Jump to content

రోమియో (2014 సినిమా)

వికీపీడియా నుండి
రోమియో
దర్శకత్వంగోపి గణేష్
రచనపూరీ జగన్నాథ్
నిర్మాతదొరైస్వామి
తారాగణంసాయిరాం శంకర్, అడోనిక
ఛాయాగ్రహణంపి.జి. వింద
కూర్పునవీన్ నూలి
సంగీతంసునీల్ కష్యప్
పంపిణీదార్లుషణ్ముఖ ఫిల్మ్స్
విడుదల తేదీ
2014 అక్టోబరు 10 (2014-10-10)
సినిమా నిడివి
119 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

రోమియో 2014, అక్టోబరు 10న విడుదలైన తెలుగు చలనచిత్రం. గోపి గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిరాం శంకర్, అడోనిక జంటగా నటించగా, సునీల్ కష్యప్ సంగీతం అందించాడు. దర్శకుడిగా గోపి గణేష్ కు ఇది తొలిచిత్రంకాగా, అడోనిక తెలుగులో తొలిసారిగా ఈ చిత్రంలో నటించింది. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ కథ, మాటలు అందించాడు.[1]

న్యూయార్క్ లో ఉండే సమంత (అడోనిక)కు ఒంటరిగా ప్రయాణం చేయడమంటే ఇష్టం ఉండడంతో ఇంట్లోవాళ్లను ఒప్పించి యూరప్ పర్యటనకు వెళ్తుంది. యూరప్ పర్యటనలో భాగంగా ఇటలీలోని రోమ్ నగరానికి చేరుకున్నప్పుడు రోమ్ నగరంలో సమంతను కిట్టు (సాయిరాం శంకర్) చూసి వెంటాడుతుంటాడు. ప్లాన్ ప్రకారం సమంతకు దగ్గరై పాస్‌పోర్ట్ ను తన దగ్గరే పెట్టుకుని ఏడిపిస్తుంటాడు. కావాలనే తన పాస్‌పోర్ట్ తీసుకొని ఏడిపిస్తున్నాడని తెలుసుకున్న సమంత, కిట్టూని నిలదీస్తుంది. దాంతో కిట్టు తన ఫ్లాష్‌బ్యాక్‌ను చెపుతాడు. అయితే కిట్టు ఫ్లాష్ బ్యాక్ కు, సమంతకు లింకేమిటి? ఈ చిత్రంలో అతిధి పాత్రలు పోషించిన రవితేజ, ఆలీ, జయసుధ, నాగబాబులకు పాత్రల ఎంటీ? కిట్టు, సమంతల కథ చివరకు ఏమైందనేదే 'రోమియో' సినిమా.[1]

నటవర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

ఈ చిత్రం లోని పాటలను విశ్వా , భాస్కర భట్ల రవికుమార్ , పైడిశెట్టి రామ్, సునీల్ కశ్యప్ రచన చేసినారు.

ఆజా ఆజా , గానం. శ్రావణ భార్గవి

ఈ అమ్మాయిలు , రచన: అనంత శ్రీరామ్ , గానం. సునీల్ కశ్యప్

ప్రాణమా, గానం.సునీల్ కశ్యప్

నీలో నీలో, గానం . అల్ఫాన్స్

నాలో చెరగని , గానం.కార్తీక్, రంజిత్

రోమియో రాక్ , గానం . సునీల్ కశ్యప్.

సాంకేతికవర్గం

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1 2 సాక్షి, సినిమా (10 October 2014). "సినిమా రివ్యూ: రోమియో". రాజబాబు అనుముల. the original నుండి 22 May 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 May 2019.
  2. సాక్షి, సినిమా (9 October 2014). "రవితేజ నటించడంతో రోమియో స్థాయి పెరిగింది". the original నుండి 22 May 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 22 May 2019.
  3. ఈనాడు, ఆదివారం సంచిక (15 July 2018). "ఈడెవడో భలే కట్ చేశాడ్రా". మహమ్మద్ అన్వర్. the original నుండి 13 మార్చి 2020 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 March 2020.

ఇతర లంకెలు

[మార్చు]