Jump to content

లాంగ్‌యియర్‌బయెన్

వికీపీడియా నుండి
లాంగ్‌యియర్‌బయెన్
పట్టణం
(డీ ఫ్యాక్టో రాజధాని)
View of Longyearbyen
Aurora above Longyearbyen
Church in Longyearbyen
The Culture House
Coat of arms of లాంగ్‌యియర్‌బయెన్
Location of Longyearbyen (red) in Svalbard
Location of Longyearbyen (red) in Svalbard
లాంగ్‌యియర్‌బయెన్ is located in Arctic
లాంగ్‌యియర్‌బయెన్
లాంగ్‌యియర్‌బయెన్
లాంగ్‌యియర్‌బయెన్ is located in Earth
లాంగ్‌యియర్‌బయెన్
లాంగ్‌యియర్‌బయెన్
Coordinates: 78°13′N 15°38′E / 78.217°N 15.633°E / 78.217; 15.633
సార్వభౌమిక రాజ్యం Norway
Territoryస్వాల్‌బార్డ్
ద్వీపంస్పిట్స్‌బెర్గెన్
స్థాపన1907
Incorporated2002 జనవరి 1
ప్రభుత్వం
 • సంస్థలాంగ్‌యియర్‌బయెన్ కమ్యూనిటీ కౌన్సిల్
విస్తీర్ణం
 • మొత్తం
10 కి.మీ2 (4 చ. మై)
జనాభా
 (2023 జనవరి 1)
 • మొత్తం
2,595[note 1]
 • సాంద్రత259.5/కి.మీ2 (648.75/చ. మై.)
Postal code
9170, 9171[2]

లాంగ్‌యియర్‌బయెన్ ("లాంగియర్ టౌన్") అనేది 1,000 కి పైబడి జనాభా కలిగిన మానవ ఆవాసాల్లో, ప్రపంచంలో కెల్లా అత్యంత ఉత్తరాన ఉన్న ప్రదేశం. ఇది నార్వే లోని స్వాల్‌బార్డ్ రాజధాని, ఇక్కడి అతిపెద్ద నివాస ప్రాంతం.[3] లాంగియర్ లోయకు ఎడమ గట్టున, అడ్వెంట్‌ఫ్యోర్డెన్ ఒడ్డున ఉంది. ఇది స్పిట్స్బెర్జెన్ పశ్చిమ తీరంలో ఇస్‌ఫ్యోర్డెన్‌కు దారితీసే చిన్న నదీముఖద్వారం. 2002 నాటికి, లాంగ్‌యియర్‌బయెన్ కమ్యూనిటీ కౌన్సిల్ మునిసిపాలిటీగా మారింది. ఇది స్వాల్‌బార్డ్ గవర్నరు నివాసముండే స్థానం. 2024 నాటికి, పట్టణ మేయర్ లీఫ్ టెర్జే ఔనేవిక్.

1926 వరకు లాంగియర్ సిటీ అనే పేరున్న ఈ పట్టణాన్ని 1906 లో బొగ్గు తవ్వకం ప్రారంభించిన అమెరికన్ జాన్ మున్రో లాంగియర్ స్థాపించి, తన పేరే దానికి పెట్టాడు. స్టోర్ నార్స్కే స్పిట్స్‌బెర్గెన్ కుల్కోంపానీ (ఎస్ఎన్ఎస్కె) లు 1916 లో గనుల తవ్వకం కార్యకలాపాలను చేపట్టింది. ఇప్పటికీ గనులను నిర్వహిస్తోంది. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ నావికాదళం క్రీగ్స్‌మెరైన్, 1943 సెప్టెంబరు 8న పట్టణాన్ని దాదాపు పూర్తిగా నాశనం చేసింది. యుద్ధం తరువాత పునర్నిర్మాణం జరిగింది. చారిత్రికంగా, లాంగ్‌యియర్‌బయెన్ ఒక కంపెనీ టౌన్‌షిప్. కానీ మైనింగ్ కార్యకలాపాలు చాలావరకు 1990 లలో స్వెగ్రువాకు తరలించారు.

మార్కెట్ పరిస్థితుల కారణంగా 2014 నుండి ఎస్ఎన్ఎస్కె ఎదుర్కొన్న అపారమైన ఆర్థిక నష్టాల కారణంగా 2017 లో ఉత్పత్తి నిలిపివేసారు.[4] ఇంతలో, ఈ పట్టణం పర్యాటకం, పరిశోధనలో పెద్ద పెరుగుదలను చూసింది. ఇందులో స్వాల్‌బార్డ్లోని యూనివర్సిటీ సెంటర్, స్వాల్బర్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్, స్వాల్బార్ద్ శాటిలైట్ స్టేషన్ వంటి సంస్థల ఏర్పాటు కూడా ఉంది. స్వాల్‌బార్డ్ విమానాశ్రయం, స్వాల్బర్డ్ చర్చి, స్వాల్బర్డ్బుటికెన్ డిపార్ట్మెంట్ స్టోర్లు ఈ సమాజానికి సేవలు అందిస్తున్నాయి.

చరిత్ర

[మార్చు]
1908లో లాంగియర్ నగరం
1925 వేసవిలో లాంగ్ఇయర్‌బైన్‌

1896 లో వెస్టెరాలెన్స్ డాంప్స్కిబ్సెల్స్కాబ్ అనే సంస్థ హోటల్నెసెట్‌కు పర్యటనలను ప్రారంభించింది. పర్యాటకులకు వసతి కల్పించడానికి, వారు ఒక హోటలు నిర్మించారు. కానీ అది లాభదాయకంగా సాగనందున 1897 సీజన్ తర్వాత మూసివేసారు. అయితే, రెండు కుటుంబాలు 1898-99,

శీతాకాలమంతా ఉండిపోయారు. నార్వే పోస్ట్ 1897 నుండి 1899 వరకు హోటల్నెసెట్ వద్ద ఒక తపాలా కార్యాలయాన్ని నిర్వహించింది.[5][5]స్వాల్‌బార్డ్లో మొట్టమొదటి వాణిజ్యపరంగా లాభదాయకమైన బొగ్గును 1899 లో సోరెన్ జకారియాసేన్ సేకరించారు.[5]1901లో బెర్గెన్-స్పిట్స్‌బెర్గెన్ కుల్గ్రూబ్-కొంపానీ అడ్వెంట్టోపెన్లో బొగ్గు తవ్వకం ప్రారంభించింది.[5]: 46 

అమెరికన్ పారిశ్రామికవేత్త జాన్ మున్రో లాంగియర్, 1901 లో పర్యాటకంగా స్పిట్స్బర్గెన్ను సందర్శించి, బొగ్గు కోసం అన్వేషణలో ఉన్న బృందాన్ని కలిశాడు. 1903 లో అతను స్పిట్స్బెర్జెన్కు తిరిగి వచ్చి, అక్కడ అతను అడ్వెంట్ఫ్జార్డెన్లో హెన్రిక్ బి. నాస్ను కలుసుకున్నాడు. అతను బొగ్గు క్షేత్రాలపై నమూనాలను, సమాచారాన్ని ఇచ్చాడు. తన సహచరుడు ఫ్రెడెరిక్ అయ్యర్తో కలిసి లాంగియర్, అడ్వెంట్ఫ్యోర్డెన్‌కు పశ్చిమాన నార్వేజియన్ భూమిని కొనుగోలు చేసి, తరువాతి సంవత్సరం గణనీయంగా వాటిని విస్తరించాడు. 1906 లో బోస్టన్ చెందిన ఆర్కిటిక్ బొగ్గు కంపెనీ, అయ్యర్, లాంగియర్ ప్రధాన వాటాదారులుగా, రేవులు, గృహాలను నిర్మించిన తరువాత మైన్ 1ఎలో మైనింగ్ ప్రారంభించింది.[6] ఈ సంస్థ మేనేజిమెంటు అమెరికన్లు కాగా, కార్మికులు ఎక్కువగా నార్వేజియన్లు. పట్టణానికి లాంగియర్ సిటీ అని పేరు పెట్టారు.[5]: 46 జర్మనీలోని లీప్జిగ్ చెందిన వైమానిక కేబుల్ కంపెనీ అడాల్ఫ్ బ్లీచెర్ట్ & కో నిర్మించిన వైమానిక ట్రామ్వే ఉపయోగించి బొగ్గును గని నుండి నౌకాశ్రయానికి 1.2 కిలోమీటర్ల (75 మైళ్ళు) రవాణా చేశారు.[5]:: 148  1913లో, కంపెనీ మైన్ 2ఎను ప్రారంభించడానికి ప్రాథమిక పనిని ప్రారంభించింది.[5]: 47 

గని 2b ని 1938 -నుండి 1969 వరకు తవ్వారు. నేడు ఇది ఒక వారసత్వ ప్రదేశం.

మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఆర్థిక ఇబ్బందుల తరువాత, [5] : 46 మైనింగ్ కార్యకలాపాలను స్టోర్ నోర్స్కే కొనుగోలు చేసింది. దీన్ని1916 నవంబరు 30న క్రిస్టియానియాలో (1926లో ఓస్లోగా పేరు మార్చబడింది) నమోదు చేసారు. [5] : 119 ఆ సంవత్సరం, SNSK ఐదు కొత్త బ్యారక్‌లను నిర్మించింది. వాటిలో ఒకదాన్ని ఆసుపత్రిగా మార్చారు. [5] : 83 SNSK నార్జెస్ బ్యాంక్ ఆమోదంతో దాని స్వంత డబ్బును ప్రవేశపెట్టింది. ఇది పూర్తిగా నార్వేజియన్ క్రోన్‌తో సమానమైన బ్యాంకు నోట్లను కలిగి ఉంది. [5] : 116 అమెరికన్ సమాజం వారి మృతదేహాలను హోటల్నెసెట్‌లో ఖననం చేసేది. 1918 లో స్పానిష్ ఫ్లూ వల్ల పదకొండు మంది మరణించారు. లాంగ్‌ఇయర్ నగరంలో ఒక స్మశానవాటికను స్థాపించారు. [5] : 64 రెండు సంవత్సరాల తరువాత, గని 1 లో బొగ్గు దుమ్ము పేలుడులో 26 మంది మరణించారు. దీని ఫలితంగా గనిని మూసివేసారు.[5] : 46  గని 2 ను విద్యుదీకరించారు.[5] : 47 అదే సంవత్సరం, మైనింగ్ కార్యకలాపాలలో ఉపయోగించడానికి మొదటి ట్రక్కును ప్రవేశపెట్టారు.[5] : 69 

