రోలు
స్వరూపం

రోకలి ఉపయోగించి నూరటం, రుబ్బటం, దంచటం మొదలైన పనులు, పొత్రం లేక రుబ్బురాయిని ఉపయోగించి రుబ్బటం ద్వారా అవసరమయిన వస్తువులపై ముఖ్యంగా ఆహార పదార్ధాములపై ఒత్తిడి కలిగించి కావలసిన రీతిలోకి మార్పు చేసుకోవడానికి ఉపయోగించే ఉపకరణాన్ని రోలు అంటారు. రోలు చాలా బరువుగా నిశ్చలంగా ఉంటుంది. భూమిపై నిశ్చలంగా ఉన్న ఈ రోటిలో అవసరమయిన వస్తువులు వేసి వాటిపై రోకలితో పైకి కిందకి ఆడించడం లేక దంచడం ద్వారా లేదా రోకలిని అటు ఇటు కదుపుతూ నూరటం ద్వారా ఒత్తిడిని కలిగించి వస్తు రూపాన్ని కావలసిన విధంగా మలచుకుంటారు. అలాగే రుబ్బురాయిని గుడ్రంగా తిప్పుతూ లేక అటు ఇటు కదుపుతూ రుబ్బటం ద్వారా వస్తు రూపాన్ని కావలసిన విధంగా మలచుకుంటారు.
లోహపు రోలు

రాతి రోలు
రాతి రోలు తయారీ కోసం ముఖ్యంగా నల్లరాయిని ఉపయోగిస్తారు.
చెక్క రోలు
చెక్క రోలు తయారీ కోసం ముఖ్యంగా చింత మొద్దును ఉపయోగిస్తారు.