Jump to content

లావీ పింటో

వికీపీడియా నుండి
లావీ పింటో
Personal information
Full nameలావిన్హో థామస్ పింటొ
Nationalityభారతీయుడు
Born(1929-10-23)1929 అక్టోబరు 23
నైరోబి, కెన్యా
Died2020 ఫిబ్రవరి 15(2020-02-15) (వయసు: 90)
చికాగో, అమెరికా
Sport
Countryభారతదేశం
Sportట్రాక్ అండ్ ఫీల్డ్
Eventస్ప్రింట్
Clubలండన్ అథ్లెటిక్ క్లబ్(L.A.C.)
Achievements and titles
Personal best(s)100 మీ.: 10.6 (1952)
200 మీ.: 21.5 (1956)
Medal record
Men's అథ్లెటిక్స్
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Gold medal – first place1951 న్యూఢిల్లీ100 మీ.
Gold medal – first place1951 న్యూఢిల్లీ200 మీ.
Silver medal – second place1951 న్యూఢిల్లీ4×100 మీ. రిలే

లావిన్హో థామస్ పింటొ (23 అక్టోబర్ 1929 15 ఫిబ్రవరి 2020) ఒక భారతీయ క్రీడాకారుడు. ఇతడు బ్రిటిష్ వారి వలస కాలనీ కెన్యాలోని నైరోబిలో 1929, అక్టోబర్ 23న జన్మించాడు. బాల్యంలోనే భారతదేశానికి వచ్చి బొంబాయిలోని సెయింట్ జేవియర్స్ స్కూల్, కాలేజీలలో చదివాడు. అక్కడ బెన్సన్ ప్రౌడ్‌ఫుట్ దగ్గర తర్ఫీదు పొంది అథ్లెటిక్స్‌లో రాణించాడు. తన 20యేళ్ళ వయసులో ఇతడు తొలిసారి బాంబే స్టేట్ అథ్లెటిక్స్ మీట్‌లో పాల్గొని రెండు స్వర్ణ పతకాలు సంపాదించాడు. 1950లో బాంబేలో జరిగిన 14వ జాతీయ క్రీడలలో ఇతడు 200 మీ. ఈవెంటును 21.8 సెకెన్లలో పూర్తి చేశాడు. తరువాత ఇతడు లుధియానా (1951), మద్రాస్ (1952), జబల్‌పూర్ (1953), కలకత్తా (1955), పాటియాలా (1956)లలో జరిగిన జాతీయ క్రీడలలో తన ప్రతాపాన్ని చూపించాడు. ఇతడు తన 27వ యేట అథ్లెటిక్స్ నుండి విరమించే సమయానికి "ఫాస్టెస్ట్ మ్యాన్ ఇన్ ఆసియా"గా పేరుపొందాడు.[1]

ఇతడు 1951లో న్యూఢిల్లీలో జరిగిన మొట్టమొదటి ఆసియా క్రీడలలో పురుషుల 100 మీ., 200 మీ. విభాగాలలో రెండు స్వర్ణపతకాలు గెలిచాడు.[2] అదే క్రీడలలో 4×100 మీ.రిలే విభాగంలో మరియన్ గాబ్రియల్, రామ్‌ స్వరూప్, ఆల్ఫ్రెడ్ షమీన్‌లతో కలిసి పరిగెట్టి రజత పతకాన్ని గెలిచాడు. ఇతడు 1952లో హెల్సింకిలో జరిగిన ఒలింపిక్స్‌లో భారత అథ్లెటిక్స్ టీముకు నాయకత్వం వహించాడు.[2] పింటో తరువాత అమెరికాలోని చికాగోలో స్థిరపడ్డాడు. ఇతడు తన 90వ యేట 2020లో మరణించాడు.

పతకాలు[3]

[మార్చు]
సంవత్సరంపోటీప్రదేశంస్థానంఈవెంటునోట్స్
1951ఆసియా క్రీడలున్యూఢిల్లీ, భారతదేశం1వ100 మీ.10.8
ఛాంపియన్షిప్ రికార్డ్
1951ఆసియా క్రీడలున్యూఢిల్లీ, భారతదేశం1వ200 మీ.22.0
ఛాంపియన్షిప్ రికార్డ్
1951ఆసియా క్రీడలున్యూఢిల్లీ, భారతదేశం2వ4×100 మీ. రిలే42.8

మూలాలు

[మార్చు]
  1. వెబ్ మాస్టర్. "Remembering pioneering sprint stars Lavy Pinto and Violet Peters". Indian Athletics. ATHLETICS FEDERATION OF INDIA. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 January 2026.
  2. 1 2 Ananth, Venkat (1 October 2014). "The untold story of Lavy Pinto - India's first (and only) 100m Asiad gold medallist". Livemint. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 13 February 2017.
  3. వెబ్ మాస్టర్. "Lavy Pinto". Athletics Podium. Şevket Furkan. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 January 2026.