లహరి గుడివాడ

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
లహరి గుడివాడ
Lahari Gudivada.jpg
జననం (1988-04-01) 1 ఏప్రిల్ 1988 (వయస్సు: 29  సంవత్సరాలు)
గుంటూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
నివాసం గుంటూరు, ఆంధ్రప్రదేశ్, భారతదేశం
జాతీయత భారతీయురాలు
జాతి తెలుగు
వృత్తి నటి

లహరి గుడివాడ ప్రముఖ రంగస్థల నటీమణి.[1] 2014లో రంగస్థలంపై అడుగు పెట్టిన లహరి, ఇప్పటివరకు 400 నాటక, నాటికల ప్రదర్శనలలో పాల్గొని, అనేక పరిషత్తులలో ఉత్తమ నటిగా బహుమతులు, సత్కారాలు అందుకుంది.

జననం - విద్యాభ్యాసం[మార్చు]

లహరి 1988, ఏప్రిల్ 1న గుంటూరులో జన్మించింది. తండ్రి వ్యాపారి, తల్లి జూనియర్ కళాశాల అధ్యాపకురాలు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసిన లహరి, ప్రస్తుతం పర్యాటకశాస్త్రంలో పి.జి. చదువుతుంది.

లహరి గుడివాడ గురించి ఈనాడులో వచ్చిన వార్త

నటనపై ఆసక్తి[మార్చు]

హోటల్ మేనేజ్ మెంట్ కళాశాలను నడుపుతున్న సమయంలో నటనపై ఈటీవి పరిపూర్ణ మహిళ కార్యక్రమంలో సెమీ ఫైనల్ వరకు వెళ్లింది. స్మైల్ రాణి స్మైల్, డ్యాన్స్-2001, ఛాలెంజ్-2002 పోటీల్లో విజేతగా నిలిచింది.[1]

రంగస్థల ప్రస్థానం[మార్చు]

లహరి 2014లో రంగస్థలంపై అడుగు పెట్టింది. ఇప్పటివరకు 400 నాటక, నాటికల ప్రదర్శనలలో పాల్గొన్నది. అనేక పరిషత్తులలో ఉత్తమ నటిగా బహుమతులు, సత్కారాలు అందుకుంది.

ఉషోదయా కళానికేతన్ వారి సత్కారం అందుకుంటున్న లహరి

నటించినవి[మార్చు]

పెళ్లిచేసి చూడు, వైనాట్, పోవోయి అనుకోని అతిథి, రెండు నిశబ్ధాల మధ్య, బ్రతకనివ్వండి, ఆశ్రిత, అభయ, పల్లవి అనుపల్లవి, ఆఖరి ఉత్తరం, బైపాస్, సరికొత్త మనుషులు, అరసున్న, నిషిద్దాక్షరి, తగునా ఇది భామా, ఇరుసంధ్యలు, గోవు మాలచ్చిమి, బతుకుచిత్రం, గుర్తు తెలియని శవం, నల్లజర్ల రోడ్డు, మొల్ల (పద్యనాటకం), భక్తకన్నప్ప, పాదుకా పట్టాభిషేకం, శ్రీకృష్ణదేవరాయలు, సౌదామిని, జ్యోతీరావ్ పూలే, పల్నాటి యుద్ధం, అక్క అలుగుడు..చెల్లి సణుగుడు, తొక్క తీస్తా, మొదలైన నాటక, నాటికలలో నటించింది.

బహుమతులు[మార్చు]

 1. ఉత్తమనటి - పోవోయి అనుకోని అతిథి (నాటిక), 2016 (సుమధుర కళానికేతన్ హాస్య నాటిక పరిషత్తు, విజయవాడ)[2]
 2. ఉత్తమనటి - బ్రతకనివ్వండి (పరుచూరి రఘుబాబు స్మారక నాటక పరిషత్తు - 2017, పల్లెకోన)[3]
 3. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), 2017 (సి.ఆర్.సి. కాటన్ కళాపరిషత్, లింగారావుపాలెం)
 4. ఉత్తమనటి - అంతా మన సంచికే (నాటిక), 2017 (ఎన్టీఆర్ కళాపరిషత్, వినుకొండ), 16వ నాటకోత్సవం[4]
 5. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), 2017 (కళాసాగర్, బుచ్చిరెడ్డిపాలెం)
 6. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), 2017 (టి.జి.వి. రస కళాపరిషత్, కర్నూలు)
 7. ఉత్తమనటి - అభయ (నాటిక), 2017 (సుబ్బరాజు నాట్య కళాపరిషత్‌, తిరుపతి)
 8. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), మే 30,31, జూన్ 1, 2017 (శ్రీకాకుళం జిల్లా కవిటి, బొరివంక)
 9. ఉత్తమనటి - అభయ (నాటిక), జూన్ 8,9,10, 2017 (హర్ష క్రియేషన్స్, విజయవాడ)
 10. ఉత్తమ ద్వితీయ నటి - ఆశ్రిత (నాటిక), 2016 (కొండవీడు కళాపరిషత్, లింగారావుపాలెం)
 11. ఉత్తమనటి - అక్క అలుగుడు... చెల్లి సణుగుడు (నాటిక), 2017 (సుమధుర కళానికేతన్ హాస్య నాటిక పరిషత్తు, విజయవాడ)
 12. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), నవంబరు 11-13, (నటరత్న నాటక పరిషత్ -2017, విజయనగరం)
 13. ఉత్తమనటి - గోవు మాలచ్చిమి (నాటిక), డిసెంబరు 27-30, 2017, (డా. నందమూరి తారకరామారావు కళాపరిషత్, తెనాలి, కీ.శే. పోలేపెద్ది నరసింహమూర్తి & తుమ్మల వెంకట్రామయ్య స్మారక రాష్ట్రస్థాయి 10వ ఆహ్వాన సాంఘిక నాటిక పోటీలు)
 14. ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - అభినయ నాటక పరిషత్, 13వ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు (జనవరి 12,13,14 - 2018), (పొనుగుపాడు, గుంటూరు జిల్లా)
 15. ఉత్తమనటి - బతుకు చిత్రం (నాటిక) - రాష్ట్ర్లస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు (ఫిబ్రవరి 12-16, 2018), (చోడవరం, విశాఖపట్టణం జిల్లా)
 16. ఉత్తమనటి - గుర్తు తెలియని శవం (నాటిక) - నరసరావుపేట రంగస్థలి, రాష్ట్ర్లస్థాయి ఆహ్వాన నాటిక పోటీలు (ఫిబ్రవరి 23-25, 2018), (నరసరావుపేట, గుంటూరు జిల్లా)

సత్కారాలు[మార్చు]

 1. ఉషోదయా కళానికేతన్, గుంటూరు వారి సత్కారం[5][6]

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 ఈనాడు, తెనాలి (8 March 2017). "విజేతలు". 
 2. సుమధుర ఫలితాలు, నటకులమ్ మాసపత్రిక, ఆగష్టు 2016, పుట.4
 3. వెబ్ ఆర్కైవ్. "రంగస్థలంకు నవీన కాంతి". web.archive.org. Retrieved 21 August 2017. 
 4. ఆంధ్రజ్యోతి, గుంటూరు. "నాటికలతో సమాజంలో మార్పు". Retrieved 21 April 2017. 
 5. ఆంధ్రజ్యోతి. "గుంటూరులో అలరించిన ‘ఆఖరి ఉత్తరం’ నాటకం". Retrieved 11 June 2017. 
 6. ఆంధ్రజ్యోతి (జూలై 22, 2016). "సందేశత్మకంగా ఆఖరి ఉత్తరం".  Check date values in: |date= (help);