లక్స్ (సబ్బు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దుస్తులు ఉతికే లక్స్ సబ్బు ప్రకటన, 1916

లక్స్ సబ్బు భారతదేశం లో మొదటిసారి 1909లో, దీనిని సన్‌లైట్ యొక్క ఒక పొరల రూపంలోని సబ్బుగా విడుదల చేశారు. తరువాత దీనిని 1916లో USలో విడుదల చేశారు, దుస్తులు ఉతికే సబ్బుగా, ముఖ్యంగా సున్నితమైన వస్త్రాలు ఉతికే సబ్బుగా దీని విక్రయాలు జరిపారు. మరకలు మరియు ఆ సమయంలో సబ్బుల్లో ఉపయోగించే కఠినమైన లై'లు (బలమైన సోడియం లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ ద్రావణాలు) ద్వారా పట్టు పసువు రంగులోకి మారే భయాలు లేకుండా మహిళలు దుస్తులను ఇంటిలోనే ఉతికేందుకు లివర్ బ్రదర్స్ ప్రోత్సాహాన్ని అందించారు. ఇతర సబ్బుల మాదిరిగా సంప్రదాయ కేకు-ఆకృతిలో సబ్బులను తయారు చేయాల్సిన అవసరం లేకపోవడంతో, పొరల-రకం సబ్బు లై ఉపయోగం విషయంలో తయారీదారుకు కొంత వరకు పరిమితులు సడలించింది. వేగంగా కరిగిపోయే ఈ మృదువైన సబ్బు అందుబాటులోకి వచ్చింది, ఇంటిలో దుస్తులు ఉతికేందుకు ఉపయోగించడానికి ఇది అనువైనదని ప్రచారం చేశారు.[1] లక్స్ ప్రస్తుతం యూనిలివర్ యొక్క ఒక ఉత్పత్తి. "లక్స్" అనే లాటిన్ పదానికి "వెలుగు" అనే అర్థం ఉండటంతోపాటు, "లగ్జరీ" అనే పదాన్ని కూడా ఇది సూచిస్తుండటంతో ఈ సబ్బుకు లక్స్ అనే పేరును స్వీకరించడం జరిగింది.[3]

లక్స్ టాయిలెట్ సబ్బు ను స్నానానికి ఉపయోగించే సబ్బుగా 1925లో USలో పరిచయం చేశారు, UKలో 1928లో లక్స్ సోప్ ఫ్లాక్స్ యొక్క ఒక బ్రాండ్ విస్తరణగా దీనిని విడుదల చేశారు. తరువాత లక్స్ సబ్బును వివిధ రూపాల్లో, అంటే హ్యాండ్‌వాష్, షవర్ జెల్ మరియు క్రీమ్ బాత్ సోప్, తదితర రూపాల్లో విక్రయించడం మొదలుపెట్టారు.

లక్స్ సబ్బును 1909లో భారతదేశంలో విడుదల చేశారు. 1909లో ఈ సబ్బు మొట్టమొదటి ప్రచార ప్రకటనలో లీలా చిట్నీస్ బ్రాండ్ ప్రచారకర్తగా కనిపించారు. భారతదేశంలో దీనిని "చలనచిత్ర నటుల సౌందర్య సబ్బు"గా ప్రచారం చేశారు.

జూన్ 2009నాటికి లక్స్ సబ్బు 100కుపైగా దేశాల్లో విక్రయించబడుతుంది.

ఒక లక్స్ సబ్బు.

ప్రసిద్ధ నటుల ప్రకటనలు[మార్చు]

అర్జెంటీనా మేగజైన్కోసం లక్స్ సబ్బు & జింజర్ రోజర్స్ యొక్క ఒక ప్రచార ఛాయాచిత్రం.

హాలీవుడ్[మార్చు]

1930వ దశకం నుంచి, అనేక మంది ప్రసిద్ధ హాలీవుడ్ నటీమణులు ఈ సబ్బును మహిళలకు ఒక సౌందర్యాన్ని పెంచే సాధనంగా దగ్గర చేసేందుకు ప్రచారం నిర్వహించారు. దీనికి సంబంధించిన ప్రకటనల్లో డోరోథీ లామౌర్[2], జోవాన్ క్రాఫోర్డ్[3], లారెట్ లూయెజ్, జుడీ గార్లాండ్, చెరిల్ లాడ్, జెన్నిఫర్ లోపెజ్, ఎలిజబెత్ టేలర్, డెమీ మూర్, సారా జెస్సికా పార్కర్, కేథరీన్ జెటా-జోన్స్, రాచెల్ వీజ్, అన్నే హాథావే, మరియు మార్లిన్ మన్రో, తదితరులు నటించారు. లక్స్ ప్రకటనలో కనిపించిన మొట్టమొదటి నటుడిగా హాలీవుడ్ నటుడు పాల్ న్యూమాన్ గుర్తింపు పొందారు.[ఆధారం చూపాలి]

