లక్ష్మి (2006 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లక్ష్మి
Lakshmi 2006 Telugu DVD.jpg
దర్శకత్వంవి. వి. వినాయక్
రచనశివ aakula
కథశివ ఆకుల
నిర్మాతనల్లమలపు శ్రీనివాస్
నటవర్గందగ్గుబాటి వెంకటేష్
నయనతార
సాయాజీ షిండే
సునీల్ (నటుడు)
రాజీవ్ కనకాల
బ్రహ్మానందం
ఎల్.బి.శ్రీరామ్
వేణు మాధవ్
ఛాయాగ్రహణంఛోటా కె. నాయుడు
కూర్పుగౌతం రాజు
సంగీతంరమణ గోగుల (పాటలు), మణిశర్మ (నేపథ్య సంగీతం)
నిర్మాణ
సంస్థ
శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్
విడుదల తేదీలు
2006 జనవరి 15 (2006-01-15)
నిడివి
160 నిమిషాలు
భాషతెలుగు

లక్ష్మీ వి. వి. వినాయక్ దర్శకత్వంలో 2006 లో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు చిత్రం. వెంకటేష్, నయన తార ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

కథ[మార్చు]

లక్ష్మీ నారాయణ (వెంకటేష్) ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళు గల ఒక కుటుంబానికి పెద్దగా అన్నీ తానై ఒక సంస్థను కూడా నడిపిస్తుంటాడు. తన తండ్రికిచ్చిన మాట ప్రకారం తమ్ముళ్ళను క్రమశిక్షణలో పెట్టడానికి వారిని శిక్షించడానికి కూడా వెనుకాడడు. వాళ్ళ కంపెనీలో పనిచేసే శైలజ (చార్మి) కి లక్ష్మీ అంటే అభిమానం ఉంటుంది. లక్ష్మీ ఇండస్ట్రీస్ లో ఉద్యోగి యైన జనార్ధన్ (సాయాజీ షిండే) ఒకసారి దొంగ సంతకాల కేసులో ఉద్యోగం కోల్పోయి ఎలాగైనా వారి కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తుంటాడు. లక్ష్మి పెద్ద చెల్లెలు ఒకతని ప్రేమలో పడుతుంది. లక్ష్మి అందుకు సంతోషంగా అంగీకరించి ఘనంగా వివాహం జరిపిస్తాడు. కానీ అతను జనార్ధన్ మేనల్లుడని తరువాత తెలుస్తుంది.

రెండో చెల్లెలికి కూడా పెళ్ళి కుదురుతుంది కానీ లక్ష్మీ పెద్ద చెల్లెలికి చేసినంత ఘనంగా పెళ్ళి ఏర్పాట్లు చేయడు. దీనిని సాకుగా తీసుకుని ఇద్దరు తమ్ముళ్ళు అతన్ని నిలదీస్తారు. దాంతో లక్ష్మి తన గతాన్ని వివరించి చెబుతాడు. నిజానికి అతను, అతని చెల్లెలు అనాథలమనీ, తల్లిదండ్రులు కోల్పోయిన తరువాత బంధువులు పెట్టే బాధలు భరించలేక పారిపోయి వస్తుంటే ఈ కుటుంబం తమను చేరదీసిందనీ చెబుతాడు.

నటవర్గం[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

బయటి లంకెలు[మార్చు]