Jump to content

లక్షాధికారి

వికీపీడియా నుండి
లక్షాధికారి
(1963 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.మధుసూదన రావు
నిర్మాణం తమ్మారెడ్డి కృష్ణమూర్తి
తారాగణం నందమూరి తారక రామారావు ,
కృష్ణకుమారి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
రేలంగి,
గిరిజ,
నాగయ్య,
మిక్కిలినేని
సంగీతం తాతినేని చలపతిరావు
నిర్మాణ సంస్థ రవీంద్రా ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

లక్షాధికారి 1963, సెప్టెంబర్ 27న విడుదలైన తెలుగు చలనచిత్రం. వి.మధుసూదన రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, కృష్ణకుమారి, గుమ్మడి వెంకటేశ్వరరావు, రేలంగి, గిరిజ, నాగయ్య, మిక్కిలినేని తదితరులు నటించారు.[1]

సంక్షిప్త చిత్రకథ

[మార్చు]

లక్షాధికారి రంగయ్య (నాగయ్య) వద్ద సీతయ్య (గుమ్మడి) నమ్మిన బంటుగా పనిచేస్తుంటాడు. రంగయ్య బావమరది శివం డబ్బు కోసం రంగయ్యను పీడిస్తుంటాడు. వజ్రాల వ్యాపారి హత్యానేరంపై రంగయ్య జైలుకెళతాడు. రంగయ్య కొడుకుని దుండగులు కిడ్నాప్ చేస్తారు. ఆ బిడ్డ కృష్ణానదిలో కొట్టుకుపోతూ అచ్చమ్మ, పిచ్చయ్య దంపతులకు దొరుకుతాడు. రంగయ్య ఆస్తి వ్యవహారాలను సీతయ్య చూస్తూవుంటాడు.

రంగయ్య కొడుకు ప్రసాద్ పెరిగి పెద్దవాడయ్యాడు. సీతయ్య కూతురు పద్మ కూడా పెద్దదౌతుంది. వారిద్దరూ ప్రేమించుకుంటారు. సీతయ్య ప్రసాద్ ప్రతిభను గుర్తించి ప్రసాద్ ప్రొడక్ట్స్ పేరుతో మందుల కంపెనీ స్థాపించి దాని బాధ్యతను ప్రసాద్ కు అప్పజెబుతాడు.

జైలునుంచి వచ్చిన రంగయ్య సీతయ్యను కలుసుకుంటాడు. ఆ రాత్రి తంగయ్య మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. దుండగుల బారినుంచి రంగయ్యను ప్రసాద్ రక్షించి, ఆ ప్రయత్నంలో దెబ్బలుతిని ఆస్పత్రిలో చేరతాడు. తరువాత మారువేషంలో ప్రసాద్ పద్మ సహాయంతో పానకాలు అనే రౌడీ నుంచి రహ్స్యాలు తెలుసుకుంటాడు. ఇంతలో ముసుగు మనిషి పానకాలును కాల్చి చంపి పారిపోతాడు. ప్రసాద్ ఆ ముసుగు మనిషిని పట్టి పోలీసులకు అప్పజెబుతాడు. పద్మ ప్రసాద్ లు వివాహం చేసుకుంటారు.

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
దాచాలంటే దాగదులే దాగుడు మూతలు సాగవులే సి.నారాయణరెడ్డి టి.చలపతిరావు ఘంటసాల
మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది సి.నారాయణరెడ్డి టి.చలపతిరావు ఘంటసాల పి.సుశీల
ఎలాగో వున్నది ఇలాగే వుంటుందా తొలిప్రేమ అన్నది ఆరుద్ర టి.చలపతిరావు పి.సుశీల
  1. అద్దాలమేడ ఉంది అందాల భామ - ఘంటసాల,కె.జమునారాణి,మాధవపెద్ది - రచన: సినారె
  2. అచ్చమ్మకు నిత్యము శ్రీమంతమాయెనే పిచ్చయ్యను చూడ - స్వర్ణలత ,రాణి, వైదేహి, రచన:కొసరాజు
  3. ఎలగో ఎలాగో ఎలాగో ఉన్నది ఇలాగే ఉంటుందా తోలిప్రేమ - సుశీల, రచన:ఆరుద్ర
  4. ఓహొ అందమైన చిన్నదాన బంగారు వన్నెదాన - మాధవపెద్ది, రచన:కొసరాజు
  5. దాచాలంటే దాగదులే దాగుడుమూతలు సాగవులే - సుశీల - రచన: సినారె
  6. దాచాలంటే దాగదులే దాగుడుమూతలు సాగవులే - ఘంటసాల - రచన: సినారె
  7. మబ్బులో ఏముంది నా మనసులో ఏముంది - సుశీల,ఘంటసాల - రచన: సినారె

మూలాలు

[మార్చు]
  1. ఏపి ప్రెస్ అకాడమీ (1963-09-29). "లక్షాధికారి చిత్రసమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 27 September 2017.[permanent dead link]
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.