నార్వే చర్చి, 1920లో థోర్లీఫ్ ఓస్టెన్‌స్టాడ్‌ను స్వాల్‌బార్డ్‌లో మొదటి వికార్‌గా, ఉపాధ్యాయుడిగా నియమించింది. [5] : 126 చర్చి, SNSK లు సంయుక్తంగా ఒక పాఠశాలను స్థాపించాయి. ఎనిమిది మంది విద్యార్థులు దీనిలో చేరారు. [5] : 114 స్వాల్‌బార్డ్‌లోని మొదటి చర్చి 1921 ఆగస్టు 28న ప్రారంభించబడింది, [5] : 126 అప్పటి నుండి చర్చి లోని పఠన గదినే పాఠశాలగా ఉపయోగిస్తున్నారు. [5] : 114 1926 లో లాంగ్‌ఇయర్ నగరాన్ని లాంగ్‌ఇయర్‌బైన్ అని పేరు మార్చారు. [5] : 85 

నార్వేజియన్ టెలికమ్యూనికేషన్స్ అడ్మినిస్ట్రేషన్ 1911లో ఫిన్నెసెట్‌లో స్వాల్‌బార్డ్ రేడియో అనే తీర రేడియో స్టేషన్‌ను స్థాపించింది. దీనిని 1930లో లాంగ్‌ఇయర్‌బైన్‌కు తరలించారు. [5] : 149 1935లో ఎస్ఎస్ లింగెన్ వేసవి కాలంలో క్రమం తప్పకుండా పొరయాణాలు చెయ్యడం ప్రారంభించినప్పుడు, పట్టణంలో పర్యాటక పరిశ్రమ ప్రారంభమైంది. [5] : 153 1937లో, SNSK గని 1b కార్మికులకు నివాసం కల్పించడానికి స్వెర్‌డ్రుప్‌బైన్‌ను స్థాపించింది. గని కార్యకలాపాలు 1939లో ప్రారంభమయ్యాయి. [5] : 143 1938లో, లాంగ్‌ఇయర్‌బైన్ లోని మొదటి రహదారి, పట్టణ కేంద్రం - స్వర్డ్రుప్‌బైన్ ల మధ్య పూర్తయింది. [5] : 166 మైన్ 2a కి వేరే ప్రవేశ ద్వారం అయిన మైన్ 2b వద్ద కార్యకలాపాలు 1939లో ప్రారంభమయ్యాయి. [5] : 47 

రెండవ ప్రపంచ యుద్ధం నుండి బయటపడిన కొన్ని భవనాలలో ఒకటైన పాత విద్యుత్ కేంద్రం, కేబుల్ సెంటర్

1940 లో నార్వేను జర్మన్ ఆక్రమించినప్పటి నుండి స్వాల్‌బార్డ్ ప్రభావితం కాలేదు. అయితే, 1941 నుండి ఈ ద్వీపసమూహం మిత్రరాజ్యాల మధ్య సరఫరా గొలుసులో వ్యూహాత్మక ప్రాముఖ్యతను సంతరించుకుంది. అలాగే ఎంతో అవసరమైన బొగ్గుకు సరఫరా మూలంగా మారింది. ప్రవాసంలో ఉన్న నార్వేజియన్ ప్రభుత్వం సోవియట్-బ్రిటిష్ ఆక్రమణను తిరస్కరించింది; [7] : 74 బదులుగా బ్రిటిష్ సైన్యం స్పిట్స్‌బెర్గెన్‌ను ఖాళీ చేయడానికి ఆపరేషన్ గాంట్లెట్‌ను ప్రారంభించింది. 1941 ఆగస్టు 29 న నై-అలెసుండ్ జనాభా మొత్తాన్ని లాంగ్‌ఇయర్‌బైన్‌కు తరలించారు. సెప్టెంబర్ 3న 765 మందిని లాంగ్‌ఇయర్‌బైన్ నుండి స్కాట్లాండ్‌కు తరలించారు. తరువాత, చివరి 150 మందిని కూడా తరలించారు. [5] : 73 లాంగ్‌ఇయర్‌బైన్ జనాభా తగ్గిపోవడంతో, అడ్వెంట్‌డాలెన్‌లో ఒక చిన్న జర్మన్ దండును, వైమానిక స్థావరాన్నీ స్థాపించింది. ఎక్కువగా వాతావరణ డేటాను అందించడానికి వీటిని వాడారు. బ్రిటిష్ ఆపరేషన్ ఫ్రిథంతో బారెంట్స్‌బర్గ్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్న తర్వాత, జర్మన్ దళాలు ఎటువంటి పోరాటం లేకుండా లాంగ్‌ఇయర్‌బైన్‌ను విడిచిపెట్టాయి.[7] : 75 

1943 సెప్టెంబరులో క్రీగ్స్‌మరైన్, లాంగ్‌ఇయర్‌బైన్, బారెంట్స్‌బర్గ్, గ్రుమాంట్‌లపై దాడి చేయడానికి టిర్పిట్జ్, షార్న్‌హోర్స్ట్ అనే రెండు యుద్ధనౌకలనూ తొమ్మిది డిస్ట్రాయర్లనూ పంపింది.[7] : 75 ఆ దాడి తరువాత లాంగ్‌ఇయర్‌బైన్‌లో నాలుగు భవనాలు మాత్రమే మిగిలాయి. అవి: ఆసుపత్రి, విద్యుత్ కేంద్రం, ఒక కార్యాలయ భవనం, ఒక నివాస భవనం. యుద్ధం ముగిసే వరకు లాంగ్‌ఇయర్‌బైన్ అశాంతితో ఉండిపోయింది, ప్రధాన భూభాగం నుండి మొదటి ఓడ 1945 జూన్ 27న బయలుదేరింది. [5] : 74 

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత

[మార్చు]

యుద్ధ సమయంలో త్వరిత పునర్నిర్మాణం, మైనింగ్ పునఃప్రారంభం కోసం ప్రణాళికలు రూపొందించారు. 1948 నాటికి, బొగ్గు ఉత్పత్తి యుద్ధానికి ముందరి స్థాయికి (4,80,000 టన్నులు) చేరుకుంది. [7] : 79 నైబైన్ స్థావరాన్ని 1946లో స్థాపించారు. అందులో ఒక్కొక్కదానిలో 72 మంది ఉండగలిగే ఐదు బ్యారక్‌లున్నాయి. [5] : 94 స్వాల్‌బార్డ్‌పోస్టెన్ పత్రిక మొదటి సంచిక 1948 నవంబరులో వెలువడింది. అప్పటి వరకు, వివిధ గోడ వార్తాపత్రికలు సక్రమంగా ప్రచురించబడలేదు.[5] : 133 1949 లో లాంగ్‌ఇయర్‌బైన్ స్వాల్‌బార్డ్ రేడియో, హార్‌స్టాడ్ మధ్య రేడియో కనెక్షన్ ద్వారా ప్రధాన భూభాగంతో టెలిఫోన్ కనెక్షన్‌ను పొందింది.[5] : 149 1949 లో లాంగ్‌ఇయర్‌బైన్‌లో పశువులు (పాలు కోసం), పందులు, కోళ్లను పెంచడానికి ఒక ఫారాన్ని నిర్మించారు.[5] : 37 1950 లో స్థానిక రేడియో స్టేషన్ ప్రసారాలను ప్రారంభించింది. [5] : 150 ఇక్కడి శ్మశాన వాటిక 1950 వరకు వాడుకలో ఉంది. అందులో 44 మందిని ఖననం చేశారు. [5] : 65 అయితే, పెర్మాఫ్రాస్టు కారణంగా శరీరాలు కుళ్ళిపోక పోవడంతో అప్పటి నుండి మృతదేహాలను ఖననం కోసం ప్రధాన భూభాగానికి పంపుతున్నారు.[8] హుసెట్ కమ్యూనిటీ సెంటర్‌ను 1951లో ప్రారంభించారు.[5] : 57 

1989లో లాంగ్‌ఇయర్‌బైన్, వైమానిక ట్రామ్‌వే నుండి దృశ్యం

గని 1b లో మైనింగు 1958 లో నిలిపివేసారు[5] : 47 కానీ మైన్ 5 లో ఆపరేషన్ మరుసటి సంవత్సరం ప్రారంభమైంది. గని 4 పై ప్రాథమిక పని 1954 లో ప్రారంభమైంది. 1960 నుండి దీనిని రిజర్వ్ గనిగా ఉపయోగించారు. [5] : 48 నార్వేజియన్ వైమానిక దళం 1950లలో పోస్టల్ విమానాలతో లాంగ్‌ఇయర్‌బైన్‌కు సేవలను అందించడం ప్రారంభించింది. 1959 లో ఒక వ్యక్తి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో అడ్వెంట్‌డాలెన్‌లో ల్యాండింగ్ స్ట్రిప్‌ను సిద్ధం చేసారు. అదే సంవత్సరం నుండి, బ్రాథెన్స్ సేఫ్ టండ్రా విమానాశ్రయానికి క్రమరహిత శీతాకాల విమానాలతో సేవలను అందించడం ప్రారంభించింది. [9] : 154–158 1957లో, ప్రాథమిక పాఠశాలలో ఒక ప్రిన్సిపాల్‌ను నియమించారు. 1958 ఆగస్టు 24న కొత్త చర్చి మొదలైంది.[5] : 126 1961 నుండి, ప్రాథమిక పాఠశాలకు అదనంగా ఒక ప్రైవేట్ మాధ్యమిక పాఠశాలను ప్రారంభించారు.[5] : 114 1959 లో ట్రోమ్సో స్పేర్‌బ్యాంక్ శాఖను ప్రారంభించారు.[5] : 16 

1960 లలో పట్టణంలోని వ్యవసాయ క్షేత్రాన్ని మూసివేసి, దాని స్థానంలో పాల పొడిని పారిశ్రామికంగా ద్రవీకరించడం మొదలుపెట్టారు. [5] : 86 మొదటి స్నోమొబైల్ ఉత్పత్తి 1961 లో వాడుకలోకి వచ్చింది. 1969 నాటికి పట్టణంలో 140 రిజిస్టర్డ్ స్నోమొబైళ్ళుండగా, కార్లు 33 మాత్రమే ఉన్నాయి.[5] : 69 1962 నుండి 1984 వరకు, స్వెర్డ్రుప్బైన్‌లో ఒక వినోద కేంద్రం నడిచింది. [5] : 143 గని 4 లో సాధారణ ఆపరేషన్ 1966 లో ప్రారంభమైంది కానీ 1970 నాటికి నిలిపివేసారు.[5] : 48  అంతకు రెండేళ్ళ ముందు మైన్ 2బి ని మూసివేసారు.[5] : 47 గని 6 లో కార్యకలాపాలు 1969 లో ప్రారంభమయ్యాయి. [5] : 48 1969లో టెలివిజన్ ప్రసార పరికరాలను ఏర్పాటు చేసారు. నార్వేజియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ యొక్క షెడ్యూల్ రెండు వారాల ఆలస్యంతో ఇక్కడ ప్రసారమయ్యేది.[5] : 150 

