Coordinates: 16°46′33″N 81°48′29″E / 16.7758°N 81.8081°E / 16.7758; 81.8081

ర్యాలి (ఆత్రేయపురం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ర్యాలి
—  రెవిన్యూ గ్రామం  —
ర్యాలి is located in Andhra Pradesh
ర్యాలి
ర్యాలి
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°46′33″N 81°48′29″E / 16.7758°N 81.8081°E / 16.7758; 81.8081
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కోనసీమ
మండలం ఆత్రేయపురం
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 13,123
 - పురుషులు 6,627
 - స్త్రీలు 6,496
 - గృహాల సంఖ్య 3,763
పిన్ కోడ్ 533236
ఎస్.టి.డి కోడ్
Sri Jaganmohini Keshava Swamy Temple, Ryali
ర్యాలిలోని జగన్మోహిని కేశవస్వామి దేవాలయం

ర్యాలి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ఆత్రేయపురం మండలం లోని గ్రామం. ఇది మండల కేంద్రం ఆత్రేయపురం నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన రాజమహేంద్రవరం నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది.

గణాంకాలు

[మార్చు]
ర్యాలీ గ్రామ పంచాయితీ కార్యాలయం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3763 ఇళ్లతో, 13123 జనాభాతో 950 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6627, ఆడవారి సంఖ్య 6496. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1866 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 86. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587569[1].పిన్ కోడ్: 533236

2001 జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 12,487. ఇందులో పురుషుల సంఖ్య 6,319, మహిళల సంఖ్య 6,168, గ్రామంలో నివాస గృహాలు 3,154 ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు

[మార్చు]
ర్యాలీ గ్రామంలో ఒక బజారు

గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఏడు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి, ప్రైవేటు మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఆత్రేయపురంలోను, ఇంజనీరింగ్ కళాశాల రాజమహేంద్రవరం లోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ రాజమహేంద్రవరంలో ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల రాజమహేంద్రవరంలో ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

ర్యాలిలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, 10 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

గ్రామంలో 2 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. డిగ్రీ లేని డాక్టర్లు ఎనిమిది మంది, డిగ్రీ కలిగిన డాక్టరు ఒకరు ఉన్నారు. ఆరు మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది.గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది.బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.కాలువ/వాగు/నది ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీరు బహిరంగంగా, కచ్చా కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు.చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

ర్యాలిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. పోస్టాఫీసు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి.ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో వాణిజ్య బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.ఏటీఎమ్, సహకార బ్యాంకు గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు, గ్రంథాలయం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

జగన్మోహిని చెన్నకేశవ స్వామి దేవాలయం

[మార్చు]

