Jump to content

లాలా అచింత్ రామ్

వికీపీడియా నుండి

లాలా అచింత్ రామ్
Member of the భారత Parliament
for హిసార్
In office
1952 (1952) – 1957 (1957)
అంతకు ముందు వారుస్థానం ఏర్పాటు చేయబడింది
తరువాత వారుఠాకూర్ దాస్ భార్గవ
Member of Parliament
for పటియాలా
In office
1957 (1957) – 1961 (1961)
వ్యక్తిగత వివరాలు
జననం(1898-08-19)1898 ఆగస్టు 19
కోట్ మహమ్మద్ ఖాన్ గ్రామం, తరణ్ తారన్ జిల్లా, పంజాబ్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుత పంజాబ్, భారతదేశం)
మరణం1961(1961-00-00) (వయసు: 62–63)
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి
సంతానం3 (సహా కృష్ణ కాంత్)
కళాశాలడి. ఎ. వి. కళాశాల, లాహోర్

లాలా అచింత్ రామ్ (19 ఆగస్టు 1898 – 1961) భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకుడు.

1921 లో లాహోర్‌లో లాలా లజపత్ రాయ్ స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్ సొసైటీ మొదటి ముగ్గురు సభ్యులలో ఈయన ఒకరు. భారత స్వాతంత్ర్యోద్యమంలో భాగంగా క్విట్ ఇండియా ఉద్యమం లో పాల్గొని 1930–32, 1939, 1940, 1942–45 మధ్య కాలంలో దీర్ఘకాలం జైలు శిక్ష అనుభవించారు. దేశ విభజన తర్వాత ఢిల్లీకి మారి, భారత రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా కూడా సేవలందించారు. 1952 లో పంజాబ్‌లోని హిసార్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 1వ లోక్‌సభ ఎన్నికల్లో, 1957 లో పటియాలా లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండవసారి విజయం సాధించారు. 1950ల కాలంలో తన భార్య సత్యవతి దేవి తో కలిసి వినోబా భావే చేపట్టిన భూదాన్ ఉద్యమం లో చురుగ్గా పాల్గొన్నారు.

తొలి జీవితం, నేపథ్యం

[మార్చు]

అచింత్ రామ్ 1898 ఆగస్టులో పంజాబ్‌లోని తరణ్ తారన్ జిల్లా ఖదూర్ సాహిబ్ తాలూకాలోని కోట్ మహమ్మద్ ఖాన్ గ్రామంలో జన్మించారు. అమృత్‌సర్, షిమ్లా లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యనభ్యసించారు. ఉన్నత విద్య కోసం లాహోర్ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) లోని డిఏవి (DAV) కళాశాలకు వెళ్లారు.[1]

1921 లో లాలా లజపత్ రాయ్ స్థాపించిన సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్ సొసైటీ లో చేరిన మొదటి ముగ్గురు సభ్యులలో ఒకరిగా నిలిచారు.[2]

1925 లో సత్యవతి దేవి ని వివాహం చేసుకున్నారు.[1] స్వాతంత్ర్య సమరయోధురాలైన సత్యవతి దేవి, 1942 ఆగస్టు 26 న తన ముగ్గురు చిన్న పిల్లలతో కలిసి ಬಂధిచబడ్డారు. జైలు లోపల మెరుగైన వసతుల కోసం ఆమె నిరసనలు నిర్వహించారు.[3] స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఈ కుటుంబం లాహోర్‌లోని లజపత్ భవన్‌లోనే ఉండి, 1948 లో ఢిల్లీకి మారడానికి ముందు వందలాది మంది శరణార్థులకు భోజనం వండి పెట్టారు. 2010 అక్టోబర్ 26 న తన 105వ ఏట మరణించే సమయానికి ఆమె భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ వృద్ధ స్వాతంత్ర్య సమరయోధురాలిగా నిలిచారు.[3]

ఈ దంపతులకు నిర్మల, సుభద్ర అనే ఇద్దరు కుమార్తెలు, కృష్ణ కాంత్ అనే కుమారుడు ఉన్నారు.[4] కుమార్తె సుభద్ర ఖోస్లా 13 ఏళ్ల వయసులో స్వాతంత్ర్యోద్యమంలో జైలుకెళ్లిన అతి పిన్న వయస్కురాలైన స్వాతంత్ర్య సమరయోధురాలు.[5] కృష్ణ కాంత్ 1997 ఆగస్టు నుండి 2002 జూలై 27 న మరణించే వరకు భారత ఉపరాష్ట్రపతి గా సేవలందించారు. ఆయన 1966 నుండి 1977 వరకు రాజ్యసభ సభ్యుడిగా, 1977 నుండి 1980 వరకు లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు.[6][7]

స్వాతంత్ర్యోద్యమంలో పాత్ర

[మార్చు]

లాలా అచింత్ రామ్ చిన్నతనంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరి దాని ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. 1930–32, 1939, 1940, 1942–45 కాలంలో స్వాతంత్ర్య పోరాటాల్లో పాల్గొన్నందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను జైలులో నిర్బంధించింది.[1] ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. పంజాబ్ ప్రావిన్షియల్ ఎలక్షన్ ట్రిబ్యునల్, నేషనల్ ఇండస్ట్రియల్ హైస్కూల్‌లకు రెండేళ్లపాటు అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆల్ ఇండియా పోస్ట్‌మెన్ అండ్ లోయర్ గ్రేడ్ స్టాఫ్ యూనియన్ ఉపాధ్యక్షుడిగా, సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్ సొసైటీ కార్యదర్శిగా, 1950–52 వరకు భారతదేశ తాత్కాలిక పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు.[1]

