లార్సెన్ & టూబ్రో
![]() | |
రకం | పబ్లిక్ |
---|---|
ISIN | INE018A01030 |
పరిశ్రమ | Conglomerate |
స్థాపన | 7 February 1946[1] Bombay, Bombay Presidency, British India (present-day Mumbai, Maharashtra, India) |
స్థాపకుడు | |
ప్రధాన కార్యాలయం | ఎల్&టి హౌస్, బల్లార్డ్ ఎస్టేట్, , |
సేవ చేసే ప్రాంతము | ప్రపంచ వ్యాప్తం |
కీలక వ్యక్తులు |
|
ఉత్పత్తులు | |
సేవలు | |
రెవెన్యూ | ![]() |
![]() | |
![]() | |
Total assets | ![]() |
Total equity | ![]() |
ఉద్యోగుల సంఖ్య | 337,994[5] (2022) |
విభాగాలు | |
అనుబంధ సంస్థలు |
|
వెబ్‌సైట్ | www![]() |
లార్సెన్ & టూబ్రో లిమిటెడ్ (ఎల్ అండ్ టి ) వాడుకలో ఉన్నపేరుతొ పిలువబడే ఒక భారతీయ బహుళజాతి సంస్థ, సంస్థ ఇంజనీరింగ్, నిర్మాణం, తయారీ, సాంకేతిక పరిజ్ఞానం, ఆర్థిక సేవల వంటి రంగములలో ఉన్నది. [6] మహారాష్ట్ర రాజధాని ముంబైలో ప్రధాన కార్యాలయం కలిగి ఉంది. ఈ సంస్థ ప్రపంచంలోని మొదటి ఐదు నిర్మాణ సంస్థలలో ఒకటిగా పరిగణించబడుతుంది. భారతదేశంలో ఉన్న ఇద్దరు డానిష్ ఇంజనీర్లు దీనిని స్థాపించారు. [7]
2020 నాటికి, ఎల్ అండ్ టి గ్రూప్ 118 అనుబంధ సంస్థలు, 6 అసోసియేట్లు, 25 జాయింట్-వెంచర్, 35 జాయింట్ ఆపరేషన్స్ కంపెనీలను కలిగి ఉంది, ప్రాథమిక, భారీ ఇంజనీరింగ్, నిర్మాణం, రియల్ ఎస్టేట్, క్యాపిటల్ గూడ్స్ తయారీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్థిక సేవలలో పనిచేస్తుంది.
చరిత్ర
[మార్చు]1946 వ సంవత్సరం లో స్థాపించిన ఎల్ అండ్ టి వృత్తిపరంగా నిర్వహించబడే భారతీయ బహుళజాతి సంస్థ, ఉద్యోగులు, భాగస్వాములు కలిసి, ఎల్ అండ్ టి ఒక ప్రధాన సాంకేతిక పరిజ్ఞానం, ఇంజనీరింగ్, నిర్మాణం, తయారీ, ఆర్థిక సేవల సమ్మేళనం, తన వ్యాపార నిర్వహణ ప్రపంచములో పేరున్న సంస్థలలో ఒకటిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 30కి పైగా దేశాల్లోని వినియోగదారులకు హైడ్రోకార్బన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్, ప్రాసెస్ ఇండస్ట్రీస్, రక్షణ వంటి కీలక రంగాలలో పనిచేస్తుంది. ఎల్ అండ్ టి ఆర్థిక వ్యవస్థ కీలక, రంగాలలో నిమగ్నమై ఉంది. 8 దశాబ్దాల బలమైన, కస్టమర్ ఫోకస్డ్ అప్రోచ్ , ప్రపంచ స్థాయి నాణ్యతతో టెక్నాలజీ, ఇంజినీరింగ్, కన్ స్ట్రక్షన్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ లు ఈ సంస్థ సాటిలేని నైపుణ్యం ఉంది. [8]
వ్యాపార రంగాలు
[మార్చు]లార్సెన్ & టూబ్రో లిమిటెడ్ ఈ వ్యాపారాలను కొనసాగిస్తుంది. వాటిలో మౌలిక సదుపాయాలు, విద్యుత్ రంగం, భారీ ఇంజినీరింగ్,ఎలక్ట్రికల్ అండ్ ఆటోమేషన్, హైడ్రోకార్బన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ టెక్నాలజీ సర్వీసెస్, ఆర్ధిక సేవలు, అభివృద్ధి ప్రాజెక్టుల రంగాలలో తన వ్యాపార నిర్వహిస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ విభాగంలో