లలితా శివకుమార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లలితా శివకుమార్ ప్రముఖ కర్ణాటక సంగీత ఉపాధ్యాయిని మరియు స్వరకర్త.

జీవిత విశేషాలు[మార్చు]

ఆమె భర్త ఐ.శివకుమార్ ప్రముఖ సంగీత విద్వాంసురాలైన డి.కె.పట్టమ్మాళ్ కుమారుడు. ఆయన కూడా మృదంగ విద్వాంసుడు. ఆమె తన అత్తగారైన ప్రముఖ సంగీత విద్వాంసురాలు డి.కె.పట్టమ్మాళ్తో కచేరీలలో పాల్గొనేది..[1] లలితా శివకుమార్ ప్రముఖ సంగీత విద్వాంసురాలు నిత్యశ్రీ మహదేవన్కు తల్లి మరియు గురువు.[2]

ఆమె తండ్రి పాల్గాట్ మణి అయ్యర్ కర్ణాటక సంగీత రంగంలో మృదంగ కళాకారుడు. ఆయన సంగిత కళానిధి మరియు పద్మభూషణ అవార్డులు పొందిన మొదటి మృదంగ వాద్యకారుడు. లలిత తన 18అ యేట డి.కె.పట్టమ్మాళ్ కుమారుడైన ఐ.శివకుమార్ను వివాహమాడారు. వివాహమాడిన రెండవ రోజున ఆమె డి.కె.పట్టమ్మాళ్ వద్ద సంగీత శిక్షణ ప్రారంభించారు.[1] తరువాత యిద్దరూ సోలో ప్రదర్శకులుగానూ, పట్టమ్మాళ్ కూ సంగీత సహకారానికి తోడుగా వెళ్ళి అనేక మంది యితర సంగీత ప్రముఖులైన డి.కె.జయరామన్, కె.వి.నారాయణస్వామి మరియు ఎం.ఎస్.సుబ్బలక్ష్మీ ల ప్రశంసలు అందుకుంది.[1]

లలితా శివకుమార్ అనేక కృతులను, తిల్లానాలను మరియు భజనలను అనేక భారతీయ భాషలలో స్వరపరచారు.

అంతే కాకుండా కుమార్తె నిత్యశ్రీ మహదేవన్ మరియు మనుమరాలు లావణ్యా సుందరరామన్ కూడా ఆమె శిష్యులే.[1] మహారాజపురం శ్రీనివాసన్, నిరంజన శ్రీనివాసన్, [3] పల్లవి ప్రసన్న, [4] నళిని కృష్ణన్ లతో పాటు అనేక మంది శిష్యులు ఉన్నారు.[5]

మూలాలు[మార్చు]