లాంబో తయెంగ్
| లాంబో తయెంగ్ | |||
| పదవీ కాలం 2014 – 2024 జూన్ 2 | |||
| ముందు | రాలోమ్ బోరాంగ్ | ||
|---|---|---|---|
| తరువాత | ఓకెన్ తయెంగ్ | ||
| నియోజకవర్గం | మెబో | ||
| పదవీ కాలం 1990 – 2009 | |||
| తరువాత | రాలోమ్ బోరాంగ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
లాంబో తయెంగ్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అరుణాచల్ ప్రదేశ్ శాసనసభకు మెబో శాసనసభ నియోజకవర్గం నుండి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా పని చేశాడు.
రాజకీయ జీవితం
[మార్చు]లాంబో తయెంగ్ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1990 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో మెబో శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జనతాదళ్ అభ్యర్థి మాలియాంగ్ పెర్మేపై 416 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1995, 1999, 2004 ఎన్నికలలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై 2009 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఓడిపోయాడు.
లాంబో తయెంగ్ ఆ తరువాత 2014,[1] 2019 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్ శాసనసభా పక్ష నాయకుడిగా పని చేసి 2024 మార్చి 4న ఇటానగర్‌లోని బీజేపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో భారతీయ జనతా పార్టీలో చేరి,[2][3][4][5] 2024 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[6]
మూలాలు
[మార్చు]- ↑ "11 Congress candidates for Arunachal Assembly elected unopposed". The Economic Times. 27 March 2014. Archived from the original on 18 May 2025. Retrieved 18 May 2025.
- ↑ "Arunachal: Congress legislature party leader Lombo Tayeng joins BJP". Arunachal24. 4 March 2024. Retrieved 31 May 2025.
- ↑ "Congress Legislature Party Leader In Arunachal Pradesh Joins BJP Ahead Of Assembly Polls" (in ఇంగ్లీష్). Zee News. 4 March 2024. Archived from the original on 31 May 2025. Retrieved 31 May 2025.
- ↑ "Congress legislature party leader in Arunachal joins BJP ahead of Assembly polls" (in Indian English). The Hindu. 4 March 2024. Archived from the original on 30 May 2025. Retrieved 30 May 2025.
- ↑ "Arunachal assembly polls: CM Pema Khandu richest candidate, most crorepatis from BJP" (in ఇంగ్లీష్). India Today. 5 April 2019. Archived from the original on 31 May 2025. Retrieved 31 May 2025.
- ↑ "Arunachal Pradesh Assembly Election Results 2024 - Mebo" (in ఇంగ్లీష్). Election Commission of India. 2 June 2024. Archived from the original on 31 May 2025. Retrieved 31 May 2025.