ఈ గ్రామములో ప్రసిద్ధి చెందిన జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం ఉంది.[2] ర్యాలి రాజమహేంద్రవరంకి 40 కి.మి., కాకినాడకు 74 కి.మి., అమలాపురంకి 34 కి.మి. దూరంలో వసిష్ఠ, గౌతమి అనేగోదావరి ఉప పాయ ల మధ్య ఉంది. ఇక్కడి విశేషం శ్రీ జగన్మోహిని కేశవ స్వామి, శ్రీ ఉమా కమండలేశ్వర స్వామి వారు ర్యాలి ప్రధాన రహదారికి ఒకరికొకరు ఎదురెదురుగా ఉండడం. ఇక్కడ జగన్మోహినీ - చెన్న కేశవస్వామి ఆలయం ఉంది. ఈ గుడిని ఘంటచోళ మహారాజు కట్టించాడని చెబుతారు. ఇక్కడ మూల విరాట్టు ముందు భాగం చెన్నకేశవస్వామి, శంఖం, చక్రం, గద, పద్మం ధరించిన నాలుగు చేతులున్నాయి. వెనుకవైపు జగన్మోహినీ రూపం ఉంది. అచ్చంగా జగన్మోహినివలె కళ్ళు చెదరే అందంతో జీవకళ ఉట్టిపడుతుంటుంది. అమే సిగ, ఆభరణాలు కాక తొడవైపు వెనుక భాగాన పుట్టుమచ్చతో కూడా సహజంగా అలరారుతుంటుంది. స్వామి పాదాలచెంత నిత్యం జలం ఉరుతుంది. తీసిన కొద్దీ నీరు వస్తుంటుంది. విష్ణుదేవుని పాదాల దగ్గరేకదా గంగ పుట్టింది. ఈ విగ్రహంలో చుట్టూ దశావతారాలు, శ్రీదేవి, భూదేవి, గంగ, గరుత్మంతుడు, చెక్కబడారు. దేవతలకు, రాక్షసులకు అమృతాన్ని పంచివచ్చిన జగన్మోహిని విష్ణుమూర్తియేనని మరచి, ఆమె రూపానికి మోహంలో పడి శివుడు ఆమె వెంటపడి పరుగెత్తాడట. ఆమె యిక్కడి వరకూ వచ్చి జగన్మోహినీ-చెన్నకేశవ మూర్తిగా శిలగా మారిందని యిక్కడ జనం వాడుకగా చెబుతుంటారు.మూల వీరాట్టు ముందు భాగం కేశవస్వామి,వెనుక వైపు జగన్మోహిని రూపం ఉంటుంది . స్వామి పాదాల చెంత నిత్యం జలము ఊరుతుంది. తీసిన కొద్ది వస్తూనే ఉంటుంది . ఈ ఆలయ ప్రాంగణలో శ్రీదేవి, భూదేవి, నారదుడు, తుంబుర, రంభ, ఊర్వశి, కిన్నెర, కింపురుష, గోవర్ధనగిరిశుడై న శ్రీ కృష్ణుని, ఆదిశేషుని, గరుడుని, గంగా విగ్రహాలు చూస్తే శిల్పకళాచాతుర్యం ప్రకటితమైతుంది. 5 అడుగుల ఎత్తు 3 అడుగుల వెడల్పు గల శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి సాలిగ్రామ విగ్రహం శ్రీ మహావిష్ణువు ప్రత్యక్ష స్వరూపం.ఈ విగ్రహము ఏక సాలిగ్రామ శిలతో తయారైంది. విగ్రహము ముందువైపు విష్ణువు కేశవస్వామి, వెనుకవైపున జగన్మోహినీ రూపంలో ఉన్నాడు.

ఈ ఆలయాన్ని 'బదలీ ఆలయంగా' ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు జరిపించినవారు తప్పకుండా తాము కోరుకున్న ప్రాంతానికి బదలీ అవుతారనే నమ్మకం ఆంధ్రప్రదేశ్ అంతటా వ్యాపించింది. మంత్రులు, ఇతర రాజకీయ పదవుల్లో ఉన్నవారు మాత్రం ర్యాలీ వైపు కన్నెత్తి కూడా చూడరు. ఎందుకంటే తమ పదవులు పోతాయనే భయం అని ఇక్కడి పూజార్లు చమత్కరిస్తుంటారు.

స్థల పురాణం

[మార్చు]
ఆలయంలోని సాలగ్రాములు

శ్రీ మహాభాగవత ఇతిహాసం ప్రకారం క్షీరసాగర మధన సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవదానవులు పోరాడుకొనుచుండగా శ్రీమహావిష్ణువు లోకకళ్యాణార్థం జగన్మోహిని అవతారాన్ని ఎత్తి దేవతలకు అమృతాన్ని అందిస్తాడు. జగన్మోహిని అవతార సమయం లోమహేశ్వరుడు జగన్మోహినిని చూసి మోహితుడై ఆమె వెంట పడగా వారి సంభోగ ఫలితంగా అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. మోహినీ స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు కొప్పు నుంచి ఒక పుష్పం క్రింద పడుతుంది. ఈ పుష్పం క్రిందపడిన ప్రదేశమే ఇప్పటి ర్యాలి (ర్యాలి అంటే పడడం అని అర్థం) అని చెబుతారు.

