Jump to content

లాతేహార్ జిల్లా

వికీపీడియా నుండి
లాతేహార్ జిల్లా
लातेहार जिला
జార్ఖండ్ పటంలో లాతేహార్ జిల్లా స్థానం
జార్ఖండ్ పటంలో లాతేహార్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంజార్ఖండ్
డివిజనుపాలము
ముఖ్య పట్టణంలాతేహార్
Government
 • లోకసభ నియోజకవర్గాలుఛత్రా
 • శాసనసభ నియోజకవర్గాలు2
విస్తీర్ణం
 • మొత్తం3,659.59 కి.మీ2 (1,412.98 చ. మై)
జనాభా
 (2011)
 • మొత్తం7,25,673
 • జనసాంద్రత200/కి.మీ2 (510/చ. మై.)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత61.23 %
 • లింగ నిష్పత్తి964
Websiteఅధికారిక జాలస్థలి
లోధ్ జలపాతం

జార్ఖండ్ రాష్ట్రం లోని జిల్లాల్లో లాతేహార్ జిల్లా (హిందీ: लातेहार जिला) ఒకటి. జిల్లా కేంద్రగా లాతేహార్ జిల్లా ఉంది. పాలము జిల్లాలో కొంత భూభాగం వేరు చేసి ఈ జిల్లాను రూపొందించారు. 2001 గంఆణ్కాలను అనుసరించి జిల్లా వైశాల్యం 3660చ.కి.మీ, జనసంఖ్య 558,831.

చరిత్ర

[మార్చు]

ఈ జిల్లా మునుపు పాలము జిల్లాలో భాగంగా ఉంటూ వచ్చింది. పాలము జిల్లా 1928 జనవరి 1 రూపొందించబడింది. 2001 ఏప్రిల్ 4 న పాలము జిల్లాలోని లాతేహార్ ఉపవిభాగం జిల్లాగా రూపొందించబడింది. ఇది రెడ్ కార్పెట్‌లో భాగం.[1]

భౌగోళికం

[మార్చు]

లాతేహార్ జిల్లాలో 2 ఎత్తైన జలపాతాలు (లోథ్ జలపాతం, లోవర్ ఘఘ్రి జలపాతం ) ఉన్నాయి. ఇవి భారతీయ ఎత్తైన జలపాతాల జాబితాలో భాగమై ఉన్నాయి. ఇవి కాక జిల్లాలో పలు జలపాతాలు ఉన్నాయి.[2]

  • జిల్లాలో " బెట్ల జాతీయ పార్క్ " ఉంది.

ఆర్ధికం

[మార్చు]

2006 గణాంకాల ప్రకారం పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో లాతేహార్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[3] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న జార్ఖండ్ రాష్ట్ర 21 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[3]

విభాగాలు

[మార్చు]

జిల్లాలో 7 డెవెలెప్మెంటు బ్లాకులు ఉన్నాయి : లాతేహార్, చంద్వా, బాలూమఠ్, మనిక, బార్వాడిహ్, గురు, మహుద్.

  • జిల్లాలో 2 విధానసభ నియోజక వర్గాలు ఉన్నాయి : మనిక, లాతేహార్. ఇవి రెండు చత్రా పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి.

2001 లో గణాంకాలు

[మార్చు]
విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 725,673,[4]
ఇది దాదాపు. భూటాన్ దేశ జనసంఖ్యకు సమానం.[5]
అమెరికాలోని. అలాస్కా నగర జనసంఖ్యకు సమం.[6]
640 భారతదేశ జిల్లాలలో. 499వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 200 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 29.38%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 964:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 61.23%.[4]
జాతియ సరాసరి (72%) కంటే.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "83 districts under the Security Related Expenditure Scheme". IntelliBriefs. 2009-12-11. Archived from the original on 2011-10-27. Retrieved 2011-09-17.
  2. "Showing all Waterfalls in India". World Waterfalls Database. Archived from the original on 2012-08-25. Retrieved 2010-06-20.
  3. 3.0 3.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Archived from the original (PDF) on 2012-04-05. Retrieved September 27, 2011.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. Bhutan 708,427
  6. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Alaska 710,231

వెలుపలి లింకులు

[మార్చు]