లాంఫెల్‌పాట్
లాంఫెల్‌పాట్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 24°49′30″N 93°54′32″E / 24.825067°N 93.908987°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మణిపూర్ |
జిల్లా | ఇంఫాల్ పశ్చిమ |
భాషలు | |
• అధికారిక | మీటీ |
Time zone | UTC+05:30 (భారత కాలమానం) |
Vehicle registration | ఎంఎన్ |
లాంఫెల్‌పాట్, మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్ పశ్చిమ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.[1] ఇది ఇంఫాల్ నగరానికి శివారు ప్రాంతంగా ఉంది. ఇంఫాల్, లిలోంగ్, తౌబాల్, మయాంగ్ మొదలైన గ్రామాలు లాంఫెల్‌పాట్ కు సమీపంలో ఉన్నాయి.[2]
భౌగోళికం
[మార్చు]లాంఫెల్‌పాట్ పట్టణం 24°49′30″N 93°54′32″E / 24.825067°N 93.908987°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.
పరిపాలన
[మార్చు]లాంఫెల్‌పాట్ ఉపవిభాగంలో 4 గ్రామాలు ఉన్నాయి.[3]
జనాభా
[మార్చు]2011 భారత జనాభా లెక్కల ప్రకారం, లాంఫెల్‌పాట్ ఉపవిభాగం పరిధిలో 2,21,422 జనాభా ఉంది. ఇందులో 108,135 మంది పురుషులు ఉండగా, 1,13,287 మంది స్త్రీలు ఉన్నారు. మొత్తం జనాభాలో 23,105 (11,871 మంది బాలురు, 11,234 మంది బాలికలు) మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. పట్టణంలో అక్షరాస్యుల సంఖ్య 1.81,635 ఉండగా, అందులో 92,184 మంది పురుషులు, 89,451 మంది స్త్రీలు ఉన్నారు.[1]
మొత్తం జనాభాలో షెడ్యూల్ కులాలవారు 1,447 మంది, షెడ్యూల్ తెగలవారు 16,743 మంది ఉన్నారు.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Lamphelpat". 2011 Census of India. Government of India. Archived from the original on 2 September 2017. Retrieved 2021-01-08.
- ↑ "Lamphelpat, Imphal Locality". www.onefivenine.com. Retrieved 2021-01-08.
- ↑ "Villages & Towns in Lamphelpat Sub Division of Imphal West, Manipur". www.census2011.co.in. Retrieved 2021-01-08.