లంకావీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Langkawi

لانكاوي
Eagle Square, Langkawi Island
Eagle Square, Langkawi Island
Motto(s): 
Bandaraya Pelancongan (ఆంగ్ల: City of Tourism)
CountryMalaysia Malaysia
StateFlag of Kedah Kedah
Establishment1957
Granted
municipal status
2001
ప్రభుత్వం
 • Yang Di-Pertua
(Mayor)
Abdul Aziz bin Hj. Abd Ghani
విస్తీర్ణం
 • City478.5 కి.మీ2 (184.7 చ. మై)
జనాభా
 • నగరం64
 • మెట్రో
64
ప్రామాణిక కాలమానంUTC+8 (MST)
 • Summer (DST)Not observed
Postal code
07xxx
International dialling code prefix+6049 (landline only)
జాలస్థలిhttp://mplbp.gov.my

లంకావీ ని, (జావీ:لانكاوي ) అధికారికంగా లంకావీ, ది జ్యువెల్ ఆఫ్ కెడా (కెడా ఆభరణం) గా గుర్తిస్తారు (మాలే: లంకావీ పెర్మాతా కెడా [1]), ఇది అండమాన్ సముద్రంలో 99 ద్వీపాలతో కూడిన (మరో ఐదు అదనపు ద్వీపాలు సముద్రపు ఆటు సమయంలో కనిపిస్తాయి [1]) ఒక ద్వీప సమూహం, మలేషియా ప్రధాన భూభాగ వాయువ్య తీరానికి 30 కిలోమీటర్ల దూరంలో ఈ ద్వీపసమూహం ఉంది. థాయ్‌తో సరిహద్దు పంచుకుంటున్న కెడా రాష్ట్రంలో ఈ ద్వీపాలు భాగంగా ఉన్నాయి. 2008 జూలై 15న, కెడా సుల్తాన్ అబ్దుల్ హలీమ్ తన స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా ఈ ద్వీప సమూహం పేరును లంకావీ పెర్మాతా కెడాగా మార్చేందుకు అంగీకారం తెలిపారు. ఇక్కడి ద్వీపాల్లో అతిపెద్దదిగా పులా లంకావీ గుర్తింపు పొందింది, దీనిపై 64,792 మంది పౌరులు నివసిస్తున్నారు, పులా తుబా సమీపంలో జనావాసాలు ఉన్న మరో ద్వీపం ఇదొక్కటే కావడం గమనార్హం. లంకావీ కూడా ఒక పరిపాలక జిల్లా హోదా కలిగివుంది, కువా అనే పట్టణం ఈ జిల్లా రాజధానిగా మరియు అతిపెద్ద పట్టణంగా ఉంది. లంకావీ ఎటువంటి సుంకాలు వసూలు చేయని ఒక ద్వీపసమూహం[2].

శబ్దవ్యుత్పత్తి శాస్త్రం[మార్చు]

లంకావీ అంటే వ్యవహారిక మాలే భాషలో ఎరుపు గోధుమ వర్ణంలోని డేగ అనే అర్థం వస్తుంది. గ్రద్ధకు మాలే పదం ఏమిటంటే హెలాంగ్ - ఇది "లాంగ్"గా సంక్షిప్తీకరించబడింది. కావీ అంటే ఎరుపు గోధుమ వర్ణమని అర్థం.[ఉల్లేఖన అవసరం]

భౌగోళిక పరిస్థితులు[మార్చు]

లంకావీ ద్వీప సముదాయం ఉత్తర మలేషియాలోని కెడా రాష్ట్రంలో ఒక జిల్లాగా పరిగణించబడుతుంది, లంకావీ జిల్లా కెడాకు పశ్చిమంగా సుమారుగా 51 కి.మీ దూరంలో ఉంది, మలేషియా ప్రధాన భూభాగం నుంచి ఈ 99 ద్వీపాల సముదాయాన్ని మలేకా జలసంధులు వేరు చేస్తున్నాయి. ఈ ద్వీపాల మొత్తం భూభాగ పరిమాణం 47,848 హెక్టార్లు ఉంటుంది, లంకావీ ప్రధాన ద్వీపం ఒక్కటే ఇందులో 32,000 హెక్టార్ల భూభాగాన్ని ఆక్రమించివుంది. ప్రధాన ద్వీపం ఉత్తరం నుంచి దక్షిణంవైపుకు 25 కి.మీ పొడవు కలిగివుంది, తూర్పు చివర నుంచి పశ్చిమ కొన భాగానికి ఉన్న పొడవు దీని కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. తీర ప్రాంతాలు చదునైన, సున్నపురాయి మిట్టలతో కనిపించే ఒండలి మైదానాలు కలిగివున్నాయి. మూడింట రెండొంతుల ద్వీప భూభాగంలో అడవులతో-నిండిన పర్వతాలు, కొండలు మరియు సహజ ఉద్భిజ్జ సంపద ఉంటాయి.