1971 లో ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలను కలిపి ఒక కొత్త పాఠశాల భవనాన్ని ప్రారంభించారు. దానితో పాటు కొత్త వ్యాయామశాల, 12.5-మీటరు (41 అ.) ఈత కొలనును ప్రారంభించారు.[5] : 114 స్వాల్‌బార్డ్ కౌన్సిల్‌ను 1971 నవంబరు 1 న స్థాపించారు. ఇందులో, SNSK ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులు అనే మూడు వేర్వేరు సమూహాల నుండి ఎన్నికైన లేదా నియమించబడిన 17 మంది ఏ పార్టీకీ చెందని సభ్యులు ఉంటారు: అయితే నిష్పత్తి మారుతూ ఉంటుంది.[5] : 134 మైన్ 3 కార్యకలాపాలు 1971 మార్చిలో మొదలు కాగా,[5] : 47 మైన్ 7 లో కార్యకలాపాలు మరుసటి సంవత్సరం మొదలయ్యాయి.[5] : 48 1973లో, వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ SNSKలో మూడో వంతును కొనుగోలు చేసింది. 1976 లో వాటా 99.94 శాతం చేరుకునే వరకు అది వాటాలను కొనుగోలు చేస్తూనే ఉంది.[10] విమానాశ్రయం 1975లో పనిచెయ్యడం మొదలైంది. ప్రారంభంలో నార్వే ప్రధాన భూభాగానికి వారానికి నాలుగు సేవలనూ, రష్యాకు సెమీ-వీక్లీ సేవలనూ అందించింది. [5] : 129 1978 లో ఇక్కడికి ప్రధాన భూభాగంతో ఉపగ్రహ సమాచార మార్పిడి సౌకర్యం లభించింది.[5] : 150 అదే సంవత్సరం, ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత మాధ్యమిక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. [5] : 114 1984 నుండి, టెలివిజన్ కార్యక్రమాలు ఉపగ్రహం ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం మొదలైంది.[5] : 150 

స్వాల్‌బార్డ్‌లోని విశ్వవిద్యాలయ కేంద్రం (UNIS)

1980 లలో స్టోర్ నోర్స్కే క్రమంగా మార్పుకు గురైంది. 1980 నుండి, స్పిట్స్‌బెర్గెన్ డబ్బును చెలామణి నుండి తీసివేసి, దాని స్థానంలో మామూలు నార్వేజియన్ కరెన్సీని ప్రవేశపెట్టారు.[5] : 116 మరుసటి సంవత్సరం గని 6 ను మూసివేసారు.[5] : 108 1982 నుండి, SNSK ప్రైవేట్ వ్యక్తులు కార్లను కలిగి ఉండటానికి, నడపడానికి అనుమతించింది. 1990 నాటికి, 353 రిజిస్టర్డ్ కార్లు, 883 స్నోస్కూటర్లూ ఉన్నాయి. [5] : 70 1983 జూలై 1 న, SNSK తన ప్రధాన కార్యాలయాన్ని బెర్గెన్ నుండి లాంగ్‌ఇయర్‌బైన్‌కు మార్చింది. [5] : 119 ప్రజా మౌలిక సదుపాయాలు, సేవలకు బాధ్యత వహించే పరిమిత సంస్థ అయిన స్వాల్‌బార్డ్ సాంఫన్స్‌డ్రిఫ్ట్ (SSD) ను SNSK 1989 జనవరి 1 న స్థాపించింది. ఆరోగ్య సంరక్షణ, అగ్నిమాపక దళం, కిండర్ గార్టెన్, రోడ్లు, చెత్త పారవేయడం, విద్యుత్ ఉత్పత్తి, నీరు, మురుగునీటి వ్యవస్థ, సినిమా, సాంస్కృతిక కార్యక్రమాలు, లైబ్రరీ వంటివి దీని బాధ్యతలు. యాజమాన్యాన్ని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ 1993 జనవరి 1 న స్వాధీనం చేసుకుంది. [11]

భౌగోళికం

[మార్చు]
ప్లాటాబెర్గెట్ నుండి లాంగ్‌యియర్‌బయెన్ మధ్య భాగాల దృశ్యం. జలాశయం అడ్వెంట్‌ఫ్‌జోర్డెన్ అయితే కుడి వైపున ఉన్న లోయ అడ్వెంట్‌డాలెన్ .
కొండ పై నుండి కనిపించే లాంగ్ఇయర్బైన్

లాంగ్ఇయర్బైన్, లాంగ్ఇయర్ నది వెంబడి, లాంగ్ఇయర్ లోయ దిగువ భాగంలో ఉంది. పట్టణం దిగువ భాగాలు అడ్వెంట్ఫ్జోర్డెన్ బే యొక్క నైరుతి తీరం వెంబడి ఉన్నాయి.[12] లాంగ్‌యియర్‌బయెన్, స్వాల్‌బార్డ్ ద్వీపసమూహంలోని అతిపెద్ద ద్వీపమైన స్పిట్స్‌బెర్గెన్‌లోని నార్డెన్‌స్కియోల్డ్ ల్యాండ్ ద్వీపకల్పంలో ఉంది. [6] బే అవతల అడ్వెంట్ సిటీ,[13] హియోర్త్‌హామ్న్ అనే నిర్జన పట్టణాలు ఉన్నాయి. [12] ఇది ప్రపంచంలోనే అత్యంత ఉత్తర కొసన ఉన్న రెండవ పట్టణం. దీనికంటే ఉత్తరాన ఉన్న అన్ని స్థావరాలు ( నై-అలేసుండ్ మినహా) పరిశోధన లేదా వాతావరణ కేంద్రాలు తప్ప సాధారణ మానవుల ఆవాసాలు కావు.[14] ప్రపంచంలో ఉత్తరాన ఉన్న శాశ్వత స్థావరం కెనడాలోని అలర్ట్, నునావుట్‌లోని కికిక్తాలుక్ ప్రాంతంలో ఉంది, అయితే ప్రపంచంలో నిజమైన ఉత్తరాన ఉన్న స్థావరం ఏప్రిల్‌లో క్యాంప్ బార్నియో.[15]

లాంగ్ఇయర్‌బైన్‌లో అనేక పేటలున్నాయి. నదికి పశ్చిమాన, అఖాతం వెంబడి, ఓడరేవు, అనుబంధ యుటిలిటీలు, పారిశ్రామిక సేవలూ ఉన్నాయి. ఈ ప్రాంతపు పశ్చిమ భాగాన్ని బైకైయా అనీ, తూర్పు భాగాన్ని స్జోమ్రాడెట్ అనీ పిలుస్తారు. పైన గవర్నర్ కార్యాలయాల ప్రదేశం స్క్జెరింగా ఉంది. లోయకు కొంచెం పైకి పశ్చిమాన గామ్లే లాంగ్‌ఇయర్‌బైన్ ("ఓల్డ్ లాంగ్‌ఇయర్‌బైన్"), చర్చి ఉన్నాయి. ఇంకా పైన స్మశానవాటిక, తరువాత హుసెట్, సినిమా, చివరకు స్వెర్డ్రుప్బైన్ ఉన్నాయి. చాలా నివాస, వాణిజ్య, సాంస్కృతిక సంస్థలు నదికి తూర్పు వైపున ఉన్నాయి. బే వెంబడి ఆ ప్రాంతాన్ని స్జోస్క్రెంటెన్ అని పిలుస్తారు. ఇంకా పైకి విశ్వవిద్యాలయ కేంద్రం, అతిపెద్ద నివాస ప్రాంతమైన గ్రువెడాలెన్ ఉన్నాయి. అక్కడి నుండి దక్షిణం వైపు ప్రధాన షాపింగ్ ప్రాంతం అలాగే టౌన్ హాల్ ఉన్నాయి. తూర్పున నివాస ప్రాంతం లియా, మరింత పైకి హౌగెన్ ఉన్నాయి, ఇక్కడ పాఠశాల కూడా ఉంది. లోయలో చివరిగా మైన్ 2బి, నైబైన్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా విద్యార్థులు నివసిస్తారు. పట్టణం వెలుపల, హోటల్నెసెట్‌కు పశ్చిమాన విమానాశ్రయం, గని 3 ఉన్నాయి. మిగిలిన గనులు పట్టణానికి తూర్పున ఉన్న అడ్వెంట్‌డాలెన్‌లో ఉన్నాయి.[16]

స్వాల్‌బార్డ్‌లో ఉత్తర అట్లాంటిక్ కరెంట్ ద్వారా బలబడిన ధ్రువ టండ్రా వాతావరణం (కొప్పెన్: ET) ఉంటుంది. స్వాల్‌బార్డ్ పశ్చిమ తీరం ద్వీపసమూహంలో అత్యంత వెచ్చని, తేమతో కూడిన భాగం (బేర్ ద్వీపం మినహా). దక్షిణం నుండి వచ్చే తేలికపాటి, తేమతో కూడిన గాలి, ఉత్తరం నుండి వచ్చే చల్లని గాలి కలయిక వల్ల ఇది సంభవిస్తుంది. లాంగ్ఇయర్‌బైన్‌లో సాధారణంగా ఆర్కిటిక్ సర్కిల్‌లోని ఇతర స్థావరాల కంటే తక్కువ తేమ ఉంటుంది. లాంగ్‌ఇయర్‌బైన్‌లో ఏప్రిల్ 18 నుండి ఆగస్టు 23 వరకు (127 రోజులు) అర్ధరాత్రి సూర్యుడు ప్రకాశిస్తాడు, అక్టోబరు 27 నుండి ఫిబ్రవరి 15 వరకు (111 రోజులు) ధ్రువ రాత్రి, నవంబరు 13 నుండి జనవరి 29 వరకు పౌర ధ్రువ రాత్రి ఉంటుంది. అయితే, పర్వతాల నుండి నీడ కారణంగా, మార్చి 8 వరకు లాంగ్‌ఇయర్‌బైన్‌లో సూర్యుడు కనిపించడు. [17] నవంబరు నుండి మార్చి వరకు పట్టణాన్ని సాధారణంగా మంచు కప్పేస్తుంది. లాంగ్‌ఇయర్‌బైన్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 21.7 °C (71.1 °F)2020 జూలైలో, అత్యంత శీతల ఉష్ణోగ్రత −46.3 °C (−51.3 °F) 1986 మార్చిలో. ప్రపంచంలో గత దశాబ్దాలలో అత్యంత వేగంగా వేడెక్కిన ప్రదేశాలలో స్వాల్‌బార్డ్, లాంగ్ఇయర్బైన్ ఉన్నాయి. 1991–2020 మధ్య సగటులు చూస్తే 1961–1990 నుండి లాంగ్‌ఇయర్‌బైన్‌లో సగటు వార్షిక ఉష్ణోగ్రత 3.6 °C (6.5 °F) పెరిగిందని తెలుస్తోంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున, చుట్టుపక్కల జలాల్లో మంచు ఏర్పడటానికి ఎక్కువ సమయం పడుతుంది. ముఖ్యంగా ధ్రువ రాత్రి కింద శీతాకాలం ప్రారంభంలో మంచు కాలం తక్కువగా ఉండటం వల్ల వేగంగా వేడెక్కుతుంది.

