉంటుంది. పొడవైన నౌకల్లో ఒకటిగా ఇది కూడా గుర్తింపు సాధించింది.[ఉల్లేఖన అవసరం]
ఇజ్రాయిల్‌లోని టెల్ అవివ్‌లో ఉన్న బెన్ గురియోన్ విమానాశ్రయంలో రోమన్ అబ్రమోవిచ్ యొక్క బోయింగ్ 767 ల్యాండ్ అవుతున్న దృశ్యం.

నౌకలతో పాటు ఆయన వద్ద ఒక ప్రైవేటు బోయింగ్ 767-33A/ER కూడా ఉంది, అరుబాలో P4-MES పేరుతో ఇది నమోదైంది. దీని కాక్‌పిట్ రంగు కారణంగా "ది బ్యాండిట్" పేరుతో ఇది సుపరిచితం. నిజానికి ఈ విమానాన్ని హవాయిన్ ఎయిర్‌లైన్ అర్డర్ చేసినప్పటికీ, అది రద్దు కావడంతో అబ్రమోవిచ్ దాన్ని కొనుగోలు చేసి తన అవసరాలకు తగ్గట్టు మార్పులు చేర్పులు చేయించారు. దీని లోపలి అలంకరణలు లేదా వాటి చిత్రాలు ఎక్కడా లభించడం లేదు. P4-మేస్ నిరంతరం హర్రోడ్స్ విమానయాన సౌకర్యం కలిగిన UKలోని స్టాన్‌స్టెడ్ విమానాశ్రయంలో నిలిచి ఉంటుంది.[ఉల్లేఖన అవసరం]

అబ్రమోవిచ్ వద్ద మూడు యూరోకాప్టర్ హెలిక్యాప్టర్లు కూడా ఉన్నాయి. ఇవి కూడా అరుబాలోనే నమోదై ఉన్నాయి. EC-145ను P4-LGB అనే రిజిస్ట్రేషన్‌తో, EC-135T1ను P4-XTC అనే రిజిస్ట్రేషన్‌తో మరియు EC-155Bను P4-HEC అనే రిజిస్ట్రేషన్ పేరుతో ఉపయోగిస్తున్నారు. ఈ హెలిక్యాప్టర్లు ఆయన సొంత నౌకలపై, బ్లాక్‌బుష్ విమానాశ్రయం లేదా UKలోని వెస్ట్ ససెక్స్‌లోని రోగేట్ వద్ద ఉన్న ఆయన సొంత ఎస్టేట్ ఫైనింగ్ హిల్‌లో నిలిచి ఉంటాయి.[ఉల్లేఖన అవసరం]

2004లో అబ్రమోవిచ్ రెండు మేబ్యాక్ 62 లిమౌసిన్స్‌ను కొనుగోలు చేశారు. ఇవి బాంబ్ & బుల్లెట్-ప్రూఫ్‌ రక్షణతో తయారయ్యాయి. వీటి విలువ £1 మిలియన్ (€1.18 మిలియన్/US$1.65 మిలియన్) ఉంటుందని అంచనా.[77] వీటితోపాటు అబ్రమోవిచ్ వద్ద US$2.2 మిలియన్ (€1.57 మిలియన్) విలువైన "రేస్‌ట్రాక్‌పై మాత్రం" ఉపయోగించే ఒక ఫెరారీ FXX కారు కూడా ఉంది. ఇలాంటి ప్రపంచంలో 30 మాత్రమే తయారయ్యాయి. అలాగే బగట్టి వెయ్‌రోన్ (నలుపుపై నీలం), మసెరటి MC12 కోర్సా, ఫెరారీ 360, పోర్సే కర్రేరా GT, పోర్సే 911 GT1 మరియు మెర్సిడెస్-బెంజ్ CLK GTR లాంటి కార్లు కూడా అబ్రమోవిచ్ వద్ద ఉన్నాయి.[ఉల్లేఖన అవసరం]

సూచికలు[మార్చు]