ద్వీపం యొక్క అతి పురాతన భూవిజ్ఞాన శాస్త్ర సంబంధ నిర్మాణంగా గుర్తింపు పొందిన గునుంగ్ మాట్‌చిన్‌కాంగ్ సుమారుగా ఒక బిలియన్ సంవత్సరాలకు పూర్వం కాంబ్రియన్ కాలంలో సముద్రగర్భం నుంచి పైకిలేచిన మొదటి ఆగ్నేయాసియా భూభాగంగా పరిగణించబడుతుంది. ఈ భాగం యొక్క అతిపురాతన నిర్మాణాన్ని ద్వీపం యొక్క వాయువ్య ప్రాంతంలోని తెలుక్ దటాయ్ వద్ద చూడవచ్చు, ఇక్కడ పైకి కనిపించే ఎగువ భాగాల రాతి నిర్మాణంలో ప్రధానంగా ఇసుకరాయి (క్వార్జైట్) ఉంటుంది, వరుస దిగువ భాగాలు అపక్షేప రాయి మరియు మట్టిరాయితో నిండి ఉంటాయి.

శీతోష్ణస్థితి మరియు వాతావరణం[మార్చు]

ఈ ప్రాంతంలో సుమారుగా 32 డిగ్రీల సెల్సియస్ సగటు వార్షిక ఉష్ణోగ్రతతో ఎండతో కూడిన, వేడి మరియు ఆర్ద్ర, ఉష్ణమండల వాతావరణం ఉంటుంది. ఏడాది పొడవునా అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నప్పటికీ, ఆగస్టు/సెప్టెంబరు సందర్భంగా వర్షకాలం ఉంటుంది.

జనాభా వివరాలు[మార్చు]

లంకావీలో కెడాహన్ మాలే జాతీయులు ఆధిపత్యం కలిగివున్నారు, వీరి తరువాతి స్థానాల్లో చైనీయులు, భారతీయులు, థాయ్ జాతీయులు ఉంటారు. ఈ ప్రాంతంలో నివసించే ఇతర మాలే జాతీయుల్లో పటానీ మాలేయులు ఉన్నారు.[ఉల్లేఖన అవసరం]

ఇస్లాం మతం ప్రధానంగా మాలేయులచే ఆచరించబడుతుంది. హిందూ మతం (ఎక్కువగా భారతీయుల్లో), బౌద్ధ మతం (దీనిని ప్రధానంగా చైనీయులు మరియు థాయ్ జాతీయులు ఆచరిస్తున్నారు) మరియు క్రైస్తవ మతాలను ఇక్కడ ఉన్న ఇతర ప్రధాన మతాలుగా చెప్పవచ్చు.[ఉల్లేఖన అవసరం]

జనాభా[మార్చు]

ఇక్కడ ఉన్న మొత్తం 99 ద్వీపాల్లో నాలుగు ద్వీపాల్లో మాత్రమే జనావాసాలు ఉన్నాయి - అవి పులా లంకావీ (ప్రధాన ద్వీపం), పులా టుబా, పులా రెబాక్ మరియు పులా డాయంగ్ బుంటింగ్. ఇక్కడ జనాభా సంఖ్య సుమారుగా 65000, వీరిలో 90% మంది మాలేయులు ఉన్నారు. చైనీయులు, భారతీయులు, థాయ్ జాతీయులను ఇక్కడ నివసిస్తున్న ఇతర ప్రధాన జాతి సమూహాలుగా చెప్పవచ్చు.

రాజకీయాలు[మార్చు]

సమాఖ్య చట్టసభ[మార్చు]


సమాఖ్య చట్టసభ (డెవాన్ రఖ్యాత్) లో లంకావీ జిల్లా ప్రతినిధులు

చట్టసభ నియోజకవర్గం పేరు చట్టసభ సభ్యుడు పార్టీ
P4 లంకావీ YB.దాటుక్ పాడుకా అబు బకర్ బిన్ తైబ్ బారిసన్ నాసినల్ (BN)

రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాలు[మార్చు]


