అబ్రహం లింకన్

వికీపీడియా నుండి
(లింకన్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
అబ్రహం లింకన్
అబ్రహం లింకన్


అమెరికా సంయుక్త రాష్ట్రాలకు 16వ అధ్యక్షుడు
పదవీ కాలం
ఏప్రిల్ 3, 1861 – ఏప్రిల్ 15, 1865
ఉపరాష్ట్రపతి Hannibal Hamlin (1861 – 1865)
Andrew Johnson (1865)
ముందు జేమ్స్ బుకానన్
తరువాత ఆండ్రూ జాన్సన్

పదవీ కాలం
మార్చి 4, 1847 – మార్చి 3, 1849
ముందు జాన్ హెన్రీ
తరువాత థామస్ హారిస్

వ్యక్తిగత వివరాలు

జననం (1809-02-12)1809 ఫిబ్రవరి 12
హార్డిన్ కౌంటీ, కెంటకీ
మరణం 1865 ఏప్రిల్ 15(1865-04-15) (వయసు 56)
వాషింగ్టన్ డి.సి
జాతీయత అమెరికన్
రాజకీయ పార్టీ Whig (1832-1854), Republican (1854-1864), National Union (1864-1865)
జీవిత భాగస్వామి Mary Todd Lincoln
సంతానం Robert Todd Lincoln, Edward Lincoln, Willie Lincoln, Tad Lincoln
వృత్తి న్యాయవాది
మతం క్రైస్తవం
సంతకం అబ్రహం లింకన్'s signature

అబ్రహం లింకన్ (ఫిబ్రవరి 12, 1809ఏప్రిల్ 15, 1865) ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మాజీ అమెరికా అధ్యక్షుడు. అమెరికా అంతర్యుద్ధం సమయంలో అత్యంత కార్యదక్షతతో పరిపాలించిన లింకన్ దురదృష్టవశాత్తూ అంతర్యుద్ధం ముగిసే సమయంలోనే హత్యగావింపబడ్డాడు.

లింకన్ కెంటకీలోని ఒక పేద కుటుంబంలో జన్మించాడు. వారి ఒక పురాతన చెక్క ఇల్లు. అమెరికా పాశ్చాత్య సరిహద్దు ప్రాంతం, ప్రధానంగా ఇండియానాలో పెరిగాడు. తానే స్వంతంగా చదువుకుని న్యాయవాది అయ్యాడు. విగ్ పార్టీకి నాయకుడు అయ్యాడు. ఇల్లినోయ్ రాష్ట్ర లెజిస్లేటర్ గారూ, ఆ రాష్ట్రం నుంచి అమెరికన్ ప్రతినిథిగానూ ఎన్నికయ్యాడు. 1849 లో స్ప్రింగ్ ఫీల్డ్, ఇల్లినోయ్ లో మళ్ళీ న్యాయవాదిగా కొంతకాలం ఉన్నాడు. 1854 లో కంసాన్-నెబ్రాస్కా చట్టం బానిసత్వానికి వంత పాడటంతో మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి వచ్చాడు. తొందర్లోనే కొత్త రిపబ్లికన్ పార్టీకి నాయకుడు అయ్యాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]
లింకన్ కాంస్య విగ్రహం

లింకన్ 1809 ఫిబ్రవరి 12 సంవత్సరం థామస్ లింకన్, నాన్సీ హ్యాంక్స్ దంపతులకు జన్మించాడు. ఆయనది రైతు కుటుంబం. ఆయన పూర్వీకుడైన సామ్యూల్ లింకన్ 17వ శతాబ్దంలోనే ఇంగ్లండునుంచి మసాచుసెట్స్ కు వలస వచ్చాడు. ఆయన తాత పేరు కూడా అబ్రహాం లింకనే.ఆయన కెంటకీకి వచ్చినపుడు 5000 ఎకరాలకు యజమాని.

లింకన్ కు తొమ్మిది సంవత్సరాల వయసులో ఆయన తల్లి అనారోగ్యంతో మరణించింది. వెంటనే తండ్రి రెండో పెళ్ళి చేసుకున్నాడు. ఆమె సవతి తల్లియైనప్పటికీ లింకన్ కు ఆమెకు గాఢమైన అనురాగం ఏర్పడింది. తన జీవితాంతం అమ్మ అని వ్యవరించేవాడు. కానీ రాను రానూ తండ్రికి దూరమయ్యాడు. కాని చాలా మంచి వాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]