లక్ష్మీపురం (వీరులపాడు)
Jump to navigation
Jump to search
లక్ష్మీపురం (వీరులపాడు) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | వీరులపాడు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521181 |
ఎస్.టి.డి కోడ్ |
లక్ష్మీపురం కృష్ణా జిల్లా, వీరులపాడు మండలంలోని గ్రామం. ఇది మండల కేంద్రమైన వీరులపాడు నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన విజయవాడ నుండి 56 కి. మీ. దూరంలోనూ ఉంది. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 588913[1].
తాగు నీరు[మార్చు]
తాగునీటి కోసం చేతిపంపులు, బోరుబావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు.
భూమి వినియోగం[మార్చు]
లక్ష్మీపురంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 5 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 290 హెక్టార్లు
- నీటి సౌకర్యం లేని భూమి: 290 హెక్టార్లు
గ్రామములో రాజకీయాలు[మార్చు]
- ఈ గ్రామంలో 200 ఘనపు మీటర్ల సామర్ధ్యంతో, ఒక బయో గ్యాస్ ప్లాంటు నిర్మాణం జరుగుచున్నది. కేంద్ర ప్రభుత్వంలోని, సాంప్రదాయేతర ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రూపు దిద్దుకుంటున్న ఈ ప్లాంటులో ఉత్పత్తి చేసిన బయోగ్యాసుతో, విద్యుత్తును తయారు చేసి, ప్రక్కనే నిర్మించుచున్న, డైరీ ఫార్మ్ అవసరాలకు వినియోగించెదరు. ఇది త్వరలో నిర్మాణం పూర్తి చేసుకొని ఉత్పత్తి ప్రారంభించును. దీని యజమాని "హెల్దీ ఫార్మ్ ప్రోడక్ట్స్ లిమిటెడ్" అను సంస్థ. ఈ బయో గ్యాసు ప్లాంటు మొత్తం నిర్మాణవ్యయం, రు.20 లక్షలు. దీనిలో 40% ప్రభుత్వ సబ్సిడీ ఇస్తుంది. మిగిలిన 60% పెట్టుబడి మొత్తం రెండు సంవత్సరాలలో తిరిగి వస్తుందని NREDCAP (New & Renewal Energy Development Corporation of Andhra Pradesh) వారు చెబుచున్నారు. ఈ ప్లాంటు పూర్తి అయి నడుస్తున్నప్పుడు, రోజుకి 3వేల రూపాయల విద్యుత్తు ఖర్చు ఆదా అవుతుందని అంచనా. [1]
మూలాలు[మార్చు]
[1] ది హిందు; 2014,మార్చి-12; 2వ పేజీ.