లావు రత్తయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విజ్ఞాన్ రత్తయ్య గా ప్రసిద్ధిచెందిన లావు రత్తయ్య గుంటూరు జిల్లా పెదనందిపాడులో మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ముగ్గురు అన్నదమ్ముల్లో పెద్దవాడు. ప్రాథమిక విద్య పెదనందిపాడు జిల్లా పరిషత్ పాఠశాలలో పూర్తి చేశారు. గుంటూరు ఆంధ్ర లూథరన్ కళాశాల నుండి బి.ఇడీ, ఎం.ఇడీ, ఆగ్రా విశ్వవిద్యాలయము నుండి ఎం.ఎస్సీ చేశారు. భారతీయ విద్యా భవన్‌లో జర్నలిజం కోర్సు చేశారు. విజయవాడ ఇండియన్ ఎక్స్‌ప్రెస్లో ప్రూఫ్ రీడింగ్ చేశారు. సెంట్‌ జోసెఫ్ మహిళా కళాశాలలో ఒక సంవత్సరం అధ్యాపకుడిగా పనిచేసిన పిదప స్వంతంగా 'విజ్ఞాన్' కోచింగ్ సెంటర్ పెట్టారు. నాగార్జునసాగర్ ప్రభుత్వ రెసిడెన్షియల్ కళాశాలవంటి విద్యావిధానంతో వడ్లమూడి వద్ద రెసిడెన్షియల్ కాలేజీ పెట్టారు.

విజ్ఞాన్ కళాశాలకు డిసెంబరు 2008లో విశ్వవిద్యాలయ హోదా లభించింది.

2009 లోక్ సభకు జరిగిన ఎన్నికలలో లోక్ సత్తా పక్షమున మల్కాజ్ గిరి స్థానము నుండి పోటీ చేసి ఓడిపోయారు.

మూలాలు[మార్చు]