లగ్నము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లగ్నము భావము

[మార్చు]

లగ్నము అంటే జాతకచక్రములో మొదటి స్థానము.

 • 1. లగ్నము :- లగ్నము మొదటి స్థానము కనుక లగ్నము లగ్నములో ఉపస్థితమై ఉన్న గ్రహాలు వ్యక్తి యొక్క గుణగణాలను సూచిస్థాయి.
 • 2. ద్వితీయ స్థానము :- ద్వితీయ స్థానము ధన స్థానము కనుక ఇది వ్యక్తి యొక్క ధన సంపత్తి గురించి తెలియ చేస్తుంది. కుంటుంభ స్థానము కనుక ఈ స్థానములో ఉన్న గ్రహాలు వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులను గురిమ్చి తెలియ చేస్తుంది. ఇది వ్యక్తి యొక్క కంఠ స్థానము కనుక ద్వితీయ స్థానములో ఉపస్థిత గ్రహాలు న్యక్తి మాటతీరును సూచిస్తాయి.
 • 3. తృతీయ స్థానము :- తృతీయ స్థానము వ్యక్తి యొక్క కనిష్ఠ సహోదర స్థానము. దీనిని ఉపజయ స్థానము అంటారు.
 • 4. చతుర్ధ స్థానము :- చతుర్ధ స్థానము మాతృ స్థానము కనుక దీనిలో ఉపస్థితమై ఉన్న గ్రహాలు వ్యక్తి యొక్క తల్లిని గురించిన విషయాలు చెప్తాయి. గృహ స్థానము కనుక వ్యక్తి యొక్క గృహయోగము గురించి కూడా తెలియజేస్తుంది. ఇది వాహన స్థానము కనుక వ్య్క్తి యొక్క వాహన యోగమును గురించి కూడా తెలియ చేస్తుంది. ప్రాథమిక విద్యా స్థానము కనుక విద్యా స్థాయి విద్యలో కలిగే ఆంకాలను తెలియ చేస్తుంది. ఇది మోక్ష్ అత్రికోణాలలో ఒకటి. కేంద్ర స్థానాలలో ఒకటి. ఈ స్థానమున ఉపస్థితమైన గ్రహాలు బలము కలిగినవి వ్యక్తి జీవితము మీద ప్రభావము కలిగించ కలిగినవి. ఓగకారకాలు ఔతాయి.
 • 5. పంచమ స్థానము :- పమ్చమ స్థానము వ్యక్తి యొక్క పుత్ర స్థానము కనుక ఇందు ఉపస్థితమైన గ్రహాలు వ్యక్తి యొక్క సంతానము గురించి తెలియ చేస్తాయి. ఇది ఉన్నత విద్యా స్థానము కనుక వ్యక్తి యొక్క ఉన్నత విద్య గురించి తెలియ చేస్తుంది. ఇది పూర్వ పుణ్య స్థానము కనుక పూర్వ జన్మ పుణ్యము గురించి తెలియ చేస్తుంది.
 • 6. షట్మస్థఅనము:- షష్టమ స్థానము ఆరోగ్య స్థానము కనుక వ్యక్తి యొక్క ఆరోగ్య స్థితిని ఇందు ఉపస్థితమైన గ్రహాలు తెలియ చేస్తాయి. ఇది శత్రు స్థానము కనుక శత్రుత్వము గురించి కూడా ఇది తెలియ చేస్తుంది. ఇందు ఉపస్థితమైన గ్రహములు బలహీనములు.
 • 7. సప్తమ స్థానము:- సప్తమ స్థానము కళత్ర స్థానము కనుక ఇది వ్యక్తి యొక్క వైవాహిక జీవితము గురించి తెలియ చేస్తుంది. వ్యాపార భాగ స్వాముల గురించి ఇక్క ఉన్న గ్రహములను అనుసరిమ్చి తెలుసుకొన వచ్చు. ఇది ఒక కేంద్ర స్థానము కనుక ఇందు ఉన్న గ్రహములు బలము కలిగినవి.
 • 8. అష్టమస్థానము :- అష్తమ స్థానము ఆయుఃస్థానము కనుక వ్యక్తి యొక్క మరనము గురిమ్చి ఇది తెలుపుతుంది. ఇందు ఉన్న గ్రహములు బలహీనములు.

మోక్ష త్రికోణములలో ఇది రెండవది కనుక వ్యక్తి యొక్క ఈ జన్మ స్థితి ఈ స్థానము విశదీకరిస్తుంది.

 • 9. నవమ స్థానము :- నవమ స్థానము ఇది పితృ స్థానము కనుక ఇందున్న గ్రహములు వ్యక్తి యొక్క తండ్రి స్థితిని గురించి తెలియ చేస్తాయి. ఇది యోగ స్థానము కనుకఈది వ్యక్తి యొక్క యోగమును గురించి తెలియ చేస్తుంది. త్రికోణ స్థానములలో ఒకటి కనుక ఇందు ఉన్న గ్రహములు బలము కలిగినవి.
 • 10. దశమ స్థానము :- దశమ స్థానము ఇది కర్మ స్థానము కనుక ఇది వ్యక్తి యొక్క వృత్తిని గురించి తెలియ జేస్తుంది. ఇది కేంద్ర స్థానము కనుక ఇందు ఉన్న గ్రహములు బలము కలిగినవి.
 • ఎకాదశ స్థానము :- ఏకాదశ స్థానము లాభస్థానము కనుక ఇది వ్యక్తి యొక్క లాభముల గురించి తెలియ చేస్తుంది. ఇది జ్యేష్ట సహోదర స్థానము కనుక జ్యేష్ట సహోదర స్థాయిని గురించి తెలియ చేస్తుంది.
 • 12 ద్వాదశ స్థానము :- ద్వాదశ స్థానము కనుక ఇది వ్యక్తి యొక్క వ్యయమును గురించి తెలియ చేస్తుంది. ఇందు ఉన్న గ్రహములు బలహీనములు. మోక్ష త్రికోణములో ఇది మూడవది కనుక ఇది వ్యక్తి యొక్క జన్మాంతర స్థితిని, మోక్షమును గురించి తెలియ చేస్తుంది.

లగ్నము మరి కొన్ని వషయాలు

[మార్చు]
 • కేంద్ర స్థానములు లగ్నము నుండి 1,4,7,10 స్థానములు. వీటిని విష్ణుపాదములు అంటారు.
 • కోణ స్థానములు లగ్నము నుండి 5,9 స్థానములు వీటిని లక్ష్మీ స్థానములు అంటారు.
 • జాతకానికి కేంద్రకోణాధిపత్యము వహించు గ్రహములు అజాకుడికి యోగకారక గ్రహాలు.
 • శుభగ్రహాలకు కేంద్రాధిపత్యము దోషము కనుక వారు ఆజాతకానికి పాపులు ఔతారు.
 • పాపగ్రహాలు కేంద్రాధిపతులైన ఆగ్రహములు శుభగ్రహాలు ఔతాయి.
 • లగ్నాధిపతి కేంద్రాధిపత్యము వహించిన అతడు శుభుడే ఔతాడు.
 • రవి చంద్రులకు అష్టమాధిపత్య దోషము లేదు.
 • లగ్నాధిపత్య దోషము రవి, చంద్రులకు ఉండదు.
 • కేంద్రాధిపతి జతకుడికి మేలు చేయడానికి ప్రయత్నిస్తాడు.

వనరులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=లగ్నము&oldid=4081888" నుండి వెలికితీశారు