Jump to content

లవంగ నూనె

వికీపీడియా నుండి

లవంగము
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
షై. ఏరోమేటికమ్
Binomial name
షైజీజియం ఏరోమేటికమ్
(లి.) Merrill & Perry
Clove (Syzygium aromaticum) essential oil in clear glass vial

లవంగ నూనె ఒక ఆవశ్యక నూనె.దీనిని ఆయుర్వేద వైద్యంలో, వైద్యపరంగా పంటి నొప్పి నివారణకు ఉపయోగిస్తారు. లవంగ నూనెలో టెర్పైనుసంబంధిత రసాయన సమ్మేళనాలు ఎక్కువ వున్నవిను. లవంగ నూనెలో యూజనోల్ ఎక్కువ శాతంలో దాదాపు 70–80 %వరకు ఉండును. లవంగాలను ముఖ్యంగా మసాలా దినుసుగా వంటలలో ఉపయోగిస్తారు.లవంగ నూనెను లవంగ పూమొగ్గల నుండి, ఆకులనుండి., చెట్టు కాండం నుండి తయారు చేస్తారు.ఆకులనుండి తీసిన నూనెను లవంగ ఆకుల నూనె అంటారు. లవంగ ఆకుల నూనెను నీటి ఆవిరి స్వేదన క్రియ/స్టీమ్ డిస్టీలేసన్ పద్ధతిలో సాధారణంగా ఉత్పత్తి చేస్తారు. పారదర్శకంగా పసుపు రంగులో వుండును. నూనె లవంగాల రుచి, వాసన కల్గి వుండును

ఆవశ్యక నూనెలు అనగానేమి

[మార్చు]

ఆవశ్యక నూనెలు అనేవి మొక్కల నుండి, చెట్లనుండి ఉత్పత్తిచేయు నూనెలు. ఆవశ్యక నూనెలలో అత్యధిక భాగం మొక్కల/చెట్ల భాగాల నుండి అనగా ఆకులు, వేర్లు, కాండంల బెరడు, కాండం, పూమొగ్గలు, పూలరెమ్మలు, పళ్ల పైనున్న తొక్కలు (peels/skins) వంటి వాటిలో లభించును.[1] అతితక్కువగా కొన్ని రకాల ఆవశ్యక నూనెలను విత్తానాల నుండి తీయుదురు. వీటిని నూనెలని వ్యవహరించినను వీటిలో కొవ్వు ఆమ్లాలు వుండవు. ఆవశ్యక నూనెలు జలవికర్షణ (hydrophobic) లక్షణం కలిగి, నూనెలలో, హైడ్రొకార్బను సాల్వెంట్ లలో కరుగు లక్షణాలు కలిగి వుండును. ఆవశ్యక నూనె లన్నియు సువాసన కలిగిన నూనెలే. ప్రతి ఆవశ్యక నూనె తనకంటూ ఇక ప్రత్యేక వాసన కలిగి వుండును. ఆవశ్యక నూనెలలో ఒకటి రెండు మినగా యించి మిగతా నూనెలన్నియు తక్కువ బాష్పికరణ/మరుగు ఉష్ణోగ్రత వున్న నూనెలే.తక్కువ ఉష్ణోగ్రత వద్దనే బాష్పీకరణ చెందు ద్రవాలను ఒలటైలులు (volatiles) అంటారు. ఆవశ్యకనూనెలను మొక్కల/చెట్ల యొక్క ఎసెన్సు (Essence=సారం) లు అని కూడా అంటారు. ఆవశ్యక నూనెలు సువాసన భరితాలు కావటం వలన అనాదిగా వీటిని సువాసన/సుగంధ ద్రవ్యాలు/నూనెలుగా (perfumes), సౌందర్య లేపనాలలో/నూనెలలో (cosmetics) విరివిగా వాడెవారు. అలాగే సుధూప (incense) ద్రవ్యాలను (అగరుబత్తి, గుగ్గిలం, సాంబ్రాణి, వంటివి) కూడా ఆవశ్యక నూనెల నుండి తయారు చేసెవారు. దేశియ వైద్యవిధానాలలో దేహబాధ నివారణ (కండరాల, కీళ్ళ నొప్పులు) కై మర్ధన నూనెలుగా కొన్ని ఆవశ్యక నూనెలను ఉపయోగించెవారు. కొన్ని రకాల చర్మ వ్యాధులకు ఆవశ్యక నూనెలను వినియోగించెవారు. ఈ మధ్యకాలంలో అరోమ థెరపి (aromatherapy) అనే ప్రత్యాన్యమయ వైద్య విధానం ఒకటి బాగా ప్రాచర్యం పొందినది. ఈ అరోమ థెరపి[2]లో ఆవశ్యక నూనెలను వాడెదరు. క్రీస్తుకు పూర్వం 1800సంవత్సరంనాటీకీ ఆవశ్యకనూనెలను అరోమా థెరఫిలో ఉపయోగించినాట్లు తెలుస్తున్నది.భారతదేశంలో ఆయూర్వేదవైద్యంలోకూడా కొన్నివందలసంవత్సరాలుగా వాడిన దాఖాలాలు కన్పిస్తున్నాయి. క్రీ.పూ.2880నాటికే గ్రీసు, రోములలో పురాతన ఈజిప్టు పాలకుడు ఖుఫు (khufu) పాలనకాలంనాటికే సుగంధద్రవ్యాలలో, అవశ్యకపునూనెలను కలిపి ఉపయోగించినట్లుగా తెలుస్తున్నది[3]

లవంగ చెట్లు జన్మ స్థానం

[మార్చు]

లవంగచెట్లు జన్మ స్థానం ఇండోనేసియా.ఇండొనేషియాలోని స్పైస్‌ ఐల్యాండ్స్‌గా పిలిచే మొలక్కస్‌ దీవులే వీటి స్వస్థలం. వీటిని బ్రెజిల్‌, ఇండియా, వెస్టిండీస్‌, మారిషస్‌, జాంజిబార్‌, శ్రీలంక, పెంబా దేశాల్లోనూ పండిస్తున్నారు.