 1. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితా Forbes.com. ఏప్రిల్ 2010న పొందబడినది
 2. http://english.pravda.ru/society/stories/07-11-2007/100351-abramovich-0
 3. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2009-03-01 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-11-17. Cite web requires |website= (help)
 4. 4.0 4.1 4.2 4.3 అబ్రమోవిచ్ ఫస్ట్ వైఫ్ వార్న్స్ హీజ్ న్యూ స్క్వీజ్ - 'హి' విల్ డంప్ యు టూ ', డైలీ మెయిల్ , మార్చ్ 23, 2007. ఏప్రిల్ 22 2010న పొందినది
 5. హార్వి, ఒలివర్. అల్ ఐ గాట్ వాజ్ ఏ క్రూమీ ఫ్లాట్, ది సన్ , మార్చ్ 16, 2007. ఏప్రిల్ 22 2007న పొందినది
 6. The Times. London http://www.timesonline.co.uk/richlist/person/0,,33600,00.html. Retrieved 2010-05-22. Missing or empty |title= (help)
 7. http://www.pbs.org/frontlineworld/stories/moscow/abramovich.html
 8. 8.0 8.1 "Chelsea owner Roman Abramovich sued for billions in bitter 'fraud and blackmail' battle with former business partner". Daily Mail. London. 2008-04-18.
 9. http://www.independent.ie/opinion/analysis/the-great-roman-empire-233609.html
 10. వేయర్, మార్టిన్ వాండర్. ది విన్నర్ of రష్యాస్ ఫ్రీ-ఫర్-అల్, ది టెలిగ్రాఫ్ , అక్టోబర్ 31, 2004. ఏప్రిల్ 23 2010న పొందబడినది.
 11. http://www.thesun.co.uk/sol/homepage/features/life/article169300.ece
 12. 12.0 12.1 12.2 12.3 12.4 Vandysheva, Olga (2008-07-03). "Roman Abramovich is no longer Chukotka's governor". Komsomolskaya Pravda (St Petersburg edition). KP.ru. Retrieved 2008-07-04.
 13. డొమినిక్ మిడ్ గ్లే మరియు క్రిస్ హట్చిన్స్ అబ్రమోవిచ్. ది బిలియనీర్ ఫ్రం నోవేర్ , హార్పర్ కొల్లిన్స్ విల్లో, 2005 ISBN 978-0007189847
 14. http://www.independent.ie/world-news/europe/chelsea-owner-admits-he-paid-out-billions-in-bribes-1428008.html
 15. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2009-05-17 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-11-17. Cite web requires |website= (help)
 16. లెవి, అడ్రియన్; స్కాట్-క్లార్క్, కాథి. 'హి వాన్, రష్యా లాస్ట్ ', మే 8, 2004. ఏప్రిల్ 23 2010న పొందబడినది.
 17. 17.0 17.1 స్ట్రాస్, జూలియస్. షై ఆర్ఫన్ హు రోస్ టు జాయిన్ రాష్యాస్ సూపర్-రిచ్, ది డైలీ టెలిగ్రాఫ్ , నవంబర్ 6, 2003. ఏప్రిల్ 23 2010న పొందబడినది.
 18. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2010-12-20 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-11-17. Cite web requires |website= (help)
 19. 19.0 19.1 19.2 http://komsomol.wordpress.com/tag/medvedev/
 20. http://www.kp.ru/daily/24124.4/345791/
 21. 21.0 21.1 http://www.pwhce.org/rus/abramovich.html