రాష్ట్ర శాసనసభలో (డెవాన్ అన్‌డాన్గాన్ నెగెరీ) లంకావీ జిల్లా ప్రతినిధుల జాబితా

చట్టసభ రాష్ట్రం నియోజకవర్గం పేరు రాష్ట్ర శాసనసభ సభ్యుడు పార్టీ
P4 N1 అయర్ హంగాత్ YB మొహమ్మద్ రావీ అబ్దుల్ హమీద్ బారిసన్ నాసినల్ (BN)
P4 N2 కువా YB దాటో' IR నవావీ అహ్మద్ బారిసన్ నాసినల్ (BN)

ఆర్థిక వ్యవస్థ[మార్చు]

ఈ ద్వీపసమూహం యొక్క సహజ, పాడవని, పర్యావరణ సౌదర్యం మరియు ప్రధాన ప్రభుత్వ కార్యక్రమాలను పరిగణలోకి తీసుకుంటే, వరి మరియు రబ్బరు సాగు, చేపల వేటకు సంబంధించిన వ్యవసాయ-ఆధారిత ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని పర్యాటక రంగ-ప్రోత్సాహక ఆర్థిక వ్యవస్థ ఆక్రమిస్తోంది.

పెర్లిస్, కెడా, పెనాంగ్ మరియు ఉత్తర పెరాక్ రాష్ట్రాలను చేర్చి - ఉత్తర ద్వీపకల్ప మలేషియాలో ఆర్థికాభివృద్ధికి ఊతం ఇచ్చేందుకు నార్తరన్ కారిడార్ ఎకనామిక్ రీజియన్ (NCER) పేరుతో మలేషియా ప్రభుత్వం ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది.

ప్రపంచ-శ్రేణి పర్యాటక గమ్యస్థానంగా లంకావీ స్థానాన్ని విస్తరించేందుకు, ఈ ద్వీపసమూహానికి మరిన్ని ప్రపంచ-స్థాయి హోటళ్లు మరియు హాలిడే రిసార్ట్‌లను ఆకర్షించడం కోసం NCER కృషి చేస్తోంది.

లంకావీలో పర్యాటక ఆకర్షణల పరిధిని పెంచేందుకు, పర్యాటక సంపదను వైవిధ్యభరితంగా తీర్చిదిద్దేందుకు కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. ప్రణాళిక దశలో ఉన్న పర్యటక ఆకర్షణల్లో: ఒక సాగర పరిరక్షణ కేంద్రం, పళ్ల తోట, సాహస పర్యాటకం, ప్రదర్శన కేంద్రాలు, కళలు మరియు సాంస్కృతిక కేంద్రం, ఒక జంతు ప్రదర్శన శాల, పగటి పడవ ప్రయాణాలు, ఫ్యాక్టరీ అవుట్‌లెట్ షాపింగ్ ఉన్నాయి.[ఉల్లేఖన అవసరం]

ఒక్కొక్క పర్యాటకుడి ద్వారా వచ్చే ఆదాయం 2005లో MYR1,890 (US$600) వద్ద ఉండగా, దీనిని 2012నాటికి MYR3,034 (US$963) కి పెంచాలని NCER లక్ష్యంగా పెట్టుకుంది.

వార్షిక పర్యాటక వ్యయం 2005లో MYR9.0 బిలియన్లు (US$2.86 బిలియన్లు) వద్ద ఉండగా, దీనిని 2012నాటికి MYR21.8 బిలియన్లు (US$6.9 బిలియన్లు) కు, 2020నాటికి MYR64.5 బిలియన్లు (US$20.4 బిలియన్లు) కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.[3]

పర్యాటకం[మార్చు]

2007 జూన్ 1న, లంకావీ ద్వీపానికి UNESCO వరల్డ్ జియోపార్క్ హోదా ఇచ్చింది.[4] లంకావీ జియోపార్కులో మూడు ప్రధాన పరిరక్షిత ప్రదేశాలు ఉన్నాయి; అవి మాచిన్‌కాంగ్ కాంబ్రియన్ జియోఫారెస్ట్ పార్కు, కిలీమ్ కర్ట్ జియోఫారెస్ట్ పార్కు మరియు డాయంగ్ బుంటింగ్ మార్బుల్ జియోఫారెస్ట్ పార్కు. (ప్రగ్నంట్ మేడిన్ లేక్ ద్వీపం). లంకావీ జియోపార్కులో అత్యంత ప్రసిద్ధి చెందిన పర్యాటక ప్రదేశాలుగా ఈ మూడు పార్కులు గుర్తింపు పొందాయి.