ఆలయ నిర్మాణం

[మార్చు]
ఆలయం

11 వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి అప్పటి చోళ రాజు విక్రమ దేవుడు వేట కై వచ్చి అలసి ఒక పెద్ద పొన్నచెట్టు క్రింద సేద తీరి నిద్రపోతాడు. శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి రథం యొక్క మేకు క్రింద పడిన ప్రదేశం లోని భూగర్భంలో తన క్షేత్రం ఉందని పల్కుతాడు. ఆ మహారాజు శ్రీ మహావిష్ణువు చెప్పినట్లు ఆ ప్రదేశాన్ని త్రవ్వించగా జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం బయట పడుతుంది. అక్కడ ఆ మహారాజు ఒక దేవాలయాన్ని నిర్మిస్తాడు. 1936 సంవత్సరంలో ఈ గుడికి ప్రాకారాలు నిర్మించబడ్డాయి.అమృతం పంచిన తర్వాత మోహిని (విష్ణుమూర్తి) ని శివుడు మోపిస్తాడు. అతన్నుంచి తప్పించుకొనేందుకు మోహిని రథం మీద వేగంగా వెళ్ళిందట. ఆ వేగం వల్ల రథం శీల రాలి పడటంతో జగన్మోహనునిగా అక్కడే వెళిశాడట.

మూలవిరాటు

[మార్చు]

5 అడుగుల ఎత్తు 3 అడుగుల వెడల్పు గల శ్రీ జగన్మోహిని కేశవ స్వామి వారి సాలిగ్రామ విగ్రహం శ్రీ మహావిష్ణువు ప్రత్యక్ష స్వరూపం.స్వామివారి ఈ విగ్రహము అతి సుందరమైనది. ప్రత్యేకముగా చెప్పుకోదగినది. ఈ విగ్రహము ఏక సాలిగ్రామ శిలతో తయారైంది. విగ్రహము ముందువైపు విష్ణువు కేశవస్వామి, వెనుకవైపున జగన్మోహినీ రూపంలో ఉన్నాడు

 • ఎదుటవైపుగా స్యామి పాదపద్మాల మధ్య ఉన్న చిన్న గంగ దేవి తల నుండి గంగ నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. (విష్ణు పాద్బోవీం గంగా).
 • ముందువైపు విష్ణువు నాలుగు చేతులు కలిగి, శంఖము, చక్రము, గద, అభయహస్తం హస్తరేఖలతో ఉన్నాడు.
 • విగ్రహము పై బాగమున ఆదిశేషుడు నీడపట్టినట్లుగా ఉన్నాడు.
 • వెనుక వైపున ఇవేమీ కనుపించకుండా, రెండు చేతులు, చక్కటి జుట్టుముడి, అందమైన శరీరాకృతి, కుడికాలు పై పాదము నకు కొద్దిగా పైభాగము (పిక్క) పై నల్లని మచ్చతో ఉంటుంది. ఈ మచ్చ పద్మినీ జాతి స్త్రీకి ఉండే లక్షణాలలో ఒకటిగా చెపుతారు. అసలే నల్లని సాలగ్రామ శిలతో తయారైనా కూడా అంతకన్నా నల్లగా ఈ మచ్చ అతి స్పష్టంగా కనుపిస్తూ ఉంటుంది.
 • మొత్తముగా ఈ విగ్రహము అత్యంత ప్రత్యేకమైనది, అద్భుతమైనది. బహుశ ఇటువంటి విగ్రహము ఇది ఒక్కటే అని చెప్పవచ్చును. అందుకే స్వామివారికి జరిగే నిత్యపూజలు, హారతి, నైవేద్యాదులు ముందువైపు, వెనుక వైపు కూడా యధావిధిగా జరుగుతాయి.

ఇతర విగ్రహాలు

[మార్చు]

శ్రీ మహావిష్ణువు తూర్పు వైపు ఉండగా ఆయనకు ఎదురుగా శ్రీ మహేశ్వరుడు పశ్చిమ ముఖమై ఉన్నాడు. శివలింగాన్ని బ్రహ్మ కమండలం చే పావనం చేయబడినందున ఇక్కడి శివలింగాన్ని ఉమా కమండలేశ్వరుడు అని పిలుస్తారు. ఈ ఆలయ ప్రాంగణలో శ్రీదేవి, భూదేవి, నారదుడు, తుంబుర, రంభ, ఊర్వశి, కిన్నెర, కింపురుష, గోవర్ధనగిరిశుడై న శ్రీ కృష్ణుని, ఆదిశేషుని, గరుడుని, గంగా విగ్రహాలు చూస్తే శిల్పకళాచాతుర్యం ప్రకటితమైతుంది.

