లష్కర్ సింగారం
లష్కర్ సింగారం | |
— రెవిన్యూ గ్రామం — | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 18°02′09″N 79°34′28″E / 18.03596240259429°N 79.57432572283037°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హన్మకొండ |
మండలం | హన్మకొండ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 506009 |
Area code(s) | 0870 |
ఎస్.టి.డి కోడ్ |
లష్కర్ సింగారం, తెలంగాణ రాష్ట్రం, హన్మకొండ జిల్లా, హన్మకొండ మండలం లోని గ్రామం.[1][2] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత వరంగల్ జిల్లాలో, ఇదే మండలంలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో దీన్ని కొత్తగా ఏర్పాటు చేసిన వరంగల్ గ్రామీణ జిల్లా లోకి చేర్చారు. [3][4] ఆ తరువాత 2021 లో, వరంగల్ పట్టణ జిల్లా స్థానంలో హనుమకొండ జిల్లాను ఏర్పాటు చేసినపుడు ఈ గ్రామం, మండలంతో పాటు కొత్త జిల్లాలో భాగమైంది.[4]
సమీప ప్రాంతాలు
[మార్చు]ఇక్కడికి సమీపంలో డాక్టర్స్ కాలనీ, కాకతీయ కాలనీ, ప్రశాంత్ నగర్, రాజాజీ నగర్, గోపాల్‌పూర్, విద్యానగర్, సమ్మయ్య నగర్ వాజ్‌పాయినగర్ 1,2, ఫారెస్టు కాలనీ, పోచమ్మకుంట, ప్రేమ్‌నగర్ కాలనీ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
వైద్యరంగం
[మార్చు]ఈ గ్రామంలోని అర్బన్ హెల్త్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సాయంత్రం క్లినిక్ లు సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు పనిచేస్తాయి. ఇందులో ఒక ఎంబీబీఎస్ వైద్యుడు, ఒక స్టాఫ్ నర్సు సేవలందిస్తారు. ప్రతి రోజు 22 నుంచి 30 మంది వరకు రోగులు వీటి వైద్యసేవలను అందుకుంటున్నారు.[5]
ప్రార్థనా మందిరాలు
[మార్చు]- ఆంజనేయ దేవాలయం
- శివాలయం
- సాయిబాబా దేవాలయం
- ఆయేషా మసీదు
- నూర్ మసీదు
- మసీదు ఇ అక్బరి
- ఆల్ఫా ఒమేగా చర్చి
- బెతేల్ బాప్టిస్ట్ చర్చి
పాఠశాలలు
[మార్చు]- ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
- వివేకవర్ధిని ఎయిడెడ్ యుపిఎస్ స్కూల్
- శ్రీవాణి నికేతన్ యుపిఎస్ స్కూల్
- శ్రీసూర్య యుపిఎస్ స్కూల్
- హరిహర యుపిఎస్ స్కూల్
- ఏకశిల హెచ్ఎస్ స్కూల్
ఇతర వివరాలు
[మార్చు]- ఉద్యోగాలకోసం విదేశాలకు వెళ్ళేవారికి ఇక్కడి అర్బన్ హెల్త్ సెంటర్ లో కరోనా వ్యాక్సిన్ వేశారు.[6]
- రూ.3.50 కోట్లతో వడ్డేపల్లి సర్పస్ నాలాపై గోడలు నిర్మించారు.
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "Lashkar Singaram, Naim Nagar Locality". www.onefivenine.com. Retrieved 2021-09-28.
- ↑ "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ 4.0 4.1 G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
- ↑ ఈనాడు, హనుమకొండ జిల్లా (26 April 2021). "అందుబాటులోకిప్రాథమిక వైద్యం". EENADU. Archived from the original on 28 September 2021. Retrieved 28 September 2021.
- ↑ The Hindu, Telangana (28 June 2021). "COVID vaccine for people set to go abroad for jobs". Archived from the original on 10 July 2021. Retrieved 28 September 2021.