లార్జ్ ఫార్మాట్ ఫిల్మ్
లార్జ్ ఫార్మాట్ (ఆంగ్లం: Large Format) 4 X 5 ఇంచిల (102 X 127 mm) గానీ అంత కన్నా పెద్ద ఫిలింని ఉపయోగించే ఛాయాచిత్రకళ [1]. లార్జ్ ఫార్మాట్ ఫిలిం, మీడియం ఫార్మాట్ ఫిలిం కన్నా కొద్దిగా పెద్దగా, 135 ఫిల్మ్ కంటే బాగా పెద్దదిగా ఉంటుంది. 135 ఫిలింతో పోలిస్తే పదహారింతలు పెద్దది కావటం మూలాన లార్జ్ ఫార్మాట్ ఫోటోగ్రఫీలో స్పష్టత కూడా పదహారింతలు ఎక్కువగనే ఉంటుంది.
మీడియం ఫార్మాట్, 135 ఫిల్మ్ ల వలె చుట్టలుగా కాకుండా, లార్జ్ ఫార్మాట్ ఫిలిం షీట్ ఫిలిం గా లభ్యం అవుతుంది. మొదట గాజుతో తయారు చేయబడే ఫోటోగ్రఫిక్ ప్లేట్ లను లార్జ్ ఫార్మాట్ కెమెరాలలో వినియోగించేవారు.
చరిత్ర
[మార్చు]డాగురోటైప్
[మార్చు]1816 లో కళాకారులైన ఫ్రెంచి సోదరులు జోసెఫ్ నీప్సె, క్లైడ్ నీప్సె లు మొదట్ నెగిటివ్ ను, దాని పాజిటివ్ ను సాధించారు. 1826-27 లో వీటిని శాశ్వత పరచే ప్రక్రియలను కనుగొన్నారు. ఇదే పద్ధతిని అనుసరించి కొద్దిగా మెరుగులు దిద్ది వారి భాగస్వామి లూయిస్ డాగురే, డాగురోటైప్ ను కనుగొన్నాడు. 19 ఆగష్టు 1839 న ఫ్రాన్సు, ఫోటోగ్రఫీని ప్రపంచానికి తాము ఇచ్చే కానుకగా పరిచయం చేసింది. 50వ దశకానికి లార్జ్ ఫార్మాట్ ఫోటోగ్రఫీ జన బాహుళ్యం లోకి వచ్చింది [2] కొద్ది పాటి మార్పులతో ఇంగ్లాండుకు చెందిన హెన్రీ ఫాక్స్ టాల్బాట్ క్యాలోటైప్ ను,
కొలాయిడన్ ప్రక్రియ
[మార్చు]1851 లో బ్రిటన్ కు చెందిన ఫ్రెడెరిక్ స్కాట్ ఆర్చర్, ఫ్రాన్సుకు చెందిన గుస్తావ్ లే గ్రే దాదాపు ఒకేసారిగా కొలాయిడన్ అనే వెట్ ప్లేట్ ప్రక్రియను కనుగొన్నారు. 1860 నాటికి కొలాయిడన్ ప్రక్రియ డాగురోటైప్ ల కు స్వస్తి పలికించింది.
1880 నాటికి డ్రై ప్లేట్ సాంకేతికత కూడా అభివృద్ధి చేయబడింది.