2021 నాటికి , లాంగ్‌యియర్‌బయెన్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వేడెక్కుతున్న పట్టణం. 1971 నుండి, స్వాల్‌బార్డ్లో ఉష్ణోగ్రతలు ప్రపంచ సగటు కంటే ఐదు రెట్లు వేగంగా, సుమారు నాలుగు డిగ్రీల సెల్సియస్ పెరిగాయి. శీతాకాలం 1970ల కంటే ఇప్పుడు ఏడు డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడిగా ఉంటుంది. 2020 లో స్వాల్‌బార్డ్, 111 నెలల తరువాత అత్యధిక ఉష్ణోగ్రత 21,7 ° C (71,1 ) నమోదైంది. నార్వేజియన్ మెటియోరోలాజికల్ ఇన్స్టిట్యూట్ ప్రకారం, స్వాల్‌బార్డ్లో వార్షిక అవపాతం గత 50 సంవత్సరాలలో 30 నుండి 45 శాతం పెరిగింది-ఎక్కువగా శీతాకాలపు వర్షపాతం రూపంలో. 2009 నుండి, లోతైన పెర్మాఫ్రాస్ట్ ఉష్ణోగ్రతలు సంవత్సరానికి 0.06 - 0.15 degree C మధ్య పెరిగాయి.[18]

లాంగ్‌ఇయర్‌బైన్ భూమిపై ప్రస్తుత లేదా గతంలో నివసించిన ఏదైనా ప్రదేశానికైనా అత్యల్ప సగటు UV సూచిక ఉంది. ఏప్రిల్, సెప్టెంబరు మధ్య, UV సూచిక సాధారణంగా 1 నుండి 2 వరకు ఉంటుంది. మే, జూన్, జూలై నెలల్లో అత్యధిక UV సూచిక 2 ఉంటుంది. మిగతా అన్ని నెలలు సగటున 0 వద్ద ఉన్నాయి, దీని వలన లాంగ్‌ఇయర్‌బైన్‌కు 12 నెలల్లో సగటు UV సూచిక 0.75 ఉంది.[19]

జనాభా

[మార్చు]
ప్రధాన వీధిలో పర్యాటకులు. దగ్గరలో ఉన్నది షాపింగ్ మాల్, దిగువన ఉన్నది టౌన్ హాల్.

2020 నాటికి , లాంగ్‌యియర్‌బయెన్ జనాభా 1,753. నార్వేజియన్ల అతిపెద్ద ప్రాంతీయ సమూహం ఉత్తర నార్వేకు చెందినది - ముఖ్యంగా నార్డ్ల్యాండ్, ట్రోమ్స్‌కు చెందినవారు. వీరు జనాభాలో 40% కంటే ఎక్కువ (2012).[20] సుమారు 300 మంది (16%) నార్వేజియనేతర పౌరులు. వీరిలో అతిపెద్ద సంఖ్యలో థాయిలాండ్, స్వీడన్, రష్యా, ఉక్రెయిన్ (2009) లకు చెందినవారు.[21] గనుల పరిశ్రమ ఆధిపత్యం కారణంగా, లింగ నిష్పత్తిలో తేడా ఎక్కువగా ఉంది. వయోజనుల్లో 60% మంది పురుషులు ఉన్నారు. జనాభాలో 25 - 44 సంవత్సరాల మధ్య వారు సగటు కంటే ఎక్కువ ఉన్నారు. కానీ 66 ఏళ్లు పైబడిన నివాసితులు దాదాపుగా లేరు. జనాభాకు సంబంధించి పిల్లల సంఖ్య జాతీయ సగటుతో సమానంగా ఉంది. కానీ యువకులు జాతీయ సగటు కంటే తక్కువ.[20]

2014 నాటికి, 120 మంది ఉన్న థాయ్ ప్రజలు, నార్వేజియన్ల తర్వాత రెండవ అతిపెద్ద నివాసితుల సమూహం; [22] 2006లో 60 మంది ఉన్నారు. 1970లలో పురుషులు తమ థాయిలాండ్ భార్యలను తీసుకువచ్చినప్పుడు థాయిస్ మొదట స్వాల్‌బార్డ్‌కు వచ్చారు.[23] 2006లో, థాయ్ ప్రజల్లో ఎక్కువ మంది క్లీనర్లుగా పనిచేశారు.[23] 2011 నాటికి చాలా మంది నిధులను ఆదా చేయడానికి రెండు నుండి మూడు సంవత్సరాల పాటు అక్కడే ఉన్నారు. 2007లో, లాంగ్‌ఇయర్‌బైన్ పాఠశాలలో 10 మంది విద్యార్థులు థాయ్ వారు.[24] థాయ్ సమాజం ఏటా అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటుంది. థాయ్ సూపర్ మార్కెట్ కూడా స్థాపించారు.[22]

లాంగ్‌ఇయర్‌బైన్‌లో ప్రజలు చాలా తక్కువ కాలం నివసిస్తూంటారు. 2008లో, 427 మంది (23%) పట్టణం నుండి దూరంగా వెళ్లారు. [21] లాంగ్‌ఇయర్‌బైన్‌లో వ్యక్తి సగటున 6.3 సంవత్సరాలు నివసిస్తారు. అయితే ఇది నార్వేజియన్లకు 6.6 సంవత్సరాలు, విదేశీయులకు 4.3 సంవత్సరాలు. 2009 లో జనాభాలో నాలుగో వంతు మంది 2000 కి ముందు నుండి పట్టణంలో నివసించారు. అందువల్ల దీనిని దాని శాశ్వత జనాభాగా పరిగణించవచ్చు. ఎక్కువ కాలం నివసించే వ్యక్తులు మైనింగ్ పరిశ్రమలో పనిచేస్తారు. తరువాత స్థానిక ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. పర్యాటకం, ఉన్నత విద్య చదివే విద్యార్థులు, ఉద్యోగులు అతి తక్కువ కాలం ఉంటారు. [20] ఈ టర్నోవర్ వలన నార్వేజియన్ ప్రభుత్వం "రివాల్వింగ్ డోర్ సొసైటీ" అని అంటుంది. చాలా మంది యువకులు వచ్చిన ఏడు సంవత్సరాలలోపు వెళ్లిపోతారు. ఇది ప్రధాన భూభాగంలోని ఏ మునిసిపాలిటీ కంటే చాలా ఎక్కువ.

70% గృహాల్లో ఒకే వ్యక్తి ఉంటారు. ప్రధాన భూభాగంలో ఇది 41%. సగటున ప్రతి ఇంటికి 1.6 మంది వ్యక్తులు ఉంటారు. ఈ వ్యత్యాసం ఎక్కువగా స్వాల్‌బార్డ్‌లో పనిచేస్తున్న వ్యక్తుల కుటుంబాలు ప్రధాన భూభాగంలోనే ఉండటం వల్ల ఏర్పడింది. లాంగ్‌ఇయర్‌బైన్ జనాభాలో విద్యావంతులు (54%) జాతీయ సగటు (43%) కంటే ఎక్కువ. మహిళల్లో, 40% మంది ఉన్నత విద్య చదివారు.[20]

రాజకీయాలు, ప్రభుత్వం

[మార్చు]
లీఫ్ టెర్జే ఔనెవిక్, లాంగ్‌ఇయర్‌బైన్ మేయర్ (2024)

లాంగ్ఇయర్బైన్ కమ్యూనిటీ కౌన్సిల్ మునిసిపాలిటీకి సమానమైన అనేక బాధ్యతలు నిర్వర్తిస్తోంది.[10] ఇది 15 మంది సభ్యుల కౌన్సిల్‌తో నిర్వహించబడుతుంది, దీనికి 2015 నుండి లేబరు పార్టీకి చెందిన మేయర్ అరిల్డ్ ఒల్సెన్ నాయకత్వం వహిస్తున్నాడు.[25] ఈ మండలి ప్రధాన బాధ్యతలు మౌలిక సదుపాయాలు, వినియోగాలు, విద్యుత్, భూ వినియోగం, కమ్యూనిటీ ప్రణాళిక, కిండర్ గార్టెన్ నుండి ఉన్నత మాధ్యమిక స్థాయి వరకు విద్య, పిల్లల సంక్షేమం. ఇది 13-తరగతి లాంగ్ఇయర్బైన్ స్కూల్ తో పాటు మూడు కిండర్ గార్టెన్లను నిర్వహిస్తోంది. [26]

లాంగ్‌యియర్‌బయెన్ ఆసుపత్రి

సంరక్షణ లేదా నర్సింగ్ సేవలు, సంక్షేమ పథకాలు ఇక్కడ అందుబాటులో లేవు. నార్వేజియన్ నివాసితులు తమ ప్రధాన భూభాగ మునిసిపాలిటీల ద్వారా పెన్షన్, వైద్య హక్కులను నిలుపుకున్నారు. [27] యూనివర్శిటీ హాస్పిటల్ ఆఫ్ నార్త్ నార్వే లాంగ్ఇయర్‌బైన్ హాస్పిటల్ అనే క్లినిక్‌ను నిర్వహిస్తోంది. [10] లాంగ్ఇయర్బైన్లో ఉన్న ఇతర ప్రభుత్వ కార్యాలయాలు నార్వేజియన్ డైరెక్టరేట్ ఆఫ్ మైనింగ్, నార్వేజియన్ పోలార్ ఇన్స్టిట్యూట్, నార్వేజియన్ టాక్స్ అడ్మినిస్ట్రేషన్, చర్చ్ ఆఫ్ నార్వే. [28] లాంగ్‌యియర్‌బయెన్ , ట్రోమ్సోలోని నోర్డ్-ట్రోమ్స్ డిస్ట్రిక్ట్ కోర్టు, హలోగాలాండ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్‌లకు అధీనంలో పనిచేస్తుంది. [29]

1920 నాటి స్వాల్‌బార్డ్ ఒప్పందంతో ఈ ద్వీపసమూహంపై పూర్తి నార్వేజియన్ సార్వభౌమత్వం ఏర్పడింది. స్వాల్‌బార్డ్ గవర్నర్ సంస్థను స్థాపించిన స్వాల్‌బార్డ్ చట్టం తరువాత, ఈ 1925 ఒప్పందంలో అమల్లోకి వచ్చింది. గవర్నర్ కౌంటీ గవర్నర్, పోలీసు చీఫ్‌గా బాధ్యత వహిస్తాడు. అలాగే కార్యనిర్వాహక శాఖ నుండి మంజూరు చేయబడిన ఇతర అధికారాలను కలిగి ఉంటాడు. విధుల్లో పర్యావరణ విధానం, కుటుంబ చట్టం, చట్ట అమలు, శోధన, రక్షణ, పర్యాటక నిర్వహణ, సమాచార సేవలు, విదేశీ స్థావరాలతో సంప్రదింపులు, సముద్ర విచారణలు, కొన్ని రంగాలలో న్యాయమూర్తి - అయితే పోలీసు లాగా వ్యవహరించే కేసులు ఎప్పుడూ ఉండవు. [28] [30] కెజెర్స్టిన్ ఆష్హోల్ట్ 2015 నుండి గవర్నర్‌గా ఉన్నారు; [31] ఆమెకు 26 మంది నిపుణుల సిబ్బంది సహాయం చేస్తున్నారు. గవర్నరు న్యాయ, పోలీసు మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటారు. ఇతర పోర్ట్‌ఫోలియోలోని విషయాలలో సంబంధిత మంత్రిత్వ శాఖలకు నివేదిస్తుంది.[32]

