లక్ష్మీ ప్రాతూరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లక్ష్మీ ప్రాతూరి

లక్ష్మీ ప్రాతూరి  భారతీయ పారిశ్రామికవేత్త, క్యూరేటర్, ఉపన్యాసకురాలు. ఆమె ఐ.ఎన్.కె సంస్థ వ్యవస్థాపకురాలు, సి.ఈ.వో. ఇంక్ టాక్స్.కామ్ నిర్వహించే లైవ్ ఈవెంట్లకు వ్యాఖ్యాత, క్యూరేటర్ గా వ్యవహరిస్తుంటుంది లక్ష్మి. ఇంక్ సంస్థ నిర్వహణలో జరిగే సింగ్యులారిటీ యు ఇండియా సమ్మిట్ కు ఆమె డైరక్టర్ గా కూడా పనిచేస్తుంది.[1] ఈ సమ్మిట్ ఆసియాలోనే సింగ్యులారిటీ  విశ్వవిద్యాలయం నిర్వహించిన మొట్టమొదటి సమ్మిట్. ఆమె ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాలు, గౌరవాలు అందుకొంది. లక్ష్మికి 2015 ఆడీ రిట్జ్ పురస్కారాల్లో ఇన్స్పిరేషన్ ఐకాన్ గా గౌరవం లభించింది.[2] అలాగే ఫోర్బ్స్ పత్రిక ఆమెను ఉమన్ టు వాచ్ ఇన్ ఆసియా అనే జాబితాలో చేర్చింది.[3] అత్యంత గౌరవప్రదమైన సమావేశాలైన అమెరికా టెడ్ కాన్ఫరెన్సెస్, జర్మనీలో జరిగిన డి.ఎల్.డి కాన్ఫరెన్స్, యుకెలో వైర్డ్ కాన్ఫరెన్స్ లలో వక్తగా పాల్గొంది లక్ష్మి.

మూలాలు[మార్చు]

  1. "SingularityU India Summit".
  2. "The Audi Ritz Icon Awards 2015 dazzle Bengaluru".
  3. "Women to Watch In Asia".