రోష్ని నాడార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రోష్ని నాడార్‌ మల్హోత్రా
జననం1980/1981 (age 42–43)[1]
విద్యనార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ
కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్
వృత్తిచైర్‌పర్సన్, హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్
క్రియాశీల సంవత్సరాలు2008 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిశిఖర్ మల్హోత్రా
పిల్లలు2
తల్లిదండ్రులుశివ్ నాడార్
కిరణ్ నాడార్
భారత మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్తో శివ్ నాడార్, రోష్ని నాడార్

రోష్ని నాడార్‌ మల్హోత్రా ఒక భారతీయ బిలియనీర్ వ్యాపారవేత్త. ఆమె హెచ్.సి.ఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్. ఆమె దేశంలో లిస్టెడ్ ఐటీ కంపెనీకి నాయకత్వం వహించిన మొదటి మహిళగా గుర్తింపు పొందింది.[2][3] ఆమె హెచ్.సి.ఎల్ సంస్థ వ్యవస్థాపకుడు, బిలియనీర్ పారిశ్రామికవేత్త శివ్ నాడార్‌కి ఏకైక సంతానం.[4] ఆమె 2019లో ఫోర్బ్స్ ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో 54వ స్థానంలో నిలిచింది.[5] ఐ.ఐ.ఎష్.ఎల్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2019 ప్రకారం రోష్ని నాడార్ దేశంలో అత్యంత సంపన్న మహిళ.[6] ఆమె 2020లో ఫోర్బ్స్ ప్రపంచంలోని 100 మంది అత్యంత శక్తివంతమైన మహిళలలో 55వ స్థానంలో నిలిచింది. ఆమె అన్ని హె.సి, ఎల్ గ్రూప్ సంస్థల హోల్డింగ్ కంపెనీ అయిన హెచ్.సి.ఎల్ కార్పొరేషన్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా.

విద్యాభ్యాసం[మార్చు]

ఢిల్లీలోని వసంత్ వ్యాలీ స్కూల్‌లో రోష్ని నాడార్ చదువుకుంది. రేడియో, టీవీ, ఫిల్మ్‌ లపై దృష్టి సారించి నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీ నుండి కమ్యూనికేషన్‌లో పట్టభద్రురాలైంది. ఆమె కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి ఎం.బి.ఎ పూర్తిచేసింది.[7]

కెరీర్[మార్చు]

హెచ్‌సిఎల్‌లో చేరడానికి ముందు ఆమె వివిధ కంపెనీలలో పనిచేసింది.[8] ఆమె చేరిన ఒక సంవత్సరంలోనే హెచ్‌సిఎల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సిఇఒగా పదోన్నతి పొందింది.[9][10] ఆమె తండ్రి శివ్ నాడార్ పదవీ విరమణ చేసిన తర్వాత రోష్ని నాడార్ హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ చైర్‌పర్సన్ అయింది.[11]

వ్యక్తిగత జీవితం[మార్చు]

రోష్ని నాడార్ శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందింది.[12] ఆమె 2010లో హెచ్‌సిఎల్ హెల్త్‌కేర్ వైస్ చైర్మన్ శిఖర్ మల్హోత్రాను వివాహం చేసుకుంది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు, అర్మాన్ (జననం 2013), జహాన్ (జననం 2017).[13]

మూలాలు[మార్చు]

  1. "Forbes profile: Roshni Nadar Malhotra". Forbes. Retrieved 16 September 2020.
  2. "HCL Tech's Roshni Nadar Is First Woman To Lead A Listed IT Company In India". Bloomberg Quint. 17 July 2020. Retrieved 17 July 2020.
  3. "Roshni Nadar Malhotra, India's Wealthiest Woman, New Chief Of HCL Tech". NDTV.com. Retrieved 2020-07-17.
  4. "HCL gen-next Roshni Nadar appointed vice-chairman of HCL Tech - Times of India". The Times of India.
  5. "World's Most Powerful Women". Forbes (in ఇంగ్లీష్). Retrieved 2019-12-13.
  6. Nair Anand, Shilpa (25 September 2019). "Mukesh Ambani is richest Indian; Roshni Nadar tops list for women: Report". Business Standard.
  7. "Roshni Nadar made CEO of HCL Corp". The Hindu. 2009-07-02. Retrieved 2009-07-02.
  8. Singh, S. Ronendra. "The rise of an heiress: Roshni Nadar". @businessline (in ఇంగ్లీష్). Retrieved 2019-01-03.
  9. "5 young guns who will take over top indian companies". Rediff.
  10. "Theindianrepublic.com | Netticasinoiden tasavalta – Markkinoiden hallitsija".
  11. "Shiv Nadar Steps Down As HCL Tech Chairman, His Daughter Roshni Nadar Malhotra To Succeed Him". NDTV.com. Retrieved 2020-07-17.
  12. "Roshni Nadar Takes Over As CEO Of HCL Corp". EFYtimes.com. 2009-07-02. Archived from the original on 2009-08-20. Retrieved 2009-07-02.
  13. Sil, Sreerupa. "Successfully Juggling Roles, Roshni Nadar Malhotra Is A True Woman". BW Businessworld (in ఇంగ్లీష్). Retrieved 2017-11-02.