లాంగ్‌ఇయర్ లోయ ఎగువ భాగం, ఎడమ వైపున స్వెర్డ్రుప్బైన్ భవనాలు, కుడి వైపున హుసెట్, నేపథ్యంలో ఒక వైమానిక ట్రామ్‌వే

స్వాల్‌బార్డ్ యొక్క ప్రత్యేక ఒప్పంద హోదా కారణంగా, లాంగ్ఇయర్బైన్ నార్వేజియన్ చట్టానికి లోబడి ఉంటుంది. కానీ ఒప్పందంపై సంతకం చేసిన దేశాల పౌరులు వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించవచ్చు. పట్టణంలో నివసించవచ్చు. [33] అయితే, ఆదాయ వనరు లేని వ్యక్తులను గవర్నర్ తిరస్కరించవచ్చు. [34] ఈ ఒప్పందం, నార్వే పన్నులు వసూలు చేసే హక్కును స్వాల్‌బార్డ్‌లోని ఫైనాన్సింగ్ సేవల హక్కుకు పరిమితం చేస్తుంది. అందువల్ల, లాంగ్‌ఇయర్‌బైన్‌లో ఆదాయపు పన్ను నార్వే ప్రధాన భూభాగం కంటే తక్కువ ఉంది. విలువ ఆధారిత పన్ను లేదు. ఈ ఒప్పందం ఫలితంగా లాంగ్‌ఇయర్‌బైన్ సైనికరహిత మండలంగా మారింది.[33] ఇది యూరోపియన్ ఆర్థిక ప్రాంతంలో లేదా నార్వేలోని మిగిలిన ప్రాంతాల మాదిరిగా స్కెంజెన్ ప్రాంతంలో భాగం కాదు. [35]

2023 నార్వేజియన్ స్థానిక ఎన్నికల నుండి, లాంగ్‌ఇయర్‌బైన్ కమ్యూనిటీ కౌన్సిల్‌కు ఓటర్లు కనీసం 3 సంవత్సరాలు నార్వే ప్రధాన భూభాగంలో నివసించి ఉండాలి. [36] [37] గతంలో, లాంగ్‌ఇయర్‌బైన్‌లోనే 3 సంవత్సరాలు నివసించిన విదేశీ పౌరులు కూడా ఓటు వేయడానికి అనుమతించబడ్డారు. ఈ నియమం మార్పుతో సెటిల్‌మెంట్ జనాభాలో గణనీయమైన శాతం మందికి ఓటు హక్కు పోయింది .

ప్రత్యేక చట్టాలు

[మార్చు]

లాంగ్‌ఇయర్‌బైన్ దూరం కారణంగా, ప్రపంచంలోని మరే చోటా లేని కొన్ని చట్టాలు ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. అటువంటి చట్టాలకు ముఖ్యమైన ఉదాహరణలు పిల్లులపై నిషేధం, ఒక వ్యక్తి ప్రతి నెలా కొనుగోలు చేయగల మద్యం మొత్తంపై పరిమితి, బయటికి వెళ్లే వ్యక్తులు ధృవపు ఎలుగుబంట్ల నుండి రక్షణగా రైఫిల్‌ను తీసుకెళ్లాలనే నిబంధన మొదలైనవి.[38] [39] లాంగ్‌ఇయర్‌బైన్‌లో మరణించడం చట్టవిరుద్ధమని ప్రజాదరణ పొందిన వాదన ఉన్నప్పటికీ, ఈ వాదనలోని పదాలు తప్పుదారి పట్టించేవిగా ఉన్నాయి. పట్టణంలో చనిపోవడం వాస్తవానికి చట్టవిరుద్ధం కానప్పటికీ, అక్కడ మృతదేహాలను ఖననం చేయడానికి ఎటువంటి అవకాశం లేదు (ప్రభుత్వ అనుమతితో బూడిదను పూడ్చిపెట్టవచ్చు). ప్రాణాంతక అనారోగ్యంతో ఉన్న నివాసితులు సాధారణంగా ప్రధాన భూభాగానికి వెళ్లవలసి ఉంటుంది. 1918 ఫ్లూ మహమ్మారి ఫలితంగా మరణించిన నివాసితుల మృతదేహాలు కుళ్ళిపోవడంలేదని 1950 లో తెలిసింది. దాంతో ఖననం చేయకూడదనే నిర్ణయం తీసుకున్నారు. పెర్మాఫ్రాస్ట్ వలన సంరక్షించబడిన ఈ శవాల్లో 20వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచ జనాభాలో 1% - 6% మంది మరణానికి కారణమైన వైరస్ జాతులు ఇప్పటికీ జీవించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. [40]

సంస్కృతి

[మార్చు]

కమ్యూనిటీ కౌన్సిల్ సినిమా, యూత్ క్లబ్, లైబ్రరీ, గ్యాలరీ వంటి అనేక సాంస్కృతిక కార్యకలాపాలను నిర్వహిస్తుంది. [41] నార్వే చర్చికి చెందిన స్వాల్‌బార్డ్ చర్చి కాంగ్రిగేషనల్ హాల్ 126 మీ2 (1,360 sq ft) కూర్చునే గది 112 మీ2 (1,210 sq ft) ఉంటాయి. చర్చిని సగం కలపతో నిర్మించారు.[5] : 126 పట్టణంలో స్వాల్‌బార్డ్ మ్యూజియం,[42] స్పిట్స్‌బెర్గెన్ ఎయిర్‌షిప్ మ్యూజియం అనే రెండు మ్యూజియంలు ఉన్నాయి.[43] సోల్ఫెస్టుకా ("సూర్య ఉత్సవ వారం") ప్రతి సంవత్సరం మార్చి 8 నాటి వారంలో జరుగుతుంది. అక్టోబరులో ప్రారంభమైన ధ్రువ రాత్రి తర్వాత, పట్టణంలోని చాలా ప్రాంతాలలో సూర్యకాంతి మొదటిసారి కనిపించేది మార్చి 8 నే. (అధికారికంగా మొదటి సూర్యోదయం సాధారణంగా ఫిబ్రవరి 16 న జరుగుతుంది. కానీ చుట్టుపక్కల పర్వతాల కారణంగా పట్టణంలోని చాలా భాగం అప్పటికింకా చీకటి లోనే ఉంటుంది). [44] 2003 నుండి ప్రతి సంవత్సరం అక్టోబరులో డార్క్ సీజన్ బ్లూస్ నిర్వహించబడుతోంది. [45] 1998 నుండి జనవరి చివరిలో/ఫిబ్రవరి ప్రారంభంలో పోలార్జాజ్‌ను నిర్వహిస్తారు.[46] పట్టణంలోని ఇరవై మంది నివాసులు లివర్‌బర్డ్స్ స్వాల్‌బార్డ్ లో సభ్యులు. ఆర్కిటిక్ ఫిల్మ్ ఫెస్టివల్ అనేది నగరంలోని స్క్రీనింగ్ వేదిక అయిన కుల్తుర్హుసెట్‌లో ప్రతి సంవత్సరం జరిగే ఫిల్మ్ ఫెస్టివల్.[47][48]

క్రీడలు

[మార్చు]

పట్టణంలోని ఏకైక ప్రసిద్ధ వ్యవస్థీకృత క్రీడా క్లబ్బు, స్వాల్‌బార్డ్ టర్న్.[5] : 139 స్వాల్‌బార్ధాలెన్ అనేది ఇండోర్ క్రీడా కేంద్రం. దీనిలో హ్యాండ్‌బాల్ లేదా మూడు బ్యాడ్మింటన్ కోర్టులు, షూటింగ్ రేంజ్, క్లైంబింగ్ వాల్, 25-మీటరు (82 అ.) ఈత కొలను ఉన్నాయి.[5] : 155 

ఈ పట్టణంలో బహిరంగ క్రీడా మైదానాలు లేవు. ఇండోర్ లేదా బహిరంగ క్రీడలోని సీనియర్ జట్టు జాతీయ నార్వేజియన్ పోటీలో (ఉదా. నార్వేజియన్ కప్ ) పాల్గొనలేదు. 2020 మార్చిలో హోర్టెన్‌లో జరిగిన చిన్న 2-రోజుల పెర్ బ్రెడెసెన్ కప్‌లో స్వాల్‌బార్డ్ టర్న్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ అండర్-16 బాలుర ఫుట్‌సల్ జట్టు ఆడింది.[49]

స్పిట్స్‌బెర్గెన్ మారథాన్, స్వాల్‌బార్డ్ స్కీమారాటన్,[50] వార్షిక ఓరియంటెరింగ్ రేసును నిర్వహిస్తున్నట్లు స్వాల్‌బార్డ్ టర్న్ వెబ్‌సైట్‌లు పేర్కొన్నాయి.

స్వాల్‌బార్డ్‌పోస్టెన్ అనేది శుక్రవారం ప్రచురితమయ్యే వారపత్రిక. ముద్రణ ట్రోమ్సోలో జరుగుతుంది. ఎక్కువ మంది చందాదారులు ప్రధాన భూభాగంలో నివసిస్తున్నారు. ఆంగ్లంలో ప్రత్యామ్నాయ వార్తాపత్రిక అయిన ఐస్‌పీపుల్ కూడా వారానికొకసారి ప్రచురితమవుతుంది. [5] : 133 

1969 లో NRK1 టెలివిజన్ ప్రసారాల ఫీడ్ 2 వారాల ఆలస్యంతో ప్రసారం మొద్లాఇంది. 1984 డిసెంబరు 22 నుండి ప్రత్యక్ష ప్రసారాలు మొదలయ్యాయి.[51] దీని ఫలితంగా స్వాల్‌బార్డ్ జాతీయ వార్తా ప్రసారాల వాతావరణ నివేదికలకు జోడించబడింది. కెనాల్ డిజిటల్ సిగ్నల్స్ నార్వే ప్రధాన భూభాగంలో బహిరంగంగా అందుబాటులోకి వచ్చినప్పటి నుండి అల్లెంటే పే-టీవీ ఉపగ్రహ సిగ్నల్స్ అందుతున్నాయి. [52]

రేడియో కోసం, NRK P1,[53] P4 (నార్వే), రేడియో నార్జ్ [54] అందుబాటులో ఉన్నాయి. 2020 జూలై నాటికి, స్క్జెరింగా మాస్ట్ అనేది NRK స్టేషన్‌లో మిగిలి ఉన్న ఏకైక మీడియం వేవ్ ప్రసారకర్త. [53] [55] DAB రేడియో ప్రసారం 2016 ఆగస్టు లేదా సెప్టెంబరులో ప్రారంభమైంది, [56] ఆ తర్వాత FM రేడియో 2017 డిసెంబరులో మూసివేయబడింది. 2016 ఫిబ్రవరి నాటికి 13 స్టేషన్లతో కూడిన NRK DAB నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని ప్రణాళిక చేయబడింది; [57] వాణిజ్య స్టేషన్ల DAB నెట్‌వర్క్ (P4, రేడియో నార్జ్‌తో సహా) స్థితి అస్పష్టంగా ఉంది.

