లవర్స్ డే
లవర్స్ డే | |
---|---|
దర్శకత్వం | ఒమర్ లులు |
స్క్రీన్ ప్లే | సారంగ్ జయప్రకాష్, లిజో పనాడా |
నిర్మాత | ఎ.గురురాజ్, సి.హెచ్.వినోద్ రెడ్డి |
తారాగణం | ప్రియా వారియర్, నూరిన్ షెరీఫ్, రోషన్ |
ఛాయాగ్రహణం | శీను సిద్ధార్థ్ |
కూర్పు | అచ్చు విజయన్ |
సంగీతం | షాన్ రెహమాన్ |
విడుదల తేదీ | 14 ఫిబ్రవరి 2019 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
లవర్స్ డే 2019లో విడుదలైన తెలుగు సినిమా. సుఖీభవ సినిమా బ్యానర్ పై ఎ.గురురాజ్, సి.హెచ్.వినోద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు ఒమర్ లులు దర్శకత్వం వహించాడు. ప్రియా ప్రకాష్ వారియర్, రోషన్, నూరిన్ షెరీఫ్, మాథ్యూ జోసఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 14, 2019న విడుదలైంది.[1][2]
కథ
[మార్చు]రోషన్ (మహ్మద్ రోషన్), ప్రియ (ప్రియ ప్రకాష్ వారియర్) డాన్ బాస్కో స్కూల్లో జూనియర్ ఇంటర్ చదువుతుంటారు. రోషన్, ప్రియ మధ్యలో ప్రేమ కన్ను కొట్టడంతో మొదలై ముద్దులు పెట్టుకోవడం వరకు సాగుతుంది. అయితే ఓ సారి అనుకోకుండా కొన్ని న్యూడ్ వీడియోస్ రోషన్ వాట్సాప్ నెంబర్ నుంచి కాలేజీ వాట్సాప్ గ్రూపులోకి అప్‌లోడ్ అవుతాయి. ఇద్దరి ప్రేమాయణం సాఫీగా సాగిపోతున్న ఈ సమయంలో రోషన్ చేసిన తప్పు వల్ల అతడికి ప్రియ దూరమవుతుంది. ప్రియ మునుపటిలా రోషన్‌ను ప్రేమించాలంటే ఆమెలో ఈర్ష్య పుట్టాలని, అందుకు రోషన్ గాథ (నూరిన్ షెరీఫ్) ను ప్రేమిస్తున్నట్టు నటిస్తాడు. ఆ తర్వాత రోషన్, ప్రియల ప్రేమ ఏమైంది? అనేది మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- మాథ్యూ జోసఫ్
- వైశాఖ్ పవనన్
- మైఖేల్ యాన్ డేనియల్
- దిల్ రూపా
- హరీష్ పెరుమన్న
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సుఖీభవ సినిమా
- నిర్మాత: ఎ.గురురాజ్, సి.హెచ్.వినోద్ రెడ్డి
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఒమర్ లులు
- సంగీతం: షాన్ రెహమాన్
- పాటలు: చంద్రబోస్, చైతన్య ప్రసాద్, శివ గణేష్, శ్రీ సాయికిరణ్
- సినిమాటోగ్రఫీ: శీను సిద్ధార్థ్
- ఎడిటింగ్: అచ్చు విజయన్
మూలాలు
[మార్చు]- ↑ Mana Telangana (2 February 2019). "సంపూర్ణమైన వినోదంతో 'లవర్స్ డే'". Archived from the original on 12 August 2021. Retrieved 12 August 2021.
- ↑ Vaartha (3 February 2019). "14న ప్రియ వారియర్ 'లవర్స్ డే'". Archived from the original on 12 August 2021. Retrieved 12 August 2021.