Jump to content

లలితా ఘాట్

వికీపీడియా నుండి
లలితా ఘాట్
రాత్రివేళ లలితా ఘాట్
ప్రదేశంవారణాసి
అక్షాంశ,రేఖాంశాలు25°18′36″N 83°00′48″E / 25.310013°N 83.013276°E / 25.310013; 83.013276
ఉన్నతి73.9 మీటర్లు
Founded1800-1804
నిర్మించినది19 వ శతాబ్దం
పరిపాలన సంస్థవారణాసి నగరపాలక సంస్థ
యజమానివారణాసి నగరపాలక సంస్థ
లలితా ఘాట్ is located in Varanasi district
లలితా ఘాట్
Varanasi district లో లలితా ఘాట్ స్థానం

లలితా ఘాట్, వారణాసిలో గంగా నదిపై ఉన్న ప్రధాన స్నానఘట్టాల్లో ఒకటి. ఈ ఘాట్‌కు హిందూ దేవత లలిత పేరు పెట్టారు. దీనిని 19 వ శతాబ్దం ప్రారంభంలో నేపాల్ రాజు రాణా బహదూర్ షా నిర్మించాడు. ఈ ఘాట్‌లో ప్రసిద్ధ నేపాలీ మందిరం, లలితా గౌరీ మందిరం ఉన్నాయి.[1]

చరిత్ర

[మార్చు]
రాణా బహదూర్ షా, నేపాల్ రాజు

నేపాల్ రాజు, రాణా బహదూర్ షా 1800 నుండి 1804 వరకు వారణాసిలో ప్రవాస జీవితం గడిపాడు. అపుడు "స్వామి నిర్గుణానంద" అని పేరుతో వ్యవహరించాడు. ఆ అజ్ఞాతవాస సమయంలోనే, వారణాసిలో పశుపతినాథ ఆలయ ప్రతిరూపాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. ఆయన వారణాసిలో ఉన్న సమయంలోనే ఆలయ నిర్మాణం ప్రారంభమైంది. నిర్మాణ సమయంలో షా తిరిగి నేపాల్‌కు వెళ్లాడు. 1806 ఏప్రిల్ 25 న, రాణా బహదూర్ షాను అతని సవతి సోదరుడు షేర్ బహదూర్ షా కత్తితో పొడిచి చంపాడు. అతని కుమారుడు గిర్వాన్ యుద్ధ బిక్రమ్ షా దేవ, దేవాలయ నిర్మాణం (ప్రస్తుత నేపాలీ మందిర్ అని పిలుస్తారు), ధర్మశాల, లలితా ఘాట్‌ల నిర్మాణం కొనసాగించాడు. గడువు ముగిసిన 20 ఏళ్ల తర్వాత నిర్మాణం పూర్తయింది.[2][3][4]

ప్రాముఖ్యత, మత విశ్వాసం

[మార్చు]

ఈ ఘాట్‌కు హిందూ దేవత లలిత పేరు పెట్టారు. పురాణాల్లోని పది మంది దేవతలలో లలితా దేవి ఒకరు. ఈ పది మంది దేవతలను సమిష్టిగా మహావిద్యలు లేదా దశ-మహావిద్యలు అని పిలుస్తారు. దశ-మహావిద్యలలో లలితా దేవి అగ్రగామి. అన్ని ఇతర మహావిద్యలు ఆమె విద్య అనగా శ్రీవిద్యలో ముగుస్తాయి. ఆమె భర్త మహా కామేశ్వరుడు. ఆమె ఆది శక్తి దేవి అత్యున్నతమైన అంశ. పార్వతి లలితా మహా త్రిపుర సుందరి యొక్క సంపూర్ణ అవతారం.

ఈ స్థలానికి అనుబంధంగా గంగా కేశవ లింగం, గంగాతీత్య, కాశీ దేవి, లలితా దేవి, భగీరథ తీర్థాలు ప్రసిద్ధి చెందాయి. లలితా దేవి దర్శనం, మొత్తం ప్రపంచాన్ని ప్రదక్షిణ చేసినంత పుణ్యాన్ని ఇస్తుందని ఒక ప్రసిద్ధ నమ్మకం. లలితా దేవి ఆశీర్వాదం సమస్యలను తొలగిస్తుందని, శ్రేయస్సును ఇస్తుందని కూడా నమ్ముతారు.[1][5]

స్థానం

[మార్చు]

లలితా ఘాట్ గంగానది ఒడ్డున ఉంది. ఇది వారణాసి జంక్షన్ రైల్వే స్టేషన్‌కు ఆగ్నేయంగా 3.8 కిలోమీటర్లు, మణికర్ణిక ఘాట్‌కు నైరుతి దిశలో 100 మీటర్ల దూరంలో ఉంది.[6]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "History". Varanasi.org. Retrieved 9 Aug 2015.
  2. "Nepali Mandir". ixigo.com. Retrieved 9 Aug 2015.
  3. "A piece of Nepal in Varanasi". The Times of India. Retrieved 9 Aug 2015.
  4. "This ghat of Goddess Lalita". The Times of India. Retrieved 9 Aug 2015.
  5. "Ghats in Varanasi". Varanasi.nic.in. Retrieved 9 Aug 2015.
  6. "Location". Google Maps. Retrieved 9 Aug 2015.