జనాదరణ పొందిన సంస్కృతి

[మార్చు]

ఆర్కిటిక్ అవుట్‌పోస్ట్ రేడియో AM1270 అనేది, 2016 నుండి కాల్ లాక్‌వుడ్ [58] అనే వ్యక్తి ద్వారా 78 ఆర్‌పిఎమ్ రికార్డులను ప్లే చేసే అంతర్జాల రేడియో స్టేషను. మీడియం వేవ్లో 1270 kHz వద్ద పట్టణానికి ప్రసారం చేస్తానని అతను చెబుతున్నాడు. [59] [a] దీని వెబ్‌సైట్ [60] దాని పాత హోస్టింగ్ వెబ్‌సైట్ [61] [62] మిస్సోరిలోని కాన్సాస్ నగరంలో నమోదు చేయబడ్డాయి. 2019లో లాంగ్‌ఇయర్‌బైన్‌లో ఉన్నప్పుడు AM ప్రసారాన్ని అందుకున్నట్లు ఒకే ఒక వ్యక్తి చెప్పారు.[63]

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]
పాత బొగ్గు ఫిల్లింగ్ స్టేషన్. మాక్స్ ప్రెస్న్యాకోవ్ డ్రాయింగ్, 2014.

2007లో బొగ్గు ఉత్పత్తి గరిష్టంగా 4.1 మిలియన్ టన్నులకు చేరుకుంది 2015 లో 1.1 మిలియన్ టన్నులకు తగ్గింది. [64] లాంగ్‌ఇయర్‌బైన్‌లో ఇప్పటికీ జరుగుతున్న ఏకైక మైనింగు, అడ్వెంట్‌డాలెన్ పైన15 కిలోమీటర్లు (9 మై.) దూరంలో ఉన్న మైన్ 7. 2012లో ఇది ఏటా 70,000 టన్నులు (69,000 long tons; 77,000 short tons) బొగ్గును ఉత్పత్తి చేసింది. అందులో 25,000 టన్నులు (25,000 long tons; 28,000 short tons) నార్వేలోని ఏకైక బొగ్గు ఇంధన విద్యుత్ కేంద్రం అయిన లాంగ్‌ఇయర్ పవర్ స్టేషన్‌కు ఇంధనంగా ఉపయోగించబడుతుంది. [65] [64] [66] ఈ విద్యుత్ కేంద్రం నిర్వహణ పని NOK 60 మిలియన్లకు షెడ్యూల్ చేయబడింది. స్థానిక అధికారులు డీజిల్ విద్యుత్ ప్లాంట్‌ను NOK 40 మిలియన్లకు అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించారు. [67]

స్టోర్ నోర్స్కే ఉత్పత్తిలో ఎక్కువ భాగం లాంగ్ఇయర్‌బైన్‌కు దక్షిణంగా 60 కిలోమీటర్లు (37 మై.) దూరంలో ఉన్న వాన్ మిజెన్‌ఫ్జోర్డెన్‌లోని స్వెగ్రువా వద్ద జరుగుతుంది. కమ్యూనిటీలను అనుసంధానించే రోడ్లు లేవు; [68] బదులుగా, 2017 కార్మికులులో మూసివేసే వరకూ స్వెయాలోని డార్మిటరీలలో నివసించారు. [69] మైనింగ్ లాభదాయకంగా లేదు. స్టోర్ నోర్స్కే ప్రభుత్వమిచ్చే సబ్సిడీలపై ఆధారపడుతుంది.[70]

ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదల కారణంగా స్వాల్‌బార్డ్‌లో చేపల పెంపకం ఊహించని పరిణామాలను చూసింది: అట్లాంటిక్ కాడ్, మాకేరెల్, మంచు పీతలు దక్షిణం వైపు వెచ్చని నీటి నుండి పారిపోయి ఉత్తరం వైపు స్వాల్‌బార్డ్ వైపు పయనించి, స్థానిక చేపల సంఖ్యను పెంచుతున్నాయి. 2020 లలో నార్వే, తన స్వాల్‌బార్డ్ ఫిషింగ్ వాణిజ్యాన్ని ఏటా US$94 మిలియన్లుగా అంచనా వేసింది.

స్వాల్‌బార్డ్‌లోని యూనివర్సిటీ సెంటర్ (UNIS)లో 350 మంది విద్యార్థులు, 40 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్లు, 120 మంది గెస్ట్ లెక్చరర్లతో కూడిన శాశ్వత అధ్యాపకులు ఉన్నారు. UNIS డిగ్రీలను అందించదు. జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, భూగర్భ శాస్త్రాలలో సెమిస్టర్ కోర్సులను అందిస్తుంది. విద్యార్థుల వసతి గృహం నైబియెన్‌లో ఉంది. ఈ కళాశాల, 12,000 మీ2 (130,000 sq ft) విస్తీర్ణంలో ఉన్న స్వాల్‌బార్డ్ సైన్స్ సెంటర్‌లో భాగం. దీనిలో నార్వేజియన్ పోలార్ ఇన్స్టిట్యూట్, EISCAT, స్వాల్‌బార్డ్ సైన్స్ ఫోరంలు కూడా ఉన్నాయి. [71] 2006 లో లాంగ్‌ఇయర్‌బైన్‌లో పరిశోధకులు దాదాపు 9,000 పరిశోధన దినాలు గడిపారు. వీటిలో ఎక్కువ భాగం నార్వేజియన్లు. దీని వలన లాంగ్‌ఇయర్‌బైన్ స్వాల్‌బార్డ్‌లోని రెండవ అతిపెద్ద పరిశోధన కేంద్రం అయింది. ఇది నై-అలెసుండ్ కంటే కొంచెం దిగువన ఉంది. దీనికి విరుద్ధంగా, లాంగ్‌ఇయర్‌బైన్‌లో దాదాపు నార్వేజియన్ పరిశోధనలను మాత్రమే ఉన్నాయి. అయితే నై-అలెసుండ్‌లో నార్వేజియన్, విదేశీ పరిశోధకులు దాదాపు సమానంగా ఉన్నారు.[72]

EISCAT రాడార్

ధ్రువ కక్ష్యలోని ఉపగ్రహాల నుండి డేటాను డౌన్‌లోడ్ చేసుకోవడానికి లాంగ్‌ఇయర్‌బైన్ యొక్క అద్భుతమైన స్థానం కారణంగా ఇక్కడి స్వాల్‌బార్డ్ ఉపగ్రహ స్టేషన్ నిర్మించబడింది. హోటెల్నెసెట్ పైన ఉన్న ప్లాటాబెర్గెట్ వద్ద, దీనిని NASA, నార్వేజియన్ స్పేస్ సెంటర్ మధ్య సహకారంతో నిర్మించారు. కానీ 2001 నుండి కోంగ్స్‌బర్గ్ శాటిలైట్ సర్వీసెస్ నిర్వహిస్తోంది. [73] ఉత్తరాది దీపాలను అధ్యయనం చేయడానికి EISCAT, ఒక ఇన్‌కోహరెంట్ స్కాటర్ రాడార్‌ను నిర్వహిస్తోంది.[5] : 36 గ్లోబల్ క్రాప్ డైవర్సిటీ ట్రస్ట్ ద్వారా నిర్వహించబడే స్వాల్‌బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్, మిలియన్ల కొద్దీ పంట విత్తనాలను నిల్వ చేయగల సురక్షితమైన భూగర్భ సౌకర్యం. గ్లోబల్ వార్మింగ్, వరదలు, మంటలు, అణు హోలోకాస్ట్ వంటి ప్రకృతి, మానవ విపత్తుల నుండి రక్షించడానికి ఈ సౌకర్యాన్ని రూపొందించారు. మొగతా ప్రపంచం నుండి దూరం, ధ్వని భూగర్భ శాస్త్రం, శాశ్వత మంచు యొక్క పరిసర ఉష్ణోగ్రత వంటి అనేక అంశాల కారణంగా ఈ ప్రదేశాన్ని ఎంపిక చేసారు.[74]

లాంగ్‌ఇయర్‌బైన్ ఈ ద్వీపసమూహంలో పర్యాటక కేంద్రం. అయితే పట్టణాన్ని కేవలం సందర్శించడం కంటే కూడా సహజ అనుభవాల ఆధారంగా పర్యాటఖం ఉత్పత్తి అవుతుంది. అయితే, లాంగ్‌ఇయర్‌బైన్ సామాగ్రి (ఈ ప్రాంతంలోని ఏకైక కిరాణా దుకాణం అయిన స్వాల్‌బార్డ్‌బుటిక్కెన్‌తో సహా), వసతి, అనేక మ్యూజియంలను అందిస్తుంది. 2008 లో లాంగ్‌ఇయర్‌బైన్‌లో అతిథులు, 89,000 అతిథి-రాత్రులు గడిపారు. 1995లో ఇది 30,000. సగటున ఒక్కో అతిథి 2.2 రాత్రులు బస చేశారు. 60 శాతం సామర్థ్యం పర్యాటకులు ఉపయోగించుకున్నారు. దాదాపు 40,000 మంది పర్యాటకులు లాంగ్‌ఇయర్‌బైన్‌కు విమానంలో వచ్చారు. పర్యాటకులలో మూడింట రెండు వంతుల మంది నార్వే నుండి వస్తారు. 2007 లో పర్యాటక పరిశ్రమ ఆదాయం NOK 291 మిలియన్లు.[75] 2008లో స్వాల్‌బార్డ్ సొసైటీ NOK 380 మిలియన్ల ప్రజా నిధులను అందుకుంది. 2015 ఇదిలో 650 మిలియన్లకు పెరిగింది. [64]

విద్య

[మార్చు]
లాంగ్‌యియర్‌బయెన్ స్కూల్
స్వాల్‌బార్డ్‌లోని విశ్వవిద్యాలయ కేంద్రం (UNIS)

లాంగ్‌ఇయర్‌బైన్ స్కూల్‌లో 6–18 సంవత్సరాల వయస్సులో ఉన్న విద్యార్థులు చదువుకుంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఉత్తరాన ఉన్న ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల. [76] విద్యార్థులకు 16, 17 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి చాలా కుటుంబాలు నార్వే ప్రధాన భూభాగానికి తరలిపోతాయి. లాంగ్‌ఇయర్‌బైన్‌లో డిగ్రీ-ఆఫర్ చేయని తృతీయ విద్యా సంస్థ ఉంది, [24] స్వాల్‌బార్డ్‌లోని యూనివర్సిటీ సెంటర్ (UNIS), నార్వేజియన్ పోలార్ ఇన్‌స్టిట్యూట్, స్వాల్‌బార్డ్ మ్యూజియం, స్వాల్‌బార్డ్ సైన్స్ ఫోరమ్‌తో కలిసి ఉంది. [77]

