Jump to content

లక్సెట్టిపేట పురపాలకసంఘం

అక్షాంశ రేఖాంశాలు: 18°54′30″N 79°12′41″E / 18.9082189°N 79.2112769°E / 18.9082189; 79.2112769
వికీపీడియా నుండి
లక్సెట్టిపేట పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
లక్సెట్టిపేట పురపాలకసంఘం is located in తెలంగాణ
లక్సెట్టిపేట పురపాలకసంఘం
లక్సెట్టిపేట పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 18°54′30″N 79°12′41″E / 18.9082189°N 79.2112769°E / 18.9082189; 79.2112769
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మంచిర్యాల
మండలం లక్సెట్టిపేట
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌
 - వైస్ చైర్‌పర్సన్‌
వైశాల్యము
 - మొత్తం 33.94 km² (13.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 21,629
 - పురుషుల సంఖ్య 10,962
 - స్త్రీల సంఖ్య 10,667
 - గృహాల సంఖ్య 5,432
పిన్ కోడ్ - 504215
Area code(s) టెలిఫోన్ కోడ్ - 08735
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

లక్సెట్టిపేట పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, మంచిర్యాల జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] లక్సెట్టిపేట పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం లోని మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

చరిత్ర

[మార్చు]

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న లక్సెట్టిపేట, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికం

[మార్చు]

లక్సెట్టిపేట 33.94 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 18°53′17″N 79°12′22″E / 18.888°N 79.206°E / 18.888; 79.206 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 260 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం మంచిర్యాల నుండి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 21,629 మంది కాగా, అందులో 10,962 మంది పురుషులు, 10,667 మంది మహిళలు ఉన్నారు. 5432 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ 11 రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన

[మార్చు]

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 15 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.

వార్డు కౌన్సిలర్లు

[మార్చు]
  1. సురేష్ నాయక్
  2. గాదికొప్పుల ఉమాదేవి
  3. చల్లా నాగభూషణం
  4. సాయిని సుధాకర్
  5. పి. శ్రీనివాస్ గౌడ్
  6. సిహెచ్. రాజన్న
  7. రాందేని సత్తవ్వ
  8. రాందేని వెంకటేష్
  9. ఓరుగంటి శ్రీకాంత్
  10. గొడిసెల లక్ష్మి
  11. ఎన్. కాంతయ్య
  12. పర్వీన్ సుల్తానా
  13. మెట్టు కల్యాణి
  14. చింతా సువర్ణ
  15. షబానా బేగం

మూలాలు

[మార్చు]
  1. "Luxettipet Municipality". luxettipetmunicipality.telangana.gov.in. Retrieved 13 May 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 13 May 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 13 May 2021.
  4. "Basic Information of Municipality, Luxettipet Municipality". luxettipetmunicipality.telangana.gov.in. Retrieved 13 May 2021.[permanent dead link]
  5. admin (2020-05-20). "Luxettipet municipality Councillors list 2020". Telangana data. Retrieved 13 May 2021.{{cite web}}: CS1 maint: url-status (link)

వెలుపలి లంకెలు

[మార్చు]