లవంగ చెట్టు

[మార్చు]

లవంగ చెట్టు వృక్షశాస్త్రంలో మాగ్నోలియోప్సిడా తరగతికి, మిర్టేసి కుటుంబానికి చెందిన మొక్క.వృక్షశాస్త్రపేరు షైజీజియం ఏరోమేటికం.

లవంగ నూనె భౌతిక లక్షణాలు

[మార్చు]

లవంగ నూనె ద్రవం.లవంగనూనె అణుభారం:205.642 గ్రాములు/మోల్.రసాయన ఫార్ములాC7H12ClN3O2.[4] 25°Cవద్ద లవంగ నూనె సాంద్రత: 1.05 గ్రాములు/మి.లీ, ద్రవీభవన ఉష్ణోగ్రత :251 °C,.[5] వర్ణరహితంగా లేదా లేత పసుపు రంగులోవుండును. లవంగ నూనె 23 రకాల రసాయన పదార్థాలను కల్గివున్నది.

లవంగ నూనెలోని రసాయనాలు

[మార్చు]

లవంగ నూనెలోని ముఖ్య రసాయానాలు టేర్పెనులు (terpenes) వాటి అనుబంధ రసాయనాలు. లవంగ నూనెలోని టేర్పెనులు యూజనోల్, యూజనోల్ ఆసిటేట్, కారియోఫిలైన్ (caryophylen) లు. పూల మొగ్గల నుండి తీసిన నూనెలో యూజనోల్ 60–90% వరకు వుండును.ఆకుల నూండి తీసిన నూనెలో 82–88%వరకు యూజనోల్, ఆకుల నుండి తీసిన నూనెలో యూజనోల్ ఆసిటేట్ ఉండడు.లేదా అతి స్వల్ప ప్రమాణంలో ఉండును.చెట్టు రెమ్మలనుండి తీసిన నూనెలో యూజనోల్90–95% వరకు వుండును. లవంగ నూనె (ఆకుల నూనె) లోని కొన్ని ముఖ్య రసాయనాలు[6]

వరుస సంఖ్య రసాయన పదార్థం శాతం
1 eugenol 76.8%
2 β-caryophyllene 17.4%
3 α-humulene 2.1%
4 eugenyl acetate 1.2%

లవంగ నూనె ఉత్పత్తి

[మార్చు]

హైడ్రో డిస్టిలేసన్ పద్ధతిలో లేదా ఆవిరి ఉత్పత్తి పద్ధతిలో లవంగ నూనెను ఉత్పత్తి చేస్తారు.ఒక పాత్రలో లవంగ ఆకులను తీసుకుని దాన్నిని నీటి ఆవిరిద్వారా వేడి చేస్తారు. ఆకులనుండి వెలుబడు లవంగ నూనె, నీటి ఆవిరులను ఒక కండెన్సరుకు పంపి వాటిని ద్రవీకరిస్తారు.నీటిలో లవంగ నూనె కరుగదూ.కావున నూనె నీరు రెందూ పొరలుగా/మట్టాలుగా ఏర్పడును.నూనెను వేరు చేసి, వడబోత చేసి బాటిల్లో నిలువ చేస్తారు.డిస్టిలేసనుకు 5-6 గంటలు పట్టును. లవంగ నూనె, నీరు వేరుపడుటకు ఆమిశ్రమాన్ని కొన్ని గంటలు కదలకుండా నిశ్చలంగా వుంచాలి.అవసరమైనచో నూనె రంగును తగ్గించుటకు బ్లిచింగు చేస్తారు. హైడ్రో డిస్టిలేసన్ అనగా డిస్టిలేసన్ ఆత్రలో తీసుకున్న లవంగ ఆకులు మునిగే వరకు నీరును నింపి, తరువాత నపాత్రను వేడీ చేస్తారు.వేడికి మొదట నీౠ వేడెక్కి ఆవిరిగా మారును.ఆవిరి లవంగ ఆకుల్లోని నూనెను బాష్పీకరించును.నూనె ఆవిరులు నీటి ఆవిరితో పాటు కండెన్సరుకు వెళ్ళి ద్రవీకరణ చెందును.

ఉపయోగాలు

[మార్చు]
  • దక్షిణ కోరియా, ఇండియా దేశాల్లో లవంగ నూనెను పంటి నొప్పి నివారిణిగా ఉపయోగిస్తారు.

చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-08-07. Retrieved 2018-08-05.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-06-05. Retrieved 2018-08-05.
  3. http://voices.yahoo.com/history-essential-oils-their-medical-847407.html?cat=5[permanent dead link]
  4. "CLOVE OIL". pubchem.ncbi.nlm.nih.gov. Archived from the original on 2018-01-30. Retrieved 2018-08-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  5. "Clove oil". chemicalbook.com. Archived from the original on 2017-12-25. Retrieved 2018-08-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  6. "Chemical Composition and Antioxidant Properties of Clove Leaf Essential Oil". pubs.acs.org/. Retrieved 2018-08-02.
"https://te.wikipedia.org/w/index.php?title=లవంగ_నూనె&oldid=4299333" నుండి వెలికితీశారు