 22. 22.0 22.1 Leake, Christopher (2007-10-06). "Battle of the oligarchs... the amazing showdown between Roman Abramovich and his arch rival". London: Daily Mail. Cite news requires |newspaper= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 23. 23.0 23.1 23.2 23.3 23.4 23.5 కేన్నిడీ, డొమినిక్. రోమన్ అబ్రమోవిచ్ అడ్మిట్స్ పేయింగ్ అవుట్ బిలియన్స్ ఆన్ పొలిటికల్ ఫేవర్స్ , ది టైమ్స్ , జూలై 5, 2008. ఏప్రిల్ 23 2010న పొందబడినది.
 24. http://www.fundinguniverse.com/company-histories/OAO-Siberian-Oil-Company-Sibneft-Company-History.html
 25. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2005-10-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2005-10-06. Cite web requires |website= (help)
 26. https://archive.is/20120729234416/www.cdi.org/russia/johnson/9258-5.cfm
 27. Smale, Will (2005-09-29). "What Abramovich may do with his money". BBC News. Retrieved 2010-05-22.
 28. "రష్యాటుడే: ఫీచర్స్: బర్త్ రేట్ బూస్ట్ ఇన్ అబ్రమోవిచ్ రీజియన్". మూలం నుండి 2008-03-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-11-17. Cite web requires |website= (help)
 29. అబ్రమోవిచ్ క్విట్స్ యాస్ గవర్నర్ Archived 2008-07-18 at the Wayback Machine. రష్యాటుడే జూలై 3 2008న పొందబడినది
 30. రాష్యాస్ పుతిన్ అవార్డ్స్ ఆర్డర్ అఫ్ హొనర్ టు అబ్రమోవిచ్ Archived 2007-10-11 at the Wayback Machine. 20 జనవరి 2006 MosNews.com. అక్టోబరు 19, 2006న సేకరించబడింది.
 31. Shaun Walker (4 July 2008). "Abramovich quits job in Siberia to spend more time on Western front". The Independent. London: Independent News and Media Limited. Retrieved 2008-07-04.
 32. http://www.forbes.com/lists/2008/10/billionaires08_Roman-Abramovich_DG3G.html
 33. http://www.forbes.com/lists/2007/10/07billionaires_Boris-Berezovsky_V7GU.html
 34. 34.0 34.1 మెడెట్‌స్కే, అనటోలి. రష్యన్ ఎనర్జీ కంపెనీ సీకింగ్ డామేజేస్ ఫ్రం అబ్రమోవిచ్ /0}, మాస్కో టైమ్స్, 19 నవంబర్ 2007. సెప్టెంబరు 23 2008న పొందబడింది.
 35. http://www.russia-ic.com/business_law/in_depth/534/
 36. రెడ్ రోం ప్రిసన్ ఒర్డాల్ | ది సన్
 37. కెన్నెడీ, డొమినిక్. చెల్సియ బాస్ లింక్డ్ టు $4.8bn లోన్ స్కాండల్, ది టైమ్స్ , ఆగష్టు 16, 2004. ఏప్రిల్ 23, 2010న పొందబడినది.
 38. Sweeney, John; Behar, Richard (2005-01-16). "Bank to sue Abramovich over '£9m debt'". BBC News. Retrieved 2010-05-22.
 39. Hope, Christopher (2005-01-19). "European bank sues Abramovich over £9.4m 'debt'". The Daily Telegraph. London. Retrieved 2010-05-22.
 40. కెన్నెడీ, డొమినిక్. టు సర్వైవ్ ది అల్యూమినియం వార్స్, మెటల్ వాస్ నీడేడ్, ది టైమ్స్ , జూలై 5, 2008. ఏప్రిల్ 23 2010న పొందబడినది.
 41. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2008-12-06 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-12-06. Cite web requires |website= (help)
 42. "Chelsea to build new training complex". Worldsoccer.com. 2004-09-27. Retrieved 2007-07-03. Cite news requires |newspaper= (help)
