లాల్రింట్లుంగా సైలో
| లాల్రింట్లుంగా సైలో | |||
| |||
| పదవీ కాలం 2018 – 2025 జూలై 21 | |||
| ముందు | లాల్రోబికా | ||
|---|---|---|---|
| తరువాత | ఆర్. లాల్తాంగ్లియానా | ||
| నియోజకవర్గం | డంపా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1960 జూన్ 13 ఐజ్వాల్, అస్సాం, భారతదేశం (ఇప్పుడు మిజోరం , భారతదేశం) | ||
| మరణం | 2025 July 21 (వయసు: 65) ఢిల్లీ, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | మిజో నేషనల్ ఫ్రంట్ | ||
| పూర్వ విద్యార్థి | చ. చుంగా హై స్కూల్, చాల్హ్మున్, ఐజ్వాల్ | ||
లాల్రింట్లుంగా సైలో (13 జూన్ 1960 - 21 జూలై 2025) మిజోరాం రాష్ట్రానికి రాజకీయ నాయకుడు. ఆయన మిజోరాం శాసనసభకు డంపా శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
రాజకీయ జీవితం
[మార్చు]లాల్రింట్లుంగా సైలో మిజో నేషనల్ ఫ్రంట్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2018 మిజోరం శాసనసభ ఎన్నికలలో డంపా శాసనసభ నియోజకవర్గం నుండి ఎంఎన్ఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి లాల్రోబియాకాపై 1,657 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో ఎంఎన్ఎఫ్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జోరమ్ పీపుల్స్ మూవ్‌మెంట్ అభ్యర్థి వన్లాల్‌సైలోవానుపై 292 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
మరణం
[మార్చు]లాల్రింట్లుంగా సైలో స్క్రబ్ టైఫస్‌తో సహా సంక్లిష్ట వ్యాధులతో బాధపడుతూ అనారోగ్యంతో ఢిల్లీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 65 ఏళ్ల వయసులో 2025 జూలై 21 మరణించాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "Sitting Mizo National Front MLA Lalrintluanga Sailo passes away in Delhi" (in ఇంగ్లీష్). Hindustan Times. 22 July 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.
- ↑ "Mizoram MLA Lalrintluanga Sailo dies in Delhi, body likely to be brought to Aizawl on Tuesday". ThePrint. 21 July 2025. Archived from the original on 15 November 2025. Retrieved 15 November 2025.