బాలీవుడ్[మార్చు]

ఈ బ్రాండ్‌కు ఇప్పటికీ భారతదేశంలో బాలీవుడ్ ప్రముఖ నటులు భారీస్థాయిలో ప్రకటనలు ఇస్తున్నారు.[4] మధుబాల, మాలా సిన్హా, హేమా మాలిని, శ్రీదేవి, మాధురీ దీక్షిత్, జూహీ చావ్లా, కరీష్మా కపూర్, రాణి ముఖర్జీ, అమీషా పటేల్, కరీనా కపూర్ మరియు టాబు అందరూ గతంలో ఈ సబ్బు ప్రచారకర్తలుగా వ్యవహరించారు.[ఆధారం చూపాలి] ఐశ్వర్యారాయ్, ప్రియాంకా చోప్రా మరియు కత్రీనా కైఫ్ ప్రస్తుతం లక్స్ ప్రచారకర్తలుగా ఉన్నారు. ఇదిలా ఉంటే నటి శ్రీయా శరన్ కోలీవుడ్ మరియు టాలీవుడ్ కోసం బ్రాండ్ ప్రచారకర్తగా వ్యవహరించేందుకు ఒప్పందంపై సంతకం చేసింది[4][5]. భారతదేశంలో షారుఖ్ ఖాన్ లక్స్ సబ్బు ప్రచారకర్తగా వ్యవహరించిన మొదటి నటుడిగా గుర్తింపు పొందాడు, ఇప్పుడు అభిషేక్ బచ్చన్ కూడా దీనికి ప్రచారకర్తగా ఉన్నాడు.[6].ప్రస్తుతం గజని నటి ఆసిన్ తొట్టుమ్కాల్ కూడా లక్స్ ప్రచారకర్తగా ఉంది.

పాకిస్థాన్[మార్చు]

పాకిస్థాన్‌లో పరిచయం చేసినప్పటి నుంచి ఈ సబ్బుకు విస్తృత ప్రచారం కల్పించారు. పాకిస్థాన్ మోడళ్లు రీమా ఖాన్, మీరా, అమీనా హాగ్, బాబ్రా షరీఫ్ మరియు పలువురు ఇతర ప్రముఖ మోడళ్లు మరియు నటీమణులు వివిధ కాలాల్లో లక్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించారు. పాకిస్థాన్‌లో లక్స్ ఇప్పటికీ మిగిలినవాటిపై ఆధిపత్యంగల సబ్బు బ్రాండ్‌గా ఉంది, పాకిస్థాన్ యొక్క సౌందర్య తరగతికి ఇది ప్రాతినిధ్యం వహిస్తుంది. లక్స్ స్టైల్ కి దునియా అనే ఒక TV కార్యక్రమంతో ప్రారంభమై, ఇప్పుడు దేశంలోని ప్రముఖ మోడళ్లు మరియు నటులు వార్షిక లక్స్ స్టైల్ అవార్డుల వేడుకలో ప్రతిఏటా పాల్గొంటున్నారు. అలీ జాఫర్ అనే ప్రముఖ పాకిస్థానీ గాయకుడు లక్స్‌కు మొదటి పురుష ప్రచారకర్తగా గుర్తింపు పొందాడు.

ఇతర దేశాలు[మార్చు]

