లావణ్యా సుందరరామన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
లావణ్యా సుందరరామన్
వ్యక్తిగత సమాచారం
జననం(1992-05-01)1992 మే 1
మూలంచెన్నై, తమిళనాడు,భారతదేశం
సంగీత శైలికర్ణాటక సంగీతం, భారతీయ శాస్త్రీయ సంగీతం
వృత్తిగాయకురాలు
క్రియాశీల కాలం2000 – Present

లావణ్యా సుందరరామన్ కర్ణాటక సంగీతకారులు. ఆమె ప్రారంభవిద్యను ఫూర్ణచంద్రరావు వద్ద అభ్యసించారు.తరువాత ఆమె సంగీత శిక్షణను సంగీతకారులైన కుటుంబసభ్యుల వద్ద చేర్చుకుంది.

ప్రారంభ జీవితం, కుటుంబం[మార్చు]

లావణ్య సంగీత కళాకారుల కుటుంబంలో గాయత్రి, సుందరరామన్ దంపతులకు జన్మించింది. ఆమె సోదరుడు వైద్యుడు.[1] ఆమె తాతగారు పాల్గాట్ మణి అయ్యర్ మృదంగ కళాకారుడు.

లావణ్య సంగీత విద్యను బాల్యంలో ఆమె తాతమ్మ అయిన ప్రసిద్ధ సంగీత విద్వాంసురాలు డి.కె.పట్టమ్మాళ్ వద్ద నేర్చుకుంది.[2] ఆమె తన నాయనమ్మ అయిన సంగీతకారిణి లలితా శివకుమార్ యొక్క శిష్యురాలు.[1] ఆమె తల్లి గాయత్రి సుందరరామన్, అత్తయ్య, ప్రసిద్ధ సంగీత విద్వాంసురాలైన నిత్యశ్రీ మహదేవన్ లకు శిష్యురాలు కూడా.[1][2]

లావణ్య 2011 లో చెన్నై లోని క్వీన్ మేరీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చేసి సంగీతంలో బి.ఎ పట్టాను పొందారు.

పర్యటనలు[మార్చు]

ఆమె భారతదేశంలో ప్రముఖ సభలలో ప్రదర్శనలిచారు. ముఖ్యంగా చెన్నై లోని ప్రతి సంవత్సరం జరుగుతున్న "డిసెంబరు మ్యూజిక్ ఫెస్టివల్"లో కచేరీలు చేసారు. ఆమె అమెరికాలో కూడా కచేరీలను చేసారు.[1] ఆమె కెనడా,[1] శ్రీలంక,[3], యితర ప్రాంతాలలో కూడా కచేరీలను చేసారు.

టెలివిజన్ కార్యక్రమాలలో[మార్చు]

ఆమె వివిధ టెలివిజన్ సంగీత కార్యక్రమాలలో పాల్గొన్నది:

 • 2004 లో జయ టీ.వీ లోని "రాగమాలిక" అనే నూతన సంవత్సర ప్రత్యేక కార్యక్రమం.
 • 2009 లో "రాజ్ టీ.వీ" నిర్వహించిన దీపావళి ప్రత్యేక కార్యక్రమం.
 • 2009 నవంబరులో "రాజ్ టీ.వీ"లో ప్రదర్శితమైన "ఎయిర్‌టెల్ సూపర్ సింగర్ జూనియర్" రెండవ సీజన్ లో పాల్గొన్నారు.
 • 2013,2014, 2015 లలో భారతదేశంలో "మక్కల్ టీ.వీ" ప్రదార్శిస్తున్న సంగీత కార్యక్రమం "తీయనముదు" .

డిస్కోగ్రఫీ[మార్చు]

ఆమె హిందూ భక్తి గీతాలను, యితర మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కూడా పాడారు.

 • సాయి లావణ్య లహరి (పుట్టపర్తి లోని సత్యసాయినాథ ట్రస్టు కొరకు)
 • కరుణై దైవమె (గిరి ట్రేడింగ్ ఏజన్సీ కొరకు)
 • మదురకలి అమ్మన్ (మంగళం గణపతి ట్రస్టు కొరకు)
 • త్రివేణీ సంగమం (గిరి ట్రేడింగ్ ఏజన్సీ కొరకు డి.వి.డి)

మూలాలు[మార్చు]

 1. 1.0 1.1 1.2 1.3 1.4 Bhanu Kumar (23 July 2011). "Blooming bud – Mumbai Mirror". Mumbai Mirror. Retrieved 20 March 2015.
 2. 2.0 2.1 Suganthi Krishnamachari (20 December 2010). "The gene factor – The Hindu". The Hindu. Retrieved 20 March 2015. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "HinduDec2010" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
 3. Satyajith Andradi (12 November 2010). "An evening of music with Nithyasree Mahadevan". The Island (Sri Lanka). Archived from the original on 2 ఏప్రిల్ 2015. Retrieved 21 March 2015.