రోహిణి రాకెట్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రోహిణి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ అభివృద్ధి చేసిన సౌండింగ్ రాకెట్‌ల శ్రేణి. వాతావరణ అధ్యయనం కోసం ఈ రాకెట్‌ను తయారు చేసారు. ఈ శ్రేణిలో ప్రస్తుతం RH-200, RH-300 Mk-II, RH-560 Mk-II రాకెట్లు ఉపయోగంలో ఉన్నాయి. ఇవి 8 నుండి 100 కిలోగ్రాముల పేలోడ్లను మోసుకుపోగలవు. 80 నుండి 470 కిలోమీటర్ల ఎత్తుకు చేరగలవు.[1] ఈ రాకెట్లను తుంబాలోని తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ (TERLS), ఒరిస్సాలోని బాలసోర్, శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం ల నుండి ప్రయోగిస్తారు.

రోహిణి రాకెట్ శ్రేణి

పేరు వివరణ[మార్చు]

రోహిణి శ్రేణిలోని రాకెట్ల పేర్లు ఇంంగ్లీషు పేరు ప్రకారం RH ("Rohini") తో మొదలౌతాయి. ఆ తరువాత వచ్చే సంఖ్య దాని వ్యాసాన్ని మిల్లీమీటర్లలో సూచిస్తుంది. .[2]

శ్రేణి[మార్చు]

RH-75

భారత్ స్వంతంగా తయారుచేసిన మొదటి సౌండింగు రాకెట్టు RH-75.[3] 1967 నవంబరు 20 న దీన్ని తొలిసారి ప్రయోగించారు, TERLS నుండి.[4] అది 75 మిల్లీమీటర్ల వ్యాసంతో, 32 కిలోగ్రాముల బరువుంది. 1968 సెప్టెంబరు వరకు దాన్ని 15 సార్లు ప్రయోగించారు.

RH-125

RH-125 ను మొదటిసారి 1971 అక్టోబరు 9 న శ్రీహరికోట నుండి మొదటిసారి ప్రయోగించారు. ఘన ఇంధనాన్ని ఉపయోగించే రెండు దశల రాకెట్టు అది. 7 కెజి బరువును 19 కిమీ ఎత్తుకు తీసుకుపోగలదు. 1970 జనవరి, 1971 అక్టోబరుల మధ్య అది రెండు సార్లు ప్రయణించింది.

RH-200

RH-200 గరిష్ఠంగా 80 కిమీ ఎత్తుకు చేరగలదు. దీని మరొక కూర్పు RH-300 Mk-II, 160 కిమీ ఎత్తుకు, మరో కూర్పు RH-560 Mk-II, 470 కిమీ ఎత్తుకూ చేరగలవు.

అనువర్తనలు[మార్చు]

RH-200 ను వాతావరణ పరిశీలనలకు వాడుతారు. RH-300 Mk-II ను ఉచ్ఛ వాతావరణ పరిశీలనకు, RH-560 Mk-II అయనావరణ పరిశీలనకు వాడుతారు. 

రోహిణి సౌండింగు రాకెట్ల శ్రేణి
పేరు RH 75 RH 125 RH 200/125 RH-300 RH-300 Mk II RH-300/200/200 RH-560/300 RH-560/300 Mk II
మొత్తం ద్రవ్యరాశి 8 కెజి (18 పౌ) 40 కెజి (88 పౌ) 100 కెజి (220 పౌ) 300 కెజి (660 పౌ) 500 కెజి (1,100 పౌ) 500 కెజి (1,100 పౌ) 1,300 కెజి (2,800 పౌ) 1,600 కెజి (3,530 పౌ)
ఎత్తు 1.50 మీ (4.90 అ) 2.50 మీ (8.20 అ) 3.60 మీ (11.80 అ) 4.10 మీ (13.40 అ) 5.90 మీ (19.30 అ) 8.00 మీ (26.20 అ) 8.40 మీ (27.50 అ) 9.10 మీ (29.80 అ)
వ్యాసం 0.0800 మీ (0.2620 అ) 0.12 మీ (0.39 అ) 0.20 మీ (0.65 అ) 0.31 మీ (1.01 అ) 0.31 మీ (1.01 అ) 0.31 మీ (1.01 అ) 0.56 మీ (1.83 అ) 0.56 మీ (1.83 అ)
థ్రస్టు 8.00 కిన్యూ (1,798 పౌఫో) 17.00 కిన్యూ (3,821 పౌఫో) 38.00 కిన్యూ (8,542 పౌఫో) 39.00 కిన్యూ (8,767 పౌఫో) 38.00 కిన్యూ (8,542 పౌఫో) 76.00 కిన్యూ (17,085 పౌఫో) 76.00 కిన్యూ (17,085 పౌఫో)
అపోజీ 10 కిమీ (6.2 మై) 20 కిమీ (12 మై) 80 కిమీ (50 మై) 100 కిమీ (62 మై) 150 కిమీ (93 మై) 300 కిమీ (190 మై) 400 కిమీ (250 మై) 500 కిమీ (310 మై)
దశలు 1 1 2 1 1 3 2 2
తొలి ప్రయోగం 1967 నవంబరు 20 1970 జనవరి 1 1979 జనవరి 1 1987 జూన్ 8 1985 నవంబరు 1 1974 ఏప్రిల్ 24 1995 ఆగస్టు 16
పేలోడ్ (కెజి) 1 7 10 60 70 100

ఇవి కూడా చూడండి[మార్చు]

అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెహికిల్

మూలాలు వనరులు[మార్చు]

  1. ఇస్రో వెబ్‌సైటు
  2. "ISRO > FAQ". Frequently Asked Questions: ISRO. Indian Space Research Organisation.
  3. Chari, Sridhar K (22 July 2006). "Sky is not the limit". The Tribune. Retrieved 10 March 2012.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2012-10-03. Retrieved 2016-08-09.