ఇంజనీరింగ్, భవన ఫ్యాక్టరీల నిర్మాణం, రవాణా మౌలిక సదుపాయాలు, భారీ పౌర మౌలిక సదుపాయాలు, పవర్ ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్, నీరు, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ఉన్నాయి. విద్యుత్ప రంగములో బొగ్గు ఆధారిత, గ్యాస్ ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్ ల కొరకు టర్న్ కీ సొల్యూషన్ లు ఉంటాయి. భారీ(హెవీ) ఇంజినీరింగ్ విభాగంలో కస్టమ్ డిజైన్ చేయబడ్డ, ఇంజినీర్ చేయబడ్డ క్రిటికల్ ఎక్విప్ మెంట్, సిస్టమ్ లను ఫెర్టిలైజర్, రిఫైనరీ, పెట్రోకెమికల్, కెమికల్, ఆయిల్ & గ్యాస్, థర్మల్, న్యూక్లియర్ పవర్, ఏరోస్పేస్,రక్షణ వంటి కీలక రంగాల పరిశ్రమలకు ఉత్పత్తి, పంపిణీ చేస్తుంది. ఎలక్ట్రికల్, ఆటోమేషన్ దానిలో మీడియం వోల్టేజ్ స్విచ్ గేర్ కాంపోనెంట్ లు, కస్టమ్ బిల్ట్ లో మీడియం వోల్టేజ్ స్విచ్ బోర్డ్ లు, ఎలక్ట్రానిక్ ఎనర్జీ మీటర్ల ప్రొటెక్షన్ సిస్టమ్ లు, కంట్రోల్,ఆటోమేషన్ ప్రొడక్ట్ ల తయారీ, అమ్మకాలు ఉన్నాయి. హైడ్రోకార్బన్ విభాగంలో సవిస్తరమైన ఇంజినీరింగ్, మాడ్యులర్ ఫ్యాబ్రికేషన్, ప్రొక్యూర్ మెంట్, ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్, కన్ స్ట్రక్షన్, ఇన్ స్టలేషన్, కమిషనింగ్ ద్వారా ఫ్రంట్ ఎండ్ డిజైన్ నుంచి గ్లోబల్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ కొరకు ఇంజినీరింగ్ ప్రొక్యూర్ మెంట్, కన్ స్ట్రక్షన్, కమిషనింగ్ సొల్యూషన్ లను అందిస్తుంది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ టెక్నాలజీ సర్వీసెస్ విభాగంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ సేవలను అందిస్తుంది. ఆర్ధిక సేవలలో (ఫైనాన్షియల్ సర్వీసెస్) విభాగంలో రిటైల్, కార్పొరేట్ ఫైనాన్స్, హౌసింగ్ ఫైనాన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్, జనరల్ ఇన్స్యూరెన్స్, మ్యూచువల్ ఫండ్ స్కీంల అసెట్ మేనేజ్మెంట్, సంబంధిత సలహా సేవలను అందచేస్తారు. డెవలప్ మెంట్ ప్రాజెక్ట్స్ దానిలో ప్రాథమిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అభివృద్ధి, నిర్వహిస్తుంది. యాన్యుటీ ఆధారిత ప్రాజెక్ట్ లతో సహా టోల్ కలెక్షన్, పవర్ డెవలప్ మెంట్, పోర్ట్ ఫెసిలిటీస్ డెవలప్ మెంట్, ఆపరేషన్, సంబంధిత సలహాలను సర్వీసులను అందచేస్తారు . ఇతర రంగాలలో మెటలర్జికల్, మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్ లు, ఓడల నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ సర్వీసులు ఉంటాయి. [9]
గుర్తింపు
[మార్చు]లార్సెన్ & టూబ్రో ఫోర్బ్స్ జాబితాలో ఈ క్రింది స్థానాలలో ఉంది. [9]
క్రమ సంఖ్య | విభాగము | పొందిన ర్యాంక్ (స్థానం ) |
---|---|---|
1 | గ్లోబల్ 2000-2022 | 514 |
2 | ప్రపంచములో ఉత్తమ వ్యాపారదక్షత | 127 |
3 | ప్రపంచములో ఉత్తమ కంపెనీలలో | 115 |
4 | ప్రపంచములో వినూత్నమైన కంపెనీలలో | 86 |
