రోలు మరియు రోకలి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
రోలు మరియు రోకలి

రుబ్బురోలు మరియు రోకలి[1]
ఇతర పేర్లు రుబ్బురోలు,రోకలి
ఉపయోగాలు పప్పు రుబ్బుకొనుటకు,పిండి దంచుటకు
ఆవిష్కర్త ఆదిమ మానవుడు
సంబంధిత అంశాలు రోలు మరియు రోకలి
రోలు మరియు పొత్రము

రుబ్బురోలు మరియు రుబ్బు పొత్రము[2]
ఇతర పేర్లు రుబ్బురోలు,రుబ్బుగుండు లేదా రుబ్బుగుండ్రాయి లేదా రుబ్బు పొత్రము
ఉపయోగాలు పప్పు రుబ్బుకొనుటకు,పిండి దంచుటకు
ఆవిష్కర్త ఆదిమ మానవుడు
సంబంధిత అంశాలు రోలు మరియు రోకలి

మన యింటిలో చూర్ణములను తయారుచేయుసాధనములలో రోలు,రోకలి,రుబ్బు గుండు లేదా పొత్రము మొదలగునవి ముఖ్యమైనవి.

రోలు మరియు రోకలి[మార్చు]

రోలు ఒక రాతితో చెయబది ఉంటుంది. ఒక గట్టి రాయి ముక్కకు ఒక రంధ్రం చేయబడి ఉన్న సాధనం రోలు. రోకలి కర్ర తో స్థూపాకారంగా చేయబడి దాని చివర లోహపు రింగు కలిగి ఉండే సాధనం. ఇది సుమారు 3 నుండి 4 అడుగుల పొడవు ఉంటుంది. రోటిలో మనం దంచవలసిన పదార్థాన్ని ఉంచి నిలువుగా అనగా రోలుకు 90 డిగ్రీల కోణంతో అనేకసార్లు దంచవలెను.
రోలు మరియు రోకలి ప్రతి యింటిలోనూ ఉంటుంది. దీనితో మిరపకాయలు,పసుపుకొమ్ములు,నువ్వులు,ధాన్యాలు మొదలగు వాటిని దంచే సాధనం. రోకలితో మిరపకాయలు, పసుపు కొమ్ములు వంటి వాటిని దంచినపుడు చూర్ణంగా మారి కారంపొడి మరియు పసుపు వంటివి తయారవుతాయి. ఈ చూర్ణములు మన వంటలలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ధాన్యం దంచినపుడు దానిపై ఉన్న పొర వేరుచేయబడుతుంది. అపుదు దంపుడు బియ్యం తయారవుతాయి. ఈ బియ్యం మన శరీరానికి ఆరోగ్యకరం. అదే బియ్యమును యంత్రంద్వారా తయారుచేసినట్లయిన బియ్యం గింజపై గల పోషక పదార్థం కల పొర తొలగింపబదుతుంది. అందువలన రోకలితో దంచిన బియ్యం ఆరోగ్యానికి మంచిది. నువ్వుల నుండి పొరను వేరు చేయాలన్నా రోలులో నువ్వులను వేసి రోకలితో దంచవలెను. అదే విధంగా మన బజారులో లభించే మినపగుళ్ళను కూడా ఈ పద్ధతిలో తయారుచెయవచ్చును. పప్పుల పైన గల పొరను తొలగించు విధానంలో రోలు మరియు రోకలి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. బియ్యం పిండిని తయారు చేసె విధానం లో రోటిలో బియ్యమును వేసి రోకలితో దంచవలెను. తర్వాత దానిని జల్లెడతో చూర్ణమును వేరుచేయవలెను ఈ బియ్యం పిందిని అరిశెలు తయారీ కి వాడతారు.

రోలు మరియు పొత్రము[మార్చు]

రోలు మరియు పొత్రము మన వంట గదిలో ముఖ్యమైన సాధనములు. పొడిగా గల చూర్ణములు రోలు మరియు రోకలి తో ఏ విధంగా తయారు చేస్తారో అదే విధంగా రుబ్బురోలు లో రుబ్బుగుండు(పొత్రము) ఉపయోగించి తడి చూర్ణము(రుబ్బు) లను తయారుచేస్తారు. పప్పులను రోటిలో వేసి రుబ్బు గుండును అందులో ఉంచి సవ్య లేదా అపసవ్య దిశలో అనేక సార్లు వృత్తాకారం గా త్రిప్పాలి. త్రిప్పినపుడు బయటకు వచ్చిన పప్పు దినుసులను మరల లోనికి పంపి నిరంతరం త్రిప్పినపుడు పప్పురుబ్బు తయారవుతుంది. ఈ రుబ్బుతో గారెలు,వడలు,అట్లు,ఇడ్లీలు మొదలగునవి తయారుచేస్తారు. ఈ కాలంలో పప్పును రుబ్బుటకు అనేక యంత్రములు వచ్చినప్పటికీ రుబ్బురోలు లో రుబ్బిన రుబ్బు తో చెసిన వడలు రుచి కలిగి ఉంటాయనడంలో అతిశయోక్తి లేదు.

