Jump to content

లక్ష్మీనరసాపురం

వికీపీడియా నుండి
తవుడునూనె తయారుచేయు పరిశ్రమ.

లక్ష్మీనరసాపురం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం లోని రెవెన్యూయేతర గ్రామం..లక్ష్మీనరసాపురం గ్రామం అనపర్తికి మూడు కిలోమీటర్ల దూరంలో రాజమండ్రి-సామర్లకోట (కాకినాడ) రోడ్డుమార్గంలో రైల్వేట్రాక్‌కు దగ్గరగా వున్నగ్రామం.

ఇది ఆంధ్ర ప్రాంతానికి చెందినది. ఇది కాకినాడ నుండి పశ్చిమాన 32 కి.మీ దూరంలో ఉంది. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుండి 436 కి.మీ దూరంలో ఉంది. లక్ష్మీనరస పురం పిన్ కోడ్ 533342. పోస్టల్ ప్రధాన కార్యాలయం అనపర్తి.

లక్ష్మీనరస పురం పశ్చిమాన మండపేట మండలం, దక్షిణాన రాయవరం మండలం, తూర్పున బిక్కవోలు మండలం, దక్షిణాన అలమూరు మండలం చుట్టూ ఉంది.[1]

రామచంద్రపురం, మండపేట, రాజమండ్రి, కొత్తపేట లక్ష్మీనరస పురంకు సమీప నగరాలు.

పంటలు

[మార్చు]

కాలవకు దగ్గరగా పల్లంగా వున్న పొలాలలో వరి పండిస్తారు.అరటి తోటలు, మామిడి తోటలున్నాయి.

పరిశ్రమలు

[మార్చు]

తవుడునుండి నూనెను తీయు పరిశ్రమ, తవుడు నూనెనుండి రెపైండు నూనెను ఉత్పత్తి చెయ్యు పరిశ్రమ (అమ్మిరెడ్డి ఆయిల్స్) ఈ గ్రామ పరిధిలోనే ఉంది.చాలా పౌల్ట్రి ఫారాలున్నాయి., కోడి గుడ్లను నిలువవుంచే అట్టబాక్సులతయారి పరిశ్రమకూడా ఉంది.

మూలాలు

[మార్చు]
  1. "Laxminarasa Puram Village , Anaparthy Mandal , East Godavari District". www.onefivenine.com. Retrieved 2025-09-29.