లంకా కృష్ణమూర్తి
| లంకా కృష్ణమూర్తి | |
|---|---|
![]() | |
| జననం | 1925, సెప్టెంబరు 9 పెనుకొండ, అనంతపురం జిల్లా |
| వృత్తి | హైకోర్టులో డిప్యూటి రిజిస్ట్రారు |
| ప్రసిద్ధి | కవి, రచయిత |
| మతం | హిందూ |
| తండ్రి | వెంకటరామప్ప |
| తల్లి | దుర్గా లక్ష్మమ్మ |
లంకా కృష్ణమూర్తి (జ. 1925, సెప్టెంబరు 9) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కవి, రచయిత.[1] ఇతను కేవలం తెలుగు సాహిత్యంలోనే కాకుండా, ఇతర భాషలైన కన్నడ, ఆంగ్లం, హిందీ భాషలలో కూడా ప్రావీణ్యం కలిగి ఉన్నాడు.[2]
జననం
[మార్చు]లంకా కృష్ణమూర్తి 1925, సెప్టెంబరు 9న అనంతపురం జిల్లా, పెనుకొండలో జన్మించాడు. ఇతని తల్లి దుర్గా లక్ష్మమ్మ, తండ్రి వెంకటరామప్ప.[2]
విద్యాభ్యాసం, ఉద్యోగం
[మార్చు]కృష్ణమూర్తి మద్రాస్ యూనివర్సిటీ నుండి బి.ఎస్.సి., మైసూర్ యూనివర్సిటీలో బి.ఎల్. పట్టాలు పొందాడు. 1950 నుండి 1959 వరకు న్యాయవాదిగా పనిచేశారు. తర్వాత కర్ణాటక హైకోర్టులో డిప్యూటి రిజిస్ట్రారుగా పనిచేశాడు.[3]
సాహిత్య కృషి
[మార్చు]కృష్ణమూర్తి సంస్కృతం, తెలుగు, హిందీ, కన్నడ, ఆంగ్ల భాషలలో ప్రావీణ్యం కలిగి ఉన్నాడు. వారు బెంగళూరులోని 'తెలుగు సాహితీ సమితి'కి ఉపాధ్యక్షులుగా పనిచేశాడు. ఇతని తెలుగు ఉపన్యాసాలు, కవితలు బెంగళూరు ఆకాశవాణిలో ప్రసారమయ్యాయి. కన్నడ ప్రాంతంలో జరిగే తెలుగు సాహిత్య సభలలో, అవధాన కార్యక్రమాలలో వారు ప్రథమ స్థానం పొందాడు.
రచనలు
[మార్చు]ముద్రితాలు:
అముద్రితాలు:
- త్యాగ శిల్పము (1958-59)[5]
- కొడెయగోపాల (కన్నడ నవల)
- త్యాగశిల్పి (కన్నడ నాటక:)
- అత్తెయ ఎత్తర (కన్నడ ప్రహసనం)[6]
మూలాలు
[మార్చు]- ↑ రాయలసీమ రచయితల చరిత్ర రెండవసంపుటి - కల్లూరు అహోబలరావు, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, హిందూపురం
- ↑ 2.0 2.1 కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).
- ↑ 3.0 3.1 కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).
- ↑ కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).
- ↑ కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).
- ↑ కల్లూరు అహోబలరావు (1977). రాయలసీమ రచయితల చరిత్ర (రెండు సంపుటం).