1946 నుండి 1950 వరకు భారత రాజ్యాంగాన్ని రూపొందించిన భారత రాజ్యాంగ పరిషత్తు సభ్యుడిగా ఉన్నారు.[8]

స్వాతంత్ర్య అనంతరం

[మార్చు]

దేశ విభజన తర్వాత, సర్వెంట్స్ ఆఫ్ ది పీపుల్ సొసైటీ ప్రధాన కార్యాలయాన్ని 1960 వరకు న్యూఢిల్లీలోని లాలా అచింత్ రామ్ నివాసానికి (2-టెలిగ్రాఫ్ లేన్) మార్చారు. 1960 లో ఢిల్లీలోని లాజ్‌పత్ నగర్ లో కొత్త భవనం (లజ్‌పత్ భవన్) ప్రారంభించబడింది.[9] ఆయన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి హిసార్ నుండి 66,266 ఓట్లతో గెలుపొందారు.[10] 1957 సార్వత్రిక ఎన్నికలలో పటియాలా లోక్‌సభ నియోజకవర్గం నుండి 1,24,380 ఓట్లతో 2వ లోక్‌సభకు ఎన్నికయ్యారు.[11]

తన గ్రామంలో పిల్లల కోసం బాలవాడి (పాఠశాల), బాలికల కుట్టు శిక్షణ కేంద్రాన్ని నిర్వహించడానికి తన పూర్వీకుల ఇల్లును గ్రామ పంచాయతీకి విరాళంగా ఇచ్చారు.[7] స్వాతంత్ర్యోద్యమంలో ఈయన, ఐ. కె. గుజ్రాల్ తండ్రి అవతార్ నారాయణ్ గుజ్రాల్ సన్నిహిత సహచరులుగా ఉన్నారు.[12] 1950లలో తన భార్యతో కలిసి వినోబా భావే చేపట్టిన భూదాన్ ఉద్యమం లో చురుగ్గా పాల్గొన్నారు.[3] 1953 లో భూమిలేని పేదలకు భూమిని విరాళంగా ఇవ్వమని ప్రజలను ప్రోత్సహించడానికి హిసార్‌కు చెందిన లాలా జై దేవ్ తాయాల్ కుమార్తె సత్య బాల తో కలిసి సిర్సా వరకు పాదయాత్ర నిర్వహించారు.[13]

చండీగఢ్‌లో ఆయన పేరు మీద ఒక ఆడిటోరియం నిర్మించబడింది. ఈ ఆడిటోరియానికి 1974 జూన్ 26 న అప్పటి భారత రాష్ట్రపతి వి. వి. గిరి శంకుస్థాపన చేశారు.[14]

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 4 "Achint Ram, Lala". Lok Sabha. Archived from the original on 15 అక్టోబరు 2013. Retrieved 26 మే 2014.
  2. ↑ Sharma, K. K. (1975). Life and Times of Lala Lajpat Rai. Indian Book Agency. p. 165.
  3. 1 2 3 "India's oldest freedom fighter dies at 105". The Times of India. 27 అక్టోబరు 2010. Archived from the original on 31 అక్టోబరు 2010. Retrieved 27 మే 2014.
  4. ↑ "A patriot Speaks". Harmony Magazine. జూలై 2009. Archived from the original on 27 మే 2014. Retrieved 27 మే 2014.
  5. ↑ Priyanka Dube (30 మార్చి 2009). "Oldest freedom fighter recalls memories of struggle". CNN-IBN. Archived from the original on 28 మే 2014. Retrieved 27 మే 2014.
  6. ↑ "Shri Krihsna Kant Profile". Vice President of India website. Archived from the original on 3 ఫిబ్రవరి 2014. Retrieved 27 మే 2014.
  7. 1 2 Bains, Satinder (21 ఆగస్టు 1998). "Lala Achint Ram's birth anniversary celebrated". Indian Express. Archived from the original on 8 జూలై 2014. Retrieved 26 మే 2014.
  8. ↑ "Founding fathers". The Tribune. Retrieved 27 మే 2014.
  9. ↑ "Head Office". Servants of the People Society. Archived from the original on 14 మార్చి 2014. Retrieved 27 మే 2014.
  10. ↑ "Statistical Report on General Elections, 1951 to the First Lok Sabha, Vol. I" (PDF). Election Commission of India. p. 103. Archived from the original (PDF) on 4 ఏప్రిల్ 2014. Retrieved 27 మే 2014.
  11. ↑ "Statistical Report on General Elections, 1957 to the Second Lok Sabha, (Vol. I)" (PDF). Election Commission of India. p. 90. Archived from the original (PDF) on 4 ఏప్రిల్ 2014. Retrieved 27 మే 2014.
  12. ↑ Swarup, Harihar (2010). Power Profiles. Har Anand Publications. p. 165. ISBN 978-8124115251.
  13. ↑ Jugal Kishore Gupta (1991). History of Sirsa Town. Atlantic Publishers. p. 156. GGKEY:63QY4LRCK9L.
  14. ↑ D C Gupta (2009). Indian Government And Politics (8th ed.). Vikas Publishing House. p. 135. ISBN 978-0706987782.