చెక్ ఆర్కిటిక్ పరిశోధనా కేంద్రం కూడా లాంగ్ఇయర్‌బైన్‌లో ఉంది. చెక్ రిపబ్లిక్ నుండి మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి వచ్చే పరిశోధకులు, విద్యార్థులకు ఇది సౌకర్యాలను అందిస్తుంది. [78]

రవాణా

[మార్చు]

లాంగ్‌ఇయర్‌బైన్‌లో 50 కిలోమీటర్లు (30 మై.) రోడ్ల నెట్‌వర్కు ఉంది.[79] కానీ ఈ నెట్‌వర్కు ఏ ఇతర కమ్యూనిటీలకూ విస్తరించదు.[80] : 63–67 2008లో 1,481 నమోదైన రోడ్డు వాహనాలు ఉన్నాయి. 49 శాతం ఇళ్ళలో కారు ఉంది. [79] కార్లు ZN రిజిస్ట్రేషన్ ప్లేట్లతో రిజిస్టర్ చేయబడతాయి.[5] : 70 స్వాల్‌బార్డ్ ఆటో అనే టయోటాలను విక్రయించే ఒకే ఒక డీలర్ ఉంది. ఇది రిపేర్లు చేసే రెండు వ్యాపారాలలో ఇది ఒకటి. [81]

స్నోమొబైళ్ళు ఇక్కడి ప్రసిద్ధ రవాణా విధానం. జనాభా కంటే స్నోమొబైళ్ళే ఎక్కువ. 2008 లో 2,672 స్నోమొబైళ్ళున్నట్లు నమోదైంది. లాంగ్‌ఇయర్‌బైన్‌లో 69 శాతం కుటుంబాలకు కనీసం ఒకటైనా స్నోమొబైలు ఉంది.[79] నేలపైన ఆఫ్-రోడ్డు మోటారు వాహనాలు నడపడం నిషేధించబడింది. కానీ శీతాకాలంలో వాణిజ్య, వినోద కార్యకలాపాల కోసం స్నోమొబైళ్ళను విస్తృతంగా ఉపయోగిస్తారు. లాంగ్‌ఇయర్‌బైన్ నుండి బారెంట్స్‌బర్గ్‌ ( 45 కి.మీ. or 28 మై. ), పిరమిడెన్ ( 100 కి.మీ. or 62 మై. ) లకు శీతాకాలంలో రవాణా స్నోమొబైల్ ద్వారాను, సంవత్సరం పొడవునా ఓడ ద్వారానూ సాధ్యపడుతుంది. [80] : 63–67 

లాంగ్‌ఇయర్‌లోని స్వాల్‌బార్డ్ విమానాశ్రయం పట్టణానికి వాయవ్యంగా, 3 కిలోమీటర్లు (1.9 మై.) దూరం లోని హోటెల్నెసెట్‌లో ఉంది. ఇక్కడ 2,483-మీటరు (8,146 అ.) పొడవైన రన్‌వే ఉంది. ద్వీపసమూహం నుండి విమానాలకు సేవలందించడానికి అనుమతి ఉన్న ఏకైక విమానాశ్రయం ఇది. [82] [83] స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్ ఓస్లో, ట్రోమ్సోకు రోజువారీ విమానాలను నడుపుతుంది, [84] రష్యాకు కూడా విమానాలు ఉన్నాయి. లుఫ్ట్‌ట్రాన్స్‌పోర్ట్ స్వెయా ఎయిర్‌పోర్ట్, నై-అలెసుండ్ ఎయిర్‌పోర్ట్, హమ్నెరబ్బెన్‌లకు రెగ్యులర్ చార్టర్ సేవలను అందిస్తుంది. ఆర్కిటికుగోల్ సంస్థ బారెంట్స్‌బర్గ్, పిరమిడెన్‌లకు హెలికాప్టర్లను నడుపుతోంది. [83] లాంగ్‌ఇయర్‌బైన్‌లో రెండు క్వేలు - ఒకటి బొగ్గు ఎగుమతికి, మరొకటి సాధారణ వస్తువులకు - ఉన్నాయి 1907 నుండి 1987 వరకు, మైనింగ్ కంపెనీలు గనుల నుండి ఓడరేవుకు బొగ్గును రవాణా చేయడానికి వైమానిక ట్రామ్‌వేల నెట్‌వర్క్‌ను నిర్వహించాయి. [5] : 148 1907-1908 సంవత్సరాలలో, అప్పటి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ జర్మన్ వైర్ రోప్‌వేస్ కంపెనీ, లిప్సియాకు చెందిన అడాల్ఫ్ బ్లీచెర్ట్ & కో., గని 1 నుండి ఓడ లోడింగ్ స్టేషన్ వరకు ఒక మెటీరియల్ కేబుల్‌వేను నిర్మించింది. తరువాత దీనిని గని 2 కు కేబుల్‌వే ద్వారా భర్తీ చేశారు. ఈ వైర్ రోప్‌వేల అవశేషాలు తరువాత ఇతర గనుల వారసులు నేటికీ కనిపిస్తాయి.

గమనికలు

[మార్చు]
  1. 1270 kHz, is an unallocated frequency in the ITU region 2 spacing where Svalbard is located. Either 1269 kHz in zone 2 as in Europe or 1270 kHz in zone 1 as in North America.