కల్వము[మార్చు]

ఆయుర్వేద మందులు తయారుచేయువారు, రసాయన శాస్త్రంలో కొన్ని ప్రయోగారు చెయునపుడు కొన్ని పదార్థాలను చూర్ణం చేయవలసి ఉంటుంది. అలాంటపుదు కల్వం ఉపయోగిస్తారు. ఇది పింగాణీ లేదా రాతితో చేయబడి ఉండుంది. అందులో చూర్ణం చేయవలసిన పదార్థాలను ఉంచి దానిని పింగాణీ గుండు లేదా రాతి గుండు తో చూర్ణం చేయవచ్చు.

ఉపయోగాలు[మార్చు]

  • రోలు మరియు రోకలితో మిరపకాయలు,పసుపుకొమ్ములు వంటివాటిని దంచి చూర్ణం చేయవచ్చు.
  • రోలు మరియు రోకలితో వివిధ రకాల ధాన్యాల యొక్క పై పొరను తొలగించవచ్చు.
  • రోలు మరియు రోకలితో అటుకులు తయారుచెయవచ్చు.
  • రోలు మరియు పొత్రముతో వివిధ రకాల పప్పుల యొక్క రుబ్బులను తయారుచేయవచ్చు.
  • రోలు మరియు పొత్రముతో మసాలా ముద్ధను తయారుచేయవచ్చును.
  • కల్వముతో వివిధ మిశ్రమాలను తయారుచేయవచ్చును.

ఆరోగ్యం[మార్చు]

నేటి సమాజం యంత్రాలపై ఎక్కువగా ఆధారపడుతున్నది. పూర్వ కాలంలో యంత్రాలు లేని కాలంలో స్త్రీలకు యింటిలో చేసే అనేక పనులే వ్యాయామ సాధనాలు. పూర్వ కాలంలో పురుషులు వివిధ పనులకు పోయినపుడు వారు చేసే శ్రమ వల్ల వ్యాయామం జరిగి ఆరోగ్యంగా ఉండేవారు. యిండ్లలో గల స్త్రీల ఆరోగ్యం యింటిలో గల వివిధ పనులు చెయడం వల్ల వచ్చేది. మిరపకాయలను దంచడం, పసుపును తయారుచేయడం, వివిధ రకాల పిండిలను తయారుచేయడం, పప్పు రుబ్బడం, వివిధ ధాన్యాలపై గల పొట్టును తీసివేయడం, కవ్వంతో మజ్జిగను చిలకడం, పశు పోషణ వంటి అనేక కార్యములు చేయడం వలన నేటి స్త్రీల కంటే అనేక రెట్లు ఆరోగ్యంగా ఉండేవారు. వారు చేసిన వివిధ పదార్థాల వలన వారి సంతానం కూడా ఆరోగ్యంగా ఉండేది. నేటి సమాజంలో పై పనులన్నింటికి యంత్రాలను ఉపయోగించటం వలన అనేక శారీరక అనారోగ్యాలను కొని తెచ్చుకుంటున్నారని చెప్పవచ్చును. ఆ కాలంలో వారు తయారుచేసే పసుపును ఉపయోగించి చర్య సౌందర్యం పొందటమె కాక చర్మ వ్యాధులనుంది నివారన పొందేవారు. ఈ కాలంలో అనేక రకాల క్రీములు వాడినప్పటికీ చర్మ రోగాల పాలు అవుతున్నారు. పసుపులో చినాలరంగు(పొటాషియం పర్మాంగనేటు) ను కలిపి దంచి కుంకుమను తయారు చేసి వాడే వారు. ఈ కుంకుమను ఉపయోగించటం వలన మన శరీరం లో గల ఉష్ణం వలన పొటాషియం పర్మాంగనేట్ చర్య జరిగి ఆక్సిజన్ తయారయి కుండలినీ శక్తి పెరిగి ప్రశాంతతతో జీవించారు. ఈ కాలంలో కుంకుమ ఉపయోగించేవారు కనుమరుగవుతున్నారు. పసిపిల్లలకు పసుపు కొమ్ములను నూరి పసుపును తయారుచేసి శరీరానికి రాసి చర్మానికి రక్షన కల్పించేవారు. ఇంకా అనేక పనులు చెసి ఆరోగ్యాన్ని పెంపొందించు

సంబంధిత చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

రోలు

రోకలి

తిరగలి

బయటి లింకులు[మార్చు]

సూచికలు[మార్చు]