లక్ష్మీపురం (వీరులపాడు)

వికీపీడియా నుండి
(లక్ష్మిపురం (వీరులపాడు) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
లక్ష్మీపురం (వీరులపాడు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం వీరులపాడు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521181
ఎస్.టి.డి కోడ్

లక్ష్మీపురం కృష్ణా జిల్లా, వీరులపాడు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన వీరులపాడు నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 56 కి. మీ. దూరంలోనూ ఉంది. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588913[1].

తాగు నీరు[మార్చు]

తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.

భూమి వినియోగం[మార్చు]

లక్ష్మీపురంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 5 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 290 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 290 హెక్టార్లు

గ్రామములో రాజకీయాలు[మార్చు]

  • ఈ గ్రామంలో 200 ఘనపు మీటర్ల సామర్ధ్యంతో, ఒక బయో గ్యాస్ ప్లాంటు నిర్మాణం జరుగుచున్నది. కేంద్ర ప్రభుత్వంలోని, సాంప్రదాయేతర ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూపు దిద్దుకుంటున్న ఈ ప్లాంటులో ఉత్పత్తి చేసిన బయోగ్యాసుతో, విద్యుత్తును తయారు చేసి, ప్రక్కనే నిర్మించుచున్న, డైరీ ఫార్మ్ అవసరాలకు వినియోగించెదరు. ఇది త్వరలో నిర్మాణం పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభించును. దీని యజమాని "హెల్దీ ఫార్మ్ ప్రోడక్ట్స్ లిమిటెడ్" అను సంస్థ. ఈ బయో గ్యాసు ప్లాంటు మొత్తం నిర్మాణవ్యయం, రు.20 లక్షలు. దీనిలో 40% ప్రభుత్వ సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన 60% పెట్టుబడి మొత్తం రెండు సంవత్సరాలలో తిరిగి వస్తుందని NREDCAP (New & Renewal Energy Development Corporation of Andhra Pradesh) వారు చెబుచున్నారు. ఈ ప్లాంటు పూర్తి అయి నడుస్తున్నప్పుడు, రోజుకి 3వేల రూపాయల విద్యుత్తు ఖర్చు ఆదా అవుతుందని అంచనా. [1]

మూలాలు[మార్చు]

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

[1] ది హిందు; 2014,మార్చి-12; 2వ పేజీ.