తెలంగాణాలో నిర్మాణం
[మార్చు]తెలంగాణ రాష్ట్రము లోని హైదరాబాద్ లో 2002 సంవత్సరం లో హైటెక్ సిటీ నిర్మాణం ఈ సంస్థ చేపట్టి పబ్లిక్ ప్రైవేట్ మోడల్ విధానంలో (PPP ) మొదటి విజయవంతమైన ప్రాజెక్ట్ పూర్తి చేసింది.[10] ఈ భవనము హైదరాబాద్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో పునాది వేసిందని పేర్కొంటారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జి.హెచ్.ఎం.సి. దానిలో నీటి సరఫరా పనులను కూడా ఈ సంస్థ చేపట్టింది. [10]
హైదరాబాదు మెట్రో రైలు ప్రాజెక్టు ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ప్రపంచంలోనే అతి పెద్ద మెట్రో ప్రాజెక్టు, దీనిని ఎల్ & టి వారు చేపట్టి మూడు కారిడార్లలో 69.2 కి.మీ.ల మేర నిర్మాణము కావించారు. [11]
మూలాలు
[మార్చు]- ↑ "incorporated on 07th February, 1946". www.larsentoubro.com. Retrieved 11 February 2022.
{{cite web}}
:|archive-date=
requires|archive-url=
(help)CS1 maint: url-status (link) - ↑ "Contact L&T". www.larsentoubro.com. Archived from the original on 12 February 2017. Retrieved 11 February 2017.
- ↑ 3.0 3.1 3.2 "Larsen & Toubro Consolidated Profit & Loss account, Larsen & Toubro Financial Statement & Accounts". www.moneycontrol.com (in ఇంగ్లీష్). Retrieved 14 July 2020.
- ↑ 4.0 4.1 "Larsen & Toubro Consolidated Balance Sheet, Larsen & Toubro Financial Statement & Accounts". www.moneycontrol.com (in ఇంగ్లీష్). Retrieved 14 July 2020.
- ↑ "Larsen & Toubro Annual Report Fiscal Year 2019 Results" (PDF). larsentoubro.com. Larsen & Toubro. 4 February 2019. Archived from the original (PDF) on 30 September 2020. Retrieved 4 February 2019.
- ↑ "LARSEN & TOURO" (PDF). bseindia.com. Archived from the original (PDF) on 23 సెప్టెంబరు 2015. Retrieved 11 July 2022.
- ↑ Shah, Shashank (February 2014). "Stakeholders Management in the Indian Construction Industry: Insights int Insights into the Appr o the Approach at Larsen & T oach at Larsen & Toubro's Constructions Construction Division". valpo.edu. Retrieved 11 July 2022.
- ↑ www.ambitionbox.com. "Larsen & Toubro Limited Overview and Company Profile". AmbitionBox (in ఇంగ్లీష్). Archived from the original on 2022-07-11. Retrieved 2022-07-11.
- ↑ 9.0 9.1 "Larsen & Toubro". Forbes (in ఇంగ్లీష్). Retrieved 2022-07-11.
- ↑ 10.0 10.1 "A futuristic techno city; Our first successful project on a PPP mode". lntecc.com. Retrieved 11 July 2022.
- ↑ "Hyderabad Metro | L&T India". www.ltmetro.in (in ఇంగ్లీష్). Retrieved 2022-07-11.