లలిత (నటి)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లలిత
జననం(1930-12-12)1930 డిసెంబరు 12
తిరువనంతపురం, ట్రావన్కోర్, కేరళ
మరణం1983
వృత్తినటి, నృత్యకళాకారిణి
తల్లిదండ్రులు
  • గోపాల పిళ్లై (తండ్రి)
  • సరస్వతమ్మ (తల్లి)

లలిత భారతీయ సినిమానటి, నర్తకి. ఈమె ట్రావన్‌కోర్ సిస్టర్స్ గా ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిలలో మొదటి సోదరీమణి.[1]

విశేషాలు[మార్చు]

ఈమె 1930, డిసెంబరు 12న కేరళ రాష్ట్రానికి చెందిన ట్రవన్కోర్ సంస్థానంలో తిరువనంతపురంలో గోపాలపిళ్లె, సరస్వతి అమ్మలకు జన్మించింది. ఈమె 1938లో అదిథన్ కనవు అనే తమిళ చిత్రంద్వరా సినిమా రంగప్రవేశం చేసింది. ఈమె తెలుగు, మళయాలం, తమిళ, హిందీ చిత్రాలలో నటించింది. ఈమె చెల్లెళ్లు పద్మిని, రాగిణులు కూడా నర్తకులుగా, సినీనటులుగా రాణించారు. ఈమె తన సోదరీమణులతో కలిసి వెంపటి చినసత్యం వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకుంది[2]. ఈమె తన సోదరీమణులకంటే ముందుగా సినిమా రంగంలో ప్రవేశించింది. ఎక్కువగా మలయాళ సినిమాలలో నటించి వ్యాంపు పాత్రలలో ఎక్కువ పేరు సంపాదించింది. సినిమా నటి శోభన ఈమె మేనకోడలు. ఈమె 1983లో మృతి చెందింది.

తెలుగు సినిమాల జాబితా[మార్చు]

లలిత నటించిన తెలుగు చలనచిత్రాల పాక్షిక జాబితా:

విడుదలైన సంవత్సరం సినిమా పేరు ఇతర నటులు దర్శకుడు
1943 పతిభక్తి పి.ఎస్.శ్రీనివాసరావు, దాసరి సుబధ్ర పి.ఎస్.శ్రీనివాసరావు
1950 బీదలపాట్లు చిత్తూరు నాగయ్య, పద్మిని కె.రామనాథ్
1951 పెళ్లికూతురు ఎన్.ఎస్.కృష్ణన్, పద్మిని ఎన్.ఎస్.కృష్ణన్
1952 కాంచన కె.ఆర్.రామస్వామి, పద్మిని, ఎం.ఆర్.సంతానలక్ష్మి ఎస్.ఎమ్.శ్రీరాములు
1952 సింగారి టి.ఆర్.రామచంద్రన్, పద్మిని, రాగిణి
1953 అమ్మలక్కలు ఎన్.టి.రామారావు,పద్మిని,బి.ఆర్.పంతులు డి.యోగానంద్
1953 ఒక తల్లి పిల్లలు శ్రీరాం, టి.ఎస్.దొరైరాజ్, పద్మిని, పి.శాంతకుమారి ఎ.ఎస్.ఎ. స్వామి
1953 దేవదాసు అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి వేదాంతం రాఘవయ్య
1955 అంతా ఇంతే శివాజీ గణేశన్, పద్మిని, రాగిణి ఆర్.ఎం.కృష్ణస్వామి
1955 విజయగౌరి ఎన్.టి. రామారావు,పద్మిని,రాగిణి డి.యోగానంద్
1960 శివగంగ వీరులు ఎస్.వరలక్ష్మి,కమలా లక్ష్మణ్, ఎం.ఎన్.రాజం
1961 విప్లవ స్త్రీ ఆనందన్, ఎం.ఆర్.రాధా,పండరీబాయి ఎం.ఎ.తిరుముగం

మూలాలు[మార్చు]

  1. "Lalitha of the Travancore Sisters". Archived from the original on 2017-03-29. Retrieved 2017-03-05.
  2. కూచిపూడి కళాప్రపూర్ణ: Dr. Vempati – Maestro With a Mission

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=లలిత_(నటి)&oldid=3886280" నుండి వెలికితీశారు