లంగ్‌డంగ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లంగ్‌డంగ్ జిల్లా
అరుణాచల ప్రదేశ్ లోని జిల్లా
అరుణాచల్ ప్రదేశ్ లోని లాంగ్డింగ్ జిల్లా స్థానము
అరుణాచల్ ప్రదేశ్ లోని లాంగ్డింగ్ జిల్లా స్థానము
నిర్దేశాంకాలు: 26°54′N 95°18′E / 26.9°N 95.3°E / 26.9; 95.3Coordinates: 26°54′N 95°18′E / 26.9°N 95.3°E / 26.9; 95.3
దేశం India
రాష్ట్రంఅరుణాచలప్రదేశ్
విస్తీర్ణం
 • Total1,192 km2 (460 sq mi)
జనాభా వివరాలు
(2011)
 • Total56,953
 • సాంద్రత48/km2 (120/sq mi)
కాలమానంUTC+05:30 (IST)
జాలస్థలిlongding.nic.in

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 17 జిల్లాలలో లంగ్‌డంగ్ జిల్లా ఒకటి. ఇది రాష్ట్రంలో సరికొత్తగా రూపొంచిన జిల్లా. తిరప్ జిల్లా దక్షిణభూభాగం వేరుచేది ఈ జిల్లా రూపొందించబడింది. జిల్లా తూర్పు సరిహద్దులో మయన్మార్ దేశం, పశ్చిమ, దక్షిణ సరిహద్దులో నాగాలాండ్ రాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి. ఉత్తర సరిహద్దులో తిరప్ జిల్లా ఉంది. [1]

చరిత్ర[మార్చు]

లంగ్‌డంగ్ జిల్లాలో స్థానికంగా వింకో ప్రజలు నివసించేవారు. ఉత్పత్తి పరంగా ఈ జిల్లా రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాగా గుర్తించబడుతుంది. 2009 ఆగస్టు 7 స్టేట్ కాబినెట్ అప్పటి ముఖ్యమంత్రి డోర్జీ ఖదు ఆధ్వర్యంలో రూపొందించబడింది. [2] 2010 జూన్ 23న జిల్లా సరిహద్దులను నిర్ణయించడానికి రాష్ట్రప్రభుత్వం అధికారిక కమిటీని ఏర్పాటు చేసింది. 2011 ఆగస్టు 11 కమిటీ నివేదికలను పరిశీలించిన తతువాత 2011 సెప్టెంబరు 26న జిల్లారూపొందించబడింది. 2012 మార్చి 19 న జిల్లా ముఖ్యమంత్రి " నాబం తుకి " చేత అధికారింగా గుర్తుంచబడింది.[3]

విభాగాలు[మార్చు]

లంగ్‌డంగ్ జిల్లా 6 డువిషన్లుగా విభజించబడింది: లంగ్‌డంగ్, కనుబరి, పొంగ్చౌ, వాక్క (అరుణాచల్ ప్రదేశ్), పుమావ్, లాను. జిల్లాలో లంగ్‌పొంగ్, నైను, నియౌస, సెనౌనొక్సా, జెడుయా, ంగిను, మిన్‌టంగ్, చను, లంగ్‌చన్, చుబం, రుస్స, రంగ్‌లువ మొదలైనవి.[1]

గణాంకాలు[మార్చు]

లంగ్‌డంగ్ జిల్లా స్థానికంగా నివసించిన వికో ప్రజలు నాగాప్రజలను పోలి ఉంటారు. వారు తుపాకీ తయారీ, కొయ్య శిల్పాలు, పూసల తయారీ వంటి పనులను చేస్తుంటారు. ఈ ప్రజలు ఇప్పటికీ " అనిమిజం " అవలంబిస్తున్నారు. తరువాత వారు క్రైస్తవమతానికి మార్చబడ్డారు. ఇతర స్థానికులలో నోక్టే ప్రజలు, కొన్యాక్ ప్రజలు, నాగా ప్రజలు ప్రధానమైన వారిగా ఉన్నారు. జిల్లా జనసంఖ్య సుమారుగా 60,000.[4]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Longding District". Veethi. Retrieved 5 November 2012.
  2. "Arunachal Pradesh gets its 17th district". timesofindia. Archived from the original on 2013-12-16. Retrieved 5 November 2012.
  3. "Longding becomes 17th Arunachal district". timesofindia. Archived from the original on 2013-01-03. Retrieved 5 November 2012.
  4. "State gets 17th district, Longding". echoofarunachal. Archived from the original on 5 మార్చి 2016. Retrieved 5 November 2012.