ఏనుగుల వీరాస్వామయ్య కాశీ యాత్రా చరిత్రలో ర్యాలీ గ్రామ ప్రస్థావన

[మార్చు]

30 తేది వుదయమయిన ఆరుగంటలకు లేచి రాజమహేంద్రవరం నుండి 7 కోసుల దూరములో వుండే ఆచంటయనే ఊరు 11 గంటలకు చేరినాను. దారిలో సప్తగోదావరి యనే ఒక పాయ పడవలకుండా దాటడమయినది. యిది కాలిబాట. తొపులు, వూళ్ళమధ్యే నడుస్తూ వచ్చినాము. అందులో రాల (ర్యాలి) యనే ఒక గ్రామములో శుభ్రమయిన నల్లశిలతో ప్రభసమేతముగా ఒక గోపాలమూర్తిని చేసివున్నది. ఆ ప్రభలోనున్న మూర్తి పీఠము మీదనున్ను రాసక్రీడలు మొదలయిన అవసరాలు మూర్తీభవించి నట్లుచెక్కి ప్రధానమూర్తిని గోళ్ళు, వెంట్రుకలుకూడా విరళపరచి అతిసుందరముగా చేసివుంది. యీ మూర్తి సముద్రములో కొట్టుకొని వచ్చినట్టు యిక్కడ చెప్పుకొంటారు. ఆచంట అనే వూళ్ళో వెంకటరాయనింగారు తన నివాసము కొరకు ఒక గొప్ప నగరుకట్టి దానికి చుట్టూ సుందరమయిన వనం నిర్మించి ఉన్నాడు. యీ వూళ్ళోనున్ను, వాడపల్లెలోపల వున్నట్టే ఒక పోలైసు అమీను ఉన్నాడు. ముప్పై బ్రాహ్మణ యిండ్లు ఉన్నాయి. యిక్కడ పెండలపు గడ్డలు బహు బాగా అయి యీనెట్టున బహుప్రసిత్థి కెక్కివున్నవి. ఒక దేవాలయముకూడా ఉంది. యీవూళ్ళో యీరాత్రి వసించినాను.

ర్యాలీ గ్రామ ఉత్సవాలు, పండుగలు

[మార్చు]
 • జగన్మోహిని కేశవ కళ్యాణం - చైత్ర శుద్ధ నవమినాడు ప్రతి ఏడాది జరుపుతారు. దానిని ఎంతో వైభవంగా చేస్తారు అనేకమంది ఈప్రాంతానికి విహారయాత్రకు కూడా వస్తారు. కార్తిక మాసంలో ఈఊరి శివాలయం, కేశవ స్వామి గుడులలో కోలాహలం నెలకొంటుంది హరిహరనాధ కీర్తనలు వినిపిస్తూ ఉంటాయి.ఇటువంటి పుణ్యస్థలం ఆంధ్రదేశంలో ఉండడం విశేషమే కదా.
 • శ్రీ రామ సత్యనారాయణ కళ్యాణం - విశాఖ శుద్ధ ఏకాదశినాడు ప్రతి ఏడాది జరుపుతారు
 • వేణు గోపాలస్వామి కళ్యాణం - జేష్ఠ శుద్ధ ఏకాదశి ప్రతి ఏడాది జరుపుతారు

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 14 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

ర్యాలిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 200 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 750 హెక్టార్లు
 • నీటి సౌకర్యం లేని భూమి: 32 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 717 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

ర్యాలిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 472 హెక్టార్లు
 • బావులు/బోరు బావులు: 245 హెక్టార్లు

ఉత్పత్తి

[మార్చు]

ర్యాలిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అరటి, కొబ్బరి 

మూలాలు

[మార్చు]
 1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
 2. "SRI JAGANMOHINI KESAVA & GOPALA SWAMY TEMPLE, RYALI | Welcome to East Godavari District Web Portal | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2023-04-01.

బయటి లింకులు

[మార్చు]