పాంటై, సెనాంగ్, పాంటై టెంగా, బురా బే, పాంటై కోక్ మరియు దటై బే ఇక్కడ ఉన్న అత్యంత ప్రసిద్ధ బీచ్‌లుగా పరిగణించబడుతున్నాయి. పాంటై సెనాంగ్ చూసేందుకు చాలా అందంగా కనిపించే బీచ్, ఇక్కడ సన్నని తెల్లని ఇసుక అవధులు లేకుండా వ్యాపించివున్నట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ బీచ్ పొడవైన కొబ్బరి మరియు సరుగుడు చెట్లతో ఈనెగట్టు కలిగివుంటుంది. పాంటై టెంగా బీచ్ సెనాంగ్ నుంచి చిన్న భూకొన భాగంతో వేరుచేయబడి ఉంటుంది. బురా బే రాతితో నిండిన భూస్వరూపాల హద్దులు కలిగివుంటుంది, లంకావీకి వచ్చే వలస పక్షులు ప్రధానంగా ఇక్కడే కనిపిస్తాయి. పాంటై కోక్ బీచ్ ప్రశాంతంగా ఉంటుంది, దీనికి వెనుకవైపు సున్నపురాయి కొండలు ఉంటాయి. దాటై బే బీచ్ అడవులు మరియు సముద్రంతో కలిసి ఉంటుంది. పాల మాదిరిగా తెల్లగా ఉండే ఈ బీచ్‌ను ఆనుకొని దట్టమైన అడవి ఉంటుంది.

లంకావీ కేబుల్ కార్ సందర్శకులను గునుంగ్ మాట్ చిన్‌చాంగ్ అగ్రభాగం వరకు తీసుకెళుతుంది, ఇక్కడ లంకావీ స్కై బ్రిడ్జ్ ఉంటుంది.

పర్యాటకలు కౌలా పెర్లిస్ నుంచి పడవలో లేదా కౌలాలంపూర్ నుంచి విమానంలో పర్యాటకులు ఈ ద్వీపానికి చేరుకోవచ్చు. ఎయిర్‌ఏషియా ఈ ద్వీపానికి బడ్జెట్ సేవలు అందిస్తోంది.

విద్య[మార్చు]

ప్రాథమిక[మార్చు]

SMK మెహ్సూరీ
 • SK బాయాస్
 • SK ఇవా
 • SK కెడావాంగ్
 • SK కెలీబాంగ్
 • SK కిలీమ్
 • SK కౌలా టెరియాంగ్
 • SK లంకావీ
 • SK లుబుక్ కెంపెడాక్
 • SK నైయోర్ చాబాంగ్
 • SK పదంగ్ మాట్ సిరత్
 • SK పెంఘులు అహ్మద్
 • SK సెలాత్ బాగన్ నైయర్
 • SK సెరి లాజెండా
 • SK సెరి నెగెరి
 • SK సుంగై మెంఘులు
 • SK తెమోన్యాంగ్
 • SK తుబా
 • SK ఉలు మెలకా
 • SJK (C) చుంగ్ హ్వా
 • SJK (C) మిన్ నామ్
 • SJK (T) లడంగ్ సుంగై రాయా

ద్వితీయ[మార్చు]

 • SMK అయెర్ హంగాత్
 • SMK కెడవాంగ్
 • SMK కెలిబాంగ్
 • SMK లంకావీ పులా తుబా
 • SMK మెహ్సూరీ
 • SMK తెంగ్కు పుత్రా
 • SM తెక్నిక్ లంకావీ
 • మక్తాబ్ మహ్ముద్ లంకావీ
 • మక్తాబ్ రెండా సైన్స్ మరా లంకావీ

తృతీయ[మార్చు]

 • కోలెజ్ కోమునిటీ లంకావీ

చిత్ర శ్రేణి[మార్చు]

సోదరి నగరాలు[మార్చు]

సూచనలు[మార్చు]

 1. "It's Langkawi Permata Kedah now". The Star Online. July 16, 2008. Retrieved 2008-07-20. Cite news requires |newspaper= (help)
 2. "Shopping in Langkawi". ABC Langkawi. మూలం నుండి 2012-07-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2009-08-11. Cite news requires |newspaper= (help)
 3. "ఆర్కైవ్ నకలు" (PDF). మూలం (PDF) నుండి 2008-11-21 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-06-24. Cite web requires |website= (help)
 4. "Langkawi given geopark status". The Star Online. June 8, 2007. Retrieved 2007-12-24. Cite news requires |newspaper= (help)
 5. http://www.presstv.com/detail.aspx?id=103847&sectionid=351020108
 6. http://www.kish.ir/HomePage.aspx?TabID=0&Site=DouranPortal&Lang=en-US/[permanent dead link]

బాహ్య లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=లంకావీ&oldid=2825477" నుండి వెలికితీశారు