మూలాలు

[మార్చు]
  1. "Population of Svalbard".
  2. "Svalbard and Jan Mayen – pricing and customs rules". Posten Bring. Retrieved 4 January 2025.
  3. "Longyearbyen". Store Norske Leksikon. 29 July 2020. Retrieved 20 September 2022.
  4. "Final Closure: Government recommends permanent shutdown of mining at Svea, Lunckefjell | icepeople". icepeople. Archived from the original on 3 August 2020. Retrieved 2020-01-21.
  5. 5.00 5.01 5.02 5.03 5.04 5.05 5.06 5.07 5.08 5.09 5.10 5.11 5.12 5.13 5.14 5.15 5.16 5.17 5.18 5.19 5.20 5.21 5.22 5.23 5.24 5.25 5.26 5.27 5.28 5.29 5.30 5.31 5.32 5.33 5.34 5.35 5.36 5.37 5.38 5.39 5.40 5.41 5.42 5.43 5.44 5.45 5.46 5.47 5.48 5.49 5.50 5.51 5.52 5.53 5.54 5.55 5.56 5.57 5.58 5.59 5.60 5.61 5.62 5.63 5.64 Holm, Kari (1999). Longyearbyen – Svalbard: historisk veiviser [Longyearbyen, Svalbard: Historical Guide] (in నార్వేజియన్). K. Holm. ISBN 82-992142-4-6. Archived from the original on 20 May 2021. Retrieved 20 May 2021.
  6. 6.0 6.1 "Longyearbyen". Norwegian Polar Institute. Archived from the original on 20 January 2012. Retrieved 15 March 2012.
  7. 7.0 7.1 7.2 7.3 Arlov, Thor B. (1994). A Short History of Svalbard. Oslo: Norwegian Polar Institute. ISBN 82-90307-55-1. Archived from the original on 1 June 2020. Retrieved 21 February 2021.
  8. Bartlett, Duncan (12 July 2008). "Why dying is forbidden in the Arctic". BBC News. Archived from the original on 3 March 2012. Retrieved 13 March 2012.
  9. Tjomsland, Audun; Wilsberg, Kjell (1996). Braathens SAFE 50 år: Mot alle odds (in Norwegian). Oslo. ISBN 82-990400-1-9.{{cite book}}: CS1 maint: location missing publisher (link) CS1 maint: unrecognized language (link)
  10. 10.0 10.1 10.2 "9 Næringsvirksomhet". St.meld. nr. 22 (2008–2009): Svalbard. Norwegian Ministry of Justice and the Police. 17 April 2009. Archived from the original on 25 August 2011. Retrieved 24 March 2010.
  11. "Industrial, mining and commercial activities". Report No. 9 to the Storting (1999–2000): Svalbard. Norwegian Ministry of Justice and the Police. 29 October 1999. Archived from the original on 11 October 2012. Retrieved 19 April 2012.
  12. 12.0 12.1 "Adventfjorden". Norwegian Polar Institute. Archived from the original on 2 August 2012. Retrieved 19 March 2012.
  13. "Advent City". Norwegian Polar Institute. Archived from the original on 2 August 2012. Retrieved 19 March 2012.
  14. Rosenthal, Elisabeth (3 March 2008). "A Speck of Sunlight Is a Town's Yearly Alarm Clock". The New York Times. Archived from the original on 12 September 2012. Retrieved 15 March 2012.
  15. "The World's Northernmost Permanent Settlement Set a Record High Temperature". Archived from the original on 31 August 2020. Retrieved 11 August 2020.
  16. "Longyearbyen map" (PDF). Svalbard Reiseliv. Archived (PDF) from the original on 14 March 2012. Retrieved 19 March 2012.
  17. "Sunrise and sunset times for Longyearbyen". Suncurves. Archived from the original on 29 April 2014. Retrieved 28 April 2014.
  18. Error on call to Template:cite paper: Parameter title must be specified
  19. "Longyearbyen, Svalbard and Jan Mayen – Detailed climate information and monthly weather forecast". Weather Atlas (in ఇంగ్లీష్). Yu Media Group. Archived from the original on 30 August 2019. Retrieved 2019-08-30.
  20. 20.0 20.1 20.2 20.3 "Pendlere eller fastboende?" (PDF) (in నార్వేజియన్). Statistics Norway. 26 March 2009. Archived (PDF) from the original on 7 April 2015. Retrieved 17 March 2012.
  21. 21.0 21.1 "Om Longyearbyen" (in నార్వేజియన్). Longyearbyen Community Council. 26 March 2009. Archived from the original on 2 March 2012. Retrieved 14 March 2012.
  22. 22.0 22.1 "Ah The Thai chef". Norwegian Air Shuttle (inflight magazine). Archived from the original on 29 October 2017. Retrieved 29 October 2017.
  23. 23.0 23.1 "Immigrants warmly welcomed". Al Jazeera. 2006-07-04. Archived from the original on 3 August 2017. Retrieved 2017-10-29.
  24. 24.0 24.1 "Learning in the freezer". The Guardian. 2007-08-29. Archived from the original on 29 October 2017. Retrieved 2017-10-29.
  25. Amundsen, Birger (10 October 2011). "Kvinne valgt av folket". Svalbardposten (in నార్వేజియన్). Archived from the original on 12 October 2018. Retrieved 16 March 2012.
  26. "Information for foreign citizens living in Longyearbyen". Governor of Svalbard. 15 August 2011. Archived from the original on 14 March 2012. Retrieved 14 March 2012.
  27. "From the cradle, but not to the grave" (PDF). Statistics Norway. Archived from the original (PDF) on 3 July 2010. Retrieved 24 March 2010.
  28. 28.0 28.1 "The administration of Svalbard". Report No. 9 to the Storting (1999–2000): Svalbard. Norwegian Ministry of Justice and the Police. 29 October 1999. Archived from the original on 18 July 2012. Retrieved 19 April 2012.
  29. "Nord-Troms tingrett". Norwegian National Courts Administration. Archived from the original on 25 August 2011. Retrieved 24 March 2010.
  30. "Lov om Svalbard" (in నార్వేజియన్). Lovdata. 19 June 2009. Archived from the original on 9 March 2014. Retrieved 24 March 2010.
  31. "Dagens sysselmann på Svalbard" (in నార్వేజియన్). Governor of Svalbard. Archived from the original on 5 March 2016. Retrieved 25 February 2016.
  32. "Organisation". Governor of Svalbard. Archived from the original on 23 July 2011. Retrieved 24 March 2010.
  33. 33.0 33.1 "Svalbard Treaty". Wikisource. 9 February 1920. Archived from the original on 24 March 2010. Retrieved 24 March 2010.
  34. "Entry and residence". Governor of Svalbard. Archived from the original on 23 July 2011. Retrieved 24 March 2010.
  35. "Lov om gjennomføring i norsk rett av hoveddelen i avtale om Det europeiske økonomiske samarbeidsområde (EØS) m.v. (EØS-loven)" (in నార్వేజియన్). Lovdata. 10 August 2007. Archived from the original on 10 December 2000. Retrieved 24 March 2010.
  36. "Sentrale Svalbard-politikere gir seg – slakter ny valgordning" (in నార్వేజియన్ బొక్మాల్). NRK. 20 September 2022. Retrieved 28 July 2023.
  37. "Utlendinger blir fratatt stemmeretten på Svalbard" (in నార్వేజియన్ బొక్మాల్). Utrop. 20 June 2022. Retrieved 28 July 2023.
  38. "Alcohol and tobacco". Governor (in ఇంగ్లీష్). Archived from the original on 23 February 2018. Retrieved 2018-02-23.
  39. "12 Facts You Never Knew About Longyearbyen: The World's Northernmost City -". johnnyjet.com (in అమెరికన్ ఇంగ్లీష్). 5 April 2012. Archived from the original on 23 February 2018. Retrieved 2018-02-23.
  40. van der Jagt, Kerry (14 May 2018). "Svalbard, Norway: The island where no one is allowed to die, or give birth". stuff. Archived from the original on 20 May 2021. Retrieved 20 May 2021.
  41. "Development of the local community in Longyearbyen". Report No. 9 to the Storting (1999–2000): Svalbard. Norwegian Ministry of Justice and the Police. 29 October 1999. Archived from the original on 18 July 2012. Retrieved 19 April 2012.
  42. "Information about the museum". Spitsbergen Museum. Archived from the original on 15 February 2012. Retrieved 19 March 2012.
  43. "Spitsbergen Airship Museum". Spitsbergen Airship Museum. Archived from the original on 29 February 2012. Retrieved 19 March 2012.
  44. "Mass enlightenment: Sun listens to warm crowd instead of drab experts in shinning return to Longyearbyen | icepeople". icepeople.net. Archived from the original on 3 August 2020. Retrieved 2020-01-23.
  45. Langset, Mona (22 October 2009). "Svalbard-blues skal lyse opp i mørketiden". Verdens Gang (in నార్వేజియన్). Archived from the original on 19 November 2011. Retrieved 11 April 2012.
  46. "Polarjazz Festivalen – Festival in Longyearbyen, Spitsbergen". Visit Svalbard (in నార్వేజియన్ బొక్మాల్). Archived from the original on 4 February 2020. Retrieved 2020-01-23.
  47. "Arctic Film Festival". FilmFreeway (in ఇంగ్లీష్). Archived from the original on 30 December 2020. Retrieved 14 October 2019.
  48. "Arctic Film Festival, Svalbard – Festival in Longyearbyen, Spitsbergen". Visit Svalbard. Archived from the original on 14 October 2019. Retrieved 14 October 2019.
  49. "–Ingen flytter til Svalbard for å bli gode fotballspillere". Gjengangeren (in నార్వేజియన్ బొక్మాల్). 10 March 2020. Retrieved 12 September 2023.
  50. "Klasseinndeling, kontingent og lisens". Svalbard Skimaraton (in నార్వేజియన్ బొక్మాల్). Retrieved 12 September 2023.
  51. "Fikk se TV i opptak uker etter fastlandet". Svalbardposten (in నార్వేజియన్ బొక్మాల్). 23 March 2018. Retrieved 12 September 2023.
  52. "Før ble TV-sendinger fraktet med fly. Så bygde de dette anlegget". Tek.no (in నార్వేజియన్ బొక్మాల్). 22 January 2015. Retrieved 12 September 2015.
  53. 53.0 53.1 "Får bedre radiorekkevidde". Svalbardposten (in నార్వేజియన్ బొక్మాల్). 2 July 2020. Retrieved 12 September 2023.
  54. "Stille for Radio Norge og P4" (in నార్వేజియన్ బొక్మాల్). 15 June 2010. Retrieved 12 September 2023.
  55. "Vedrørende AM-sendinger fra Ingøy og Longyearbyen" (PDF). Radio Nordkapp (in నార్వేజియన్ బొక్మాల్). 11 June 2019. Retrieved 12 September 2023.
  56. "DAB innstallert på øya". Svalbardposten (in నార్వేజియన్ బొక్మాల్). 2 September 2016. Retrieved 12 September 2023.
  57. "Svalbard får DAB" (in నార్వేజియన్ బొక్మాల్). 4 February 2016. Retrieved 12 September 2023.
  58. "Instagram: Cal_Lockwood - Music Director and broadcast host on Arctic Outpost Radio AM1270". www.instagram.com. Retrieved 2024-05-09.
  59. "Spinning the 78's | Arctic Outpost Radio AM1270". Retrieved 9 May 2024.
  60. "aor.am WHOIS, DNS, & Domain Info - DomainTools". whois.domaintools.com. Retrieved 2024-05-09.
  61. "ARCTIC OUTPOST". nordic-lodge-radio (in ఇంగ్లీష్). Retrieved 2024-05-09.
  62. "NordicLodgeRadio.com WHOIS, DNS, & Domain Info - DomainTools". whois.domaintools.com. Retrieved 2024-05-09.
  63. Sabbatini, Mark (6 April 2020). "FEVERISHLY COOL: Arctic Outpost Radio AM1270 hosted by local man of mystery Cal Lockwood goes from three 'followers' to 40,000 in hours due to viral reaction from...Portugal?!". Retrieved 9 May 2024.
  64. 64.0 64.1 64.2 "Gruvedriften Svalbards bristende hjerte" (in నార్వేజియన్). 2017. p. 8. Archived from the original on 26 July 2017.
  65. "Gruve 7". Store Norske Spitsbergen Kulkompani. Archived from the original on 12 March 2012. Retrieved 15 March 2012.
  66. "Energy needs of Longyearbyen" (PDF). 2017. p. 15. Archived (PDF) from the original on 2 May 2021. Retrieved 2 May 2021.
  67. Urke, Eirik Helland (17 September 2021). "Vedtatt: Longyearbyen stenger kullkraftverket, skal fyre med diesel". Tu.no (in నార్వేజియన్). Teknisk Ukeblad. Archived from the original on 20 September 2021. Retrieved 19 September 2021.
  68. "Svea Nord". Store Norske Spitsbergen Kulkompani. Archived from the original on 27 February 2012. Retrieved 15 March 2012.
  69. "Sveagruva". Norwegian Polar Institute. Archived from the original on 21 July 2012. Retrieved 15 March 2012.
  70. "Gruvedrift: Svalbardsamfunnets hjerte" (PDF) (in నార్వేజియన్). Statistics Norway. October 2009. Archived (PDF) from the original on 28 March 2014. Retrieved 7 March 2012.
  71. "Arctic science for global challenges". University Centre in Svalbard. Archived from the original on 6 February 2012. Retrieved 14 March 2012.
  72. "Pendlere eller fastboende?" (PDF) (in నార్వేజియన్). Statistics Norway. October 2009. Archived (PDF) from the original on 7 April 2015. Retrieved 17 March 2012.
  73. Grønli, Kristin Straumsheim (December 2006). "Øyet i himmelen laster ned på Svalbard". Forskning.no (in నార్వేజియన్). Archived from the original on 3 December 2011. Retrieved 14 March 2012.
  74. Roug, Louise (12 October 2007). "The Seed Bank Atop the World". Los Angeles Times. Archived from the original on 10 March 2012. Retrieved 15 March 2012.
  75. "Turisme: Stadig flere vil oppleve Arktis" (PDF) (in నార్వేజియన్). Statistics Norway. October 2009. Archived (PDF) from the original on 7 April 2015. Retrieved 19 March 2012.
  76. "Learning in the freezer". The Guardian. 2007-08-29. Retrieved 2017-10-29.
  77. "Heidi The glaciologist". Norwegian Air Shuttle (inflight magazine). Archived from the original on 29 October 2017. Retrieved 29 October 2017.
  78. "Research communities". www.forskningsradet.no (in ఇంగ్లీష్). Retrieved 2022-03-21.
  79. 79.0 79.1 79.2 "Lov og rett: Anerledes lov og orden" (PDF) (in నార్వేజియన్). Statistics Norway. October 2009. Archived (PDF) from the original on 7 April 2015. Retrieved 19 March 2012.
  80. 80.0 80.1 Umbreit, Andreas (2005). Spitsbergen: Svalbard, Franz Josef, Jan Mayen (3rd ed.). Chalfont St. Peter, Bucks: Bradt Travel Guides. ISBN 978-1-84162-092-3. Archived from the original on 21 May 2021. Retrieved 21 May 2021.
  81. "Om oss" (in నార్వేజియన్). Svalbard Auto. Archived from the original on 13 May 2013. Retrieved 13 March 2012.
  82. "Airport information for ENSB" (PDF). Avinor. Archived from the original (PDF) on 11 June 2012. Retrieved 20 April 2012.
  83. 83.0 83.1 "11 Sjø og luft – transport, sikkerhet, redning og beredskap". St.meld. nr. 22 (2008–2009): Svalbard. Norwegian Ministry of Justice and the Police. 17 April 2009. Archived from the original on 11 October 2012. Retrieved 15 March 2012.
  84. Avinor. "Destinations from Svalbard Airport, Longyear" (in నార్వేజియన్). Archived from the original on 5 March 2012. Retrieved 15 March 2012.


ఉల్లేఖన లోపం: "note" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="note"/> ట్యాగు కనబడలేదు