 43. Scott, Matt (2006-11-28). "Rummenigge hits out over Chelsea's massive spending". London: The Guardian. Retrieved 2006-11-28. Cite news requires |newspaper= (help)
 44. "Roman Abramovich Calm About Chelsea's Record Losses". MosNews. 2006-01-30. మూలం నుండి 2006-11-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-01-19. Cite news requires |newspaper= (help)
 45. "Abramovich speaks out over 'nonsense' budget cut claims". London: Daily Mail. 2007-05-30. Retrieved 2007-05-30. Cite news requires |newspaper= (help)
 46. "We will cut spending — Abramovich". BBC. 2006-12-24. Retrieved 2007-01-19. Cite news requires |newspaper= (help)
 47. Lowe, Sid (13 April 2007). "Instability at Chelsea could force me to leave, says Mourinho". London: The Guardian. Retrieved 2007-04-13. Cite news requires |newspaper= (help)
 48. "Mourinho makes shock Chelsea Exit". BBC Sport. 2007-09-20. Retrieved 2007-09-20. Cite news requires |newspaper= (help)
 49. "Chelsea name Grant as new manager". BBC Sport. 2007-09-20. Retrieved 2007-09-20. Cite news requires |newspaper= (help)
 50. "Mourinho issues warning to Grant". BBC Sport. 2007-07-12. Retrieved 2007-09-20. Cite news requires |newspaper= (help)
 51. "Grant sacked as Chelsea manager". BBC Sport. 2008-05-24. Retrieved 2008-05-24. Cite news requires |newspaper= (help)
 52. అబ్రమోవిచ్స్ సాకర్ ఇంట్రెస్త్స్ క్లియర్డ్ బై Uefa Archived 2006-11-11 at Archive.is 2 సెప్టెంబర్ 2004, mosnews.com. అక్టోబరు 19, 2006న సేకరించబడింది.
 53. "ఆస్ట్రేలియా మరియు PSV కోచ్ గుస్ హిడ్డింక్ ను రష్యా ఫుట్బాల్ యునియన్ కు చెల్సియ యజమాని రోమన్ అబ్రమోవిచ్ చే సిఫార్సు చేయబడినారు ఇంకా తనకు జీతం ఆయనే చెల్లించారు". మూలం నుండి 2006-09-10 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-11-17. Cite web requires |website= (help)
 54. దత్చ్ స్కౌట్, అబ్రమోవిచ్స్ యొక్క రహస్య లింకు
 55. Bill Mills (2009-06-07). "Guus Hiddink believes he will make Premier League return". The Times. Retrieved 2009-06-13. Cite news requires |newspaper= (help)
 56. Wilson, Jonathan (2 January 2008). "Russia reaps rewards of visionary school". The Guardian. London: Guardian News and Media Limited. Retrieved 2008-01-19.
 57. "Russia: Abramovich Shows Himself the Door". Stratfor. 2003-08-25. Retrieved 2007-05-20. Cite news requires |newspaper= (help)[permanent dead link]
 58. [46] ^ ఇబిడెం.
 59. పెంకేత్, అన్నే. బ్యాటిల్ అఫ్ ది బిల్యనీర్స్: బేరిజోవిస్కి టు సూ అబ్రమోవిచ్ ఇన్ బ్రిటిష్ కోర్ట్స్ Archived 2008-12-05 at the Wayback Machine., ది ఇండిపెన్డెంట్ , జూలై 5, 2005. ఏప్రిల్ 23 2010న పొందబడినది
 60. http://football.guardian.co.uk/comment/story/0,,1978514,00.html The Observer
 61. కెన్నెడీ, డొమినిక్; స్టీవార్ట్, విల్. అబ్రమోవిచ్ ఈస్ 'దీప్లి హార్ట్' బై క్లైమ్స్ హిస్ వైఫ్ వాంట్స్ ఏ డివోర్స్, ది టైమ్స్ , అక్టోబర్ 17, 2006. ఏప్రిల్ 23 2010న పొందబడినది