నేపాల్‌లో కూడా లక్స్ సబ్బు బాగా ప్రాచుర్యం పొందింది, నేపాలీ మోడల్-నటి జరానా బజ్రాచార్యను 2003 వేసవిలో లక్స్ ప్రచారకర్తగా నియమించుకున్నారు. తరువాత, ఆమె అనేక TV వాణిజ్యప్రకటనల్లో దర్శనమిచ్చింది. నైజీరియన్ నటి జెనెవీవ్ నాజీ 2004లో లక్స్ ప్రచారకర్తగా కనిపించింది. రెండు దశాబ్దాలకు ముందు, గాయని పాటీ బౌలేయ్ లక్స్‌కు నైజీరియా ప్రచారకర్తగా వ్యవహించింది. నార్వేలో 1950 మరియు 1960వ దశకాల్లో, లక్స్ ప్రకటనల్లో కాల్పనిక ఇటాలియన్ నటీమణులు దర్శనమిచ్చారు. పాకిస్థాన్‌లో లక్స్ సబ్బు సౌందర్య సాధనాల రంగాన్ని ఏలుతుంది, అందానికి ఇది చిరునామాగా గుర్తించబడుతుంది. మొదట చలనచిత్ర నటుల సౌందర్య సబ్బుగా ఇది గుర్తించబడింది, ఇటీవల కాలంలో దీనిని నటుల నుంచి సాధారణ పౌరులకు చేరువ చేయడంపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం దీనికి ఇమాన్ అలీ ప్రచారకర్తగా ఉన్నారు. ఇండోనేషియా నుంచి, తమరా బ్లెయ్‌జెన్‌స్కీ, డియాన్ సాస్ట్రోవార్డోయో, లూనా మేయా, మరియు మరియానా రెనాటాలు లక్స్ ప్రచారకర్తలుగా ఉన్నారు.షరాన్ కునెటా, పాప్స్ ఫెర్నాండెజ్, క్రిస్ అక్వినో మరియు రీజిన్ వెలాస్‌క్వెజ్ వంటి కొందరు ఫిలిప్పీన్స్ మహిళలు కూడా దీనికి ప్రచారకర్తలుగా వ్యవహించారు.[7]

రేడియో షోలకు స్పాన్సర్‌షిప్[మార్చు]

1930 మరియు 1940వ దశకాల్లో అనేక ప్రసిద్ధ రేడియో సిరీస్‌లను లక్స్ సబ్బు స్పాన్సర్ చేసింది, సెసిల్ బి. డిమిల్లే[8] నిర్వహించిన లక్స్ రేడియో థియేటర్ కార్యక్రమాన్ని ఎక్కువ భాగం లక్స్ ప్రాయోజితం చేసింది,[9] విజయం సాధించిన చలనచిత్రాల రేడియో స్వీకరణలను కూడా ఇది ప్రాయోజితం చేసింది, ప్రారంభ సోప్ ఒపెరా అయిన లైఫ్ అండ్ లవ్ ఆఫ్ డాక్టర్ సుసాన్ ,[10] దీనికి ఒక ఉదాహరణ.

అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ప్రదర్శనలు నిర్మించబడినప్పుడు ఈ రేడియో ప్రాయోజిత చర్యలు కారణంగా లక్స్ బాగా ప్రాచుర్యం పొందింది, తరువాత నుంచి అమెరికా ప్రధాన విఫణుల్లో దీని ప్రభావం అదృశ్యమయింది, ఒకప్పుడు ఉన్నటువంటి గుర్తింపు ఇప్పుడు ఈ సబ్బుకు లేదు. అనేక మంది హాలీవుడ్ నటులు లక్స్ రేడియో థియేటర్‌ లో కనిపించేందుకు అమితాసక్తి చూపేవారు, ఈ సబ్బు యొక్క అధిక నాణ్యత వలనే కాకుండా, ఉచితంగా సబ్బులు ఇవ్వడానికి బదులుగా డబ్బు చెల్లిస్తుండటంతో నటులు మరియు నటీమణులు దీనిపై ఎక్కువ ఆసక్తి చూపేవారు. 1950 నుంచి 1959 వరకు, టెలివిజన్‌పై లక్స్ వీడియో థియేటర్ మరియు లక్స్ ప్లేహౌస్‌ లను లక్స్ ప్రాయోజితం చేసింది.

సూచనలు[మార్చు]

  1. "Emergence of Advertising in America: Lux Advertisements (Lever Bros.)". Retrieved 2007-05-22. Cite web requires |website= (help)
  2. "1938 Lux Soap: Dorothy Lamour". Retrieved 2007-04-22. Cite web requires |website= (help)
  3. "Joan Crawford 1929 Lux ad". Retrieved 2007-04-22. Cite web requires |website= (help)
  4. http://www.thehindubusinessline.com/2008/06/03/stories/2008060352382000.htm
  5. http://ibnlive.in.com/news/shriya-saran-set-for-hollywood-debut/66489-8.html
  6. [1]
  7. [2] youtube.com lux commercial
  8. సెసిల్ బి. డెమిల్లే @ క్లాసిక్ మువ్ ఫావరేట్స్ - లక్స్ రేడియో థియేటర్
  9. సెసిల్ బి. డెమిల్లే @ క్లాసిక్ మువ్ ఫావరేట్స్ - లక్స్ రేడియో థియేటర్
  10. "Life and Love of Dr. Susan". Retrieved 2007-04-22. Cite web requires |website= (help)

బాహ్య లింకులు[మార్చు]