మీడియం ఫార్మాట్ రాక
[మార్చు]లార్జ్ ఫార్మాట్లు అయిన డాగురోటైప్, కొలాయిడన్ ప్రక్రియలలో వాడబడే ప్లేట్లలో పగిలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండటం, కాపీ చేయటం కష్టతరంగా ఉండటంతో క్రొత్త దారులు వెదకవలసి వచ్చింది. ఫోటోగ్రఫీ నైపుణ్యం అవసరమయ్యే ఒక కళ/వైజ్ఙానిక శాస్త్రం గా మాత్రమే కాక, ఔత్సాహికులకు అభిరుచిగా మారటం, ఫోటోగ్రఫీ లో వచ్చిన ఈ పెనుమార్పును ఈస్ట్‌మన్ కొడాక్ అందిపుచ్చుకొంటూ మీడియం ఫార్మాట్ కెమెరాలు, వాటికి తగిన ఫిలిం ను తయారీ ప్రారంభం చేయటం తో లార్జ్ ఫార్మాట్ ఫిలిం మరుగున పడింది. [3]
ఫిలిం ఫార్మాట్
[మార్చు]లార్జ్ ఫార్మాట్ ఫిలిం లో వివిధ పరిమాణాలు (ఇంచిలలో)
- 4 X 5
- 4 X 10
- 5 X 7
- 8 X 10
- 8 X 20
- 9 X 9
- 9 X 12
- 9 X 18
- 10 X 13
- 11 X 14
- 13 X 18
- 16 X 20
- 20 X 24
- 24 X 24
- 36 X 36
- 48 X 48
లక్షణాలు
[మార్చు]- అన్ని ఫిలిం ఫార్మాట్ లలో కెల్లా పెద్దవి అయిన ఛాయాచిత్రాలు వస్తాయి
- జూం కటకాల స్థానే కటకానికి, ఫిలిం కు మధ్యన తోలుతో చేసిన బెల్లోస్ ఉండటం
- అత్యధిక స్పష్టత
- పలు రకాల కటకాల అవసరం కావటం
- అన్ని లార్జ్ ఫార్మాట్ కెమెరాలలో మీడియం ఫార్మాట్ ఫిలిం ను కూడా ఉపయోగించవచ్చును
- ప్రతి ఒక్క అమరిక, ప్రతి ఒక్క నియంత్రణ మానవీయం (manual)
లాభాలు
[మార్చు]- మిగతా రెండు ఫార్మాట్ లతో పోలిస్తే వచ్చే ఫిలిం గ్రెయిన్ అవకాశం తక్కువ. కాబట్టి స్పష్టత అవకాశం ఎక్కువ [4]
- మిగతా రెండు ఫార్మాట్ లతో పోలిస్తే సాధ్యపడే నాణ్యత ఎక్కువ
నష్టాలు
[మార్చు]- పరికరాలు భారీగా ఉండటం వలన తరలింపు కష్ట సాధ్యం
- ఫిలిం ను కెమెరాలో లోడ్ చేయటానికి డార్క్ రూం అవసరం అవుతుంది
- మిగతా రెండు ఫార్మాట్ లతో పోలిస్తే పెట్టుబడి, సంవర్థన ధరలు హెచ్చు
- మిగతా రెండు ఫార్మాట్ లతో పోలిస్తే సంవర్థన సమయం కూడా ఎక్కువే
- ట్రైపాడ్ లేనిదే లార్జ్ ఫార్మాట్ ఫోటోగ్రఫీ సాధ్యపడదు
- కదులుతోన్న సబ్జెక్టులను (పశుపక్ష్యాదులు, క్రీడలు వంటివాటిని) చిత్రీకరించటానికి లార్జ్ ఫార్మాట్ పనికి రాదు
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ లార్జ్ ఫార్మాట్ ఫిలిం ను నిర్వచించిన లార్జ్ ఫార్మాట్ ఫోటోగ్రఫీ.ఇన్ఫో వెబ్ సైటు
- ↑ "లార్జ్ ఫార్మాట్ కు బీజం వేసిన నీప్సె సోదరులు". Archived from the original on 2017-02-15. Retrieved 2018-10-05.
- ↑ "మీడియం ఫార్మాట్ వచ్చే వరకు ఒక వెలుగు వెలిగిన లార్జ్ ఫార్మాట్". Archived from the original on 2018-08-12. Retrieved 2018-10-07.
- ↑ లాభాలను వివరించిన ఇల్ఫోర్డ్ ఫోటో వెబ్ సైటు