 62. మిఖైలోవ, అన్నా. మీటింగ్ దష జుకోవా, రోమన్ అబ్రమోవిచ్స్ గర్ల్, ది టైమ్స్ , జూలై 13, 2008. ఏప్రిల్ 23 2010న పొందబడినది
 63. Harding, Luke (2007-03-16). "Goodnight Irina: Abramovich settles for mere £155m". Vedomosti reported in The Guardian. London: Guardian News and Media Ltd. Retrieved 2007-03-16.
 64. "Roman Abramovich topic page". Forbes. మూలం నుండి 2010-10-27 న ఆర్కైవు చేసారు. Retrieved March 2010. Check date values in: |accessdate= (help)
 65. [1] సండే టైమ్స్ రిచ్ లిస్ట్ 2008
 66. "Abramovich wants to sell Chelsea" (ఆంగ్లం లో). London: Sunday Times. Retrieved 18 January 2009. Unknown parameter |description= ignored (help); Unknown parameter |datepublished= ignored (help); Cite news requires |newspaper= (help)[dead link]
 67. [210] ^ ది ఆర్ట్ వార్తాపత్రిక.
 68. ది ఆర్ట్ న్యూస్పేపర్ : "రోమన్ అబ్రమోవిచ్ బ్రింగ్స్ హోం ది $86.3m బకన్ అండ్ ది $33.6m ఫ్రీడ్" Archived 2009-06-20 at the Wayback Machine..
 69. Osipovich, Alexander (2008-09-16). "Abramovich's girlfriend opens major Moscow art gallery". Yahoo news / AFP. Retrieved 2008-09-21. Cite web requires |website= (help)[dead link]
 70. .Churcher, Sharon (2008-05-11). "Chelsea boss Abramovich snaps up £18million ranch in Rocky Mountains". London: Mail on Sunday. Retrieved 2008-05-11. Cite news requires |newspaper= (help)
 71. "ఇన్ ది రోమన్ నేవీ" ది మెయిల్ ఆన్ సండే 23 అక్టోబర్ 2005
 72. "అడ్మిరల్ చెల్‌స్కీ విన్స్ సి సుప్రిమసీ" ది సండే టైమ్స్ 17 జనవరి 2007
 73. Frank, Robert (2007-01-12). "The Russians Are Coming -- at 40 Knots". The Wall Street Journal.
 74. 74.0 74.1 74.2 Sorrel, Charlie (2009-09-21). "Russian Billionaire Installs Anti-Photo Shield on Giant Yacht". Wired.com. Retrieved 2009-09-21. Cite web requires |website= (help); Italic or bold markup not allowed in: |publisher= (help)
 75. పన్‌సేవ్‌స్కీ, బోజన్. రోమన్ అబ్రమోవిచ్ జాప్స్ స్నాప్పర్స్ విత్ లేసర్ షీల్డ్, ది టైమ్స్ , సెప్టెంబర్ 20, 2009. ఏప్రిల్ 23 2010న పొందబడినది
 76. ఎస్టాసి వీడియో మరియు పిక్చర్స్
 77. "Roman's pounds 1m runabouts". Sunday Mirror. 2004-05-30.

గ్రంథ పట్టిక[మార్చు]

 • డొమినిక్ మిడ్ గ్లే & క్రిస్ హత్చిన్స్, అబ్రమోవిచ్: ది బిల్లినియర్ ఫ్రొం నోవేర్ , హార్పర్ కొల్లిన్స్ విల్లో (2005 మే 3), ISBN 0007189842
 • డేవిడ్ హాఫ్మాన్, ది ఒలిగార్చ్స్: వెల్త్ అండ్ పవర్ ఇన్ ది న్యూ రష్యా , పబ్లిక్ అఫ్ఫైర్స్ (2003 డిసెంబరు 4), ISBN 1586482025
 • మార్క్ బెంనేట్ట్స్, ఫుట్బాల్ డైనమో - మోడరన్ రష్యా అండ్ ది పీపుల్స్ గేం ,' విర్జిన్ బుక్స్, (15 మే 2008), ISBN 0753513196

బాహ్య లింకులు[మార్చు]

మూస:S-gov
అంతకు ముందువారు
Alexander Nazarov
Governor of Chukotka
2000 – 3 July 2008
తరువాత వారు
Roman Kopin